దేశభక్తుల దేశంలో..


Sun,March 20, 2016 01:47 AM

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజెప్పడమే దేశ భక్తి అయితే.. అలాంటి దేశ భక్తి మాకొద్దు అని ప్రకటించాడు. అలాగే.. మేం ఈ దేశ పౌరులం. మట్టి బిడ్డలం. సహజ వనరులను ప్రజలకోసం రక్షించుకుంటాం. మేం దేశంలో 80శాతంగా ఉన్న పేద ప్రజల పక్షాన నిలబడతాం. పోరాడుతాం. ఇదే మా దృష్టిలో దేశ భక్తి.. అని ప్రకటించాడు.ఇదే మన పాలకుల దృష్టిలో రాజద్రోహమైంది.

sama


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. మినిమ మ్ గవర్నమెంట్ మాగ్జిమమ్ గవర్నెన్స్ తమ విధానమని ప్రధాని మోదీ ప్రకటించారు. కనీస ప్రభు త్వం, గరిష్ఠ పాలన అంటే ఏమి టో క్రమక్రమంగా ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. దేశంలోని ప్రజలందరూ తాము దేశభక్తులమేనని నిరూపించుకోవలసి వస్తున్నది. హిందుత్వ, మెజారిటీ వాదాన్నీ, బ్రాహ్మణీయ కులాధిపత్య విధానాలను ప్రశ్నించిన వారందరూ దేశ ద్రోహులుగా ముద్రవేయబడుతున్నారు. ప్రభుత్వాన్నీ, పాలక విధానాలనూ, ఆక్రమంలో మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నిస్తే పాపం చేసినంత పనై పోతున్నది.

రాజద్రోహ (సెడిషన్)నేరం మోపబడుతున్నది. ఇప్పటిదాకా సామాజిక సమస్యలపై గొంతెత్తిన కార్యకర్తలు, ఉద్యమకారుల వరకే పరిమితమై ఉన్న రాజద్రోహనేరం కేసులు.. ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల దాకా వచ్చాయి. దీంతో రాజద్రోహంపై దేశం యావత్తూ ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం, బీజేపీ దాని అనుబంధ సంఘాల నేతలు హిందుత్వ రాజకీయ, తాత్విక విషయాలను చర్చలోకి తెచ్చారు. భార(జా)తీయత, దేశ భక్తి లాంటి మౌలిక(సెంటిమెంట్) విషయాలను ముందుకు తెచ్చి వాటి మాటున అదిరింపులకు, బెదిరింపులకు దిగుతున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటున్న 68ఏళ్ల తరువాత.. దేశ భక్తి, జాతీయత అంటే ఏమిటో చర్చకు రావడం ఓ విషాదమైతే.., ఎవరు ఇండియన్, ఎవరు కాదో (అన్ ఇండియన్) తేల్చే బ్రిటిష్‌వారు తమ రక్షణ కోసం రూపొందించుకున్న 156ఏండ్ల కిందటి నాటి ఇండియన్ పీనల్‌కోడ్ 1860(ఐపీసీ) మన పాలకులకు ఆయుధంగా మారడం మహా విషాదం. దీని ప్రకారం..ఎవరైనా మాట పూర్వకంగా నైనా, రాత పూర్వకంగా నైనా, లేదా దృశ్య, శ్రవణ పూర్వకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో కార్యకలాపాలు నిర్వహిస్తే.. రూపొందించుకున్న భారత చట్ట ప్రకారం శిక్షార్హులు. వారు అన్ ఇండియన్‌గా పరిగణింపబడతారు. ఇలాంటి రాజద్రోహనేరాలకు పాల్పడిన వారిని జీవితాంతం జైళ్లో నిర్బంధించే అధికారం ప్రభుత్వానికి ఉన్నది.

1909లో బ్రిటిష్ వైస్‌రాయ్ లార్డ్ మింటో వేసవి కాలపు విడిది సిమ్లాలో ఉండి, దేశంలో లావాలా ఉప్పొంగుతున్న జాతీయోద్యమాన్ని అణచి వేసేందుకు, రాజద్రోహ కార్యకలాపాల నిరోధానికి దేశంలోని 25 ప్రిన్సిలీ స్టేట్స్‌కు రాసిన లేఖలను చెప్పుకోవాలి. ఆ లేఖల్లో.. రాజద్రోహ ఉద్యమాలను ముందుచూపుతోనే అంచనావేసి అణచివేసేందుకు మనం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, కట్టడి చేయాలని సూచించాడు. బ్రిటిష్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో విమర్శనాత్మక రాతలు రాస్తే, మాటలు మాట్లాడితే వారంతా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిగా, రాజద్రోహులుగా ప్రకటించి చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఈ నేపథ్యంలోనే యంగ్ ఇండియా పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసినందుకు మహాత్మాగాంధీపై రాజద్రోహం నేరం మోపి బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల శిక్ష విధించింది. అయినా వెరవకుండా సగర్వంగా..ఇలాంటి రాజద్రోహం చేయడం నేను నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తానని గాంధీ ప్రకటించాడు.

అలాగే బ్రిటిష్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను రాతల్లో, మాటల్లో వ్యక్తంచేసి ప్రజలను జాగృతం చేసినందుకు బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, అరబింద ఘోష్, అనీబిసెంట్ లాంటి జాతీయోద్యమ నాయకులంతా రాజద్రోహ నేరం మోపబడి జైలుకు పంపబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని దూషిస్తున్నాడని తిలక్‌ను, జైలులో కూడా ఉద్యమిస్తున్నాడని లాలా లజపతిరాయ్‌నూ, ప్రభుత్వాన్ని అదేపనిగా విమర్శిస్తూ రాతలు రాస్తున్నాడని అరబింద్ ఘోష్‌నూ జైలు పాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక రాతలను అచ్చు వేస్తున్నారని అనీ బిసెంట్ నిర్వహిస్తున్న ప్రెస్‌ను బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. అయి నా.. భారత జాతీయోద్యమం ఆగలేదు. బ్రిటిష్‌వాడు తెరమరుగు కాక తప్పలేదు.

రాచరికాలు పతనమయ్యాయి. వలసపాలనలు అంతమై పోయాయి. దేశదేశాల్లో ప్రజలు విముక్తి ఉద్యమాలతో స్వేచ్ఛా వాయువులు పీల్చారు. దాదాపు అన్ని దేశాల్లో జాతీయ ప్రభుత్వాలు రాజద్రోహం అన్న చట్టాలను తొలగించుకోవడమే కాదు, సెడిషన్‌అన్న పదాన్నే నిషేధించుకున్నాయి. కానీ..107 ఏళ్ల తర్వాత.. స్వంతంత్య్ర భారతావనిలో నాటి బ్రిటిష్‌చట్టాలు కోరలు చాస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై రాజద్రోహం కేసులు మోపబడుతున్నాయి! ప్రభుత్వ పాలనా విధానాలను విమర్శిస్తూ మాట్లాడినందుకు, మానవ హక్కులు అడిగినందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కన్నయ కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను రాజద్రోహం నేరం మోపి జైలుకు పంపారు.

ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కార్టూన్ గీసినందుకు అసీమ్ త్రివేదీ అనే కాన్పూర్‌కు చెందిన కార్టూనిస్టుపై రాజద్రోహం నేరం మోపి జైలుకు పంపారు. డాక్టర్ బినాయక్‌సేన్, అరుంధతీ రాయ్‌పై ప్రభుత్వ వ్యతిరేక రాతలు రాసినందుకు సెడిషన్‌కేసులు మోపారు. చివరికి పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపిన హార్దిక్ పటేల్‌పై కూడా రాజద్రోహం నేరం మోపి జైలుకు పంపారు. ఈ ఉదంతాలతో పాలకులు చెప్పదల్చుకున్నది.. ఎవరూ ఏరూపంలోనూ ప్రభుత్వ విధానాలను విమర్శించవద్దు, వ్యతిరేకించవద్దని చాటిచెప్పడమే. పాలనావిధానాలను విమర్శించడమే రాజద్రోహంగా భావించిన బ్రిటిష్ వలసవాద పాలనకు, నేటి పాలకులకు పాలనా విధానాల్లో తేడా ఎక్కడున్నది?

ఇప్పుడు దేశ భక్తి కొందరి గుత్త సొత్తు అయిపోయింది. ఆర్‌ఎస్సెస్, బీజేపీ శక్తులు అయితే.. హిందుత్వమే దేశభక్తి అన్నట్లుగా మాట్లాడుతున్నాయి. మావి మూడు విశ్వాసాలు. హిందూ సంస్కృతి, హిందూ చారిత్రక పురుషులు, హిందూ దేశం.. ఇవే ఈ సమాజాన్ని ఐక్యం చేస్తాయి. వీటికోసం మేం మా శక్తి వంచన లేకుండా కృషిచేస్తాం. దీనికోసమే సంఘ్‌పరివార్ పనిచేస్తుంది. దీనితోనే మేం ఫలితాన్ని రాబడుతాం. దీనికోసం ఇదే సరియైన సమయం.. అంటూ ఆరెస్సెస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పుకొస్తున్నాడు. సమాజాన్ని హైందవీకరించడమే కార్యక్రమంగా ప్రకటించుకుని ముందుకు పోతున్న వారికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. హిందుత్వశక్తుల అసహనాన్ని ప్రశ్నిస్తున్న వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నది.
ప్రజల ప్రయోజనాలకు విడిగా జాతిప్రయోజనాలను, దేశభక్తిని చూడలేం. దేశా న్ని బ్రిటిష్ వలస పాలకులు విడిచి వెళ్లిన తర్వాత అనేక సామ్రాజ్యవాద దేశాలకు మనదేశం ఆట విడుపు అయ్యింది.

అమెరికా, రష్యా,బ్రిటన్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్‌లాంటి చిన్నా చితకా దేశాల దోపిడీకి నెలవుగా మారింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జాతి ప్రయోజనాలు తాకట్టుపెట్టి ఈ దేశ ప్రకృతి వనరులూ, సంపదలూ బహుళజాతి కంపెనీలకు అప్పనంగా అప్పజెప్పడమే తమ పనిగా మన పాలకులు వ్యవహరిస్తున్నారు.1980ల తర్వాత ప్రపంచ బ్యాంకు అప్పులు, శరతుల సంకెళ్లు బిగిశాయి. సరళీకృత నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 1990ల తర్వాత విదేశీ దోపిడీకి తలుపులు బార్లా తెరువబడ్డాయి. మన దేశంలోనే విదేశీ భూమిగా పరిగణింపబడే 577 సెజ్‌ల ఏర్పాటుకు పాలకులు పచ్చజెండా ఊపారు. లక్షలాది ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి మరో రూపంలో సామంత రాజ్యాల స్థాపనకు సహకరించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ఇనుప ఖనిజం ధర 106 డాలర్లుంటే ( 4,895 రూపాయలు), దాన్ని రూ.14.50 పైసలకు అప్పగించారు. హెక్టార్ భూమిలో ఐరన్ ఓర్‌ను తవ్వుకుంటే రాయల్టీగా 350 రూపాయలకే బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పారు. ఈ లెక్కన కార్పొరేట్ కంపెనీలు 2005-06లో 7,803కోట్లు సంపాదిస్తే, ప్రభుత్వానికి 1,035 కోట్లే వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటి దాకా ప్రతియేటా మూడు నాలుగు రెట్ల సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ఇక చంద్రబాబు హయాంలో అయితే.. హైదరాబాద్‌లోని ఆల్విన్ కంపెనీకి చెందిన 150కోట్ల విలువైన భూములను 3కోట్లకే అప్పజెప్పారు.

120 కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీని 55 కోట్లకే అప్పజెప్పారు. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూముల ను బహుళజాతికంపెనీలకు అప్పజెప్పడమే దేశ భక్తి అయితే.. అలాంటి దేశ భక్తి మాకొద్దు అని ప్రకటించాడు. అలాగే.. మేం ఈ దేశ పౌరులం. మట్టి బిడ్డలం. సహజ వనరులను ప్రజలకోసం రక్షించుకుంటాం. మేం దేశంలో 80శాతంగా ఉన్న పేద ప్రజల పక్షాన నిలబడతాం. పోరాడుతాం. ఇదే మా దృష్టిలో దేశ భక్తి.. అని ప్రకటించాడు. ఇదే మన పాలకుల దృష్టిలో రాజద్రోహమైంది.

1599

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు