రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?


Sun,October 18, 2015 02:01 AM

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపోయింది. క్రమానుగతంగా దేశంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలనుకున్న ఆశయాలు ఆవిరై పోయాయి. 70 నాటికి సంపూర్ణ మద్యనిషేధం సాధించాలనుకున్నది, తలకిందులై దేశమంతా మద్యం ఏరులైపారుతున్నది.

sana


ఇదంతా తలకిందుల సమాజం అని చాలామంది వాపోతుంటారు. నానాటికీ పతనమవుతున్న సామాజిక విలువల నేపథ్యంలో ఒకింత బాధతో అలా మాట్లాడటం అందరం చూస్తూనే ఉన్నాం. అంటే మనం చెబుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా సామాజిక విలువలు, మానవ సం బంధాలు ఉన్నప్పుడు సాధారణంగా వచ్చే స్పందన ఇది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న మన దేశంలో దాని కి మూలబిందువైన రాజ్యాంగం, దానిలో రూపొందించుకున్న చట్టాలు ప్రకటించుకున్న లక్ష్యాలకు పూర్తి విరుద్ధంగా తలకిందులుగా చెలామణిలో ఉంటే.. శ్రేయోరాజ్యంలో ప్రజల సంక్షేమం కోసమే ఉన్నాయన్నది అబద్ధమని అర్థమవుతున్నది. అయితే చట్టాలనేవి భూమి సీలింగ్ చట్టం, వరకట్న నిషేధచట్టం, బాలకార్మిక వ్యవ స్థ నిర్మూళన చట్టం లాగా ఆచరణలో పూర్తిగా అమలుకు నోచుకోకపోయినా ఫర్వాలేదు. కానీ అవి నిర్దేశించుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా ఆచరణలో అమలులో ఉంటే.. అది చట్టాల లోపమా? లేదా.. మొత్తంగా పాలక విధానాల లోపమా? అనేది ప్రశ్న.

నాగరికతా వికాస చరిత్రలో దేశ దేశాల్లో కాలానుగుణంగా ఎన్నో విలువలు ఉనికిలోకి వచ్చాయి. దేశంలోనూ చేసిన అనేక పోరాటాలు, త్యాగాల ఫలంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పారదోలి మనల్ని మనం పాలించుకునే స్వేచ్ఛను తెచ్చుకున్నాం. అనేక విలువల్ని నిర్మించుకున్నాం. ప్రపంచమంతటా దేశదేశాల్లో రాసుకున్న లిఖిత రాజ్యాంగాలన్నింటినీ వడపోసి మంచినంత ఏరికూర్చి ప్రపంచంలో నే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసుకున్నాం. రాజ్యాంగం వెలుగులో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమనే ఎన్నికల ప్రక్రియ ద్వారా అధికారం చేపట్టిన పాలకులంతా రాజ్యాంగం నిర్దేశించిన బాటలో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పుకు న్నాం. చేస్తారని ఆశించాం. రూపొందించుకున్న చట్టాల నీడలో ప్రజలు పూర్తి సంరక్షణలో ఉంటారని ఆకాంక్షించాం. ఇందులో వాక్ స్వాతంత్య్రంతోపాటు అందరి కీ సమాన అవకాశాలు, సమన్యాయం అందేలా అవకాశాలూ, పరిస్థితులు ఉండాలనీ, దానికి రూపొందించుకున్న చట్టాలు రక్షణగా నిలుస్తాయని కలలు గన్నాం.
అలా ప్రజల మేలుకోసం, సంరక్షణకోసం రూపొందించుకున్న రాజ్యాంగంలో ని 21వ అధికరణం ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించే హక్కును ప్రసాదించింది. అలాగే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కలుగజేసే మద్యాన్ని నియంత్రించాలని రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్ చెబుతున్నది.

ఈ స్ఫూర్తితోనే దేశంలో మద్యాన్ని నియంత్రించడానికి, మద్యం, మత్తు పదార్థాల ద్వారా ప్రజల ఆరోగ్యానికి కలిగే హానిని ప్రచారం చేస్తూ దాన్ని పూర్తిగా ప్రజల నుంచి దూరం చేయడానికి ఎక్సైజ్‌శాఖను ఏర్పాటు చేశారు. 70ల నాటికి దేశంలో సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి తెచ్చేలా కర్తవ్య బాధ్యతను నిర్దేశించుకున్నారు. అంటే ఎక్సైజ్‌శాఖ కర్తవ్యం, బాధ్యత మద్యాన్ని ప్రజల నుంచి దూరం చేయడం. మద్యం, మత్తు పదార్థాల వాడకాన్ని, అమ్మకాన్ని కట్టడి చేయడం. లేదా ప్రజలను చైతన్యవంతులను చేసి మద్యాన్ని నిషేధించడం. కానీ ఆచరణలో ఏమవుతున్నది?

రాజ్యంగం నిర్దేశించిన ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను మన ప్రభుత్వాలు పూర్తిగా నీరుగార్చాయి. అంటే ఎక్సైజ్ శాఖను పనిచేయకుండా చేయడం కాదు, నిర్దేశించుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థగా పాలకులు మార్చేశారు. మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా చేశారు. ఏ యేటికి ఆ యేడు మద్యం అమ్మకాలను పెంచే లక్ష్యంతో ఎక్సైజ్ రాబడిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ కొత్త ఎక్సైజ్ పాలసీలతో ముందుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 11,900 కోట్లుంటే, దాన్ని 15వేల కోట్లకు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం గతంలో ఉన్న మద్యం షాపులను పెంచేసి 4,380 షాపులు తెరిచేందు కు అనుమతులిచ్చారు.

వీటిలో పదిశాతం మద్యం అమ్మకాలను మార్కెట్ కమిటీ ల ద్వారా అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. దీంతో.. ఇప్పటిదాకా మద్యం దుకాణాల్లో మాత్రమే దొరికే మందుబాటిళ్లు ఇప్పుడు సూపర్ మార్కెట్లలో, బేకరీల్లో, జనరల్ స్టోర్లలోకూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఎక్కడపడితే అక్క డ అందుబాటులో ఉండే మద్యం తాగి కాటికి వెళ్లాలన్నమాట! అలాగే.. మార్కెట్ కమిటీలంటే.. అవన్నీ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే ఉంటాయని వేరే చెప్పక్కరలే దు. తెలంగాణలోనూ గతంలో ఉన్న మద్యం షాపుల సంఖ్యను పెంచి గతంలో ఉన్న 10,300 కోట్ల ఆదాయాన్ని 12వేల కోట్లు లక్ష్యంగా ప్రకటించుకున్నారు.

ఇలా ఇవ్వాళ.. దేశంలో అన్ని రాష్ర్టాల్లోనూ (గుజరాత్, నాగాలాండ్, మిజో రాం, మణిపూర్ మినహా) ఇదే జరుగుతున్నది. తమిళనాడు, కేరళ, ఢిల్లీ ప్రభుత్వా లు ఏకంగా హోల్‌సేల్, రిటేల్ అమ్మకాలను కూడా ప్రభుత్వాలే చేపడుతున్నాయి. మిగతా రాష్ర్టాల్లో హోల్‌సేల్ ప్రభుత్వం చేస్తూ రిటేల్‌నే ప్రైవేటుకు అప్పగిస్తున్నాయి. మహారాష్ట్రకు 2005-06లో మద్యం ఆదాయం 2,823 కోట్లు అయితే, అదే 2010 నాటికి 5,056 కోట్లకు చేరింది. అలాగే కర్ణాటకలో 3,396 కోట్ల నుంచి 6,942 కోట్లకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2,684 కోట్లనుంచి 2010 నాటికి 5,84 8 కోట్లకు చేరుకున్నది. ఇలా ప్రభుత్వాలన్నీ మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ప్రజలేమైపోతున్నారనేది ఎవరికీ పట్టని విషయమైపోయింది. మొత్తం ప్రపంచ మద్యం ఉత్పత్తిలో ఐదవ వంతు మన దేశంలోనే తాగుతున్నారు.

ఇంకా ప్రతియేటా ముప్పై శాతం ఉత్పత్తి పెంచుకుంటూ పోతున్నారు. భారత్‌ను తాగుబోతు ఇండియాగా మార్చుతున్నారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన, ఆలోచించాల్సిన విషయమేమంటే.. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయం లేకుంటే.. ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయలేమని ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. అంటే.. మన పాలకులు మద్యం అమ్మకాలు లేకుంటే.. గ్యాస్ సబ్సిడీ, రేషన్ సబ్సిడీ లాంటి వాటినీ అమలు చేయలేరన్నమాట! ఇంత నిస్సిగ్గుగా మన పాలకులు చెప్పుకొస్తుంటే.. ఇక మద్యం అమ్మకాలు తగ్గాలని, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న రకరకాల మద్యం, మత్తు పదార్థాలు మటుమాయం కావాలంటే ఎలా అవుతాయి?

దేశంలో మద్యానిది సుదీర్ఘ చరిత్ర. బ్రిటిష్ వాడు దేశానికి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టేదాకా దేశంలో ప్రజలంతా ప్రకృతి, సహజ పానీయాలపైనే ఆధారపడేవారు. తాటికల్లు, ఈతకల్లు, వేపకల్లు అంతా ప్రధానంగా మత్తు పదార్థంగా గాక, భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజ ఆరోగ్య సేవనంగా నే ఉండిం ది. ప్రతిదాన్నీ అమ్మి లాభాలు పొందే సంస్కృతి కలిగిన బ్రిటిష్‌వాడు మొదటిసారి1870 ప్రాంతంలో మద్యం అమ్మకాలకు లైసెన్సులను ప్రవేశపెట్టి నగరాలన్నింటా మద్యం అమ్మకాల అంగళ్లను తెరిచి మద్యం అమ్మకాలతో లాభాలను దండుకోవడమే కాదు సామాజిక అశాంతి, నైతిక పతనానికి పునాది వేశాడు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్య్రోద్యమ కాలంలో మద్యవ్యతిరేక నినాదం కూడా ప్రముఖంగా ముందుకువచ్చింది. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జరిగే పోరాటంలో భాగంగా.. మద్యం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. మద్యం, కల్లు దుకాణాల మందు కూడా ధర్నాలు చేశారు. చాలా సందర్భాల్లో గాంధీ బ్రిటిష్ పాలకుల ముందుంచిన ప్రధాన డిమాండ్లలో మొదటి డిమాండ్‌గా మద్య నిషేధం ఉండేది. అలా 1947 నాటికే గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ర్టాల్లో సంపూర్ణ మద్యనిషేధం ఉండేది.

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత.. మద్యపానానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేయాలని క్రమంగా దేశంలో సంపూర్ణ మద్యనిషేధం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్‌శాఖ ఏర్పాటయ్యింది. 1970 నాటికి సం పూర్ణ మద్యనిషేధం సాదించాలని మొదలయ్యారు. ఈ క్రమంలోనే 1963లో టేక్ చంద్ కమిషన్ వేసి మద్యపానంతో సమాజానికి ఒనగూరుతున్న నష్టాలు, మద్యాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయాలని చెప్పా రు. ఈ కమిషన్ 64లోనే నివేదికను సమర్పించి మద్యం అమ్మకాలతో జరుగుతు న్న నష్టాలను గురించి వివరంగా ప్రస్తావించింది. తాగుడుతో ఆరోగ్యం, ఆర్థికంగా నష్టపోవడమే కాదు, అంతకన్నా ఎక్కువగా మానవ శ్రమ వృథా అవుతున్నదని తేల్చిచెప్పింది. సామాజిక అశాంతికి, మనిషి నైతిక పతనానికి, సమస్త మానవీయ విలువల పతనానికీ మద్యమే కారణమని వివరించి సంపూర్ణ మద్యనిషేధంతోనే ఆరోగ్య, ఆనందకర సమాజానికి పునాదులు పడతాయని తెలిపింది. ఇవేవీ మన పాలకుల చెవికెక్కలేదు.

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపోయింది. క్రమానుగతంగా దేశంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలనుకున్న ఆశయాలు ఆవిరై పోయాయి. 70 నాటికి సంపూర్ణ మద్యనిషేధం సాధి ంచాలనుకున్నది, తలకిందులై దేశమంతా మద్యం ఏరులైపారుతున్నది. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంపైనే ఆధారపడి పాలన సాగిపోతున్నది. తాగినోడే కట్టె తాటి పన్ను అని అందరూ చూస్తూ ఊరుకుంటే.., ప్రభుత్వాలే మద్యం వ్యాపారం చేస్తుంటే.. తాలిబొట్లు తెగిపడుతున్న దానికి బాధ్యులెవరు? రాజ్యాంగంలో రాసుకున్న 21 అధికరణం, ఆర్టికల్ 47 స్ఫూర్తి ఏమయ్యింది? దీన్ని తలకిందులు చేసిందెవరు? కల్తీకల్లు, కల్తీసారా, గుడుంబాలతో ఆరోగ్యాలే కాదు, ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషాదానికి ఎవరు బాధ్యులు?

1550

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు