మహమ్మారి మాధ్యమాలు


Sun,December 6, 2015 03:30 AM

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫోనంత దూరమే అన్నారు. కానీ ఆ సెల్లే.. మనుషుల మధ్య పూడ్చలేని అగాథాన్ని పెంచేస్తున్న తీరు అనుభవిస్తూనే ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియాతో జరుగుతున్న సంస్కృతిక ప్రపంచీకరణ మనిషిని పరాయీకరణకు బలి చేయడంతోనే ఆగిపోవడం లేదు. మనిషిని అమానవీయంగా, హింసాత్మకంగా మార్చి వేస్తున్నది. మౌఢ్యంలో ముంచేస్తున్నది.

ఈ మధ్య సోషల్ మీడియా లో ఓ వీడియో హల్‌చల్ చేస్తున్న ది. టీవీలో కార్టూన్ ప్రోగ్రాం లు, సెల్లులో వీడియో గేమ్స్‌కు బానిస అయిన ఓ బాలుని విషా ద దృశ్యమది. కార్టూన్ సినిమా లు చూడకుండా, వీడియో గేమ్స్ లు ఆడకుండా ఉండలేని బాలు డు హాస్పిటల్ బెడ్‌మీద గిలాగిలా కొట్టుకుంటున్న వీడియోను వేల సంఖ్యలో చూసి వీవర్స్ ఖాతాలో చేరారు. లక్షల సంఖ్య లో లైక్‌లు చేశారు! ఆ విషాద సన్నివేశం పట్ల వచ్చిన స్పందన నుంచి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా? ఏవైనా గుణపాఠాలు తీసుకుంటున్నామా అన్న విషయాలకు సోషల్ మీడియాలో పెద్దగా తావుండదు. ఏవైనా కొన్ని సామాజిక ఘటనల పట్ల సిరియస్‌గా ఏదో కొంత మేర చర్చ జరిగుతున్నా.. అది మొత్తంగా సామాజాన్ని కదిలించి మార్పుకు మార్గాలు వేసిన ఉదంతాలు చాలా తక్కువ. అంతా.. షేరింగ్‌లు, లైక్‌లతో నడిచిపోతుంటుంది.
చార్లీచాప్లిన్ సినిమా మోడ్రన్ టైమ్స్ కొంత మందిని కడుపుబ్బ నవ్విస్తే.., మరికొంత మందికి కన్నీరు పెట్టించిన అనుభవమున్నది. సరిగ్గా అలాంటి దుస్థితిలోనే.. ఈ కార్టూన్ సినిమాలు, వీడియోగేమ్‌ల బాధిత బాలుడి గాథ అత్యంత విషాదకరమైనది. ఇది ఈ ఒక్క బాలుడి సమస్య మాత్రమే కాదు, ఇవాళ.. ఆధునిక యుగంలో ప్రతి ఇంటి సమస్య. అందరి సమస్య.

చరిత్రలో మున్నెన్నడూ లేనంతగా గత రెండు దశాబ్దాల్లో జరిగిన శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి ప్రపంచ గమనాన్ని, ముఖచిత్రాన్నే మార్చేసింది. ముఖ్యం గా ప్రచార, ప్రసార సాధనాల అభివృద్ధి, సమాచార(కమ్యూనికేషన్) రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మానవాళి జీవన సరళిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వీటిలో టీవీ, సెల్లుల గురించి, అవి మానజీవితంపై ప్రభావం చూపుతున్న తీరుపై ఎంత చెప్పుకున్నా తక్కువే. సమాచార, ప్రచార, ప్రసార రంగంలో గుణాత్మక మార్పుకు కారణమైన టీవీ 1940లో ఉనికిలోకి వచ్చిన్నా డు దీన్ని ఆవిష్కరణలన్నింటిలో అద్భుతమైనదిగా ఆనందపడ్డారు. కళ్లమందు కనిపించే ప్రపంచాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి టీవీ అందివచ్చిన సాధనగా భావించారు. కానీ.. పదేళ్లు తిరగకుండానే పెట్టుబడి చేతుల్లో బంధీ అయ్యిం ది. 1952లో మొదటిసారి ఓ జొన్న, ఆలుగడ్డ ఉత్పత్తుల వ్యాపారి టీవీ ప్రకటనతో.. పదింతల అమ్మకాలు పెంచుకున్నప్పటి నుంచి టీవీ ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. పెట్టుబడిదారుల వ్యాపారాభివృద్ధికి సాధనం, సోపానమైపోయింది. 80 దశకం నుంచి నేటి ప్రపంచాన్ని టీవీ, మొబైల్‌ల యుగంగా చెప్పుకోవచ్చు. నాటి నుంచి నేటి దాకా టీవీ చాలా దూరం ప్రయాణింది. వాస్తవాలను కళ్లముందు ఉంచే దృశ్యతెర నుంచి వినోదానికీ, వినోదం పేర విశృంఖలత్వానికీ కేంద్రమైపోయింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏ టీవీ తీసుకున్నా వాటి ప్రసారాల్లో 13 శాతం మాత్రమే వార్తలను ప్రసారం చేస్తున్నాయి. 9.6శాతం కాంటెంట్ ప్రోగ్రాంలు ప్రసారం చేస్తూ.. 80 శాతానికి పైగా వ్యాపార ప్రకటనల కు కేటాయిస్తున్నాయి. దీన్నిబట్టి వ్యాపార ప్రకటనలతో మానవాళిపై ఎంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఎన్నో అద్బుత పరికరాలను తయారు చేసిన మనిషి, చివరికి ఆ పనిముట్లకే బానిసవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మన ఇళ్లలోని వారంతా సరాసరిగా రోజుకు ఆరు గంటలు టీవీ చూస్తున్నారు. 8-18 ఏళ్ల లోపు పిల్లలు అయితే రోజుకు ఐదు గంటలు టీవీ చూడటంలోనే గడుపుతున్నారు. అది బస్సు అయినా, బజార్ అయినా ఎక్కడ ఇద్దరున్నా.. గతంలో ఏదో ముచ్చట పెట్టేవారు. మాట్లాడుకునే వారు. కష్టసుఖాలు కలబోసుకునేవారు. అనుభూతులు పంచుకునే వారు. అనుబంధాలు పెంచుకునేవారు. ఇప్పుడిదంతా కనుమరుగై.. ఇద్దరూ తమ సెల్లుల్లో తలలు దూర్చి లోకాన్ని మర్చిపోతున్నారు. ఒంటరై పోతున్నారు. ఈనేపథ్యంలోంచే.. నేటి ఆధునిక లోకం పోకడలో సమూహంలో ఒంటరై పోయాడు మనిషి. అందుకే ఇవ్వాళ.. అందరికీ మానవీయ సంబంధాలు, అనుబంధాలు అర్థం లే(కా)ని విషయాలై పోయాయి.
24 X 7.. పొద్దస్తమానం నిరంతరాయ ప్రసారాలతో ఇంట్లో తిష్టవేసి ఈడియట్ బాక్స్ చేస్తున్న భావ కాలుష్యం అంతా ఇంతా కాదు. మానవ సంబంధా లు, అనుబంధాలన్నింటినీ ఈర్ష్యా ద్వేషాలతో నింపివేసి అత్తా-కోడల్లను ఆగర్భ శత్రువులుగా మార్చేస్తున్నది. మనుషులంటేనే.. పగ, ప్రతీకారాలకు ప్రతిరూపాలని బోధిస్తున్నది. ఇక టీవీ ప్రసారాల ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా ఉంటున్నది. రామాయణం, మహభారతం సీరియళ్లు వచ్చిన కాలంలో దేశంలో చాలాచోట్ల బాణాలతో ఆడుకుంటున్న పిల్లలు 31 మంది కళ్లు పోగొట్టుకున్నారు. శక్తిమ్యాన్ ప్రసారమవుతున్న కాలంలో శక్తిమాన్‌ను అనుకరించి ఎత్తయిన బిల్డింగ్ ల మీది నుంచి దూకి ఇద్దరు పిల్లలు చనిపోగా ఏడుగురు కాళ్లు విరగ్గొట్టుకున్నారు.

వ్యాపార ప్రకటనల ప్రభావం మనిషిపై తీవ్రంగాఉంటున్నది. సామాజిక సంపర్కం లేని మనిషికి టీవీ చెప్పిందే వేదమై పోతున్నది. మనిషి సంప్రదాయక సంస్కృతిక ఆచరణ నుంచి దూరమై వినియోగదారునిగా మారిపోతున్నాడు. ఈ క్రమంలో సంప్రదాయిక విలువలు, ఆచరణలు అనాగరికమైనవని టీవీ చెప్తున్న ది. ఏం తినాల్నో, ఎట్లా తినాల్నో కూడా మనకు టీవీనే నేర్పుతున్నది. వేప, ఉత్తరేని పుల్లతో పళ్లు తోమే రైతుకు.. ఛీ కట్టెపుల్లతో పళ్లు తోముతారా? అంటూ అనాగరికమని దెప్పి పొడుస్తది. బొగ్గు పొడితోనో, ఉప్పుతోనో పళ్లు తోమితే.. ఇంత వెనకబాటు తనమా అంటూ హేళనచేస్తది. మరో వైపు.. మీ దంతాలు ముత్యా ల్లా మెరవాలంటే ఫలానా టూత్ ఫేస్టునే వాడమంటుంది. అంతటితో ఆగదు.. టూత్ పేస్టుకు అలవాటు పడిన మనలతో..ఆయుర్వేద వేప గుణాలున్న తమ పేస్టునే వాడమంటూ.. బొగ్గు, ఉప్పు గుణాలున్నది.., ఉత్తరేణి గుణాలున్నది.. అంటూ నెలకొక కొత్త పేస్టును మన చేత కొనిపిస్తున్నది. లక్షా 35వేల టన్నుల టూత్ పేస్టును బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు మన చేత కొనిపించి సొమ్ము చేసుకుంటున్నాయి.ఈ విధంగా ఒక్క కొల్గేట్ టూత్ ఫేస్ట్ కంపెనీయే ప్రతియేటా.. 12వేల కోట్ల వ్యాపారం చేస్తున్నది. అంతే కాదు.. మనకు సంస్కారం కూడా ఓ బట్టలుతికే సబ్బు నేర్పుతున్నది. అందరికి మెచ్చే కోడలు కావాలంటే టీవీ చెప్పిన టీ పోడితోనే చాయ్ చేయాలి. ఈ క్రమంలోంచే.. అమ్మ.. కాంప్లాన్ మమ్మీ అయిపోయి, వాడు కాంప్లాన్ బోయ్ అవుతున్నాడు. ఇదింకా ముదిరి ఈ కాలం పిల్లలు అయితే.. ఐ లవ్ మమ్మీ అనడం లేదు, ఐ లవ్ కంట్రీ అనడం లేదు, ఐ లవ్ మై బజాజ్ అంటున్నాడు! ఈ క్రమంలో సంస్కృతిక ప్రపంచీకరణతో మనుషులంత ఏకురీతి వస్తు వినియోగ దారులుగా మాత్రమే తయారవుతున్నారు.

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫోనంత దూరమే అన్నారు. కానీ ఆ సెల్లే.. మనుషుల మధ్య పూడ్చలేని అగాథాన్ని పెంచేస్తున్న తీరు అనుభవిస్తూనే ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియాతో జరుగుతున్న సంస్కృతిక ప్రపంచీకరణ మనిషిని పరాయీకరణకు బలిచేయడంతోనే ఆగిపోవడం లేదు. మనిషిని అమానవీయంగా, హింసాత్మకంగా మార్చి వేస్తున్నది. మౌఢ్యంలో ముంచేస్తున్నది. ఉదయాన్నే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పే ప్రోగ్రాం మొదలు మిడ్ నైట్ మసాలా సినిమాల దాకా.. టీవీల్లో, సినిమాలన్నింటా అశాస్త్రీయ మూఢనమ్మకాల మౌఢ్యం, రక్తపాతం, హింస, ఈర్ష్యా ద్వేషాలే నిండి ఉంటున్నాయి. ఒక డిస్‌క్లేమర్ కార్డు వేసి అశాస్త్రీయ చెత్తనంతా రోజంతా ప్రచారం చేస్తూ మనుషులను మూఢనమ్మకాల్లోకి దించుతున్న తాయత్తులు, మాలలు, ఉంగరాల కట్టు కథలకు అంతే లేదు. నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు మనిషిని శాస్త్రీయభావజాలం వైపు, మానవీయత వైపు నడిపించాల్సినవి మొత్తం సమాజాన్ని వెనకకు తీసుకెళ్తున్నాయి.ఈ పరిస్థితుల్లో సమాజం మానవీయంగా, శాస్త్రీయంగా ఉండాలంటే.. ప్రసార మాధ్యమాల విశృంఖలత్వాన్ని ప్రభుత్వాలు అరికట్టాలి. శాస్త్రీయ భావజాల వ్యాప్తికి మాత్రమే చోటుండే కార్యక్రమాలకు పెద్ద పీట వేయాలి.

mallareddy


అదే క్రమంలో.. ప్రచార ప్రసార సాధనాల ప్రచార ప్రభావానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఇందులో వ్యక్తి గత స్థాయిలో తల్లిదండ్రులు, సామాజికస్థాయిలో ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించినప్పుడే సాధ్యమవుతుంది. దీనికి పునాదిగా ఇంట్లో పిల్లలు మితిమీరి టీవీకి, సెల్ ఫోన్‌లకు అతుక్కుపోవడాన్ని మొదట్లోనే గుర్తించి నివారించాలి. అతిగారాభంతో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తే..మొదటికే మోసం వస్తుంది. మనకు కనిపిస్తున్నది హాస్పిటల్ బెడ్ మీద విలవిలలాడుతున్నది ఒక బాలుడే కాదు, సమాజమంతా.. ఇవ్వాళ.. అట్లాంటి దురవస్థలోనే ఉన్నది. సమాజంలోని మానవతను తోడేస్తున్న సంస్కృతిక ప్రపంచీకరణ ప్రమాదాన్ని ఇకనైనా గుర్తించి నిలువరించక పోతే భవిష్యత్తంతా అంధకారం, అమానవీయం అవుతుంది.

2410

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు