అసమానతల అభివృద్ధి..


Sat,November 28, 2015 11:33 PM

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమాధికార దేశంలో స్వయం ప్రతిపత్తిగల కార్పొరేట్ కంపెనీల సామంత రాజ్యాలు దేశ ప్రజలను బానిసలను చేసి పీడిస్తున్నాయి. వీటన్నింటినీ మన పాలకులు అభివృద్ధి కోసమని అంటున్నారు!

sama


జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టా లు కొత్తగా ఏర్పడిన సందర్భం లో.. మన రాష్ర్టానికి చెందిన సామాజిక శాస్త్రవేత్తల బృందమొకటి ఆ రాష్ర్టాలను సందర్శించింది. అప్పుడు అక్కడి నేతలతో, ముఖ్యంగా పాతతర ం గాంధేయవాదులతో సమావేశమై రాష్ర్టాల అభివృద్ధికి చేస్తున్న ఆలోచనలు, తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న మన రాష్ర్టాభివృద్ధితో పోలుస్తూ.. చాలా వెనుకబడి ఉన్న మీ రాష్ర్టాల్లో ఏపీతో ధీటుగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి ప్రణాళికలను, పథకాలను అమలు చేయబోతున్నారని వారిని అడిగితే.. అక్కడి గాంధేయవాది అయిన ఒక రాజకీయవేత్త ఇచ్చిన సమాధానంతో మన వాళ్లు నోరెల్లబెట్టాల్సి వచ్చింది.

ఆయన అన్నదేమంటే..ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే.. తల తల మెరిసే రోడ్లు, ఆకాశాన్నంటే భవనాలు.. ఇంకా ఇతరత్రా మీకు చాలా విషయాల్లో మా రాష్ర్టాలు వెనుకబడి ఉన్నట్లు మీకు కనిపించవచ్చు. మేం ఎంత వెనుకబడి ఉన్నామన్నది పక్కనబెడితే.. మా రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అదే మీ దగ్గర వేలల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సామాజిక హింస ఏ రూపం లో తీసుకున్నా మా ప్రాంతంలో మీకన్నా చాలా తక్కువ. కాబట్టి మేం వెనుకబడి ఉన్నామన్న సంగతి పక్కనపెట్టి మీ అభివృద్ధి ఎలాంటితో ఆలోచించండి.

నిజంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎవరైనా ఒడిషా మొదలు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ దాకా ఏ రాష్ట్రంలో ఎక్కడికి పోయి చూసి నా.. ఆ రాష్ర్టాలు మన కన్నా దశాబ్దాలు వెనుకబడి ఉన్నాయనిపిస్తుంది. రెండువేల సంవత్సరం ప్రారంభంలో అనుకుంటాను.. ఒక సామాజిక అధ్యయనం కోసం కాంగ్రెస్ నేత అజిత్ జోగిని కలవడానికి నేను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాం చి వెళ్లాను. రాంచీలో ఎక్కడ చూసినా మట్టి రోడ్లే. చివరికి ఆయన ఇంటి ముందటి రోడ్డు కూడా మట్టి రోడ్డే ఉన్నది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. మన దగ్గర ఊరూరుకూ తారు రోడ్లతో అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అక్కడి పరిస్థితి అది. ఇక గ్రామాల్లో ప్రజల జీవన విధా నం చూసినా.. కట్టు, బొట్టు, పరిశుభ్రత, గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఇలా అనేక విషయాల్లో మన కన్నా చాలా వెనుకబడి ఉన్నారన్న అభిప్రాయానికి వచ్చి తీరుతాం.

అయితే ఇక్కడే అసలు సమస్య. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? అనేది. అలాగే అభివృద్ధి ఎవరి కోసం? అనేది. గాంధేయవాది అన్నట్టు మనతో పోలి స్తే.. ఛత్తీస్‌గఢ్‌లో ఊరూరుకూ రోడ్లు లేకపోవచ్చు. ఆకాశాన్నంటే బంగ్లాలు, అద్దాల మేడలూ లేకపోవచ్చు. కానీ అక్కడ ఇప్పటిదాకా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు! కానీ అదే మన రాష్ర్టానికి వస్తే.. మన పాలకుల విజన్ 20-20లు, హైటెక్ అభివృద్ధిల పుణ్యమాని నగరాలు కాంతులీనుతున్నాయి. ఊరూరుకూ మట్టి రోడ్లేం ఖర్మ తారు రోడ్డు కోసం తపన పడుతున్నాం. ప్రచార, ప్రసార సాధనాలు, కమ్యూనికేషన్ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక అభివృద్ధి ఫలితంగా ప్రతి ఇల్లూ రంగుల టీవీతో కలకలలాడుతున్నది.

వ్యవసాయ ప్రధానమైన గ్రామాల్లో పశుసంపద కనుమరుగై పోయి, యువత నోట్లో జోడే బైల్ గుట్కా నోట్లోకి వచ్చింది. అభివృద్ధి, నాగరికత పరిస్థితి ఇలా ఉంటే.. స్త్రీలపై హింసా దౌర్జన్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ దశాబ్దకాలంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ గాంధేయవాది అన్నట్లు.. ఏది అభివృద్ధి? ఎవరి అభివృద్ధి? అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఎంతగా అభివృద్ధి చెందుతున్నామని చెబుతున్నా, రెండంకెలలో అభివృద్ధి సూచికలను ఉదహరిస్తున్నా.. అంతా అంకెల గారడిలా కనిపిస్తున్నది. ఇప్పటికే అణుశక్తి రంగంలో, రోదసి అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యాల సరసన నిలిచిన భారత్‌ను ఆర్థికంలోనూ అగ్రరాజ్యాల సరసన నిలిపేందుకు మన పాలకులు పడరాని పాట్లు పడుతున్నారు.

దీనికోసం ప్రధాని మోదీ అయితే కాలుకు బలపం కట్టుకుని పెట్టుబడుల కోసం దేశాల వెంబటి జోలెపట్టి తిరుగుతున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశం ఎలా అనువైనదో, ఎంత చవకగా మానవ శ్రమ అందుబాటులో ఉన్నదో విదేశీ కంపెనీలకు వివరించి చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులు ఎంత ఎక్కువగా వస్తే.. అంత వేగంగా మన దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుందని చెప్పుకొస్తున్నారు! దానికి అనుగుణంగా చట్టాలన్నింటినీ మార్చేసి ఏ ఆటంకం లేనివిధంగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని హామీ పడుతున్నారు. అంతటితో ఆగకుండా బహుళజాతి కార్పొరేట్ కం పెనీలు తయారు చేసే వస్తువులపై దేశీయ పన్నుల భారం పడకుండా హామీ ఇస్తూ, వస్తు-సేవల పన్నును కార్పొరేట్ కంపెనీలు తమ ఇష్టానుసారం నిర్ణయించుకోవచ్చని ఏకంగా పార్లమెంటు సాక్షిగా హామీ ఇస్తున్నారు.

పాలకుల అభివృద్ధి విధానాలన్నీ ప్రజల జీవన విధానాలతో సంబంధం లేనివిగా ఉంటున్నాయని అర్థమవుతున్నది. లేదా జరుగుతున్న అభివృద్ధి అంతా సమాజంలోని కొద్దిమందికే ఉపయోగపడే విధంగా ఉంటున్నదని చెప్పకనే చెబుతున్నది. అందుకే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నా అదేస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. రోజురోజుకూ దిగజారుతున్నాయి. అధికారిక అధ్యయనాల ప్రకారమే. కనీస అవసరాలు తీరని రెండు పూటలా కడుపార తిండి లేని ప్రజలు ఇప్పటికీ నూటికి అరవై మంది ఉన్నారు. మరోవైపు మన పాలకులు గంగానదిని శుద్ధి చేయడం కోసం 20వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే అంతరిక్ష పరిశోధనల కోసం ఏటా సుమారు 500 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కానీ ప్రాథమిక విద్య, వైద్యం కోసం నిధుల కేటాయింపు నామమాత్రంగా ఉంటున్నది.

విశాల భారతావనిలో చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టులతో దేశాన్ని సస్యశ్యామలం చేయాల్సిన చోట పెద్దపెద్ద ప్రాజెక్టులు కట్టి కోట్లాది మందిని నిర్వాసితులను చేస్తున్నారు. దేశంలో 47నాటికి 30మీటర్ల ఎత్తుకు మించని ప్రాజెక్టులు కేవలం మూడు మాత్రమే ఉం డేవి. అలాంటిది నేడు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టులున్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత మన దేశమే నిలిచింది. పెద్ద ప్రాజెక్టులకు ఆధునిక దేవాలయాలని పేరుపెట్టి అవి అందరికీ చోటు లేనివిగా తయారుచేశారు.ఈ పెద్ద ప్రాజెక్టులతో 90 దశకం నుంచి రెండు కోట్ల 13 లక్షల మంది విస్థాపకులయ్యారు. ఇందులో 86 లక్షల మంది నిమ్న, వెనుకబడిన దళిత వర్గాల ప్రజలు. కేవలం 21 లక్షల మందికే ప్రభుత్వాలు పునరావాసం కల్పించగలిగాయి. ఇక గనుల తవ్వకం పేరిట అడవిని చెరబట్టి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం ముమ్మరంగా సాగుతున్నది.

దక్షిణాఫ్రికాకు చెందిన డీబీర్స్ అనే వజ్రాల బహుళజాతి కంపెనీకి ఒడిషా రాష్ట్రంలో 8 లక్షల 50 వేల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 67వే లు, ఛత్తీస్‌గఢ్‌లో 9 లక్షల హెక్టార్లు అప్పజెప్పారు. అలాగే ఏసీసీ రియోటింటో అనే కంపెనీకి మధ్యప్రదేశ్‌లో 7 లక్షల 65 వేల హెక్టార్లు, ఛత్తీస్‌గఢ్‌లో 6 లక్షల హెక్టార్లు కట్టబెట్టారు. జార్ఖండ్, ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద విలువైన ఇనుప ఖనిజ నిల్వలున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే 33 వేల హెక్టార్లలో 105 కంపెనీలు ఖనిజ తవ్వకాలు సాగిస్తున్నాయి. ఇక దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ అయితే ఈ ప్రాంతంలో తిష్టవేసి ఇండియాలో పాగా వేసింది. 51 వేల కోట్ల పెట్టుబడితో ఇండియాలో అతిపెద్ద బహుళజాతి కంపెనీగా దేశాన్ని కబలిస్తున్నది. ఈ కంపెనీకి ఇప్పటికే నాలుగు వేల ఎకరాలను కట్టబెట్టారు.

2500 రూపాయలకు ఎకరా చొప్పున మరో 1,135 ఎకరాలను అప్పగిస్తున్నారు. ఇంకా జిందాల్, వేదాంత, ఎస్సార్ కంపెనీలు మధ్యభారతంలోని అటవీ ప్రాంతంపై కన్నేసి ఆదివాసులను విస్తాపనకు గురిచేస్తున్నాయి. అటవీ భూములను చెరబడుతున్నాయి. జాతీయత దేశభక్తి తమ పేటెంట్ హక్కుగా చెప్పుకునే బీజేపీ హయాంలోనే అంటే ఎన్డీఏ హయాంలో మొదట సెజ్‌లకు అనుమతి ఇచ్చారు. దాన్ని ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వాలు కొనసాగించాయి. ఇప్పటికి దేశంలో 235సెజ్‌లు ఏర్పడ్డాయి. నిజానికి సెజ్ అంటే అదొక స్వయం ప్రతిపత్తి గల, స్వయం నిర్ణాయక ప్రాంతం అని అర్థం. వాటి లో మన ప్రభుత్వ పాలనాధికారాలు, చట్టాలు ఏవీ చెల్లవు. ఆయా కంపెనీలు రూపొందించుకున్న విధాన నిర్ణయాలే చెల్లుబాటవుతాయి. అక్కడ ఏ హత్య జరిగినా సదరు కంపెనీ అనుమతి లేనిదే మన పోలీసులు ప్రవేశించి దర్యాప్తు చేయడానికి, కేసులు పెట్టడానికి అవకాశం లేదు. దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వల స రాజ్య స్థాపనకు వీలుకల్పించడమే.

సార్వభౌమాధికార దేశంలో స్వయంప్రతిపత్తిగల కార్పొరేట్ కంపెనీల సామంత రాజ్యాలు దేశ ప్రజలను బానిసలను చేసి పీడిస్తున్నాయి. వీటన్నింటినీ మన పాలకులు అభివృద్ధి కోసమని అంటున్నారు! ఖనిజ తవ్వకాల కోసం అడవిని ధ్వంసం చేయడం, లక్షల ఎకరాల్లో ప్రజల పంటభూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం, సెజ్‌ల పేరిట విదేశీ కంపెనీల సామంత రాజ్యాల ఏర్పాటుకు తోడ్పాటునందించడం వంటివి ఎవరి అభివృద్ధి కోసం? ఈ అభివృద్ధి విధానాలతో లాభపడేదెవరు? నష్టపోతున్నదెవరు? తవ్వుతున్న ఖనిజాలు, మెరుస్తున్న తారు రోడ్లు ఎవరి సౌఖ్యం కోసం? ఇవన్నీ అర్థం కాని చిక్కు ప్రశ్నలేమీ కావు.

అందుకనే.. సింగూరు, నందిగ్రాం నుంచి కోస్తాతీరప్రాంత బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. ఈ పోరాటాలను పాలకులు అభివృద్ధి నిరోధకం, వ్యతిరేకం అంటున్నారు. నిర్బంధాన్ని ప్రయోగించి అణచివేత విధానాలు అవలంబిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోంచే కావచ్చు మాజీ ప్రధాని వీపీ సింగ్.. శాంతియుతమైన ప్రజా వ్యతిరేకతను కాలరాచి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడమంటే.. ప్రజలను మళ్లీ తిరిగి రాలేని కొండ చివరికి తీసికెళ్లడం తప్ప మరేం కాదు. అని మన పాలకులను ప్రశ్నించారు. అభివృద్ధి తీరు తెన్నులను నిలదీశారు.

996

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు