సర్కారీ భూ కబ్జా..


Sat,October 6, 2012 05:21 PM

scan1దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గుడ్డల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజలను సమిధలను చేయడంలో పోటీపడుతున్నారు. వేల, లక్షల ఎకరాల పంట భూములను బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టి.. సామంత రాజ్యాలకు ప్రాణం పోస్తున్నారు.

నాలుగున్నర ఎకరాల భూమి గుంజుకొని నాకు కోటిన్నర రూపాయలు చేతిలో పెట్టింది ప్రభుత్వం. తాత ల కాలం నుంచి ఆ భూమిలోనే పనిచేసి బతుకుతున్నం. ఇప్పుడు ఈ పైసలేం చేసుకోవాలి? ఏం చేసి బతకాలని ఉత్తరవూపదేశ్ నోయిడాలోని 72 ఏళ్ల రైతు వాపోతున్నా డు. పనిచేసి బతకడం తప్ప మరేమీ తెలియని ఈ ఒక్క రైతు ఆవేదనే కాదు, ఇవాళ దేశంలో మూల మూలనా భూములు కోల్పోయిన రైతుల దుస్థితి ఇది. పోలేపల్లినుంచి.., పోస్కో వ్యతిరేక ఉద్యమం దాకా.. భూనిర్వాసితుల గోడు ఇది.
ఇవాళ దేశంలో భారీ భూకబ్జా జరుగుతోంది. ఈ దుర్మార్గానికి ప్రభుత్వమే ఒడిగడుతోంది.అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ, అటవీ భూమిని రైతుల నుంచి ప్రభుత్వం నయానా, భయా నా.. గుంజుకుంటోంది. దీంతో.. భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులు నిర్వాసితులై.. రోడ్డున పడుతున్నా రు. జీవనోపాధి కోల్పోయిన ప్రజలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. పోరాడుతున్నారు. ఆంధ్రవూపదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్, ఒడిసా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఈశాన్యరాష్ట్రాలైన అస్సాం తో సహా అన్ని రాష్ట్రాలు .. భూ నిర్వాసితుల పోరాటాల తో.. అట్టుడుకుతున్నాయి.

నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన నాటినుంచీ దేశంలో విధ్వంసక అభివృద్ధి రథాలు పరుగులు తీస్తున్నాయి. పారిక్షిశామికాభివృద్ధి పేరుతో ఏర్పాటు చేస్తున్న సెజ్‌లు, ఆధునిక రవాణా సౌకర్యాల పేరుతో నాలుగు లైన్ల రోడ్లు (ఎక్స్‌వూపెస్ వే లు), పవర్ ప్రాజెక్టులు, డ్యామ్ లూ .. ఏవైనా.. ప్రజల జీవితాల ను తోడేస్తున్నాయి. దీంతో..ఆ భూములపై ఆధారపడి జీవిస్తు న్న ఆదివాసులు, రైతులు అభివృద్ధి ప్రాజెక్టులేవైనా.. అడుగడుగునా.. వ్యతిరేకిస్తున్నా రు. ప్రజలకు ప్రత్యామ్నాయ జీవన మార్గాలను చూపాల్సిన ప్రభుత్వాలు అణిచివేతనే ఆయుధంగా ఎంచుకుంటున్నాయి. కంపెనీ యజమానుల ప్రయోజనాలను కాపాడటానికి..కంకణం కట్టుకున్నాయి.

ఉత్తరవూపదేశ్ ప్రజల పాలిట ‘ఎక్స్‌వూపెస్ వే’లు శాపం గా మారాయి. రాష్ర్టంలో.. మాయావతి సర్కారు రెండు ఎక్స్‌వూపెస్ రోడ్డు మార్గాలను వేయడానికి పథకాలు రచించింది. ఇది నోయిడా ప్రజలకు ఉరితాడు అయ్యింది. ‘యమునా ఎక్స్‌వూపెస్ వే’ పేరుతో 9,500 కోట్లతో నిర్మిస్తున్న ఆ రోడ్డు మార్గానికి 43 వేల హెక్టార్ల భూమిని రైతుల నుంచి బలవంతంగా సేకరించడానికి పూనుకుం ది. ఈ రోడ్డు మార్గం పొడవునా 1,191 గ్రామాలు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. పంటభూములు మట్టిపాలయ్యాయి. ఏడాది పొడవునా పైరు పచ్చలతో కలకలలాడే పల్లెసీమలు వల్లకాడయ్యాయి.

దీంతో రైతులు పంట భూములివ్వడానికి నిరాకరించారు. భూసేకరణకు వచ్చిన అధికారులను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న యంత్రాలను ఊళ్లలోకి రాకుండా ఊళ్లచుట్టూ కందకాలు తవ్వారు. మే 9 -12 తేదీ వరకు భట్టా, పార్‌సోల్ గ్రామాలు యుద్ధభూమిగా మారాయి. వేలాది పోలీసులు గ్రామాలను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపారు. దీంతో రెచ్చిపోయిన రైతులు పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడా నుంచి ఆగ్రాకు కేవలం రెండుగంటల ప్రయాణ కాలా న్ని తగ్గించే రోడ్డు కోసం ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. ఇక మరో గంగా ఎక్స్‌వూపెస్ వే కథ కూడా ఇంతే. దీన్ని కూడా జేపీ ఇన్‌వూఫాటెక్ కంపెనీకే అప్పగించిన మాయావతి ప్రభుత్వం పెద్దమాయనే చేసింది. 40 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ రోడ్డుమార్గానికి 10 వేల హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు.

దీనివల్ల 5 వేల గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ భూములను కోల్పోతున్నారు. ఈ నేపథ్యం లో గ్రామీణ ప్రాంతాల్లో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరలో ఉన్న నోయిడా ప్రాంత రైతులకు పంట భూములు పోయి, నష్టపరిహారంగా.. కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. ఈ అవాంఛనీయ డబ్బు తో.. గ్రామాల్లో పెద్ద బంగళాలు ఏర్పడి, కార్లు వచ్చి, మద్యం, మారణాయుధాలు వచ్చి చేరాయని ధరమ్‌వీర్ సింగ్ అనే రైతు వాపోయారు.
2008లో వచ్చిన నూతన గనుల విధానం ఛత్తీస్‌గ ఢ్‌ను అతలాకుతలం చేస్తోంది. అపార ఖనిజ సంపదకు పుట్టినిపూ్లైన ఛత్తీస్‌గఢ్‌పై జాతీయ, అంతర్జాతీయ మైనింగ్ కంపెనీలు కన్నేశాయి.

లక్షల ఎకరాల వ్యవసాయ పంట భూములే గాక, లక్షా 64 వేల హెక్టార్ల అటవీ భూమి మైనింగ్ కోసం నాశనం చేశారు. ఇంకా 50 వేల హెక్టార్ల భూమి కోసం రైతులను బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ప్రైవేటు కంపెనీలు ఛత్తీస్‌గఢ్‌కు క్యూ కట్టాయి. ఒక రాయ్‌ఘర్ ప్రాంతంలోనే 297 కంపెనీ లు వెలిశాయి. 1999-2007 మధ్యకాలంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 82వేల 300 హెక్టార్ల భూమిని కంపెనీలకు కట్టబెట్టింది. దీనికోసం అటవీ చట్టాలనూ పాతరే సి పర్యావరణానికి తీవ్ర హాని తలపెట్టారు. మైనింగ్ కంపెనీలతో జీవనోపాధి కోల్పోయిన రైతులు కంపెనీలకు వ్యతిరేకంగా.. కదం తొక్కుతున్నారు. ఒక జోథ్ పూర్ జిల్లాలోనే 50వేల మంది రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా రోడ్లమీది కొచ్చారు. అమాయక గిరిజనులను నిలువ నీడలేకుండా చేసి మైనింగ్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ప్రజ లు, గిరిజనులు పోరు బాట పడుతున్నారు. చావనైనా చస్తాం కానీ.. అడవిని వదలబోమంటున్నారు.

ఈ మధ్య భూనిర్వాసితుల పోరాటాలతో.. ఒడిసా ఉడికిపోతోంది. ఒడిసా సర్కార్ 2002-2010 మధ్య కాలంలోనే 8 లక్షల కోట్లతో.. 184 అభివృద్ధి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది. దీనికోసం 480 కి.మీ కోస్ట ల్ ప్రాంతంతోపాటు, 50 వేల ఎకరాల భూమిని కంపెనీలకు కట్టబెట్టడానికి ఒడిసా సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పారిక్షిశామిక విధానాన్ని స్థానిక రైతులు, గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో.. లాంజిగర్‌లోని నియాంగిరి హిల్స్, కలహండి ప్రాంతాల గిరిజను లు వేదాంత అల్యూమినియం కంపెనీకి వ్యతిరేకంగా.. పెద్ద యుద్ధమే చేస్తున్నారు. వేదాంత కంపెనీ యంత్రాల ను తగులబెట్టారు. దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పోస్కో కంపెనీకోసం 1500 హెక్టార్ల భూమిని రైతుల నుంచి బలవంతంగా గుంజుకున్నారు.

సౌత్ కొరియా నిర్మిస్తున్న ఈ కంపెనీ కోసం స్థానిక ప్రజల కన్నీళ్లు చూడటానికి ఒడిసా ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఈ కంపెనీ కోసం మహానది నీళ్లను మల్లించడంతో.. 20 వేల మంది రైతులు రోడ్డున పడ్డా రు. ఖాందాధర అడవిలో వేలాదిమంది గిరిజనులు నిర్వాసితులయ్యారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం గ్రామాలకు సాయుధ పోలీసులను పంపింది. సంతకా లు చేసిన చెక్కులు, చేతిలో తుపాకులతో.. పోలీసులు గ్రామాలపై పడి భూములు అప్పగించాలని బెదిరిస్తున్నా రు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీయడానికైనా సిద్ధ మైంది కానీ.. కంపెనీని ఆపడానికి సిద్ధంగాలేదు. స్థానిక గిరిజనులు పోస్కోకు వ్యతిరేకంగా.. హైకోర్టుకుపోయి కంపెనీపై గెలిచారు. అయినా ఒడిసా ప్రభుత్వం కంపెనీ నీ ఆపేది లేదని నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నది.

వామపక్ష ప్రభుత్వాలున్న పశ్చిమ బెంగాల్ , కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో కూడా.. దీనికి భిన్నంగా ఏమీలేదు. బడా కంపెనీల కోసం పేదల బతుకులను బలిపెట్టడాని కి వామపక్షీయులు వెనుకాడలేదు. సీపీఎం కంచుకోట బెంగాల్‌లో టాటా, జిందాల్ వంటి కంపెనీలకోసం సింగూర్, నందిక్షిగాంలను రక్తపుటేరుల్లో ముంచారు. పచ్చని పంటపొలాలను కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించినందుకు రైతుల గుండెల్లో గుండ్లు దించారు. పంట పొలాల్లో రక్తపు పారించారు. దీని ఫలి తమే 34ఏళ్ల సీపీఎం పాలన అంతమైంది. వెయ్యి ఏనుగులు తిన్న రాబందులా కూలిపోయింది.

మన రాష్ట్రానికొస్తే.. అభివృద్ధి పేర పాలకులు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అందమైన రోడ్లూ, వయ్యారాలుపోయే ఫె్లై ఓవర్లు, హై టెక్కు అద్దాల బిల్డింగ్‌లే కాదు.. సెజ్‌ల పేరుతో రైతుల ఉసురుపోసుకున్నారు. రైతుల కు ఉరిబిగించారు. బహుళజాతి కంపెనీలను భుజానకెత్తుకొని.. బడుగులను బలిచ్చారు. ఈ క్రమంలో జరిగిన విధ్వంసాలే... సోంపేట, కాకరాపల్లి, కనపర్తి. పాలకుల వినాశకర విధానాలకు పరాకాష్టగా.. కోస్టల్ కారిడార్ పేర పాలకులు చేసిన పాపం అంతా ఇంతాకాదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరుజిల్లా తడవరకు 76 థర్మల్ పవర్ ప్లాంట్లకు ప్రణా ళికలు రచించి 36 ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వీటిలో ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం కనపర్తి దగ్గర నిర్మిస్తున్న థర్మల్ ప్లాంట్ పెద్ద దుమారాన్నే లేపుతోంది.

దీనికోసం 2638 ఎకరాల పంటభూముల ను రైతుల నుంచి బలవంతంగా గుంజుకున్నారు. కనపర్తి థర్మల్ ప్లాంటుతో చుట్టూ 40 కి.మీ. మేర పంటపొలాలు, 40 వేల ఎకరాల వరిపంట నాశనమవుతుందని రైతులు అంటున్నారు. రోజుకు 36వేల టన్నుల బూడిద విడుదల చేసి, జల వాయు కాలుష్యానికి కారణమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో అందరూ ఒకే తానులోని గుడ్డల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజలను సమిధలను చేయడంలో పోటీ పడుతున్నారు. వేల, లక్షల ఎకరాల పంట భూములను బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టి.. సామంత రాజ్యాల కు ప్రాణం పోస్తున్నారు. మరో రూపంలో.. దేశాన్ని విదేశీకంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. ఓ సామాజిక కార్యకర్త అన్నట్లు ఒకప్పుడు ఈస్ట్ ఇండియాకంపెనీ... వందేళ్లకు దేశాన్ని ఆక్రమించుకుంది. కానీ.. ఇప్పుడు లెక్కకుమించిన కంపెనీలు అనతికాలంలోనే దేశాన్ని ఆక్రమించుకున్నాయి. పాలకులను పాదాక్షికాంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మిగిలింది.. బహుళజాతి కంపెనీలను తరిమికొట్టడమే. మరో స్వాతంత్ర పోరాటమే.

-ఎస్. మల్లారెడ్డి

39

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం