అతనొక పసిపిలగాని పాట


Sat,October 6, 2012 05:22 PM

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను చూసి...జీవితాన్నే కథగా మలుచుకున్నాడు.

జనక్ జనక్ మన్న డప్పు సప్పుడుకు కదిలే కాలుకు.. జానపదపాటను జోడించి..పల్లెగానమైన వాడు. పచ్చిగడ్డి కోసుకొచ్చి బర్రెకేసినంత ప్రేమగా.. పాటను ఇష్టపడ్డవాడు.
122-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపల్లె పదమై.,పాటయై..,విప్లవగానమై..పిల్లల పాటయై..పాలనురుగంత తేటగా..విరబూస్తున్నవాడు...
అతడే భూపాల్. కవి, రచయిత, నటుడు. ఒక్క జీవితంలోని అన్ని పార్శ్వాలూ.. కలెగలిసిన మట్టి మనిషి. ఉండేది పట్నంలో అయినా.. నివాసం అంబర్ పేట.పల్లె, పట్నం కలెగలుపు జీవితాల సాంగత్యంతో..సారవంతమైన తెలంగాణ జీవితంలో భాగమైనవాడు. అచ్చమైన తెలంగాణ భూమిపువూతుడు.
డప్పు సప్పుడైతే చాలు... నిలువని కాలు, ఆగని మనసుతో..పక్కసందులో శవంముందర బైండ్లవాళ్లతో కలిసి ఆటాడి.. ఆరేళ్ల పోరగాడిగా..వీపు పగులగొట్టించుకున్న కాణ్ణుంచి..,నేటిదాకా.. 52 ఏళ్లుగా..పాటను అపురూపంగా చూసుకుంటున్నవాడు భూపాల్.అందుకే.. ఆయన అక్షరం పేర్చితే పాట. మనసు విప్పితే.. కథ. ఓ వ్యథ.

పుట్టింది వ్యవసాయ కుంటుంబం. తండ్రిపేరు రాంరెడ్డి. తల్లి అంబమ్మ. మూసీనదిలో రెండెకరాల గడ్డిపొలమున్న రైతు. భూపాల్ తండ్రి ఆనాటి ఏసీబీలో కానిస్టేబుల్ ఉద్యోగమైనా...చాలీ చాలని జీతానికి, ఇంట్లో ఉన్న ఆరు బర్లే..ఆ కుటుంబానికి ఆదరువు. ఒక అన్న, అక్క, తమ్ముడూ, ముగ్గురు చెల్లెండ్లు. భూపాల్ నడిపోడు. అయినా.. ఇంటి బాధ్యతంతా తానే మోసిన కష్టజీవి.కన్న పిల్లల చదువులకోసం ఇటుకబట్టీలలో పనిచేసిన భూపాల్, పిల్లల చదువులు అయిపోయిన తర్వాత తానూ డిగ్రీ చదువు పూర్తిచేసిన చదువు ప్రేమికుడు. నిత్య సాహిత్య కృషీవలుడిగా.. ఇప్పటికే 19 పుస్తకాలను ప్రచురణలోకి తెచ్చాడు. ఆయన రాసిన ‘ఉగ్గుపాలు’ చిన్నపిల్లల కథల సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు (బాలల సాహిత్యంలో )వచ్చిన సందర్భంగా.. భూపాల్‌తో ‘నమస్తే తెలంగాణ’ ముఖాముఖం.

ప్ర: భూపాల్‌గారూ మీ బాల్యాన్ని గురించి చెప్పండి?
నిజానికి నాది బాల్యమెరుగని జీవితం.చిన్నప్పటినుంచీ.. ఇంటికీ, అమ్మకూ..చేదోడు వాదోడుగా ఉంటూ..పనుల్లో, బాధ్యతల్లో భాగం పంచుకున్న జీవితం నాది.ఇంట్లో అన్న, అక్క, తమ్ముడు,ముగ్గురు చెల్లెండ్లలో నేను రెండో వాడిని.నాయన ఏసీబీలో కానిస్టేబుల్ ఉద్యోగం.చాలీ చాలని జీతం.ఇల్లు గడవడానికి మూసీ నదిలోని గడ్డిపొలమే దిక్కు.ఇంట్లో ఆరు బర్లు ఉండేవి. మూసీ నుంచి గడ్డి కోసుకొని సైకిల్ మీద పెట్టుకొని ఇంటికి ఆరు ట్రిప్పులు కొట్టేవాడిని.నేనే కుటుంబానికి పెద్ద దిక్కయ్యాను. కొన్ని కారణాల చేత అన్న ఇంటినుంచి దూరంగా ఉండటంతో..బాధ్యతంతా నామీదనే పడింది.

జీవన పోరాటంలో.. చదువు డిగ్రీ స్థాయిలోనే మధ్యలోనే ఆగిపోయింది. ఆదరువుగా ఉన్న గడ్డిపొలాన్ని అమ్మి చెల్లెండ్ల పెళ్లిల్లు చేశాను. ఉన్న గడ్డిపొలము పోయి.., ఇంట్లో బర్లుపోయి.. అరుక ఇరిగిన రైతులా రెండు చేతులే మిగిలాయి. దీంతో.. కుటుంబ భారం కోసం ఎదురైన పనల్లా చేశాను. ఇటుక బట్టీల్లో, కెమికల్ ఫ్యాక్టరీల్లో కూలీ పని మొదలు 2001లో ‘జట్టు’ స్వచ్ఛంధ సంస్థలో పనిచేసేదాకా.. అంతా.. జీవనపోరాటమే. జీవిక కోసం ఆరాటమే.

ప్ర: మీ చదువు సంధ్యల గురించి చెప్పండి.
1410-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaమూడో తరగతి నుంచి అంబర్ పేట స్కూలులో 8 వతరగతి వరకు చదివాను. ఆ తర్వాత 9 నుంచి హెచ్చెస్సీ వరకు ఛాదర్ ఘాట్ స్కూలులో చదివాను. ఆతర్వాత ‘పీయూసీ’ న్యూసైన్స్ కాలేజీ , ‘డిగ్రీ’ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో. డిగ్రీ రెండో సంవత్సరం వరకు దువుతున్న సమయంలోనే నక్సల్‌బరీ, శ్రీకాకుళ పోరాటాల వెల్లువ , విప్లవ రాజకీయాల ప్రభావం నామీద పడింది. దీంతో.. ఈ బూర్జువా చదువులు వద్దని చదువుకు స్వస్తి చెప్పాను.

ప్ర: రైతు కుటుంబంలో పుట్టిన మీకు పాట ఎలా అబ్బింది?
మంచి ప్రశ్న. మాది రైతు కుటుంబం . రైతు బతుకంటే.. శ్రమతో , భూమితో.., ఉత్పత్తితో..వి దీయలేని జీవితం. అందులోనూ.. హైదరాబాద్ అని చెప్పుకుంటున్నా.. అంబర్‌పేట అంటే.. తెలంగాణలోని ఏ గ్రామానికీ తీసిపోని పల్లె జీవితం. అంబర్ పేటలో మా ఇంటిముందే ఎప్పుడూ బాగోతులు, హరికథలు , చిరుతల రామాయణం ఆడుతుండే వారు. బుద్దెరిగినప్పటినుంచీ.. ఆ పాటలే ఎప్పుడూ.. నా నోట నానుతుండేవి. కాలు ఆడుతుండేది.అలాగే.. అమ్మమ్మ ఊరు ఇబ్రాహీంపట్నం దగ్గరలోని లింగంపల్లి, గడ్డమల్లాయి గూడెం తరుచుగా పోయి వస్తుండే వాడిని. ఈ పల్లె జీవితమే... నా జీవితంలో పాటను భాగం చేసింది. ఎలాగైనా నేను కూడా ఆడి పాడాలని ఆరాట పడేవాడిని. కానీ.. ఎక్కడా అవకాశం దొరకలేదు.

ఒకరోజు మా పక్క బాజార్లో ఎవరో చనిపోయారు. జోరుగా డప్పులు మోగుతున్నాయి. నాకాలు నిలవలేదు. శవ యాత్ర సాగుతున్నది. బైండ్ల వాళ్లు శవం ముందట డ్యాన్స్ చేస్తున్నరు. నేనూ వాళ్లతో కలిసి పోయాను. మోగుతున్న డప్పులకు అనుగుణంగా.. స్టెప్పులు వేస్తూ.. నన్ను నేను మరిచిపోయాను. ఎవరో చూసి అది మా ఇంట్లో చెప్పారు. ఆతర్వాత పొద్దుగూకినంక ఇంటికి వెళ్లగానే.. వంగబెట్టి నావీపుమీద మోత మోగించారు. దెబ్బలు తిన్నందుకు బాధపడలేదు, దరువుకు అనుగుణంగా ఆటాడినందుకు ఎక్కడ లేని తృప్తి మిగిలింది. ఆనాటి నుంచి.. ఆ పాటల బాటలో.. ఎన్నెన్నో కష్టాల పడ్డాను. కానీ..పాటను మరువలేదు.

ప్ర: నటుడు ఎలా అయ్యారు?
నేను ఏ నటనా శిక్షణ తీసుకోలేదు. నిజానికి జీవితానికి మించిన లోతైనది ఏదీ లేదు. నటన అంటే.. జీవిత ఘటనలనే ప్రతిఫలించడం కదా..! దానికి పెద్ద శిక్షణ అవసరమని నేను అనుకోను. దానికి జీవితం ఉంటే చాలు. జీవితం తెలియని వాడికి శిక్షణ అవసరం.

ప్ర: విప్లవరాజకీయాల పరిచయం ఎలా ఏర్పడింది?
bbbb-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaనేను హెచ్చెస్సీ చదువుతున్న రోజుల్లోనే నాకు తరిమెల నాగిడ్డి, దేవుల పల్లి వెంక అనుచరులతో పరిచయం ఏర్పడింది. వారి అనుచరులు నవోదయ అనే సంస్థ ,జీవనాడి అనే పత్రికను తీసేవారు.టీఎన్, డీవీ అనుచరులతో.. తరచుగా.. వీవీ కాలేజీలో చర్చల్లో పాల్గొనే వాణ్ణి. డీఎస్‌ఓ రాజకీయాలతో ఏకీభావంతో పనిచేయనారంభించాను.నా చెల్లెండ్లు, తమ్ముడు, నామివూతుల తమ్ముళ్లతోనే ఓ టీమ్ ఏర్పాటు చేసి నాటకాలు, డ్యాన్సులు మీటింగుల్లో ప్రదర్శించేవాళ్లం. అవసరానికనుగుణంగా.. అప్పటికప్పుడు పాటలు రాసి పాడే వాళ్లం . ప్రదర్శించేవాళ్లం. ఈ సమయంలోనే.. ముకుందం, పి నిర్మల, భూపాల్, భూపాల్‌డ్డి పేర్లతో..విస్తృతంగా కవితలు, పాటలు, నాటికలు రాశాను. ప్రతి జీవనాడి పత్రికలో నావి ఒకటి రెండు పాటలు, కవితలు ఉండాల్సిందే.

ఈ సందర్భంలోనే మా పక్క బజారులోనే ఉంటున్న చెరబండరాజు గురించి, జ్వాలాముఖి గురించి విన్నాను. ఒక రోజు మంగలి షాపులో కటింగ్ కోసం వెళ్లాను. అప్పుడే వచ్చిన ఒకతనికి నన్ను చూపిస్తూ.. ఈ పిల్లగాడు కూడా ఏదో రాస్తుంటడు, పాడ్తుంటడని చెప్పి పరిచయం చేశాడు షాపు అతను. అదే చెరబండరాజుతో నా తొలి పరిచయం. ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ మీటింగులో నేను నాబృందం కళా ప్రదర్శనలిచ్చాం. చెరబండరాజు వక్తగా వచ్చాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను రాసిన జానపద ప్రేమ గీతం పాడాము. ఇది విన్న చెరబండరాజు.. ‘ఆ పాటతో ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనంతా కొట్టుకుపోయింది’ అని చెప్పి వెళ్లాడు. దానిపై సీరియస్‌గా ఆలోచించాను. జరిగిన తప్పును తెలుసుకున్నాను. ఆనాటినుంచీ.. వెను తిరిగి చూడలేదు. ఏది రాసినా, పాడినా.. శాస్త్రీయతకు దూరంగా ఉండేదేదీ రాయలేదు. మూఢత్వాన్ని, దోపిడీని ఎదిరించే ఇతివృత్తంతోనే రాశాను. రాస్తున్నాను.

ప్రః జననాట్యమండలి ఫౌండర్ మెంబర్ అంటారు కదా..దాని గురించి చెప్పండి.
Bhoopa-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసరిగ్గా యాదికిలేదు. కానీ.. చెరబండరాజు తన స్వంత ఊరు ఘట్‌కేసర్ దగ్గరి అంకుశాపురంలో ‘మే డే’ ఏర్పాటు చేశాడు. దానికి మా బృందంతో ప్రదర్శన ఇవ్వడానికి రమ్మని పిలిచాడు. దానికి విఠల్ అనే అతను కూడా వస్తున్నాడని చెప్పాడు. అప్పటికే గద్దర్ అనే పేరును విన్నాను కానీ.., విఠలే గద్దర్ అని ె లువదు. నాట్రూపుతో నేను ఉప్పల్ లో బస్సు ఎక్కాను. ఘట్‌కేసర్‌లో దిగాను. మాతోపాటే.. అసలే పొడుగు, నెత్తిపై పొడుగాటి టోపి పెట్టుకొని ఒకతను(ఆ తర్వాత తెలిసింది అతనే బి. నర్సింగరావు అని), ఓ పొట్టి దుబ్బటి మనిషి దిగారు. దిగి అంకుశాపురం బాట వైపు నడిచి వెళ్తున్నాం. వారూ మా వెంటే వస్తున్నారు.

చెరబండరాజు చెప్పిన పేరు గుర్తుంది కదా..‘ విఠల్ అంటే మీరేనా..?’ అని అడిగాను. అప్పుడు ఆయన ‘ఎందుకు , ఎవరు చెప్పార’ంటూ..మమ్ములను పట్టించుకోకుండా... ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఏమైతే నేం .. చివరికి అంకుశాపురం చేరుకున్నాం. ప్రోగ్రాం ఇచ్చాం. అంతా అయిపోయిన తర్వాత జనం లేచిపోతలేరు. జనం ఎంతకూ వెళ్లిపోతలేరని జనగనమణ పాడారు. ఆతర్వాత నేను తీవ్రంగా విమర్శ పెట్టాను. చెరబండ రాజు తన విమర్శను ఒప్పుకొని జనాన్ని లేచిపొమ్మనడానికి మా దగ్గర మాకు తెలిసిన ఆయుధమేదీ లేదని చెప్పి తప్పు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన వెంటనే ‘మీరు గద్దర్ కదా’ అని అడిగాను. అప్పుడు ‘అవును నేనే గద్దర్’ అని కావలించుకున్నాడు. అలా ఏర్పడ్డ మా పరిచయంతో నేను ఎప్పుడూ కలుస్తుండే వాడిని.

అప్పటికే వారు బి. నర్సింగరావు, గద్దర్ , బాలయ్య, తదితరులు కలిసి ఆర్ట్ లవర్స్ నుంచి జననాట్యమండలిగా రూపు దిద్దుకుంటున్న క్రమం. నర్సింగరావు ఇంట్లో ఎప్పుడూ.. ఏదో ఒక రిహార్సల్ నడుస్తూ ఉండేది. ఎవవరో వచ్చిపోతుండే వారు. సీరియస్ రాజకీయ చర్చలు, విప్లవ రాజకీయాలను పాటల్లో ఎలా చెప్పాలనే దానిపై చర్చలు జరిగేవి. ఎంచుకున్న పాట, నాటికలకు డ్యాన్స్ కంపోజ్ చేసే వాళ్లం. ‘నువ్వు కూడా పాటలు రాస్తవట కదా.. ఓ పాట రాసుక రా’ అన్నడు నర్సింగరావు. తెల్లారే నేను ‘గొల్లకుర్మ గోత్రమింటవా ఓ రబ్బిగా గొల్లోనీ బాధలింటవా’ పాట రాసుకొని తీసుక పోయిన. దాన్ని చూసి గద్దర్, నర్సింగరావు ఎగిరి గంతేసిండ్రు. ‘మాకో గొప్ప కవి దొరికిండ’ని ఎంత సంతోషించిండ్రో. ఆనాటి నుంచి.. జనానాట్యమండలి కళావూపదర్శనల్లో.. డ్యాన్సుల రూపకల్పనలో నాది విడదీలేని పాత్ర. బహుశా ఇదంతా 74 చివరి కాలం అనుకుంటా.

ఇలా జెఎన్‌ఎంలో భాగంగా.. ఇంటినీ, చదువునూ వదిలి పాటనే జీవితంగా స్వీకరించాను. శ్రీకాకుళం ఏరియాలో జెఎన్‌ఎం కార్యక్షికమాలు ఇవ్వడం కోసం వెళ్లాము. సరిగ్గా అప్పుడే ఎమ్జన్సీ ప్రకటించారు.మమ్మల్నందర్నీ అరెస్టు చేసి పార్వతీ పురం కేసు పెట్టి వైజాగ్ జైలులో నిర్బంధించారు. ఓ నెల రోజుల తర్వాత బెయిలు పై విడుదలయ్యాం.

ప్ర: మీరు మరిచిపోలేని ఘటనలను కొన్ని చెపుతారా..?
కేసులకు హైదరాబాదునుంచి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. మాకు పార్టీ వాళ్లు ఎవరూ కలిసే పరిస్థితిలేదు. ఎమ్జన్సీ చీకటి రోజులు. ఎవరి దగ్గర పైసలు లేవు. మా అమ్మ గుండ్లు, కమ్మలు గిరి పెట్టి కేసులకు తిరిగినం. చివరికి ఇక కేసులకు తిరగలేక బెయిల్ ను రద్దు చేసుకొని జైలుకు పోయినం. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలసూరి కృషితో మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యాం. అయితే.. మాదగ్గర చిల్లి గవ్వ లేదు. ఏం చేయాల్నో తోచలేదు. వెంటనే నేను నాదగ్గరున్న తువ్వాలను జోలెగా చేసి పాటలు పాడుతూ.. జైలు దగ్గర నుంచే ప్రదర్శన ఇస్తూ.. చందాలు అడిగినం. ‘అయ్యాలారా.. అమ్మలారా మేం బిచ్చగాళ్లం కాదు. జనం కోసం పాటలు పాడే జననాట్యమండలి కళాకారులం.

ప్రభుత్వం మమ్ములను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించింది. మీరే ఆదుకోవాల’ని టీమ్ లీడర్‌గా నేను స్ట్రీట్ మీటింగుల్లో మాట్లాడేవాణ్ణి. జనం తమకున్న దాంట్లో ఎంతో కొంత మాకు సాయం చేసేవారు. మాకు డబ్బు చింత తీరిపోయింది. ఇక్కడే మరో విషయం గురించి చెప్పుకోవాలి. మేం అలా రోడ్డు వెంట పాటలు పాడుతూ , ఉపన్యాసాలిస్తూ.. పోతుంటే.. ఓ భిక్షగాడు వచ్చి తనదగ్గర అయిదు పైసలే ఉన్నాయని, అందులోంచి మూడు మీరు తీసుకొని నాకు రెండు పైసలు ఇవ్వండని కోరాడు. అంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నందుకు అపరాధ భావంతో తల దించుకొని వేడుకున్నాడు. ఇది చూసిన నేను నిజంగా కన్నీటి పర్యంతమయ్యాను. ప్రజల ప్రేమ ఎంత గొప్పదో.., ప్రజలు విప్లవాన్ని ఎలా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారో అప్పుడే అర్థం అయ్యింది. నేటికీ.. ప్రభుత్వాలు ఎంత నిర్బంధాలు పెట్టినా, ఏ నిషేధాలు విధించినా.. ఎన్‌కౌంటర్లు చేసినా ఉద్యమం విస్తరిస్తూనే ఉందంటే.. ప్రజల ప్రేమనే.

అలాగే..జెఎన్‌ఎం బృందంతో.. నేను అనంతపురం జిల్లాలో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చే టప్పుడు నెల రోజులు పరిటాల శ్రీరాములు మాతోనే ఉన్నడు. ఆయనసాంగత్యం ఎప్పటికీ మరువలేనిది. అలాగే.. గుంటూరులో ప్రదర్శనలిచ్చేటప్పుడు పోలీసులు మా ట్రూపునంతా అరెస్టుచేసి రోడ్డుమీదనే రక్తాలు కారేటట్లు కోడుతూ తీసుకెళ్తుంటే..మేం ఆ దెబ్బలు తింటూనే విప్లవ పాటలు పాడుకుంటూ.. పోయాం. ఆ దెబ్బలు ఇప్పటికీ వీపుపై ఉన్నాయి. ఇలా ఎన్నెన్ని జ్ఞాపకాలు. చిత్రహింసల కొలిమిలో ఎరుపెక్కిన పగడమై తేలి వచ్చిన రోజుపూన్నో.., నాతోపాటు అనేక సందర్భాలలో సహచరులుగా పనిచేసిన వారు ఈ దేశ ఉత్తమ పుత్రులు ఎందరో.. ఒక్కొక్కరు నేల కొరుగుతుంటే.. నిదురలేని రాత్రుపూన్నో...

ప్ర: జననాట్యమండలి , విరసం సభ్యుడిగా ఉన్న మీరు పిల్లల సాహిత్యం వైపు రావడానికి కారణం?
చిన్పప్పుడు నేను కోల్పోయిన బాల్యమే కారణం కావచ్చు . నేను రాసిన సీరియస్ కవిత, పాటల్లోనూ ఒకటో రెండో పిల్లలపాటలు కూడా ఉన్నాయి. బహుశా.. నేను కోల్పోయిన బాల్యం నుంచి.. పిల్లలపట్ల విపరీతమైన ప్రేమ. నేటి సమాజంలో పిల్లలు అనుభవిస్తున్న హింస చూసి తట్టుకోలేను. నరకం ఉంటదో ఉండదో నాకు తెలువదు. కచ్చితంగా ఇది నరకమే. పిల్లలకు ఆనందం ఇవ్వని సమాజం నరకంతో సమానం.

మీ పిల్లలు ఏం చేస్తున్నారు?
మా పిల్లల చదువుల కోసం ఎనభైల చివరిదాకా.. చాలా కష్టపడ్డాను. వారి డిగ్రీలు, చదువులు పూర్తయ్యేదాకా.. ఎదురైన పనినల్లా చేశాను. చదువులు పూర్తయ్యాయి. బిడ్డ, కొడుకు జీవితంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత పిల్లలు నన్ను చదివించారు. నేను 1985 లో డిగ్రీ చదివాను. తరువాత పీజీ చేశాను. పొట్లపల్లి రామారావు రచనలు , వ్యక్తిత్వం పై పీహెచ్‌డీ చేశాను.

మీరు ఎదుర్కొన్న సంక్షిష్టమైన పరిస్థితులు?
నేను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. అనేక మంది జననాట్యమండలి పాటలను ఓట్లకోసం ఎన్నికల పార్టీలకు తిరగ రాసివ్వమని అడిగారు. రాసివ్వనని కరాఖండిగా చెప్పాను. అలాగే.. దాసీ, కొమురం భీమ్ సినిమాల తర్వాత నన్ను ఒకరిద్దరు నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో నటించమని అడిగారు. అడిగినంత ఇస్తామన్నారు. కానీ.. నాకేమీ వద్దు. కమర్షియల్ సినిమాల్లో నటించనని చెప్పేశాను. ఇప్పటికీ.. , ఎప్పటికీ ఇలాగే ఉంటాను. డబ్బులకు లొంగిపోను. విలువలకు తిలోదకాలివ్వను.

చివరగా...ఈ సందర్భంలో మీకు వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి మీ స్పందన?
ఈ ప్రశ్న అడగగానే.. మౌనంగా..గంభీరంగా మారిపోయాడు. నేలవైపు చాలా సేపు చూసి.. గుడ్లనిండ నీళ్లతో.. మాట పెకలలేని స్థితిలో... ‘నాకు బాలల సాహిత్యానికి గాను అవార్డు వచ్చినందుకు సంతోషం! మధ్యభారతంలో.., దండకారణ్యంలో రాజ్యం ఇనుప బూట్ల కింద నలిగిపోతున్న ఆదివాసీ పిల్లల బాల్యం, రాజ్య క్రూరత్వం గుర్తుకు వస్తున్నది. నా ఈ కన్నీటికి తావులేని సమాజం కోసం మరింత బాధ్యతగా పనిచేస్తాన’ని కారుతున్న కన్నీటి చుక్కల సాక్షిగా శపథం చేశాడు భూపాల్.

35

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Wed,December 26, 2018 04:24 PM

సెల్ టవర్లతో ఆరోగ్యానికి ముప్పు

జనావాసాల మధ్య సెల్ టవర్ల నిర్మాణం చేపట్టవద్దని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థతో సహా అనేక ప్రజా సంక్షేమ సంస్థలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి.

Published: Wed,December 26, 2018 03:42 PM

ఒబామాకు మోదీ చాయ్!

యూపీఏ హయాంలో అణు ఒప్పందం దేశ ప్రయోజనాలకు భంగకరమని భావించి నాడు దాన్ని అటకెక్కించారు. దానికి ఆమోదం తెలిపే క్రమంలో మన్మోహన్‌సింగ్ ప్

Published: Wed,December 26, 2018 04:20 PM

వస్తుమయ విధానాలే పర్యావరణానికి చేటు

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ మంతటా వాడవాడలా పర్యావరణం గురించి సభలు, సమావేశాలూ, చర్చాగోష్టులు జరుగుతున్నాయి. ఉపాన్యాసా

Published: Wed,December 26, 2018 04:47 PM

తెలంగాణ ఉద్యమం-విజయాలు

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది.స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు అరవై ఏళ్లుగా చేస్తున్న పోరాటం విజయం సాధించింది. ఈ సందర్భంగా

Published: Wed,December 26, 2018 04:09 PM

మహాకవిగా మావో..

నవ చైనా నిర్మాతగా, జన చైనా విప్లవ నాయకుడిగా మావో వేల పేజీల వచన రచన చేశాడు. అందులో సిద్ధాంత వ్యాసాలున్నాయి. ఆచరణాత్మక సమస్యలను పరి

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు