ఏ వెలుగులకు మన చదువులు?


Sat,October 6, 2012 05:20 PM

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులే కంప్యూటర్, ఐటీ రంగంలో నిపుణులుగా సేవలందిస్తున్నారు. కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఐటీ, టెక్నాలజీ రంగంలో భారతీయులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలా ఒక్కొక్కటిగా ఎన్నైనా భారతీయ విద్యార్థుల ప్రతిభకు, ఘనతకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కానీ.. ఇదంతా నాణానికి ఒక పార్శం మాత్రమే. అసలు విషయం మరోలా ఉంది. విద్యావూపమాణాలలో భారతదేశం అట్టడుగున ఉన్నది. చదవడం, రాయడం నైపుణ్యాలలో దయనీయమైన స్థితిలో భార తీయ విద్యార్థులు ఉన్నారని అనేక సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి.అన్నింటికంటే విషాదకరమైనదేమంటే.. కనీస లోకజ్ఞానం లోపించి, నమ్మకాలు, విశ్వాసాలు, మౌఢ్యాలు ‘విద్య’ స్థానంలో తిష్ట వేశాయన్నది.

ఈమధ్య దేశంలో విద్యావూపమాణాలు గురించి ‘ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’(ASER), ది ప్రోగ్రా మ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అస్సెస్‌మెంట్(PISA), క్వాలిటీ ఎడ్యుకుషన్ స్టడీ (QES)అనే సంస్థలు దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాల గురించి సర్వే చేశాయి. దేశంలోని మహానగరాలతో పాటు మారుమూల పల్లెల వరకూ అన్నింటా విద్యాబోధన తీరును, విద్యార్థుల ప్రతిభను పరీక్షించి సవివరమైన రిపోర్టును వెల్లడించాయి. దీంతో.. ఇప్పటి దాకా విద్యావూపమాణాలలో గణనీయంగా అభివృద్ధి సాధించామని అనుకుంటున్న దానికి భిన్నంగా వాస్తవాలు వెలుగు చూశాయి. అంతకంటే ముఖ్యంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ప్రాపంచిక జ్ఞానం విషయంలో కళ్లు తిరిగే వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ప్రపంచంలో భారత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాయనుకుంటున్న దేశాల్లో కంటే, మన దేశంలోనే విద్యా ప్రమాణాలు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయన్న చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, చైనా, కొరియాలాంటి దేశాలను మనం ఇంకా ఈ శతాబ్దాంతానికి కూడా అందుకోలేనంత ఎత్తులో ఉన్నాయి. ఈ సంస్థలు సర్వే చేసిన 73 దేశాలలో ఒక కిర్జిస్థాన్ కంటే మనం ఒక మెట్టు ఎగువన ఉన్నాము. దీన్నిబట్టి విద్యావూపమాణాలలో దేశం ఏ స్థితిలో ఉన్నదో అర్థమవుతూనే ఉన్నది.

ఆ సర్వేలు చెప్పిన దాని ప్రకారం, దేశంలో మహానగరాల్లోని పాఠశాలల్లో చదువుతు న్న నాలుగవ తరగతి విద్యార్థుల్లో పదిశాతం మంది పిల్లలు మహాత్మాగాంధీ ఇంకా జీవించే ఉన్నారని నమ్ముతున్నారు. దేశంలో 15 ఏళ్లలోపు విద్యార్థులందరిలో దాదాపు 15 శాతం మందికి గణితంలో ప్రాథమిక జ్ఞానం కూడా లేదు. గ్రామీణ భారతంలోని కోట్లాది మంది విద్యార్థుల్లో నాలుగింట మూడొంతుల మంది విద్యార్థులకు రెండు అంకెలతో కూడిన ‘తీసివేత’ లెక్కలు చేయడం రాదు. అంటే ‘తీసివేత’లో కనీస జ్ఞానం కూడా లేదు. అలాగే.. ర్యాంకులనీ, వందకు వంద శాతం మార్కులని చెప్పుకుంటున్న మెజారీటీ విద్యార్థుల్లో కూడా కనీస వ్యక్తీకరణ, భాష పరిజ్ఞానం కూడా ఉండటంలేదని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. ‘అందరికీ విద్య’ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పంచ వర్ష ప్రణాళికల్లో, వార్షిక ప్రణాళికల్లో అనేక పథకాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్ మొదలు, నూతన విద్యావిధానం దాకా ప్రభు త్వం పథకాల మీద పథకాలు ప్రకటిస్తూనే ఉన్నది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నది. మరోవైపు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరిట ప్రభుత్వం తీసుకు రాదలుచుకున్న విధానం చదువువకుంటున్న విద్యార్థుల మధ్య అంతరాన్ని మరింత పెంచడమే గాక, వైరుధ్యాలను పెంచి పోషిస్తుందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. అయినా ప్రభుత్వం తాను చేయదలుచుకున్నది చేసుకుంటూపోతున్నది.

జిల్లా, మండల, గ్రామస్థాయి పాఠశాలలు, ఉపాధ్యాయుల పనితీరును గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంగా తయారైంది. దేశంలో ఏ ‘సర్వే’ చేయాలన్నా ఉపాధ్యాయులచేతనే చేయిస్తున్నారు. విద్యాసంవత్సరంలో సగం పనిదినాలు ‘సర్వే’లకే సరిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు చదువు ఎలా, ఎప్పు డు చెప్పాలని ఉపాధాయులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనైతే.. కనీస వసతులు లేక విద్యార్థులు చదువు కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయి. 80 శాతం పాఠశాలల్లో కనీసం టాయిపూట్స్ కూడా లేకపోవడంతో మంచినీళ్లు తాగకుండా విద్యార్థినులు పాఠశాలకు వస్తున్నట్లు వాపోతున్నారు. ఈ మధ్య కొత్తగా ప్రవేశ పెడతామంటున్న ‘మోడల్ స్కూల్’ విధానం ద్వారా ఇంకా సామాజిక అంతరాలు పెరుగుతాయే గానీ తగ్గవని విద్యావేత్తలు అంటున్నారు.

పాఠశాలల్లో విద్యాబోధన తీరు అశాస్తీయతకు ఆలవాలంగా తయారైంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, శాస్త్రీయ విద్యాబోధన పద్ధతులు, మూర్తిమత్వాన్ని వికసింపచేసే శాస్తీయ విధానాపూన్నో అభివృద్ధి చెందినా వాటినేమీ నేటి ఉపాధ్యాయులు అమలు చేయడంలేదు. ఏనాటిదో కాలం చెల్లిన పద్ధతులనే అవలంబిస్తున్నారు. పలకలమీద అక్షరాలు పెట్టించి దిద్దిపిస్తున్నారు. పాఠాలను వల్లే వేయిస్తున్నారు. దీంతో భాషా పరిజ్ఞానం కనీస స్థాయిలోనైనా ఉండటం లేదు. పరిసరాల పరిజ్ఞానం కనీసంగా కూడా లేకుండా.. నేడు చదువుకుంటున్న విద్యార్థులు కళ్లుండి చూడలేని, నోరుండీ చెప్పలేని కబోదులుగా మారుతున్నారు. మాతృభాషలోనే విద్యాబోధన జరిగితేనే విద్యార్థికి అభ్యసనం అందుతుందని శాస్త్రీయ పరిశోధనలు, అనుభవాలు చెప్పాయి. అయినా దీనిని పాటిస్తున్న పాపాన పోవడంలేదు. 1990ల తరువాత వచ్చిన నూతన ఆర్థిక విధానా లు, ప్రపంచీకరణల నేపథ్యంలో.. ఇంగ్లిష్ చదువులు రాజ్యం ఏలుతున్నాయి. విద్య ప్రైవేటీకరణ అయిపోయి.. ‘చదువంటే ఇంగ్లిష్ మీడియం చదువులే’ అన్నంతగా సమా జం తయారైంది. ఇది చాలదన్నట్లుగా.. ప్రభుత్వమే మండలానికొక ఇంగ్లిష్ మీడియం పాఠశాలను నెలకొల్పుతూ.. కోట్లాదిమంది గ్రామీణ విద్యార్థిలోకాన్ని ఆత్మన్యూనతకు బలిచేస్తున్నది. ప్రైవేటు వారి విద్యావ్యాపారానికి భిన్నంగా, మాతృభాషలో నాణ్యమైన విద్యనందించే బదులు ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి ప్రయత్న పూర్వకంగా తప్పుకుంటున్నది. దీంతో రాబోయే కాలంలో విద్యారంగంలో మరింత విపరీత పరిణామాలు సంభవించనున్నాయి.

చదువే సంపద, జ్ఞానమనే స్పృహ గతంతో పొల్చితే.. చాలా పెరిగింది. దీంతో..ఎంత పేదరికంలో ఉన్నా చదివించాలనే చైతన్యం ప్రజ ల్లో వచ్చింది. ఇది పునాదిగా మాతృభాషలో విద్యాబోధన గరిపి భవిష్యత్‌తరాలను వెలుగు బాటలో పయనింపచేయాలి. కానీ ప్రభు త్వం ఈ బాధ్యతను మరిచిపోతున్నది. యాంత్రికత పునాదిగా ఉన్న చదువులతో మానవీయంగా, ఉన్నతంగా ఎదగాల్సిన విద్యార్థులు అమానవీయంగా రూపొందుతున్నారు. సామాజిక బాధ్యత, దేశవూపేమ కాలం చెల్లిన భావనలుగా మారిపోయాయి. ఎక్కడ ఏమి చేస్తున్నామన్నది ప్రధానం కాక, ఎన్ని డాలర్లు వెనకేసుకుంటున్నామన్నదే ప్రధాన మై పోయింది. మానవ స్పందనల ఆనవాళ్లైన అక్షరాలు.. డాలర్ల వేట లో నిర్జీవ యాంత్రిక నమూనాలైనాయి. ఈ దుస్థితి పోవాలి. మనిషినీ, సమాజాన్ని ఉన్నతీకరించే మానవీయ సృజనాత్మక విద్య మాత్రమే సమాజాన్ని ముందుకు తీసుకుపోతుంది. మనిషి ఎదుర్కొటున్న సకల సమస్యల పరిష్కారానికి వెలుగు బాటలు వేస్తుంది. అలాంటి విద్య మాత్రమే అనాగరిక మనిషిని నాగరికున్ని చేస్తుంది. మనిషిని ఉన్నతీకరిస్తుంది. నాగరికుడంటే.. సూటు బూటుతో ‘కాక్‌టైల్ తాగ డం కాదు, తన చుట్టూ ఉన్న సమాజ స్థితిగతులను చూసి, స్పందించి, పట్టించుకునే కర్తవ్యాన్ని ఎరిగినవాడు. కాలంతో పరిగెత్తడం పేరిట కన్నీరు ఆవిరైన వాడు కాదు. గుండెలో తడారకుండా.. మిగిల్చుకున్నవాడు. విద్యార్థి ప్రతిభకు మార్కుల స్థానంలో మానవీయ త ప్రమాణంగా మారిన నాడే నిజమైన అర్థంలో విద్య తన పాత్రను పోషిస్తుంది. అప్పు డు విద్య ఒకరి బతుకుకు మాత్రమే వెలుగు కాదు, భారత్‌కే వెలుగు.

-ఎస్. మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు