పతనం అంచున ప్రజాస్వామ్యం


Sat,October 6, 2012 05:21 PM

indi05-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లోనే ప్రధాని పదవికి ఎడమ భుజంగా భావించే ప్రతిపక్ష పార్టీ హోదా ఎక్కడైనా వరిస్తుందా? ఏ రాజకీయాలు లేని, తెలియని ఓ ఉన్నతోద్యోగి రాత్రికి రాత్రి దేశాధినేత అయిపోగలడా? ఎక్కడా జరగని ఇలాంటి వింతలన్నీ.. దేశం లో చాలా సాదాసీదాగా ఎలా జరిగిపోయాయి! ఎందుకు జరిగిపోయాయి? సక ల చెడులకు కేంద్రంగా రాజకీయాలు ఎందుకు మారిపోయాయి? క్రమ పరిణామాత్మకంగా రాజకీయాలంటే, రాజకీయ నేతలంటే హీనంగా చూసే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇలాంటి ప్రశ్నలు! మరెన్నో అనుమానాలు!! వీటన్నింటికీ మూలాలు ఎక్కడున్నాయి?

నేడు దేశం ఎదుర్కొంటున్న అనేకానేక రుగ్మతలకు, సమస్యల కు బీజం 1980లోనే పడింది. లిబరలైజేషన్ పేర ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక, రాజకీయ విధానాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అప్పటిదాకా దేశంలో ఉన్న సంప్రదాయిక రాజకీయార్థిక విధానాలకు తిలోదకాలిచ్చి సరికొత్త పరాధీన తాకట్టు విధానాలు అమలులోకి వచ్చాయి. ఈ నూతన ఆర్థిక విధానాల మూలంగా.. ప్రజల జీవన పరిస్థితులు ఎలా ధ్వంసం అయ్యాయో, అవుతున్నాయో చాలా చర్చనే సాగింది. సాగుతోంది. సహజవనరులు ఏవిధంగా బహుళజాతి కంపెనీల పరం అయ్యాయో కూడా తెలుస్తూనే ఉంది. వీటికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అయి తే.. అన్నింటికన్నా ప్రమాదకరమైన పరిణామంగా రాజకీయ విలువలను ధ్వంసం చేయడం ఓ క్రమపద్ధతిలో చేశారు. మొదట రాజకీయాలం ఓ కుళ్లుగా ప్రచారం చేశారు.

రాజకీయాలు నీచమైన కార్యంగా చెప్పారు. ఈ దేశంలోని రాజకీయపార్టీలన్నీ.. భ్రష్టుపట్టి పోయాయనీ, దీనికి పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదని నమ్మబలికారు. మొత్తంగా రాజకీ యం అంటేనే ఓ అంటరానిదిగా విష ప్రచారం చేశారు. రాజకీయ నేతల పేర ఏ చదువూలేని, విజ్ఞానంలేని మొరటులు రాజ్యమేలుతున్నారని చెప్పుకొచ్చారు. వీరికంటే ఉన్నత చదువులున్న అధికారులే గొప్పవారని అన్నారు. ఇలాంటి చదువుకున్న బ్యూరోక్షికాట్ల మూలంగానే నేడు దేశంలో కాస్తో కూస్తో మంచి జరుగుతుందన్నారు. తమకే రాజకీయాలు లేవనేది ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అలాగే అందమైన పరిభాషతో నగిషీలు చెక్కిన సివిల్ సొసైటీ లాంటి వాటికి పురుడు పోశారు. ఈనేపథ్యంలోనే బ్యూరోక్షికాట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిభాష మాట్లాడుతూ రాజకీయాలను తిట్టిపోసే పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. ఇంకా ముందుకు పోయి మతపరమైన ధర్మోపాన్యాలు ఇచ్చుకునే సన్యాసులు మొదలు యోగాసానాలు నేర్పుతూ బతికే సాధువుల దాకా దేశాన్ని బాగు చేసే వారుగా తెర మీదికొచ్చారు.

చివరికి దేశ ప్రజల భవిష్యత్తును నిర్మించే రాజకీయాలను రూపుమాపే కుట్ర లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఫలితంగా దేశానికీ, దేశ ప్రజలకు జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏ పోరాట, త్యాగాల చరి త్ర లేని వారంతా తెరమీదికి వచ్చారు. సోనియాగాంధీ మొదలు, చిదంబరం, మన్మోహన్‌సింగ్ దాకా దేశ దిశా నిర్దేశకులయ్యారు.

భారత ప్రధాని ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్‌గాంధీకి చదువుకునే రోజుల్లో పరిచయమైంది సోనియాగాంధీ. అది పెళ్లి దాకా దారితీసి ఎంతో రాజకీయ వా ర సత్వమున్న నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబంలో అడుగు పెట్టింది. రాజీవ్‌గాంధీ అకాల, ఆకస్మిక మరణంతో 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సోనియా చేతుల్లో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడంలోనూ, విజయపథాన నడిపించడంలోనూ నాయకత్వం విఫలమవుతుందన్న కారణంతో.. సోనియాను తెరమీదికి తెచ్చారు. 1997లో కలకత్తా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఏడాది తిరగకుండానే 98లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన 62 రోజులకే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నుకోబడ్డా నాటి నుంచీ నేటి దాకా ప్రధానిపదవిలో ఎవరు కూర్చున్నా యూపీఏ అధ్యక్షురాలిగా సోనియానే నడిపిస్తున్నారు.

ప్రధాని మన్మోహన్‌సింగ్ మొదలు, చిదంబరం, అహ్లూవాలియా, అభిషేక్ సంఘ్వీ దాకా కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న వారంతా బ్యూరోక్షికాట్లే అమెరికాలో చదువుకొని ప్రపంచబ్యాంకులో ఉద్యోగం చేసి, ప్రపంచ కాబూలీవాలాల రికమండేషన్‌తో అందలం ఎక్కిన వారే. చిదంబరం అయితే.. బహూళ జాతి కంపెనీలకు న్యాయసలహాదారుగా పనిచేసి వాటికి నమ్మిన బంటుగా పనిచేసి మార్కులు తెచ్చుకున్నాడు. బహుళ జాతి కంపెనీల దోపిడీని, ప్రయోజనాలను కాపాడే పనిని తన భుజాలపై వేసుకొని పనిచేశాడు. అనేక సందర్భాలలో దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా.. కంపెనీల తరఫున పోరాడారు. ఇప్పుడు కేంద్ర ఆర్థికమంవూతిగా జిందాల్, పోస్కో లాంటి బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం ఆదివాసీ ప్రజలను బలిచేస్తున్నారు. ఈ బహుళ జాతి కంపెనీల దోపిడీని వ్యతిరేకిస్తున్న ఆదివాసులపై ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట యుద్ధం ప్రకటించాడు. లక్షలాది ఆదివాసులను నిర్వాసితులను చేసి దేశ సహజవనరులను, ఖనిజ సంపదను దోచిపె కంకణం కట్టుకున్నారు. పాలకపార్టీ ఏదైనా చక్రం తిప్పేది మాత్రం ప్రపంచ బ్యాంకు తాబేదారులేనన్నది వాస్తవంగా మారిపోయింది.

భారత దేశ తరతరాల త్యాగాల చరిత్ర అక్కరకు రానిదైపోయింది. సంప్రదాయ రాజకీయార్థిక విధానాలు నీచమైనవిగా మారిపోయాయి. జాతీయ భావనలు, భావాలు మొరటు ఆలోచనలయ్యాయి. నిజజీవితంతో సంబంధంలేని ఆచరణకు అందని అమూర్త విలువల భాష అందలమెక్కింది. ప్రజలులేని ప్రజాస్వామ్యం ఆచరణలోకి వచ్చింది. దేశాన్ని రెండు విభిన్న జీవన ప్రపంచాలుగా విభజించారు. సంపన్న, కూలీన, నగర జీవితాలు కేంద్రంగా ఉన్న ఇండియా ఒకటైతే, అర్థాకలితో అలమటిస్తు న్న కోట్లాది గ్రామీణ ప్రజల భారతదేశం మరొకటి. నేటి పాలకులు చేపడుతున్న కార్యక్షికమాలన్నీ కులీన సంపన్న వర్గాల కోసమే. వారి సుఖ సౌఖ్యాల కోసమే. హై టెక్కు అభివృద్ధి అంతా ఈ హై క్లాస్ ఆనందాల కోసమే. ఇక్కడ పేదోడికి తావులేదు. రింగురోడ్లు, మెట్రోరైలు ప్రాజెక్టులు, ఫ్లె ఓవర్లు, పీవీఎక్స్‌వూపెస్ హైవేలు అన్నీ వారి పరుగు కోసమే. వీటి మీద పేదవాని కాలు పడకూడదు. పేదోడు రోడ్డెక్కకుండా నిస్సిగ్గుగా నిషేధాలు విధిస్తారు.
పేద ప్రజల ఉద్ధరణ అని ఎన్ని చెప్పినా, ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పినా అవన్నీ ప్రచార పటాటోపాలే తప్ప మరేమీ కాదు.నిజంగానే ఈ పాలక విధానాలన్నీ పేదల సంక్షేమ పథకాలే అయితే 65 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో పేదరికమే ఉండకూడదు. కానీ ఈ దేశ పాలకుల పుణ్యమా అని పేదరికం రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. పాలకులు గొప్పలు పోతున్నట్టు దేశమేమీ వెలిగిపోవడం లేదు. ఆమ్ ఆద్మీ బతుకుకు గ్యారంటీ ఏమీ లేదు.

దేశ సాంస్కృతిక సంప్రదాయాలు అంటే ఏమిటో తెలియని వారు జాతి ప్రతినిధులుగా వెలిగిపోతున్నారు. రాజకీయాలు అంటే పొడ గిట్టని వారు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే స్థానాల్లో తిష్ఠ వేసి..దేశ ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తున్నారు. తత్వశాస్త్రం కళ్లుగా, రాజకీయాలు కాళ్లుగా నడిచే సమాజమే పురోగమిస్తుంది. వికాసం చెందుతుందని ఓ గ్రీక్ తత్వవేత్త అన్నాడు. అలాగే సమాజానికి అత్యం త దురదృష్టకరమైన స్థితి ఏదైనా ఉందంటే, అది నిర్ణయాధికారం రాజకీయాలు తెలియని బ్యూరోక్షికాట్ల చేతిలో ఉండటం అని మరో తత్వవేత్త అన్నాడు. సరిగ్గా మన దేశం అలాంటి దురదృష్టకరమైన స్థితిలోనే ఉందని ఇంకా చెప్పాలా!

-ఎస్. మల్లాడ్డి


35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు