వస్తుమయ మాయాజాలం..


Sun,January 17, 2016 01:00 AM

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామాజికశాస్త్రవేత్తలు చాలానే చెప్పారు. వస్తు ఉత్పత్తులు, వాటి లాభాలపైనే ఆధారపడిన ఆధునిక పెట్టుబడిదారీ సమాజం వస్తుమయవాదం అనే మాయా తెరను సమాజంపై కప్పేస్తున్నది. వస్తుమయ వాదం మనుషులపై బహుముఖీయంగా దాడి చేస్తుంది.

sama


బంజారాహిల్స్‌లోని ఓ పేరుమోసిన అంతర్జాతీయస్థాయి మోటార్ సైకిళ్లు అమ్మే షో రూం నుంచి టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తానని చెప్పి ఓ యువకుడు బైక్‌ను తీసుకున్నాడు. హైటెక్ అబ్బాయి వాలకం చూసి షోరూం నిర్వాహకులు నమ్మకంతో బైక్‌ను ఆయనగారికి అప్పజెప్పారు. బైక్‌తో టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన వాడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కోటి రూపాయల విలువ చేసే బైక్‌ను దొంగిలించాడని షోరూం వారికి అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆ యువకుడు కొన్ని గంటల్లోనే బైక్ తో మహారాష్ట్ర చేరుకున్నాడు. పోలీసు లు అప్రమత్తమవడంతో చిక్కాడు. తీరా విచారిస్తే.. అతను ఇంజినీరింగ్‌లో మెరిట్ విద్యార్థి. ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో లక్షకు పైగా నెల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు! కార్పొరేట్ కంపెనీలో లక్షకు పైగా జీత భత్యాలతో ఉన్నతోద్యోగం చేస్తు న్నవాడు.. బైక్ దొంగతనం ఎందుకు చేశాడు..?

అతనో మధ్య తరగతి యువకుడు. చిరుద్యోగం. రోజుకొకటిగా వస్తున్న విలాస వస్తువుల కవ్వింపులతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తానూ అలాంటి విలాస వస్తువులను సొంతం చేసుకోవాలని కలలు కన్నాడు. కానీ అది సాధ్యమయ్యేది ఎలాగో అంతు పట్టలేదు. ఆ వస్తువులన్నింటినీ సమకూర్చుకోవడమెలాగో అర్థం కాలేదు. ఉన్నఫలానా ఉండలేక.. వాటన్నింటినీ సొంతం చేసుకోవడానికి తన కిడ్నీని అమ్ముకొని ఏకంగా అరవై జతల షూలు, ఓ రోలెక్స్ వాచ్ కొన్నాడు! తన వస్తు దాహాన్ని తీర్చుకోవడానికి ప్రాణం మీదికి వచ్చేదైనా.. కిడ్నీని ఎందుకు అమ్ముకున్నాడు..?

మనిషి ఉండవలసిన తీరుగా ఉండనీయనిదేదో సమాజాన్ని ఆవహించింది. అది మనిషిలోని మనిషిత్వాన్ని తోడేస్తున్నది. పరాయీకరించి విచిత్ర జీవిగా మార్చేస్తున్నది. మనిషిగా చేయగూడని, ప్రవర్తించని వర్తనను ఆపాదిస్తున్నది. మనిషిలోని (సమాజంలోని) సమస్త సహజ లక్షణాలను, సహజాతాలను ఆవిరి చేస్తున్నది. ఈ నేపథ్యంలోంచే మున్నెన్నడూ చూడని వికృతాలు చూస్తున్నాం. అమానవీయాలు అనుభవిస్తున్నాం. ఈ వికృతాలన్నింటికీ కారణం.. వస్తుమయ వాదం విసిరిన వల.

ఈ రెండు ఘటనలే కాదు, నేడు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వస్తుమయ వాదం.. అది ఎంత మాయావి నో, ఎంతగా అమానవీయమైనదో అనుభవంలోకి వస్తున్నది. మూడు దశాబ్దాలుగా వస్తుమయవాద ప్రమాదం గురించి సామాజిక ఉద్య మ సంస్థలు, సాహితీ సాంస్కృతిక సంఘాలు హెచ్చరిస్తున్నా.. ఎవరికీ దాని ప్రమా దం గురించి అర్థం కాలేదు. ఇవ్వాళ.. అది మనిషి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నది.

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయ వాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామాజిక శాస్త్రవేత్తలు చాలానే చెప్పారు. వస్తు ఉత్పత్తులు, వాటి లాభాలపైనే ఆధారపడిన ఆధునిక పెట్టుబడిదారీ సమాజం వస్తుమయ వాదం అనే మాయా తెరను సమాజంపై కప్పేస్తున్నది. వస్తుమయ వాదం మనుషులపై బహుముఖీయంగా దాడి చేస్తున్నది. అందులో ప్రధానంగా.. ఒకటి-మనుషులపై వస్తువులతో దాడి. రెండు- వస్తువుల కోసం మనుషులను తయారు చేయడంగా ఉంటుంది.

పెట్టుబడిదారీ సమాజంలో మనిషి అవసరాల కోసం కాకుండా, పెట్టుబడిదారుల లాభాల కోసం వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. లాభాల కోసం జరిగే వస్తూత్పత్తికి ఏ నియమాలుండవు. సామాజిక అవసరాలు పట్టవు. మనుషుల కొనుగోలు శక్తి అస లే పట్టదు. చిత్ర, విచిత్ర వస్తువులతో, రకరకాల స్కీములతో మనుషులను ఊరిస్తా రు. రెచ్చగొడతారు. వస్తువుల అమ్మకం కోసం ఆయా కంపెనీలు చేసే వ్యాపార ప్రకటనలు, ప్రచార హోరులో మనిషి ఉక్కిరిబిక్కిరవుతాడు. అవి తమ సొంతం చేసుకో లేకపోతే.. తాను తమ చుట్టూరా ఉన్న సమాజానికన్నా వెనుకబడి పోతానన్న ఆత్మన్యూనతకు గురవుతాడు. దీంతో మార్కెట్లోకి వచ్చిన ప్రతి వస్తువునూ సొంతం చేసుకునేందుకు పరుగులు తీస్తాడు. అప్పులు చేసైనా పరువు నిలుపుకోవాలని ఆరాట పడుతాడు. అవసరం లేకపోయినా మార్కెట్లో కొని ఇంట్లో ప్రదర్శనకు పెడతాడు. అందుకే.. ఒక్కొక్కరి ఇంట్లో.. కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ సంఖ్యలో వాహనాలుంటాయి. మోటార్ బైకులుంటాయి. ఇక వెయిటింగ్, డ్రెస్సింగ్, కిచెన్ రూముల్లోనైతే.. మార్కెట్లోని కొత్త వస్తువులన్నీ కొలువు దీరి ఉంటాయి. అవన్నీ అవసరమా అంటే.. ఉండాలి కదా.. అనేదే సమాధానంగా ఉంటున్నది.

ఇంతగా వస్తు వ్యామోహం పెంచడానికి వస్తూత్తత్తి కంపెనీలు, ముఖ్యంగా బహుళజాతీ కంపెనీలు పేరుమోసిన సెలబ్రిటీలు ప్రధానంగా సినీ తారలు, హీరోలు, క్రీడాకారులతో చేసే ప్రచార హోరుకు అంతుండదు, హద్దుండదు. కొకొకోలా కంపెనీ తన శీతల పానీయం అమ్ముకోవడానికి, మెగాస్టార్‌తో.. ఆ కూల్ డ్రింక్ తాగడానికి.. మీకు దమ్ముందా.. అని మన యువతనంతా రెచ్చగొడతారు. ఇది చూసిన మన యువతరమంతా.. మాకు దమ్ములేదా.. మా దమ్మేందో చూపిస్తామన్నట్లుగా అన్నం తినేప్పుడు కూడా మంచి నీళ్లకు బదులు కూల్ డ్రింకులే తాగుతున్నారు. ఈ మధ్యన మరో స్టార్ అయితే.. ఏదో ఒకటి అదరగొట్టాలి.. అంటూ.. కూల్ డ్రింక్‌ను తాగి శక్తిని కూడదీసుకుని దుమ్మురేపుతాడు. మనోళ్లేం తక్కువ.. నేటి విద్యార్థి, యువత అంతా కూల్ డ్రింక్‌లు తాగుతూ దుమ్మురేపుతున్నారు.

ఒక కార్ల ఉత్పత్తి కంపెనీ అయితే తన కార్ల అమ్మకాల కోసం.. అమానవీయం ప్రచారానికి ఒడిగట్టింది. ఓ డాబుసరి యువకుడికి కొత్తగా వచ్చిన కారు.. తళుకు బెలుకులతో చూడగానే ముద్దొచ్చే అమ్మాయిగా కనిపిస్తుంది. వెంటనే పరుగెత్తి దాన్ని వాటేసుకుని.. ముద్దుపెట్టుకుంటాడు. మరో బైకుల తయారీ కంపెనీ అయితే.. తమ కంపెనీ తయారు చేసిన బైకులు ఎక్కితే.. అమ్మాయిలు వచ్చి నేరుగా తమ వెనక కూర్చుంటారని చెప్తున్నది. మిత్రునితో బైక్‌పై పోతున్న యువతి.. కొత్త బైక్‌తో వచ్చిన యువుకున్ని చూడకుండానే.. ఆ బైకును చూసి ఏకంగా కూర్చున్న బైక్ దిగి కొత్త బైక్ ఎక్కి వెళ్లిపోతుంది! బైక్‌పై ఉన్న యువకునితో సంబంధం లేకుండానే.. మోటార్ సైకిల్‌ను చూసి మురిసిపోయి మనసు పారేసుకుంటుంది. ఆ బైకున్నవాడే తన వాడనుకుంటుంది. ఇది చూసిన మన యువతరమంతా.. లక్షలు పోసి బైకులు కొంటున్నా రు. ఈ హై స్పీడ్ బైకులతో ఏమొస్తుందో లేదో కానీ ప్రమాదాలు మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి.

ఒక కంపెనీ తాము తయారు చేసిన కొత్త బైక్ చాలా గట్టిదీ, ఎట్లాంటి పరిస్థితులైనా తట్టుకుంటుంది అని చెప్పడం కోసం అది.. దున్న పోతులాంటిదనీ, దానిపై శత్రువుపై సవారీ చేసినట్లుగా చేయొచ్చనీ.. చెప్పకొస్తుంది. అందుకోసం ఆ బైక్‌కు వెనుక భాగాన కొమ్ముల లాంటి ఎలివేషన్స్‌ను కూడా పెట్టి బైక్ గట్టి తనాన్ని చాటిచెబుతున్నది. మనదైన సంస్కృతిక జీవనంలో.. పరికరం, వస్తువు ఏదైనా ప్రేమగా, గౌరవంగా చూసుకుంటాం. పొరపాటున కాలు తగిలినా కళ్లకద్దుకుంటాం. నిత్య జీవితంలో తోడుగా, సాయంగా నిలిచే ఏ వస్తువు, పరికారాన్నైనా గౌరవిస్తాం, పూజిస్తాం.అది మన మానవీయ సంస్కృతి. పరికరాలతోకూడా మానవీయ సంబంధంలో ఉండే మన సంస్కృతిని అమానవీయం చేసి మన వస్తువును మన శత్రువుగా చూడమంటుంది ఈ కన్స్యూమరిజం.

మనిషిపై వస్తు దాడి.., దాని పర్యవసనాలు నేటి సమాజంలోని వికృతాలను ఎన్నై నా చెప్పుకోవచ్చు. వస్తూత్పత్తితో మనుషుల అవసరాలను సృష్టించి, వస్తుదాడితో.. మనుషులను వినియోగ దారునిగా వస్తుదాహాన్ని పెంచడం ఒక ఎత్తు అయితే.., వస్తువుల కోసం మనిషినే తయారు చేయడమనేది వస్తుమయ వాదపు అమానవీయ ముఖానికి పరాకాష్ట. దీంతో.. మనిషి వస్తువులను అవసరం కోసం కొనడం ఉండదు. సరదా కోసం వస్తువులను కొంటాడు. మార్కెట్‌కు పోవడం, వస్తువులను కొనడం సరదా మాత్రమే కాదు అలవాటు! సరిగ్గా ఈ నేపథ్యంలోంచే.. మన సెలబ్రిటీలు టీవీ షోల్లో మీ హాబీ ఏంటంటే.. షాపింగ్ అంటారు. షాపింగ్ చేయడం హాబీ ఏంటో..!? పుస్తకాలు చదవడం, పాటలు వినడం హాబీలుగా ఉంటాయి, ఉండాలి. కానీ మన సెలబ్రిటీల హాబీ షాపింగ్ అని ఏ జంకు లేకుండా చెప్పుకోవడమే కాదు.. ఎక్కడెక్కడ పోయి ఎన్ని రకాల చెప్పుల జతలు, హ్యాండ్ బ్యాగులు, పర్ఫ్యూంలు, ఐ ఫోన్‌లు కొన్నారో చెప్పుకొస్తారు. వాటితో ఎన్ని బీరువాలు నింపా రో కూడా సెలవిస్తారు.

వస్తుమయ వాద మాయావి ఆవరించిన మనిషి వస్తుదాహం తీరనిది, అంతులేనది. అందుకే మన సాఫ్ట్‌వేర్ కంపెనీలోని ఉన్నతోద్యోగి అయినా.. కోటి రూపాయల బైక్‌పై ఎక్కి సవారు చేయాలన్న కాంక్ష.. అతన్ని అన్ని మరిచిపోయేలా చేసింది. ఎలాగైనా సవారీ చేసే దాకా అతన్ని మనిషిగా ఉండనీయకుండా దొంగను చేసింది. మరో ఘటనలో.. కిడ్నీ అమ్ముకుని అయినా.. ఆరవై జతల బూట్ల జతలు కొన్నాడు. రోలెక్స్ వాచ్ కొన్నాడు. ఇలాంటి హృదయాన్ని ద్రవింపచేసే ఘటనలన్నీ జరిగిపోతున్నా.. నేటి సమాజం వాటిలోని ప్రమాదాన్ని పట్టించుకోకుండా కళ్లప్పగించి చూస్తుండి పోవడమే నేటి విషాదం. ఇవి వ్యక్తిగత పోకడలు, ఘటనలు ఎంత మాత్రం కావు. అవి నేటి సామాజిక రుగ్మతకు ప్రతీకలు. ఈ రుగ్మత నివార ణకు సమయం ఆసన్నమైనది. ఇప్పటికైనా.. వస్తుమయ వాద ప్రమాదాన్నుంచి సమాజాన్ని రక్షించుకునేందుకు కదలాలి. కన్స్యూమరిజాన్ని కట్టడిచేసేందుకు సామాజికోద్యమమే చేయాలి.

1412

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు