నవతరానికి నాణ్యమైన విద్య


Sun,June 12, 2016 01:04 AM

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తున్న దుస్థితి ఉన్నది. దీనికంతటికీ విద్యావిధానం(చదువు)లోని అపసవ్యాలు, అశాస్త్రీయతలే కారణం. మానవీయ సమాజానికి శాస్త్రీయ భావనలే పునాది. సమాజ ఉన్నతికి ఆ సమాజ అక్షరాస్యతే కొలమానంగా పరిగణిస్తున్న పరిస్థితుల్లో కేవలం అక్షర జ్ఞానం గాక, జ్ఞాన ప్రపంచాన్ని ఆవిష్కరించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే.

sama
వేసవి సెలవుల తర్వాత రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం గతంలో ఎన్నడూ లేని ప్రాముఖ్యం సంతరించుకున్నది. ఎన్నో ఏళ్లుగా వివిధ సామాజికవర్గాలు ప్రభుత్వరంగంలో ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలను ప్రారంభించాలంటున్న దానికి అనుగుణంగా ప్రభు త్వం పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మాధ్యమ స్కూళ్లను ప్రారంభిస్తున్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్య కూడా అందుబాటులోకి రానున్నది. ఈ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థ తీరుతెన్నుల గురించి విస్తృత చర్చ జరిగింది, జరుగుతున్నది. పాఠశాలల్లోని మౌలిక వసతులు, వనరుల గురించి గణాంకాలతో సహా పతాకశీర్షికలో వార్తా కథనాలై లోతైన చర్చ సాగింది. అయితే.. ఎప్ప టి లాగానే పాఠశాలల్లోని వసతులు, పరిస్థితుల గురిం చి చర్చజరిగినంతగా.. విద్యా ప్రమాణాల గురించిన విషయం చర్చకు నోచుకోలేదు. ఏవిధమైన విధాన నిర్ణయాలతో, ఆచరణతో విద్యా ప్రమాణాలు పెంచవచ్చో నిర్దిష్టమైన ఆలోచనలు, ప్రతిపాదనలు ముం దుకు రాలేదు.

స్వాతంత్య్రానంతర ఈ అరవై తొమ్మిదేళ్లలో మన విద్యావిధానం ప్రజల ఆకాంక్షలను,ఆశలను నెరవేర్చడంలో విఫలమైందనే చెప్పవచ్చు. నేటి విద్యావిధానం ఉనికిలోకి రావడమే ఒక సహజ సమాజపరిణామక్రమానికి అనుగుణంగా రాలేదు. సామాజిక మార్పులో భాగంగా రూపుదిద్దుకోలేదు. బ్రిటిష్ వలసపాలకుల పాలనా అవసరాలు తీర్చేందుకు 19వ శతాబ్దం ఆరంభంలో ఊపిరి పోసుకుని.. మన విద్య వలసపాలకులకే ఊడిగం చేసింది. మన చదువులన్నీ బ్రిటిష్ పాలకుల కింద గుమాస్తాలుగా పనిచేసేందుకే ఉపయోగపడ్డాయి. ఈ నేపథ్యంలోనే.. జాతీయోద్యమంలో ఒకానొక దశలో జాతీయ విద్యావిధానంకోసం పెద్ద ఎత్తు న చర్చ జరిగింది. కానీ..అప్పటి జాతీయ నాయకత్వానికున్న బలహీనతలు, రాజీ ధోరణి కారణంగా మనదైన దేశీయ విద్యావిధానం రూపుదిద్దుకోలేదు.

బ్రిటి ష్ వలసపాలకులు తమ అవసరాల కోసం ప్రవేశపెట్టిన విద్యావిధానమే స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగుతున్నది. మన దేశీయ అవసరాలు, సంస్కృ తిక జీవనవిధానం పునాదులపై రూపుదిద్దుకున్న విద్యావిధానం అయితే.. ఫలితాలు మరోవిధంగా ఉం డేవి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే నిర్దేశించుకున్నట్లు 1965 నాటికే సంపూర్ణ అక్షరాస్యత సాధించేవాళ్లం. నిరుద్యోగ్యం లేని అభివృద్ధి సాధించేవారం. మెరుగైన విద్యావిధానం గురించి స్వాతంత్య్రానికి ముందు, తర్వాత ఎన్నో కమిషన్‌లు ఏర్పాటయ్యా యి. ఎన్నో రిపోర్టుల్లో ఎంతో విలువైన సూచనలు చేశాయి. కానీ.. అవన్నీ చెప్పుకోవడానికే పనికొచ్చా యి కానీ.. ఆ సిఫారసుల్లో కొంచెమైనా ఆచరణకు నోచుకున్న దాఖలాలు లేవు.

ఇవ్వాళ మన విద్యావిధానం గురించి ఆలోచించినట్లే.. నాడు స్వాతంత్య్ర ఆరంభ దినాల్లోనే విద్యావిధానం గురించిన చర్చలో నెహ్రూ..ఇప్పటి దాకా విద్యా విధానం గురించి ఎన్నో కమిటీలు, కమిషన్‌లు వేశారు. కానీ కావలసింది సవరణలు, దిద్దుబాట్లుకా దు, విద్యావిధానంలో సంపూర్ణ విప్లవాత్మక మార్పు లు రావాలని అన్నాడు. కానీ విప్లవాత్మక మార్పులు అటుంచి కనీస మార్పులకు, దేశీయ అవసరాలకు అనుగుణమైన, ప్రజా జీవనాన్ని ప్రతిబింబిస్తూ, ఉన్నతీకరించే విద్యావిధానం రూపొందలేదు. దీనికి విధాన కర్తలదే పెద్ద బాధ్యత.
ఇవ్వాళ ఎటు చూసినా ఇంగ్లీష్ చదువుల గురించి పెద్ద చర్చ సాగుతున్నది. ఆధునిక ప్రపంచీకరణ పరిస్థితుల్లో చదువంటే.. ఇంగ్లీష్‌మీడియం చదువులే అన్నంతగా తయారయ్యింది. ఇంగ్లీష్ చదువులతోనే ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాలు సాధ్యమని అం దరూ నమ్ముతున్న స్థితి ఏర్పడింది.

అయితే ఈ ఇంగ్లీ ష్ చదువుల మోజు ఇవ్వాళనే కొత్తగా హటాత్తుగా వచ్చిపడిందేమీ కాదు.మన ఇంగ్లీష్ చదువులకు మెకా లే ఆద్యుడనుకుంటున్నాం కానీ.. ఆయనకు ముప్పై ఏళ్ల ముందునుంచే ఇంగ్లీష్ చదువులపై మోజు ఉన్న ది. నాడు కూడా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చిన వారికే బ్రిటిష్ వారి దగ్గర ఉద్యోగాలు వచ్చేవి. నేడు కూడా.. ఈ ఇంగ్లీష్ చదువులతోనే కార్పొరేట్ కంపెనీల్లో కొలువులొస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. మన ఇంగ్లీష్ చదువుల సారమంతా పరాయి సేవ కోసం పనికొచ్చినంతగా మన జాతి వికాసాభివృద్ధికోసం పనికిరావడం లేదు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారికి బంట్రోతులుగా చేస్తే.., ఇప్పుడు మన వారు పలు కార్పొరేట్ కంపెనీలకు సీఈవోలుగా చేస్తున్నా రు. పేరుకు పెద్ద పీట కావచ్చు, కానీ.. సేవలు ఎవరికోసం, దేనికోసమనేది కూడా ప్రశ్ననే. అయితే.. చదు వుల మాధ్యమంఏది అనేది కాకుండా చదువుల వెలుగులు, ఫలాలు ఎవరికి చెందుతున్నాయన్నది మాత్రం ఆలోచించాలి. దేశీయ సంపదతో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఇతరుల సేవకు ఉపయోగపడితే.. ఆ మేరకు దేశం, ప్రజలు నష్టపోతున్నట్లే.

ఈక్రమంలోనే విద్యా ప్రమాణాల గురించి మాట్లాడినప్పుడల్లా అందరూ మౌలిక వసతులు, వనరుల గురించి మాట్లాడటం పరిపాటైపోయింది. విద్యాలయాల్లో కనీస వసతులు ఉండాలనేది అందరూ అం గీకరించాల్సిందే, కోరుకోవాల్సిందే. కానీ వసతులతో ప్రమాణాలు ముడిపెట్టడం మాత్రం సర్వత్రా సమర్థనీయం కాదు. ఇక్కడే విద్యాప్రమాణాల గురించి ఓ తాజా ఉదాహరణగా.. నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ దగ్గరున్న సర్వేల్ గురుకుల పాఠశాల గురించి చెప్పుకోవాలి. ఎనభైయవ దశకం దాకా సర్వేల్ గురుకుల పాఠశాల ఓ వెలుగు వెలిగింది. విద్యా ప్రమాణా ల్లో రాష్ట్ర స్థాయిలోనే తలమానికంగా ఉండేది. ఆ కాలంలో సర్వేల్‌లో చదువుకున్న విద్యార్థులంతా నేడు ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు.

ఇప్పటికీ సర్వేల్ పూర్వ విద్యార్థులు సగర్వం గా చెప్పుకునే స్థితి ఉన్నది. ఈ అత్యున్నత విద్యా ప్రకారణం.. అప్పుడు అధ్యాపకులంతా పాఠశాల ఆవరణలోనే ఉండేవారు. విద్యార్థులకు చదువుతున్న సబ్జెక్టులో ఏ అనుమానమొచ్చినా రాత్రి తొమ్మిది, పది గంటల దాకా టీచర్ల దగ్గరికి వెళ్లి అనుమానాలు నివృ త్తి చేసుకునేవారు. విద్యార్థులే లోకంగా నాటి టీచర్లు ఉండేవారు. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యాప్రమాణాలు అడుగంటి సర్వేల్ గురుకులం ఓ సాధారణ సోషల్ వెల్‌ఫేర్ హాస్టల్ స్థాయికి దిగజారింది. దీనికి కారణం మౌలిక వసతుల లేమి కాదు, అధ్యాపకులు స్థానికంగా ఉండక పోవడం. ఇవాళ అధ్యాపకులంతా సర్వేల్‌కు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే విద్యాప్రమాణాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అర్థమవుతున్నది. కాబ ట్టి ఇవ్వాళ.. బడి బాటతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయాస పడుతున్న ఉపాధ్యాయ లోకమంతా విద్యాప్రమాణాలు పెంచే దిశగా ఆలోచించాలి. అడుగులు వేయాలి.

విద్య ఉద్యోగం కోసంకాదు,మనిషి వికాసంకోసం, ఉన్నతి కోసం అనుకుంటే.. చదువుల ద్వారా సమాజమంతా ఎంతో ఉన్నతీకరించబడాలి. సామాజిక హింసను రూపుమాపి మానవీయ సమాజాన్ని ఆవిష్కరించాలి. కానీ దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. చదువు లే(రా)ని వాడు వింత పశువుఅన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తున్న దుస్థితి ఉన్నది. దీనికంతటికీ విద్యావిధానం(చదువు)లోని అపసవ్యాలు, అశాస్త్రీయతలే కారణం. మానవీయ సమాజానికి శాస్త్రీ య భావనలే పునాది. సమాజ ఉన్నతికి ఆ సమాజ అక్షరాస్యతే కొలమానంగా పరిగణిస్తున్న పరిస్థితుల్లో కేవలం అక్షర జ్ఞానం గాక, జ్ఞాన ప్రపంచాన్ని ఆవిష్కరించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే.

1389

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు