నిస్తేజం సమాజ పతనమే


Wed,October 7, 2015 03:55 AM

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి సంకేతం. సరిగ్గా ఇలాంటి స్థితిని గర్హిస్తూ.. అలా సమాధిలా అంగుళం మేరన్నా కదలకుండా పడుంటే ఎలా..? కొన్నాళ్లు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికే నీకు తెల్సి చావదు.. అని మూడు దశాబ్దాల కిందటే కవి అలిశెట్టి ప్రభాకర్ మనల్ని హెచ్చరించాడు.

దేశాభివృద్ధి ఆరులైన్ల హైవేలో దూసుకుపోతున్నది. ఆధునిక అభివృద్ధి, సమాచార సాంకేతిక విప్లవం మనిషిని ఏదీ అంటని పాదరసంగా మార్చివేసింది. ఏ నిబద్ధత లేని తన మే నాగరికమై పోయింది. సామూహిక జీవనం పాతకాలపు పద్ధతి అయ్యింది. సామాజిక బాధ్యత, సామాజిక మార్పు అనేవి కాలం చెల్లిన ఆలోచనలు, అనవసర, వల్లమాలిన విషయాలయ్యాయి. ఇప్పుడంతా కావలసింది ఎదగడమే. ఎదగడమంటే నాగరికంగా, మానవీయంగా కాదు, ఆర్థికంగా ఎదగడమే. తరాలు కూర్చుని తిన్నా తరగని విధంగా కోట్లు కూడబెట్టడమే. ఈ పరుగు పందెంలో ఇరుగు, పొరుగుకు తావులేదు. సాటి మనిషికి అర్థం లేదు, చోటు లేదు. సానుభూతి, సహానుభూతి అక్కరకురాని సోది.

mallareddy


మూడు దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న ఈ ధోరణి మొత్తంగా సామాజాన్ని నిస్సారం చేసింది. నిస్సత్తువను నింపింది. బాధ్యతారాహిత్యం నిలువెల్లా నిండిన సమాజం అమానవీయంగా మారింది. ఇప్పుడిక్కడ ఎవరికి ఎవరూ కారు. ప్రభు త్వం అంటే ప్రజల కోసం కాదని, కొందరి కోసమే ఉన్నట్లుగా చాటుకుంటున్నది. రాజ్యం రక్షణ కొందరికే ఉంటుందని చేష్టలతో చెబుతున్నది. పేదల ప్రాణాలు దేనికీ కొరగానివిగా అయిపోయి. వారి ఉనికే కొందరికి అసహనాన్ని కలుగజేస్తున్నది. ఈ నేపథ్యంలోనే..
-మధ్యప్రదేశ్‌లోని కత్నీ గ్రామానికి చెందిన 45 ఏళ్ల లతోరీలాల్ తాగి రోడ్డుపక్కన గోతిలో పడిపోయాడు. రోడ్డు వేసే కాంట్రాక్టర్ గుంతను పూడ్చడానికి ఇంత మట్టి, కంకర మిగులుతాయని అనుకున్నాడేమో.. లతోరీలాల్ పైనుంచి తారు రోడ్డు వేసేశాడు!
-ఉత్తరప్రదేశ్ లక్నోలో ఓ 65ఏళ్ల కిషన్‌కుమార్ స్థానిక పోస్టాఫీసు ముందర రోడ్డువార చెట్టుకింద టైపు మిషిన్ పెట్టుకుని పొట్టపోసుకుంటున్నాడు. స్థానిక పోలీసు పెద్దకు ఎందుకు కంటగింపు అయ్యిందో.., రోడ్డు వార కూర్చుని తన మానాన తాను పనిచేసుకుంటున్న వృద్ధు న్ని చితకబాది టైప్ మిషిన్‌ను నుజ్జు నుజ్జు చేసి కసి తీర్చుకున్నాడు!
-దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ కుటుంబం వారు ఆవు మాంసం తిన్నారని ఊరు జనానికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఊరు పవిత్రతను నాశనం చేశారని ఆ ఇంటిల్లిపాదిని చితక బాదారు. ఒకరిని ఏకంగా చంపేసి గ్రామ పవిత్రతను కాపాడుకున్నారు!
ఇవి ఘటనలు మాత్రమే కాదు. ఈ సమాజం పోకడకు నిలువుటద్దం. ఇవన్నీ మన పేపర్లలో ఓ మూల సింగిల్ కాలమ్ వార్తలు. కాబట్టి ఇవేవీ ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ఇక వాటి గురించి పట్టించుకోవడాలూ, ఆలోచించడాలూ అసలే లేవు. వారంతా.. సామాన్యులు. అందులోనూ డాబూ దర్పం లేనివారు. కాబట్టి అవి మన మీడియాకు పెద్ద న్యూస్‌గా కనిపించ లేదు. అందుకనే వారు రోజూ వేలాదిగా జరుగుతున్న ఘటనల్లో ఇదొక ఘటనగా అనుకున్నారు. సింగిల్ కాలమ్‌తో నైనా సరిపుచ్చి తమ బాధ్యతగా చేతులు దులుపేసుకున్నారు.

ఇలా విడిగా, ఘటనల వారీగా దేశం నలుమూలలా జరుగుతున్న ఘోరాలు, అమానవీయ ఘటనలు ఎలా ఉన్నా.. మన ప్రభుత్వాల విధానాలు, పాలకులుగా మన ఏలికలు తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ప్రజల మౌలిక జీవితాలను మార్చే దిశలో ఉంటున్నాయా? అంటే లేదనే చెప్పాలె. అచ్ఛే దిన్ ఆయేగీ అంటూ అంతా తానై ప్రచార పటాటోపంతో అధికారం చేజిక్కించుకున్న మోదీ ఏడాదిన్నర కాలంలో ప్రధానిగా దేశంలో ఉండి పాలన చేసిందానికన్నా విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపారు. గుజరాత్ అభివృద్ధి తరహాలోనే దేశాన్ని అభివృద్ధిబాటలో పరుగులు తీయిస్తానని చెప్పిన మోదీ దానికి కావలసిన పెట్టుబడుల కోసమని ప్రపంచదేశాలన్నింటా జోలెపట్టి తిరుగుతున్నారు. దేశంలో పుష్కలంగా ఉన్న సహజవనరులను చూపించి వాటిని యథేచ్ఛగా వాడుకుని చవకైన మానవశ్రమతో లాభా లు మూటగట్టుకోవచ్చని బడా కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. అయినా ఎన్ని బహుళజాతి సంస్థలు వస్తున్నాయి, ఎంత పెట్టుబడులు పెడ్తున్నాయి.., వాటితో ఉద్యోగ కల్పన ఎంత ఉంటుంది? అన్నవి అడగకూడని ప్రశ్నలు!
ఇంతకూ మోదీ గుజరాత్ అభివృద్ధి మోడల్ ఏమిటి? గుజరాత్‌లో ఎకరం భూమి విలువ 50 లక్షల నుంచి కోటి రూపాయలుగా ఉన్న చోట ఆయన అంబానికీ, ఆదానీకి అక్షరాలా ఒక రూపాయికే ఎకరం భూమి చొప్పున అప్పజెప్పారు. ఇంకా తనకు అత్యంత ప్రియమైన ఆదానీకి.. కచ్ జిల్లాలో 14,306 ఎకరాల భూమిని చదరపు మీటరుకు 32 రూపాయలకే అప్పగించాడు. నిజానికి ఆ భూమి విలువ మార్కెట్ ధర వేలల్లో ఉంటుంది. బెంగాల్‌లో నానో కార్ల ఉత్పత్తి కోసమని తలపెట్టిన భూ సేకరణను వ్యతిరేకించి అక్కడి ప్రజలు టాటా కంపెనీని అక్కడినుంచి వెల్లగొట్టడంతో.. ఆయనను గుజరాత్‌కు సాదరంగా ఆహ్వానించారు. సకల సౌకర్యాలతో.. కారుచవకగా భూములు అప్పగించి నానో కార్ల కంపెనీని పెట్టుకొమ్మని చెప్పి టాటాను ప్రసన్నం చేసుకున్నాడు. ఈ విధంగానే బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు గుజరాత్ సహజవనరులను కట్టబెట్టి వాటి జిలుగు వెలుగులనే రాష్ర్టాభివృద్ధిగా చెప్పుకొస్తున్నారు. దీన్నే మీడియా దేశ నవనిర్మాణ రూపశిల్పిగా మోదీని కీర్తిస్తున్నది. గుజరాత్‌లో జరిగిన అభివృద్ధిలో పేదల జీవితాలకు చోటులేదు. గుజరాత్ అభివృద్ధిలో సమిధలు పేదలు. ఈ క్రమంలో చూస్తే.. 2001లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రి అయ్యే నాటికి గుజరాత్ అప్పు 26 వేల కోట్లు. అయితే.. మోదీ విధానాలతో 2014నాటికి ఆ అప్పు రెండు లక్షల కోట్లు దాటింది. అంటే మోదీ చెబుతున్న అభివృద్ధి విధానంతో గుజరాత్‌కు మిగిలింది అప్పుల కుప్ప. ప్రజలకు మిగిలింది మట్టి దిబ్బ మాత్రమే.

ఇవ్వాళ.. దేశంలో వ్యవసాయ సంక్షోభం నెలకొన్నది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలకు తోడు మన ప్రభుత్వాల వ్యవసాయ విధానాల పుణ్యమాని రైతు అప్పు ల ఊబిలో కూరుకు పోయాడు. దేశానికి వెన్నెముక రైతు అన్నచోట రైతు పంటచేలల్లో ఉరితాడుకు వేలాడుతున్నాడు. ఇది కరువు ప్రాంతాలకే పరిమితం కాలేదు. హరిత విప్లవం తెచ్చిన పంజాబ్‌లో కూడా రైతు ఆత్మహత్యలు అధికంగా ఉన్నా యి. పదేళ్ల కాలంలో పంజాబ్‌లో ఇంటికొకరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో వైపు ఇబ్బడి ముబ్బడిగా వాడిన రసాయన ఎరువులు, పురుగుమందుల కారణం గా అక్కడి భూమి, నీరు, గాలి కాలుష్యమై పోయి క్యాన్సర్ రోగులు దేశ సగటుకు పదింతలు పెరిగిపోయారు. దీంతో క్యాన్సర్ రోగులను ఢిల్లీ ఆస్పత్రులకు తీసుకుపోయేందుకు ఒక ప్య్రతేక రైలునే వేశారు. దానికి క్యాన్సర్ రైలు అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అక్కడి వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకువచ్చి ప్రజల జీవితాలను పరిరక్షించే చర్య ఏ ఒక్కటీ జరగడం లేదు. బహుళజాతి కంపెనీల ధనదాహానికి అడ్డుకట్టవేసి పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం లేదు. తరతరాల భారతీయ జీవనాధార వ్యవసాయ విధానానికి పట్టం కట్టే విధంగా ఏ చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదు.

ఇలా ఘటనల రూపంలోనూ, విధానాల రూపంలోనూ జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి సంకేతం. సరిగ్గా ఇలాంటి స్థితిని గర్హిస్తూ.. అలా సమాధిలా అంగుళం మేరన్నా కదలకుండా పడుంటే ఎలా..? కొన్నాళ్లు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికే నీకు తెల్సి చావదు.. అని మూడు దశాబ్దాల కిందటే కవి అలిశెట్టి ప్రభాకర్ మనల్ని హెచ్చరించాడు. అయినా మనం సోయి తెచ్చుకోలేదు. అలిశెట్టి చెప్పినట్టే నానా గడ్డి మొలిచి మనం ఉనికి కోల్పోవడమే కాదు, పాలకులే మనపై తారు కప్పేస్తున్నారు. మన మెదళ్లను మొద్దు బార్చి మనల్ని పరాయికరణకు బలిచేసి సామూహికంగా.. సమాధి చేస్తున్న సంకేతమే.. లతోరీలాల్ ఘటన. ఇకనైనా మనం మేల్కోవాలి. సామూహిక సమాధి చేస్తున్న పాలకుల విధానాలను ఎదిరించాలి.

1743

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు