కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు


Sun,November 8, 2015 03:21 AM

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా
తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద్రీకరణకు, ప్రజల ముంగిట పాలనకూ పునాది కావాలి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం సహేతుకమైన, శాస్త్రీయమైన విధానాలను రూపొందించుకుని పది లక్షల జనాభాకు ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేయాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిడి, ప్రభావాలకు తావీయకుండా జిల్లాలు, జిల్లా కేంద్రాలను ఏర్పాటుచేయాలి.

samna


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చలు సాగుతున్నా యి. నూతనంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు కేంద్రంగా తమ ప్రాంతాన్నే ఎంపిక చేయాలనే ఆం దోళనలూ ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ మొదలు మండల పరిషత్‌లు, మున్సిపాలిటీల దాకా తీర్మానాలు చేసి తమ ప్రాం తా న్నే జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. ఇలా కోరుతున్న వాటిలో ఎక్కువ భాగం రాత్రికిరాత్రి పుట్టుకొచ్చిన గొంతెమ్మ కోర్కెలేమీ కావు. అని చెప్పి అన్నిచోట్ల ప్రజలు కోరుకుంటున్న దాంట్లో హేతబద్ధత ఉందని కూడా చెప్పలేం. ప్రస్తుతమున్న జిల్లా కేంద్రాల ఉనికితో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా గూడుకట్టుకున్న అసంతృప్తులు, ఆకాంక్షలను వీటిలో చూడాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ పరమైన విధాన నిర్ణయాలు, ఎన్నికల వాగ్దానాల అమలు లాంటివే ఇప్పటిదాకా ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఏడాదిన్నర తర్వాత అయినా పాలనాపరమైన సంస్కరణలు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో ప్రారంభమవడం ఆహ్వానించాల్సిన విషయం. అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటు అంత సులువైన ప్రక్రియ కాదు. ఎందుకంటే.. జిల్లాల ఏర్పాటుకు ఇప్పటిదాకా రాజ్యాంగబద్ధమైన, సూత్రబద్ధమైన విధానాలేవీ లేకపోవడం ఓ విషాదం. స్వతంత్య్ర భారతంలో ప్రతి చిన్న పాలనాపరమైన విభాగ నిర్మాణానికీ, ఏర్పాటుకూ చట్టపరమైన విధి విధానాలున్నాయి. గ్రామ పంచాయతీ మొదలు పాలన విభాగాలన్నీ ఆ నిర్మాణ సూత్రాలపైనే ఆధారపడి ఏర్పడ్డాయి. పనిచేస్తున్నాయి. కానీ పాలనాయంత్రాంగంలో అతిముఖ్యమైన పాత్ర వహించే జిల్లాల ఏర్పాటుకు మాత్రం చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి సూత్రబద్ధ విధి విధానాలు లేకపోవడం ఆశ్చర్యమే. అలాగే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలేవీ లేవు. రాష్ర్టాలే నిర్ణయం తీసుకోవాలి. పరిపాలన, రాజకీయ అవసరాలే కొత్త జిల్లాల ఏర్పాటుకు పునాదిగా ఉంటున్నది! కాబట్టే అనేక సందర్భాల్లో జిల్లాల ఏర్పాటు, వాటి కేంద్రాల ఏర్పాటులో అనేక అపసవ్యాలు కనిపిస్తాయి.

దేశంలో ఇప్పటి దాకా వివిధ రాష్ర్టాల్లో 681 జిల్లాలున్నాయి. వీటన్నింటి ఏర్పాటులో పాలనా పరమైన సౌలభ్యత, ప్రజానుకూలత కన్నా.. రాజకీయపరమైన ప్రభావాలే ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతున్నది. అందుకనే.. దేశ వ్యాప్తంగా జిల్లాల ఏర్పాటులో ఏ సూత్రబద్ధతా కనిపించదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా సగటు జనాభా 19 లక్షలు. పశ్చిమబెంగాల్‌లో 29 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉన్నది. అదే ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ర్టాల్లో ఏడు లక్షల జనాభాకు ఒక జిల్లా ఉన్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 16 జిల్లాలు ఉంటే.. ఆ తర్వాత వారు 11 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. మన రాష్ట్రంలో 35 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉన్నది. ప్రతి జిల్లాలో యాభై వరకు మండలాలున్నాయి.

ఈ క్రమం లో తెలంగాణ ప్రభుత్వం మరో 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతిజిల్లాలో ఐదు శాసన సభ నియోజకవర్గాలు ఉండే విధంగా చూస్తున్నట్లు తెలుస్తున్నది. దీనికి గాను పాలనాపరమైన సంబంధిత అధికారు ల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ ప్రాంతం జిల్లా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమో కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు ప్రచారమున్నది. దీం తో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తమ ప్రాంతాన్నే జిల్లా కేంద్రంగా చేసుకోవాలనే తపన కనపడుతున్నది. కానీ జిల్లా కేంద్రం ఏర్పాటుకు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి.

ఇప్పటికైనా సూత్రబద్ధమైన విధానాలను రూపొందించుకుని వాటి ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోవాలి. దానికి గాను ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి.1.జనాభా, 2. చారిత్రక ప్రాధాన్యం,భౌగోళిక సారూప్యత, 3. జిల్లా కేంద్రం ప్రతిపాదిత జిల్లా పరిధికి అందరికి అందుబాటులో ఉండే విధంగా మధ్య భాగంలో ఉండటం, 4, ప్రతిపాదిత కేంద్రానికి అన్ని ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు రవాణా సౌకర్యం కలిగి ఉండటం, 5. జిల్లా కేంద్రం విస్తరణ, అభివృద్ధికి కావలసిన మౌలిక వనరులు, భూమి తదితరాలు సమృద్ధిగా అందుబాటులో ఉండటం లాంటివి దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రాలను ఎంపిక చేయాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే అసంబద్ధ డిమాండ్లకు ముకుతాడు పడుతుంది. ఎవరు పడితే వారు తమ తమ రాజకీయ కారణాలతో జిల్లా కేంద్రంకోసం డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదు.

నల్లగొండ జిల్లా విషయానికి వస్తే.. జిల్లా భౌగోళిక స్వరూపాన్ని బట్టి మూడు జిల్లాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అలా చూసినప్పుడు భువనగిరి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అన్ని విధాలా సముచితంగా ఉంటుంది. చారిత్రకత నేపథ్యాన్ని బట్టే కాకుండా భౌగోళిక పరిస్థితి మౌలిక వనరులు, వసతులు, రైలు రోడ్డు రవాణా సౌకర్యాల లాంటి వన్నీ భువనగిరి జిల్లా కేంద్రం కావడానికి ప్రధాన అర్హతలుగా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు తమ రాజకీయ ఉనికిని నిలబెట్టుకునేందుకు అనేక కొత్త ప్రతిపాదనలతో ప్రకటనలు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమైక్యవాద పార్టీలో ఉండి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నేతలు ఇప్పుడు జిల్లా కేంద్రం నినాదాన్ని ఎత్తుకుని ప్రజలముందుకు వస్తున్నారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. వారు కోరుతున్న దాంట్లో సహేతుకత, శాస్త్రీయత, మౌలిక వనరుల విషయాలలాంటి వేటినీ పట్టించుకోకుండా జిల్లా కేంద్రం పేరుతో రాజకీయం చేస్తూ తమ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇలాంటి వారు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా చరిత్ర, సహేతుకతల ముందు ఓడిపోక తప్పదు.

తెలంగాణలో ఇప్పుడున్న చాలా జిల్లాల్లో జిల్లా కేంద్రం విషయంలో చాలా అశాస్త్రీయత ఉన్నది. జిల్లాలోని ఒక మూల నుంచి జిల్లా కేంద్రానికి పోవాలంటే వం ద, నూటా ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులున్నాయి. సాధారణ ప్రజలైతే జిల్లా కేంద్రానికి పోవాలంటే సద్దిమూట కట్టుకుని పోవాల్సిన దుస్థితి ఉన్నది. ఇలాంటి సమస్యలు, అసంబద్ధతలు ఏ జిల్లా తీసుకున్నా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులు పోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద్రీకరణకు, ప్రజల ముంగిట పాలనకూ పునాది కావాలి.

ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం సహేతుకమైన, శాస్త్రీయమైన విధానాలను రూపొందించుకుని పది లక్షల జనాభాకు ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేయాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిడి, ప్రభావాలకు తావీయకుండా జిల్లాలు, జిల్లా కేంద్రాలను ఏర్పాటుచేయాలి. అలా చేసినప్పుడే.. సామాన్యునికి అందుబాటులో పాలనా యంత్రాంగం ఉండి సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో పారదర్శకత ఏర్పడుతుంది. అనన్య త్యాగాలతో, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో సరికొత్త నవపాలనా శకం ప్రారంభమవుతుంది.

1075

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు