వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?


Sun,December 13, 2015 01:42 AM

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలి. ఇవేవీ చేయకుండా.. సమాజంలోని వివిధ సామాజికవర్గాల మధ్య ఉన్న అంతరాన్ని, వైరుధ్యాన్ని పరిష్కరించకుండా జవాబుదారీపాలన, పారదర్శక పాలన అన్నది నీటి మీది రాతే అవుతుంది.

sama


ఏకే మాథుర్ నేతృత్వంలో ని ఏడవ వేతన కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఇతర అలవెన్సులు పెంచాలని సిఫార్సు చేసింది. కమిషన్ సామాజిక జీవన పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వ ఉద్యోగికి కనీస వేతనం 18వేలుగానూ, గరిష్ఠంగా 2.25లక్షలుగాను నిర్ణయించింది. అలాగే ప్రతి ఏటా మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని సూచిస్తూ.. పింఛన్‌దారుల వేతనాన్ని 24 శాతం పెంచింది. వేతన పెంపు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, బోధనా సిబ్బందికి వర్తిస్తుందని తెలిపింది. ఈ పెంచిన వేతనాలు జనవరి 2016 నుంచి అమలవుతాయి. దీంతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 55 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూరనున్నది.

వేతన కమిషన్‌లు వేయడం.. అది సూచించిన విధంగా వేతనాలు పెంచకపోవడం, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితరాల్లో మార్పులు చేయకపోవడం మన ప్రభుత్వాల కు అలవాటు. ఈ సిఫార్సులకు అటు ఇటుగా కొన్ని మార్పులతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేతనాలు పెంచడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలోనే ఎప్పుడు చూసినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చి చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తక్కువగానే ఉంటున్న స్థితి కూడా ఉన్నది. ఈ వివక్ష ఎందుకు, ఎంత కాలమనే ప్రశ్న కూడా చాలా కాలంగా ఉన్నది. ఈ క్రమంలోనే ఏడవ వేతన కమిషన్ సూచనల ప్రకారం.. ప్రభుత్వోద్యోగుల వేతన భారం 2016-17ఆర్థిక సంవత్సరం నుంచి 68,400 కోట్లకు చేరుకోనున్నది. అలాగే పింఛన్‌దారుల భారం కూడా 33,700 కోట్లకు చేరుకుంటుంది. మొత్తంగా చూస్తే.. 1,02,100 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సూచించిన విధంగా వేతనాలు పెంచడం దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తలకు మించిన భారమని ఆర్థికవేత్తలు అంటున్నారు. అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన ఆర్థిక వ్యవస్థ దీంతో కుదేలవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు.

పరిస్థితులెలా ఉన్నా, వేతన సవరణలపై ఎంత చర్చ జరిగినా, ఏదో మేర వేతనాల్లో పెరుగుదల ఉండటం జరుగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోంచే.. ఒకనాడు బతకలేక బడి పంతులు అన్నది, ఇవ్వాళ మారిపోయింది. ఉపాధ్యాయుల వేతనాలు గణనీయంగా పెరిగిపోయాయి. కళాశాల లెక్చరర్ల జీతాలైతే లక్షలు దాటిపోయింది. ఇలా ఏ శాఖ తీసుకున్నా.. నేడు ప్రభుత్వ ఉద్యోగమంటే పని తక్కువ పైకం ఎక్కువ అన్న నానుడి ఏర్పడింది. అయితే.. నేటి ఆధునిక యుగంలో పెరుగుతున్న అవసరాలు, చుక్కలంటుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో.. అన్ని ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగుల వేతనాలు వారి సేవలకు తగిన విధంగా, న్యాయంగా ఉన్నాయని అర్థంకాదు. కానీ ఇక్కడ నోరున్నోళ్లదే రాజ్యం అన్న చందంగా మారిపోతున్నది.

సంఘటిత శక్తిగానే గాక, నోరున్న ఉద్యోగ సమూహం గా, పాలక ప్రభుత్వాలపై ఒత్తిడి చేయగలిగిన వర్గంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఏదో స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. పాలకులు కూడా ప్రజాప్రతినిధులుగా తక్కువ తిన్నామా అని.. తమకు కావాల్సిన విధంగా వేతనాలు పెంచుకుటున్నారు. అయితే ఇక్కడ సమస్య అంతా.. ఉద్యోగులకు వేతనాలు పెంచడం, ప్రజా ప్రతినిధుల వేతనాలు పెంచుకోవడం కాదు, ఇదే స్థాయిలో ప్రజల స్థితి గతులేవిధంగా ఉంటున్నాయి, జీవన ప్రమాణాలేమైనా మారుతున్నాయా అన్నది ప్రశ్న.
ఇక్కడే పే కమిషన్‌ల తీరు గమనంలోకి తీసుకోవాలి. ప్రతి పదేళ్లకోసారి దేశంలో వేతన సంఘం వేయడం ఆనవాయితీగా వస్తున్నది.

ఈ క్రమంలో.. 1946లో మొదలైన ఒకటవ వేతన సంఘం.. నాడు ఉద్యోగుల కనీస వేతనం 35రూపాయలుగా నిర్ణయించింది. రెండవ వేతన సంఘం నాటికి 80 రూపాయ లు చేసింది. ఇలా.. మూడవ వేతన సంఘం 185 రూపాయలు, నాల్గవది 750, ఐదవది 2550, ఆరవది 6660 ఖరారు చేశాయి. ఏడవ వేతన సంఘం నాటికి మూడు రెట్లు పెంచి 18వేలుగా ఖరారు చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా1954లో రూపొందించుకున్న నియమ నిబంధనల ప్రకారం వేతనాలు నిర్ణయించుకుంటున్నారు.

దీనికి 28 సార్లు సవరణలు చేసుకుంటూ వేతనాలు పెంచుకున్నారు. 1968లో ఎంపీల గౌరవ వేతనం 400 రూపాయలు, రోజుకు అలవెన్స్ 31 రూపాయలు. అప్పటినుంచి 1985 దాకా ఎంపీల వేతనం 500, అలవెన్స్-51 రూపాయలు.1977లో ప్రజాప్రతినిధులకు పెన్షన్ విధానం ప్రవేశ పెట్టి 1985 నాటికి 1500 రూపాయలకు పెంచుకున్నారు. అదే 2010 నాటికి లక్షా 40వేలకు పెంచుకున్నారు. వీటికి తోడు అనేక రకాల అలవెన్సులు అన్నీ కలిపి నెలకు 35లక్షలకు చేరుకుంటున్నది. ఈ లెక్కన ఓ సాధారణ వ్యక్తి ఏడాదిలో సంపాదించిన దాని కన్నా 68 రెట్లు ఎక్కువ.

మన ప్రజాప్రతినిధుల జీత భత్యాలు చూస్తే.. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్‌తో సహా ఏదేశానికీ తీసిపోని విధంగా ఉన్నాయి. కానీ ఆ దేశాల్లో ప్రజా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వారు మరే ఇతర వ్యాపారాలు చేయకూడదు. కానీ మన నేతలు తమ వ్యాపారాల లబ్ధి కోసమే ప్రజాప్రతినిధుల అవతారమెత్తుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగస్వామ్యం, ప్రజాప్రతినిధులు తమ జీత భత్యాలను పెంచుకుపోతున్న రీతిలో.., ప్రజల స్థితిగతులు మారా లి. అలా జరుగుతున్నదా అంటే లేదనే చెప్పాలి. 1947లో స్వాతంత్య్రం వచ్చిందన్న నాటి నుంచి దేశంలో కోట్లాదిగా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు కనీస స్థాయిలో కూడా మెరుగు పడకపోవడమే కాదు, ఇంకా దిగజారిన స్థితి కనిపిస్తున్నది. నాటి నుంచి నేటి దాకా దేశంలో పేదరికం పెరిగిందని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు, ప్రభుత్వ సర్వేలు, అధ్యయనాలు తెలుపుతున్నాయి.

పేదరిక అధ్యయనం కోసం నియమించిన సురేశ్ టెండూల్కర్ కమిటీ 2011-12లో ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రామాల్లో 27 రూపాయలు, పట్టణాల్లో 33 రూపాయల కన్నా తక్కువ సంపాదిస్తున్న వారే పేదవారని చెప్పింది. ఇలాంటి పేదవారు ఆయన తేల్చిన లెక్కల ప్రకారమే దేశంలో 36 కోట్ల మంది ఉన్నారు. ఇంతకు ముందు 2009-10 సంవత్సరంలో నియమించిన రంగరాజన్ కమిటీ దేశంలో 38కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ రాజ్ సంస్థ 1999లో చేసిన అధ్యయనం ప్రకారం గ్రామీణ భారతంలోని 86లక్షల 65వేల కుటుంబాలలో 26లక్షల 77వేల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయి. ఇలా కటిక దారిద్య్రంలో నూటికి ముప్పై మందికి పైగా ఉన్న ప్రజలు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో రోజుకు 27,33 రూపాలయతో ఏం కొని, ఏం తినగలరో ఊహించుకోవాల్సిందే.

ఈ క్రమంలోనే ప్రజల స్థితి గతులు నానాటికీ దిగజారిపోతున్నా.. పట్టని పాలకులు ఉద్యోగస్వామ్యానికి మాత్రం ఇబ్బడి ముబ్బడిగా జీత భత్యాలు పెంచి వారిని పరాయీకరణకు గురిచేసే కార్యక్రమం పకడ్బందీగా చేసుకుంటూ పోతున్నారు. అందుకే ఓ పోలీసు, హాస్పిటల్‌లోని అటెండరు, రెవెన్యూ కార్యాలయంలోని ఉద్యోగి అవసరం కోసం వచ్చిన ప్రజల పట్ల కనీస మానవీయత మరిచిపోతున్నా డు. అవసరం కోసం వచ్చిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడమే కాదు, అవమాన పరుస్తున్నారు. ఉద్యోగులైనా..తామూ ఓ రైతు బిడ్డనే అనేది మర్చిపోతున్నారు. నేటి ఉద్యోగులు మొదట తాము మనుషులం, ఆ తర్వాతే ఉద్యోగులంఅనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఏ వర్గం పట్లా మరో వర్గానికి కనీస ప్రేమ, గౌరవం కరువైన స్థితి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగిన నాడు వారికి వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పేందుకు ఉద్యోగులను పందికొక్కులు అని మన పాలకులు నిందించారు. ఇలా వివిధ సామాజిక వర్గాల మధ్య లేని వైరుధ్యాన్ని సృష్టించడమే కాదు, అగాధాన్ని పెంచి పోషించేందుకు పాలకులు చేయాల్సినంతా చేస్తున్నారు. పేదలు, రైతులు..మొత్తంగా కోట్లాది మంది ప్రజలు తమ జీవన స్థితి గతుల పట్ల ప్రశ్నిస్తే, ఉద్యమిస్తే పాలకుల దృష్టిలో నేరమైపోతున్నది. శాంతి భద్రతల సమ స్య అవుతున్నది. ఈ క్రమంలోంచే ప్రజల నుంచి పాలకులకు రక్షణ అవసరమవుతున్నది. ఉద్యోగస్వామ్యం నుంచి మద్దతు అవసరమవుతున్నది. ఈ నేపథ్యంలోం చే.. ఉద్యోగస్వామ్యాన్ని మచ్చిక చేసుకుని ప్రజలపై ఉసిగొల్పే ప్రక్రియ కొనసాగుతున్నది. ఉద్యోగస్వామ్యానికి జీత భత్యాలు పెంచుతూ పోతూ.., ప్రజల బాగోగులను గాలికొదిలేయడం కొనసాగుతున్నది.

బక్కచిక్కిన ఆర్థిక వ్యవస్థ, లోటు బడ్జెట్ల గణాంకాల మాటున ఉద్యోగుల జీత భత్యాల పెంపునూ, ప్రజల సమస్యలను, పేదరికాన్ని ఒకదానికొకటి పోటీ పెట్టడం సరికాదు. దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి. తద్వారా ప్రజల జీవ న ప్రమాణాలను మెరుగుపర్చాలి. ఇవేవీ చేయకుండా.. సమాజంలోని వివిధ సామాజిక వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని, వైరుధ్యాన్ని పరిష్కరించకుండా జవాబుదారీపాలన, పారదర్శక పాలన అన్నది నీటి మీది రాతే అవుతుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడం, వాటి నుంచి ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుంది.

1603

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు