భలిదానాలు ఆగేదెన్నడు?


Sat,October 6, 2012 05:21 PM

-ఎస్. మల్లాడ్డి




తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మంది ఆత్మార్పణం చేశారు. అమ్మానాన్నల కలల పంట అభినాష్. భవిష్యత్తుపై బంగారుకలలు కంటూ కరీంనగర్‌లో బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రసాధనలో ఎదురవుతున్న ఆటంకాలను, జరుగుతున్న జాప్యాన్ని చూసి కలత చెందాడు. తనలాంటి ఎందరో యువకు ల కలలపంట అయిన తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డుపడుతున్న అవ రోధాలు, నేతల తీరును చూసి తెలంగాణ రాదేమోనని కసితో రగిలిపోయాడు. అంతే తన ఆత్మబలిదానమైనా తెలంగాణసాధనకు ఓ ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందేమోనని ఆత్మహత్యాయత్నం చేశాడు. మృత్యువుతో పోరాడి చనిపోయాడు. అభినాష్ అంత్యక్షికియలు ముగియక ముందే తెలంగాణ కోసం మరో యువకుడు ఇదే జిల్లాలో పురుగులమందు తాగి చనిపోయాడు.

నేతలంతా ఐక్యంగా ఉద్యమించి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాటం చేయాలని తన చివరి కోరికగా తన సూసైడ్ నోట్‌లో రాసి మరీ ఆత్మత్యాగం చేశాడు.

దశాబ్ద కాలంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమం.. ముఖ్యంగా మూడేళ్లుగా శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌డ్డి మొదలు అభినాష్ దాకా బలిదానాల పరంపర సాగుతూనే ఉందిపపంచ చరివూతలో ఎక్కడాలేని త్యాగాల సంప్రదాయాన్ని తెలంగాణ విద్యార్థి యువకులు కొనసాగిస్తున్నారు. ఈ బలిదానాలు తెలంగాణ వాదులను కలచి వేశాయి. తెలంగాణ వాదులు, మేధావులు బలిదానాలు వద్దని విజ్ఞప్తులు చేశారు. ఈ బలిదానాలను తెలంగాణ వాదులతో సహా అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. బలిదానాలు చేసుకుంటున్న విద్యార్థి యువజనుల త్యాగాలను కొనియాడుతూనే, బలిదానాల ద్వారా తెలంగాణా రాదని, చనిపోయి సాధించేదేమీ లేదని , బతికుండి సాధిద్దామని నచ్చ చెబుతున్నారు.

ఆత్మహత్యల నిరోధక కమిటి కూడా ఏర్పడి ఆత్మహత్య లు చేసుకోవద్దని ప్రచారం కూడా చేశారు. అయినా ఆత్మత్యాగాలు ఆగడం లేదు. అయి తే ఈ బలిదానాలకు అసలు కారణాలను తెలుసుకోవడంలోనూ, వాటి నివారణకు చేయాల్సిన కర్తవ్యాలను కనిపెట్టడంలోనూ అందరూ విఫల మయ్యారనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలిస్తే తెలంగాణ ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉద్యమ కార్యాచరణ లేకపోవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది.ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో ప్రజానీకానికి, ముఖ్యంగా విద్యార్థిలోకానికి ఆకాంక్షల స్థాయి లో కార్యాచరణ ఇవ్వడంలో.. అందరూ విఫలమయ్యారు.ఈ క్రియా శూన్యత నుంచే ఆత్మహత్యలు పుట్టుకొచ్చాయి. వస్తున్నాయి.
దశాబ్ద కాలం నుంచీ ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాలు తెలంగాణ వాదాన్ని పాదుకొల్పడంలో విస్తృత ప్రచారం చేశాయి.

తెలంగాణలోని వివిధ కులసంఘాల జేఏసీలు, విద్యార్థి జేఏసీలతో పాటు కోదండరాం నేతృత్వంలోని పొలిటికల్ జేఏసీ, గద్దర్ నాయకత్వంలోని ప్రజావూఫంట్, విమలక్క నేతృత్వంలోని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లాంటి సంస్థలు తెలంగాణ ఉద్యమానికి జవజీవాలయ్యా యి. ఉద్యోగ ,కార్మిక జేఏసీలు కీలక భూమికను పోశిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. మొత్తంగా తెలంగాణ లోని ప్రజారాసులన్నీ జేఏసీ లుగా ఏర్పడి తెలంగాణ వాదాన్ని గడప గడపకూ చేర్చాయి. ఆబాలగోపాలాన్ని తెలంగాణ నినాదాన్ని అందుకునేట్టు చేశాయి. ఎంతో సారవంతమైన సాంస్కృతిక జీవితం కలిగిన తెలంగాణలో సహజంగానే ఎవరూ ఊహించని విధంగా తెలంగాణవాదం ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఈనేపథ్యంలోనే ప్రజాసంఘాల తెలంగాణ భావప్రచారం పునాదుల మీద నిర్మితమైన టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ వాదాన్ని రాజకీయ శక్తిగా మలిచింది. ఊరు వాడను ఏకం చేసింది.

మునుపెన్నడూ లేని విధంగా ఆయా పార్టీల ప్రధాన నాయకత్వం (కొంత మంది వ్యక్తు లు తప్ప) మినహా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ జెండా పట్టుకున్నారు. గల్లీనుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్ పాత్ర గణనీయమైనది. ప్రజల చైతన్య స్థాయిలో ఉద్యమ రూపాలను రూపొందించి తెలంగాణ నినాదంతో కదం తొక్కించింది. ఉద్యమాలు అంటే ‘అద్దాలు పగలడం, లాఠీలు విరగడ’ అన్న అపవాదునుంచి సృజనాత్మక పోరాట రూపాలతో ప్రజలను ఏకం చేసింది. పోరాటం అంటే నినాదాలు, నిరసనలే కాదు ఆడూతూ పాడుతూ ఆకాంక్షను వ్యక్తీకరించడంగా మారిపోయింది. బతుకమ్మ పాటలు, కోలాటం ఆటలూ, వంటా వార్పులూ పోరాట రూపాలయ్యాయి.

ఈ సామూహిక కార్యాచరణలోంచి తెంగాణ ఉద్యమం అత్యున్నత ఆత్మగౌరవ పోరాటంగా ఎదిగింది. అంతకంటె మిన్నగా జాతి పోరాటంగా రూపుదిద్దుకుంది. ఈ పోరాట విస్తృతిల్లోంచి చరివూతలో మునుపెన్నడూ లేనంత ఐక్యత, ఏకీభావం సాధ్యమైంది. విముక్తిపోరాటంగా.. విస్తృతి చెందింది.
ఈ ఆకాంక్ష కోసమే తెలంగాణ ప్రజానీకం ఆరాట పోరాటాలు చేస్తోంది. ఇది జేఏసీ ఇచ్చిన అనేక పోరాటాల్లో వ్యక్తమైంది. తెలంగాణ కల సాకారం కోసం తెలంగాణ వేయి కళ్లతో ఎదిరి చూస్తోంది. అంటే కేవలం అచేతనంగా ఎదిరి చూడడం కాదు, పోరాటా ల్లో తెలంగాణ ఆకాంక్షను చూసుకుంటోంది. తెలంగాణ సాధనదిశగా అనుక్షణం ఆరాటపడుతోంది. అయితే ప్రజల్లో ఉన్న ఈబలీయమైన ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమ కార్యాచరణ లేకపోవడంతో చైతన్యంతో ఉరకలు వేస్తున్న విద్యార్థి యువజనులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దీనికి తోడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి విద్యార్థులను తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోంచి ఆత్మబలిదానాలు ఉనికిలోకి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వెనుకడుగు వేసి స్తబ్దతకు గురి అయినప్పుడల్లా విద్యార్థులు బలిదానాలతో ఉద్యమాన్ని రాజేశారు. ముందుకు తీసుకుపోయారు. శ్రీకాంతా చారి ఆత్మత్యాగం మొదలు వేణుగోపాల్ రెడ్డి అభినాష్ బలిదానాల దాకా ఈ నేపథ్యంలోనే జరిగాయి. అలాగే ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ నేతల విధానం కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు కారణం అయ్యింది. తెలంగాణ ఉద్యమ క్రియా శూన్యతలోంచి ఆత్మబలిదానాలు పుట్టుకొచ్చాయన్న విషయాన్ని మరిచి విద్యార్థుల బలిదానాలను కొందరు తప్పుడు చైతన్యంతో చేసుకుంటున్న అనవసర త్యాగాలుగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు.

ఇంకా ముందుకెళ్లి నిరాశా నిస్ప్రుహల్లోంచి చేసుకుంటున్న ఆత్మహత్యలుగా చెబుతున్నారు. ఇది చాలా విచారకరం. ఆక్షేపనీయం. విద్యార్థుల బలిదానాలు ఆగాలంటే విజ్ఞప్తులు, హితబోధలు కాదు. ఉద్యమ కార్యాచరణ కావాలి. అంతకు మించి తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేస్త్తున్నామని నిరూపించుకోవాలి. ఆ పోరాటాల్లో విద్యార్థి యువజనులను భాగస్వాములు చేయాలి. అప్పుడే విద్యార్థుల బలిదానాలు ఆగుతాయి.

‘పపంచంలో..అందరికంటే.. అత్యంత ధైర్యశాలి ఆత్మహత్య చేసుకున్నవాడ’ని ఓ గ్రీక్ తత్వవేత్త అంటాడు. నిజానికి ఏ ప్రాణి అయినా.. ప్రాణం నిలుపుకోవడం కోసం ఆఖరి క్షణందాకా పోరాడుతుంది.జీవించడం కోసం చివరి ఊపిరిదాకా పోరాడే మనిషి, తన ఊపిరినే.. వదులుకోవడానికి సిద్దపడడం జీవితం నుంచి పారిపోవడం కాదు. జీవితాన్ని గెలువడం అంటాడు అయన. అలాగే.. ఇవాళ జీవితాన్ని గెలిచే క్రమంలో.. తెలంగాణ యువత పోరాడుతోంది. జీవితాలనే ఫణంగా పెడుతోంది. దీనికి వారిని నిందించడం కాదు..మన్నల్ని మనం నిందించుకోవాలి. సరియైన ఉద్యమ కార్యాచరణ ఇవ్వడం ద్వారా యువతను కాపాడుకోవాలి. తెలంగాణా సాధించుకోవాలి.

40

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు