అంతరాలే సామాజిక హింసకు పునాది


Sun,November 22, 2015 12:26 AM

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచారాలు అసలే లేవు. అంటే సమాజాన్ని అనాగరిక అటవిక, ఆదిమ సమాజం దిశగా మళ్లించాలని కాదు. ఇప్పుడు జరుగుతున్న వికృత, విధ్వంసకర అభివృద్ధి స్థానంలో
మనిషిని ఉన్నతీకరించేదిగా, మనిషి కేంద్రంగా అభివృద్ధి జరగాలి. చదువు మనిషి ఉన్నతీకరణకు వెలుగు బాటలు వేయాలి. మనిషి నైతికతను, మానవీయతను హరించేది ఇంకేదైనా
కావచ్చు కానీ, చదువు ఎంతమాత్రం కాదు.

samna


దేశంలో ఏ ప్రాంతంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న దానిపై ఈ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. దేశాన్ని మొత్తం నాలుగు ప్రాంతాలుగా (ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చి మ) విభజించి ఉత్తర భారతంలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయంటే.. కాదు, దక్షిణ భారతంలోనే ఎక్కువ జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో లెక్కలను ఆధారం చేసుకుని వాదించుకున్నా రు. ఉత్తర భారతీయులు చట్టాలను అతిక్రమించడాన్ని ఒక ఆటగా ఎం జాయ్ చేయడమే కాదు, దాన్ని తమ గొప్పతనానికి ప్రతీకగా భావిస్తున్నారని కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు అన్న మాటలు ఈ చర్చకు కేంద్ర బిందువుగా నిలిచాయి. దీనిలో అత్యున్నత పదవులు చేపట్టిన పోలీసు అధికారులు మొద లు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, నేర పరిశోధక, ఫోరెన్సిక్ నిపుణుల దాకా పాల్గొన్నారు. వీరంతా తమతమ వాదనలు వినిపిస్తూ ఒక (తమ) ప్రాం తంపై అన్యాయంగా అభాండం మోపుతున్నారని, ఇతర ప్రాంతాల్లో నేరాలు జరగడం లేదా! అంటూ నిష్టూరాలు పోయారు. పరోక్షంగా తమ ప్రాంతాన్ని వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

ఈ నేరాలు-ప్రాంతీయతకు సంబంధించి పేరుగాంచిన మాజీ పోలీస్ అధికారులు జులియో రెబిరో, వేద్ మార్వా, ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేఎన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ బీఎన్ చట్టోరాజ్, సామాజిక శాస్త్రవేత్త సుహాస్ పాల్షికర్ తదితర ఉద్ధండ మేధావులంతా పాల్గొన్నారు. దానికి జాతీయ నేరగణాంక సంస్థ లెక్కలను ఆసరాగా తెచ్చుకున్నారు. ఉత్తర ప్రాంతంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న దాన్ని తప్పుపడుతూ కేంద్రమంత్రి అభిప్రాయాన్ని ఖండించడానికే పరిమితమయ్యారు.

ఎనభైయవ్వ దశకంలో పంజాబ్ ఉద్యమాన్ని అణచడంలో కీలకపాత్ర పోషించి సూపర్ పోలీస్‌గా పేరుగాంచిన రెబిరో అయితే.. ఈ నేరాల గురించి చర్చ అనవసరం అంటూ.. దేశంలో సంస్థాగతంగా సాగుతున్న మావోయిస్టు ఉద్యమాలు, ఈశాన్య భారతంలోని తిరుగుబాట్ల గురించే ఆలోచించాలంటూ, అసలు ప్రమాదమంతా ఈ ఉద్యమాల హింసతోనే అని చెప్పుకొచ్చారు. వీరంతా హింస, నేరం ఎప్పుడు, ఎందుకు జరుగుతాయన్న దాన్ని పట్టించుకోకుండా.. గణాంకాల ఆధారంగా ప్రాంతాల, సమాజాల మంచి చెడులను బేరీజు వేశారు. నేరాల సామాజిక, ఆర్థిక మౌలిక కారణాల జోలికి పోకుండా సమాజ మంచి చెడుల గురించి చెప్పడానికి ప్రయత్నించారు. అంతకన్నా ముఖ్యంగా నేరాలు ఎప్పుడు ఎలా రూపుమాసిపోతాయో పరిష్కార మార్గాలూ చెప్పలేదు.

నిజానికి రాజ్యాంగ చట్టాల ప్రకారం హింస, నేరాలుగా పరిగణించబడుతున్న వాటిని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. సామాజిక ఆర్థిక అంతరాలు, కారణాల నేపథ్యంలో జరుగుతున్న హింస ఒకటైతే, సాంస్కృతిక పతనం, విధ్వంసం ఫలితంగా చోటుచేసుకుంటున్న హింసా దౌర్జన్యాలు మరొక కారణంగా చెప్పుకోవాలి. ఇవ్వాళ.. దేశంలో మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన ఈ రెండు దశాబ్దాల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయింది. కోటీశ్వరుల సంఖ్య రెట్టింపయ్యింది. అదే స్థాయిలో పేదల బతుకు అంతకంతకూ దిగజారుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రోజుకు ముప్పై రూపాయలు కూడా సంపాదించలేని వారు నూటికి అరవై ఐదు మంది ఉన్నారు.

ఐక్య రాజ్యసమితి అధ్యయనం ప్రకారం.. పేదలు కనీసం రెండు పూటలా తిండి కూడా తినలేని దీనస్థితిలో ఉన్నారు. ఇలాంటి దుస్థితి, సామాజిక అంతరాల నుంచి అనివార్యంగా ఉద్భవిస్తున్న ఉద్యమాలు, పోరాటాలను ప్రభుత్వాలు శాంతి భద్రతల సమస్యగా చిత్రిస్తున్నాయి. ప్రజలు మనుగుడ కోసం చేస్తున్న పోరాటాలు, ఆరాటాల నేపథ్యంలో జరుగుతున్న ఘటనలను పాలకులు నేరాలు అంటున్నారు. మరోవైపు ఆర్థిక వ్యత్యాసాల ఈర్ష్యాద్వేషాల నుంచే అనేక నేరాలు జరుగుతున్నాయని అనేక అధ్యయనాలు అంటున్నాయి. ఈ సామాజిక పునాదుల్లోంచే జైళ్లన్నీ పేద బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీ ప్రజలతోనే నిండిపోయాయి. ఒకానొక అధ్యయనం ప్రకారం దేశంలోని జైళ్లలో 90 శాతం మంది నిమ్న, బడుగు, బలహీన వర్గాల ప్రజలే ఉన్నారు. ఒక అనుభవం ఇక్కడే చెప్పుకోవాలి.

హైదరాబాద్ సీతాఫల్‌మండిలో ఒక కిరాణా దుకాణం నుంచి రెండు కిలోల గోధుమలు దొంగిలించిన కేసులో నాలుగేళ్లు జైలు నిర్బంధంలో ఉన్న రాజయ్య దీనగాథ వినే ఉన్నాం. ఇలాంటివే ఏ జైలుకెళ్లినా వినిపిస్తాయి. ఈ మధ్యనే అనురాధ రాసిన హజారీబాగ్ జైలు గాథలు ఏది నేరం? పుస్తకం దేశంలో జైలు స్థితిగతులు, అందులోని పేదల కనీటి గాథలు కళ్లకు కట్టినట్లు చెప్పినవి ఉండనే ఉన్నాయి. మరోవైపు కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిన పెద్దలు మన ప్రజాస్వామ్యంలో పాలకులుగా చెలామణి అవుతున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఒక ప్రజా కవి అన్నట్లు.. జైలులో ఉండాల్సిన వారంతా బయట అధికారం చెలాయిస్తున్నారు. బయట ఉండి కాయకష్టం చేస్తూ ఉత్పత్తిలో పాల్గొనాల్సిన పేద ప్రజలంతా జైలులో మగ్గుతున్నారు.

సామాజిక హింసకు ప్రధాన కారణమై సాంస్కృతిక విధ్వంసం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో నవనాగరికతగా చెలామణి అవుతున్న వస్తుమయ సంస్కృతి తీవ్రమైన సాంస్కృతిక విధ్వంసానికి కారణమవుతున్నది. మనిషిని పరాయీకరణకు గురిచేసి మానవీయతను తోడేస్తున్నది. దీనిలో బంధుత్వాలకు, అనుబంధాలకు తావులేదు. మరీ ముఖ్యంగా స్త్రీల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. మహిళ అంగడి సరకుగా మారిపోవడమే కాదు, భోగ వస్తువుగా మారిపోయింది. అందుకే అరవై ఏళ్ల వృద్ధుడు ఐదేళ్ల పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఇంటా బయటా స్త్రీలపై జరుగుతున్న హింస, అత్యాచారాలకు అంతులేకుండా పోతున్నది. ప్రతి ఏటా మహిళలపై హింసా, దౌర్జన్యాల సంఖ్య పాపం పెరిగినట్లు పెరిగిపోతున్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. 2006లో అత్యాచారాలు 19,348 జరిగితే.., 2009 నాటికి అవి 21,397కు పెరిగాయి. కేంద్ర మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా అత్యాచారాలు 95,065 జరిగితే, గృహ హింసకు బలవుతున్న వారి సంఖ్య 3,87,690కు చేరుకున్నది. ఇక లైంగిక వేధింపులకు 1,92,860 మంది గురవుతున్నారు. 1998-99 జాతీయ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 19 శాతం బాలికలు 4 నుంచి 8 ఏళ్ల లోపే సెక్సువల్ దుర్వినియోగానికి బలవుతున్నారు.

28 శాతం మంది బాలికలు 8-12 ఏళ్ల లోపు, 35శాతం మంది 12నుంచి 16 ఏళ్ల లోపు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశంలో ఆడ బిడ్డపై వివక్ష నానాటికీ పెరుగుతున్నది. తల్లి గర్భంలోనే ఆడశిశువుపై నేటి సమాజం కత్తిగడుతున్నది. ప్రతిరోజు దేశంలో ఏడు వేల మంది తల్లి గర్భంలోనే కడతేర్చ బడుతున్నారు! ఈ నేపథ్యంలోనే.. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకుని క్రైమ్ రేట్ లెక్కిస్తే.. 2014లో మొత్తం ఈశాన్య రాష్ర్టాల్లో 175.7 ఉంటే, దక్షిణ భారతంలో 506.7 ఉన్నది. అదే పశ్చిమ భారతంలో 240.5 ఉంటే ఉత్తర బారతంలో 197.9 ఉన్నది. ఇంకా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. అక్షరాస్యతా శాతం ఎక్కువ ఉన్న రాష్ర్టాలు, ప్రాంతాల్లోనే అధిక నేరాలు జరుగుతునట్లు తెలుస్తున్నది. అలాగే నవనాగరికతకు కేంద్రాలుగా చెప్పుకుంటున్న నగరాల్లోనే సామాజిక హింస, అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లు అన్నిరకాల అధికారిక ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. మనమంతా అనుకుంటున్నటువంటి అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజ న, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నా యి. ఇక అత్యాచారాలు అసలే లేవు. అంటే సమాజాన్ని అనాగరిక అటవి క, ఆదిమ సమాజం దిశగా మళ్లించాలని కాదు. ఇప్పుడు జరుగుతున్న వికృ త, విధ్వంసకర అభివృద్ధి స్థానంలో మనిషిని ఉన్నతీకరించేదిగా, మనిషి కేంద్రంగా అభివృద్ధి జరగాలి. చదువు మనిషి ఉన్నతీకరణకు వెలుగు బాట లు వేయాలి. మనిషి నైతికతను, మానవీయతను హరించేది ఇంకేదైనా కావ చ్చు కానీ, చదువు ఎంతమాత్రం కాదు. నేటి మార్కుల చదువుతో సర్టిఫికెట్లు, ఉద్యోగాలు వస్తున్నాయే గానీ జ్ఞానం రావడం లేదు.

శాస్త్రవేత్తలు సైతం నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేస్తున్నారు! రాకెట్ నమూనాలను సైతం తిరుపతి ఏడుకొండల గుండంలో పడేసి అంతా ఏడు కొండలవాని దయ అంటున్నారు. దేశం ఆర్థికాభివృద్ధిలో, శాస్త్ర,సాంకేతిక రంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే.. మనిషిలో శాస్త్రీయత, మానవీయత నానాటికీ ఆవిరైపోతున్న తీరుకు అడ్డుకట్ట వేయాలి. శాస్త్రీయత పునాదిగా, మానవీయత కేంద్రంగా సమాజ గమనం సాగాలి. సామాజిక అభివృద్ధి ఫలాలన్నీ అందరికీ అందుబాటులో ఉండటమే కాదు, అందరికీ సమానంగా అందే సామాజిక వ్యవస్థతోనే సామాజిక హింస, నేరాలు అంతరించి పోతాయని గ్రహించాలి.

1116

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు