రక్షణ దళాలను రక్షించేదెవరు?


Sat,October 6, 2012 05:20 PM

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నేల కొరగడం లేదు. తమలాగే ఉద్యోగం కోసమని వచ్చిన.. సహచరుల చేతుల్లో అంతమవుతున్నారు. ఆర్మీలో, పోలీసు వ్యవస్థలో ఇవ్వాళ దేశంలో జరుగుతున్న విషాదం ఇది. రక్ష ణ వ్యవస్థలో ఉండే కేంద్రీకృత అధికార విధానం, ‘ఆర్డర్లీ’(బాసిజం) కారణంగా ఈ వ్యవస్థల్లో ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. ఎంత పెద్ద ఘటన జరిగినా, బాధితులు ఎవరూ నోరు మెదపటానికి సాహసించరు. మాట్లాడటానికి కూడా వీలు లేదు. ఆ వ్యవస్థకు సంబంధించిన అత్యున్నత అధికారి మాత్రమే నోరు విప్పాలి. అతని వివరణనే సమాచారం. అది మాత్రమే ప్రపంచానికి తెలిసే సత్యం. అంతకంటే.. ఇంకేదీ బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఇలా అక్కడొకటి, ఇక్కడొకటిగా జరుగుతున్న ఘటనలుగా కనపడతున్నా...ఇవి ఒక విధానంగా కొనసాగుతున్నా యి. గతనెల 26న జమ్మూ కశ్మీర్‌లోని గందెర్బల్ జిల్లా కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్ 1 బెటాలియన్‌లో సైనికుల మధ్యనే ఏం జరిగిందో ఏమో.. క్యాంపులోనే సైనికులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన వారంతా సైన్యంలోని డ్రైవర్లు కావడం విశేషం. సైనికులు, డ్రైవర్ల మధ్య ఏమి జరిగిందన్న దానికి ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు మాత్రం విచారణ జరుపుతున్నామన్న పాత పాటే పాడుతున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే.. ఖమ్మం జిల్లాలో ఓ పవర్ ప్రాజెక్టుకు రక్షణగా ఉన్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ నితిన్‌కుమార్ ఉన్నతాధికారి ఎస్‌టీఎఫ్ ఎస్‌ఐ రమేష్ ను కాల్చిచంపాడు. విచారణ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు క్రికెట్ స్టంప్స్‌తో తలపై బలంగా కొట్టి చంపాడని చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ అంతర్గత కాల్పులకు కారణాలేమిటి? నివారణా చర్యలు ఏంటి? అని ఎవరూ ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఇలాంటి వెన్నో 2011సంవత్సరంలో జరిగాయి. మాల్దా జిల్లాలోని బీఎస్‌ఎఫ్ బ్యారక్‌లో 7-5-2011న సురేంవూదపాల్ అనే సైనికుడు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయాడు. సహచర జవానులంతా భోజనాలు చేస్తుండగా బాత్‌రూములోకి వెళ్లిన సురేంవూదపాల్ తన రైఫిల్‌తోనే కాల్చుకుని చనిపోయాడని అధికారులు అంటున్నారు. 2-04-2011న జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆర్మీ క్యాంపులో తెల్లవారు జామున నాలుగు గంటలకు చొరబడిన ఓ సైనికుడు తోటి సైనికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురిని చంపేశాడు. అంతకు వారం రోజుల ముందే సహచర బీఎస్‌ఎఫ్ జవానును మరో జవాన్ తన రైఫిల్‌తో కాల్చి చంపాడు. మహారాష్ట్రలోని బస్తర్ జిల్లాలో 2-3-2011న మావోయిస్టు ఏరివేత కార్యక్షికమంలో పాల్గొంటున్న ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు పరస్పరం వాదులాడుకుని మాటా మాటా పెరిగి కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరూ చనిపోయారు. అలాగే.. అస్సాంలోని తిన్‌సుకియా, దిబ్రూగర్ జిల్లాలో 13-12-2011న ముగ్గురు ఆర్మీ జవానులు చనిపోయారు. 7-12-2011న కూడా అదే అస్సాంలో..ఇద్దరు పారా ట్రూపర్లు పరస్పరం కాల్చుకుని చనిపోయారు. ఇవి చెదురు మదురు ఘటనలుగా కనిపిస్తున్నా.. ఎంతో మంది బలి అవుతున్నారు. ప్రభుత్వ, సైనిక అధికారుల లెక్కల ప్రకారమే.. 2002 నుంచి 2007 మధ్యలో టెర్రరిస్టులు, చొరబాటు దారుల కాల్పుల్లో 4 మంది చనిపోతే.., ఆత్మహత్యలు చేసుకుని 46 మంది చనిపోయారు. అంటే.. విధినిర్వహణలో భాగంగా చనిపోతున్న వారితో సమానంగా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2007 నుంచి ఇప్పటి దాకా 143 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో 75 మంది బీఎస్‌ఎఫ్ జవానులే. ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నతాధికారులు, మానసిక నిపుణులతో ఓ అధ్యయనం చేయించింది. దీనిలో తేలిందేమంటే.. బీఎస్‌ఎఫ్ బలగాలలో 70 శాతం పైగా సిబ్బంది మానసిక ఒత్తిడులతో సతమతమవుతున్నారని తెలిసింది.

భద్రతా బలగాలలో రోజు రోజుకూ పెరిగిపోతున్న అంతర్గత కాల్పులు, ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఏదో మొక్కు బడి విచార ణ తంతును ముగించి అసలు నిజాలను పాతరేస్తున్నారు. దీని ఫలితంగానే కొన్ని దశాబ్దాలుగా అంతర్గత కాల్పులు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఘటనలు జరిగినప్పుడల్లా చర్యలకు దిగుతున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటనలు చేస్తున్నా.. , కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఈ మధ్య స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పేరిట సైనిక బలగాలకు యోగా, ధ్యానం లాంటి వాటిని అభ్యసనం చేయిస్తున్నారు. శిక్షణ ఇస్తున్నారు. కానీ.. ఆత్మహత్యలు, అంతర్గత కాల్పులకు అసలు కారణాలను శాస్త్రీయంగా ఆలోచించి నివారణ చర్యలు తీసుకోవడం లేదు. భద్రతా బలగాలలో పెరిగిపోతున్న అంతర్గత కాల్పులు, ఆత్మహత్యల పట్ల సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏదేని ఒక సమూహం అదేపనిగా అసహజ మరణాలకు గురవుతూంటే.. తప్పక ఆ వ్యవస్థ మూలాల్లోనే లోపముండి తీరాలి. అదీ ఉద్యోగ సమూహం, ఇంకా భద్రతా బలగాలు అయితే.. ఇంకా తీవ్ర విషయంగా పరిగణించాలి. ఒక ఉద్యోగ సమూహంలో తరచుగా అసహజ మరణాలు చోటుచేసుకుంటుంటే.. దాని నిర్మూలనకు తీవ్రంగా కృషి జరగాలి. సహజ మరణాల కంటే..అసహజ మరణాలు అందులో ఆత్మహత్యలు లెక్కకు మించి జరుగుతున్నా పట్టించుకోకపోవడం నాగరిక సమాజ లక్షణం ఎంత మాత్రం కాదు. కానీ మన భద్రతా బలగాల్లో ఈ దారుణాలు సాదా సీదాగా జరిగిపోతూనే ఉన్నాయి. దీనికంతటికీ.. భద్రతా బలగాల నిర్మాణంలోనే లోపముంది.

సమాజ పరిణామ క్రమంలో.. సమాజం మానవీకరించబడుతూ.., అభివృద్ధి చెందు తూ ముందుకుసాగుతోంది. మానవ వికాస చరివూతలో..సమాజంలోని సకల సమూహాలు మానవ విలువల్ని పెంపొందించుకుంటూ..,సాధించుకుంటూ.. రూపంలోనూ, సారంలోనూ మారుతూ వస్తున్నాయి. సామాజిక పరిణామ క్రమంలో.. ఒక భద్రతాబలగాలు మినహా,మిగతా సమూహాలన్నీ హక్కులను సాధించే క్రమంలో ముందుకు సాగాయి. అనేక రూపాలలో పోరాడి హక్కులను సాధించుకుని మానవీకరించబడ్డాయి. కానీ.. విషాదమేమంటే.. ఒక సైనికబలగాలు మాత్రమే క్రమశిక్షణ పేరుతో, ఆర్డర్లీ పేరుతో అణచివేతకు గురవుతున్నాయి. రాజ్యాంగ యంత్రంతో ఊడిగం చేయించుకోదల్చుకున్న పాలకులు, తమ దోపిడీ విధానాల రక్షణకోసం రక్షణ బలగాలను సమాజం నుంచి ప్రయత్న పూర్వకంగా వేరు చేశారు. సామాజిక విషయాలను పట్టించుకోవద్దన్నారు. మానవీయ స్పందనలు ఉండొద్దన్నారు. దీనికి ‘విధినిర్వహణ’ అనే అందమైన పేరుపెట్టి తమ అధాకారాన్ని నిలుపుకుంటున్నారు. ఎవరైనా ఎక్కడైనా మానవీయంగా స్పందిస్తే విధి ఉల్లంఘన అన్నారు. రాజ ద్రోహమన్నారు. లాఠీ, తుపాకీ పట్టిన మనిషి మరమనిషిగా మారిపోవాలన్నారు. మారిపోయేలా చేశారు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని నూరిపోశారు. మనిషిగా ఉంటే సహించలేని చట్రాన్ని తయారు చేశారు. నియమ నిబంధనల సాలె గూడు అల్లారు. సామాజిక పరిణామ క్రమంలో ఫ్యూడల్ రాజుల కాలంలో ఉన్న హక్కులు కూడా నేడు సైనిక బలగాలకు నిరాకరించబడ్డాయి. రాజుల కాలంలో యుద్ధాలు చేసే సమయంలో తప్ప మిగతా కాలమంతా.. భటులు తమ వృత్తి తాము చేసుకొని బతికారు. సర్వహక్కులూ అనుభవించారు. దండ యాత్రలు, యుద్ధాలలో పాల్గొనడానికి మాత్రమే బల్లాలు , శూలాలు పట్టి సైనికులుగా యుద్ధాలు చేశారు. వీరికి సామన్య పౌరులకు ఉండే అన్ని హక్కులూ ఉన్నాయి. అందుకనే ఫ్యూడల్ కాలంలో రాజభటులను, సైనికులను సామాజిక శాస్త్రవేత్తలు అర్ధ సైనికులన్నారు. కానీ.. సమాజం ప్యూడల్ వ్యవస్థనుంచి పరిణామం చెంది.. ప్రజాస్వామిక ప్రభుత్వాలుగా మారిన క్రమంలో.. ఆధునిక రాజ్యాలు తమ రక్షణకోసం సైనిక బలగాలను కట్టుబానిసలుగా మార్చాయి. క్రమశిక్షణ మాటున మొత్తం సైనిక బలగాలను ఎలాంటి హక్కులు వినియోగించుకోవడానికి వీలు లేని వర్గంగా మార్చి వేశారు.

సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు లాంటివి ద్రోహ కార్యాలుగా పరిగణించబడుతున్నాయి. అప్పగించిన పనిని యంత్రంలా చేయాల్సిందే తప్పా.., ఎందుకు చేయాలని ప్రశ్నించకూడదు. డ్యూటీకి డుమ్మా కొట్టకూడదు. అధికారుల ఆజ్ఞలను శిలాశాసనాలుగా నోరెత్తకుండా అమలు చేయాల్సిందే. ఈ క్రమంలోనే భూమిపువూతులై ఉండికూడా... తమ రక్త సంబంధీకులను కూడా అమానవీయంగా.. అమానుషానికి బలిచేసే చర్యలు చోటుచేసుకుంటున్నాయి. విధినిర్వహ ణ పేరుమీద మనిషిలోంచి ఎంతగా మానవీయతను తోడేసినా.. ఎక్కడో దాగి ఉన్న మమకారం ఎప్పుడో ఒకప్పుడు మేల్కొనడం సహజం. ఈ నేపథ్యంలోం చే.. నిజామాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య, మరో కానిస్టేబుల్ గంగాధర్ తెలంగాణ కోసం తమ దగ్గరున్న తుపాకులతోనే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత మంది అకారణంగా విదార్థి యువజనులపై జరుగుతున్న దమనకాండను చూసి తట్టుకోలేక మానసిక ఒత్తిడితో.. నలిగిపోతున్నారో లెక్కలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్డర్లీ వ్యవస్థ మరింత అమానవీయమైనది.ఉన్నతాధికారులకు సహాయకులుగా ఉండాలనే పేరిట కిందిస్థాయి ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకోవడం నేటికీ కొనసాగుతున్నది. ఉన్నత చదువుల చదివి ఉద్యోగం చేయడానికి వస్తే.. ఉన్నతాధికారుల ఇళ్లలో పాచిపనులు చేయడం మొదలు కొని, బట్టలు ఉతకడం దాకా చేయించే పనులతో ఎంతో మంది సాధారణ పోలీసులు, సైనిక జవానులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆర్డర్లీ పేరుతో అమానుషాన్ని పెదవికింద అదిమిపట్టి మౌనంగా రోదిస్తున్నారు. ఈ క్రమంలోనే మానసిక సంఘర్షణతో ఎంతో మంది మానసికరోగులుగా మారడమే కాదు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇదే పరిస్థితి సైనికబలగాలలోనూ కొనసాగుతోంది. ఇదే కాకుండా.. నెలలు, సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి.. కాని ప్రదేశంలో విధుల నిర్వహణ పేరుతో ఏ సామాజిక సంబంధంలేని పనులు చేస్తూ నిస్సార జీవితాలను గుడుపుతున్న సైనికబలగాలు మానసిక ఒత్తిడులకు గురవుతున్నాయి. ఈ అర్థం పర్థంలేని, అమానవీయ పని పరిస్థితుల్లోంచి మానసిక సంఘర్షణకులోనై అసహజంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్గత కాల్పులు, ఆత్మహత్యలకు రక్షణబలగాలు బలవుతున్నాయి. రక్షణ బలగాలను సామాజిక జీవితానికి, మానవ సంబంధాలకు దూరంగా ఉంచడమే ఈ దుస్థితికి కారణం. రక్తమాంసాలున్న మానవీయ మనుషులుగా తీర్చిదిద్దే కార్యక్షికమం జరగనంత కాలం ఈ అంతర్గత కాల్పులకు, ఆత్మహత్యలకు అంతం ఉండదు. ముప్ఫై ఏళ్లుగా మిలిటరీబలగాల్లో ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ అధికారి ఈజిప్టులో జాస్మిన్ విప్లవాల సందర్భంగా.. ప్రజల పక్షాన నిలబడి తన తుపాకీని తిరుగుబాటుదారుల చేతు ల్లో పెట్టి ‘ప్రపంచం ఇంత విశాలంగా ఉందా! అని ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ.. ఈ ప్రపంచం ఎంత అందమైనదీ’ అని ఆశ్చర్యపోయాడు. అంటే.. సైనికులు,పోలీసు బలగాలలోని మనుషులు ఎంతగా పరాయీకరణకు గురయ్యారో తేటతెల్లం చేశాడు. నిజంగా.. మన దేశంలోని రక్షణ, పోలీసు బలగాలను సామాజిక సంబంధాలలో భాగం చేసి మానవీకరిస్తే.. సైనికబలగాలలో ఆనందం తాండవిస్తుంది. అంతర్గత కాల్పులు, ఆత్మహత్యలు అంతమవుతాయి. అప్పుడు మావూతమే ప్రజల పట్ల రక్షణ బలగాలు ప్రేమతో వ్యవహరిస్తాయి. రక్షకులుగా, సేవకులుగా ఉంటారు.

-ఎస్. మల్లాడి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు