తెలంగాణ సంస్కృతి - పండుగలు


Sun,October 25, 2015 12:57 AM

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం అంటేనే.. జాతి జనుల పరిపూర్ణ
వికాసానికి, అభివృద్ధికి హామీగా నిరంతరం జ్వలించే చైతన్య జ్వాల. ఆ అర్థంలో అరవై ఏళ్లుగా అనన్య త్యాగాలతో ముందుకు సాగిన ఉద్యమం ప్రజల జీవితాచరణలో భాగమైపోవాలి.

reddy


తెలంగాణలో పండుగలు జీవన సంస్కృతికి అద్దం పట్టే వి మాత్రమే కాదు, అవి ప్రజల ఆశల, ఆశయాల ప్రతీకలు. బతుకమ్మ, దసరా, పీర్లపండుగ (మొహర్రం)లనే తీసుకుంటే.. అవి కేవలం మతం పునాదిగా మౌఢ్యం తో, హిందూ బ్రాహ్మణీయ సంస్కృతిలో భాగంగా జరుపుకొనే క్రతులు ఎంతమాత్రం కాదు. వ్యవసాయ సాంస్కృతిక జీవనంలో.., తరతరాల చరిత్రలో ప్రజలు చేసిన పోరాటాలు, వారి ఆశయాలు కూడా ప్రజా జీవనంలో కలెగలిసి పోయిన ఒక ప్రత్యేక గ్రామీణ జీవన సంస్కృతికి ప్రతీకలు. ఆయా చారిత్రక సందర్భాల్లో ప్రజలు చేసిన పోరాటాలు, వారి ఆశలు, ఆకాంక్షలు ఆధునిక తెలంగాణ పల్లె సహజీవన సంస్కృతికి, ఐక్యతకు ప్రతిబింబాలు.

దేశంలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం వ్యవసాయ ఉత్పత్తి సంస్కృతికి తోడు ఇక్కడి ప్రజలు చేసిన పోరాటాలు, ఆశలు, ఆశయాలు ఆయా పండుగల్లో వ్యక్తీకరించబడుతున్నాయి. దసరా పండుగకు సంబంధించి పురాణ, ఇతిహాసాల నేపథ్యంలోంచి చెడుపై మంచికి దక్కిన విజయానికి సంకేతంగా రావణ దహనాన్ని, జమ్మిచెట్టు పూజ శమీ శమయతే పాపం శ్లోక పఠనాలను అటుంచితే.. ప్రజల ఆశలు, ఆశయాల ప్రతీకలుగానే వీటిని చెప్పుకోవచ్చు. వీటికి ఉదాహరణలుగా పురాణ గాథలు అటుంచి, ఆధునిక చరిత్రలో సమ్మక్క, సారక్క మొదలు జోడేఘాట్ భూంకాల్ ఉత్సవం, నాగోబా జాతర దాకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాట కాలం తర్వాత.. చేసిన పోరాటాలు, త్యాగాలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేశాయంటే.. ప్రజల పండుగ పబ్బాల్లో కూడా వాటి వ్యక్తీకరణలు, ప్రతీకలు నిలిచాయి. ఆచార వ్యవహారాల్లో భాగమైపోయాయి.

తెలంగాణ పల్లె జీవనంలో పోరాట సంకేతం ఎర్ర జెండా ప్రజల జీవనంలో భాగమై పోయింది.
చరిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. తదనంతర కాలంలో దాని ఆశలు, ఆశయాలు దసరా పండుగ చుట్టూ అల్లుకు పోయాయి. సాయుధ పోరాట కాలంలో పోరాట కేంద్రాలుగా ఉన్న చాలా ఊళ్లల్లో దసరా ప్రత్యేకతను సంతరించుకున్నది. మిగతా ప్రాంతాలకు భిన్నంగా దసరా ఉత్సవాల్లోకి ఎర్రజెండా చేరిపోయింది. తెలంగాణ పల్లెల్లో దసరా నాడు ఊరులో ఎర్రజెండా ఎగరేసి.. యువకులు ఎర్ర అంగీలు, తెల్ల ప్యాంటులు కుట్టించుకుని జమ్మి ఆకు కోసం బయలు దేరుతారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఓ తరానికి ఎర్రజెండా ఎగరేసే ఒక మే-డేలాంటిది ఒకటి ఉంటుందని చాలా ఏళ్ల వరకు తెలియదు. ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులుగా, కార్యకర్తలుగా ఉన్న లక్షలాది మందికి దసరానే ఎర్ర జెండా పండుగ! ఒక రాజకీయ పోరాటం, ఆశయం ప్రజల జీవితాల్లో ఎంతగా భాగమై పోయిందో చెప్పుకోవడానికి ఇదో ఉదాహరణ.

ఇక్కడనే ప్రజాకవి గద్దర్ రాసిన .. దసర పండుగ దగ్గరుంది-దర్జీ వాళ్లూ కుట్టరనీ, తెల్లప్యాంటు, ఎర్ర షర్టు- తెచ్చి కుట్టి పెట్టినామూ.. మీరు జమ్మియాకై కలిసిపోతారా.. మా వీరులూ, మీరు పాల పిట్టయి చూసి పోతారా.. మా బిడ్డలూ.. పాట తీసుకుంటే దసరా పండుగకు, పోరాటానికి ఉన్న సంబంధం అర్థం అవుతుంది. చాలా మంది అనుకుంటున్నట్లు మాదాల రంగారావు సినిమాల తర్వాతనే ఎర్రషర్టు, తెల్ల ప్యాంటు రాలేదు. దీని వెనుక 1946నుంచి నేటి దాకా అవిచ్ఛిన్నంగా సాగుతున్న పోరాట సంప్రదాయం ఉన్నది. అలాగే దసరా పండుగ చుట్టూ ప్రజల ఆశలు, ఆశయాలు ప్రస్ఫుటమవుతాయి. ఒక ఆశయం కోసం చేసిన పోరాటం, త్యాగాలు ప్రజలను ప్రభావితం చేయడమే కాదు, జీవన సంస్కృతుల్లో ఎంతగా భాగమవుతాయో, పెనవేసుకు పోయాయో కూడా ఇది తెలియజేస్తున్నది.

అలాగే తెలంగాణ ప్రజలు నిజాం దోపిడీ పీడనల నుంచి విముక్తి సాధించిన తర్వాత మరో రూపంలో సీమాంధ్ర రాజకీయ అధిపత్యంలోకి వెళ్లిపోయినప్పటి నుంచి అరవై ఏళ్లుగా తెలంగాణ పడిన ఆరాటం, చేసిన పోరాటం తక్కువదేమీ కాదు. ఆ క్రమంలోనే రాష్ట్ర సాధన కోసం మలిదశ పోరాటంగా, దశాబ్దంనర కాలం సాగి రాష్ర్టాన్ని సాధించుకున్న పోరాటం ప్రజల జీవితాల్లో భాగమై పోవాలి. అదే స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయాలి. కానీ.. రాష్ట్ర సాధన తర్వాత అంతా అయిపోయినట్లుగా.. విజేతలుగా చెప్పుకోవడానికి లేదు. ఇన్నాళ్లుగా సాగిన జాతి వికాస పోరాటం కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనతోనే నిలిచిపోకూడదు, ముగిసిపోకూడదు. ఈ సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ సమాజం ఓ మానవీయ సామాజిక విలువల కోసం పరితపించింది, పోరాడింది. కన్యాశుల్కం నాటకంలో గురజాడ అన్నట్లు దేశానికి స్వాతంత్య్రం వస్తే.. మా కానిస్టీబు మారతాడా..అన్నట్లుగా, రాష్ట్ర సాధనతో ఆంధ్ర వలసవాద పార్టీల రాజకీయ ఆధిపత్యం ప్రత్యక్షంగా కనుమరుగైనా స్వేచ్ఛా స్వాతంత్య్రాల అర్థంలో ప్రజల అనుభవంలోకి రావాల్సిన విలువలు ఇంకా మిగిలే ఉన్నాయి.

ఇన్నాళ్లుగా మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం అంటేనే.. జాతి జనుల పరిపూర్ణ వికాసానికి, అభివృద్ధికి హామీగా నిరంతరం జ్వలించే చైతన్య జ్వాల. ఆ అర్థంలో అరవై ఏళ్లుగా అనన్య త్యాగాలతో ముందుకు సాగిన ఉద్యమం ప్రజల జీవితాచరణలో భాగమై పోవాలి. ఆ పోరాటం అందించిన చైతన్యం, నిర్మించిన ఐక్యత, సంస్కృతి ప్రజల నుంచి విడదీయ లేనంతగా విలీనమైపోవాలి. బతుకమ్మ పండుగలో కనిపించినంత తెలంగాణ ఏకత, మిగతా జీవన సంస్కృతిలో అంతగా కనిపించడం లేదు.

తెలంగాణ ఉద్యమాన్ని ఓట్లు, ఎన్నికలు, ప్రభుత్వాలు, పార్టీలు అనే అర్థంలో కాకుండా విస్తృతార్థంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలుగా, ఆత్మగౌరవంగా చూడాలి. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటం ఆ స్థాయిలో ఓ భావనా స్రవంతిని నిర్మించలేకపోవడం తెలంగాణ పోరాటానికి సంబంధించి పెద్ద లోటు. తెలంగాణ వికాసం కోసం, పునర్నిర్మాణం కోసం, ఒక సమున్నత మానవీయ విలువల కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగాలి. వలసాంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలు అనుభవించిన అన్ని రకాల అణచివేతలు, వివక్షలు అంతమయ్యే ఓ సామాజిక స్థితి కోసం అడుగులు వేయాలి. వివక్ష, అణచివేతల పోరాటాన్ని ఆత్మగౌరవ పోరాటంగా, జాతి వికాస పోరాటంగా ముందుకు తీసుకుపోయిన్నాడే.. తెలంగాణ పునర్నిర్మాణం సుసాధ్యం అవుతుంది.
పీర్లకు సంబంధించిన క్రతులు నిర్వహించేందుకు ఉన్న ఒక ముస్లిం వ్యక్తి తప్ప.. పీర్లను ఎత్తుకునే వారు మొదలు ఆల్వా చుట్టూ దూలా ఆడే వారంతా సబ్బండ వర్ణాల ప్రజలే.

కానీ ఇటీవలి పరిణామాలతో తెలంగాణ సమాజాన్నంతటినీ కుల మతాలకతీతంగా ఏకం చేసి నడిపించే పీర్ల పండుగ కళావిహీనం అవుతున్నది. పీర్ల పండుగ ముస్లింల పండుగగా ముద్ర వేయడంలో మతతత్వ శక్తుల ప్రయత్నాలు సఫలమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే క్రమంగా ఇతర వర్గాల ప్రజల భాగస్వామ్యం కరువవుతున్నది. దీన్ని లౌకిక ప్రజాస్వామిక శక్తులు సవాలుగా తీసుకుని ముందుకు నడవాలి. మెజారిటీ వాద హిం దుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలి. ఈ విలువల సమాహారమే తెలంగాణ ఉద్యమం. ఈ లౌకిక, మానవీయ విలువలు కేంద్రంగా తెలంగాణ సమాజం నడవాలి. లౌకిక ప్రజాస్వామిక విలువల పునాదిపై తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి.

4123

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు