ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!


Mon,December 17, 2012 01:46 AM


ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓ సాధారణ మనిషి కూడా ప్రతీకారంతో హింసోన్మాదిగా ప్రాణాలు తీస్తున్నాడు. ఒకమనిషి విషయంలోనే ఇంతటి ప్రమాదం ఉంటే, రాజ్యమే ప్రతీకారానికి దిగితే..ఉన్నపళాన మనిషి తీవ్రవాదిగా ముద్రవేయబడి మాయమవుతాడు.ఎన్‌కౌంటర్ అవుతాడు. మానవ హననాలు జరిగిపోతుంటాయి. శాంతియుతంగా ఉద్యమించినా ఒక్కో వ్యక్తిపై 700 కేసులు నమోదవుతాయి! మనిషన్న వాడు తల దించుకునే విధంగా ప్రవర్తించి చిత్రహంసలతో మనిషిని హింసించిన వాడికి దేశంలో అత్యున్నత పురస్కారం అందుతుంది! ఈ నేథ్యంలోనే దేశంలో ఎంత హింస జరుగుతుందో చూస్తున్నాం. దీనికి ప్రజలు ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో అనుభవిస్తున్నాం. ఇవ్వాళ దేశంలో జరుగుతున్న అనేకానేక ఘటనలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.పోలీసులు చెబుతున్నట్లు జూన్ 28న జరిగిన ‘బాసగూడ హత్యాకాండ’ కాకతాళీయంగా జరిగింది కాదు. కూంబింగ్‌కు వెళ్లిన బలగాలకు సమావేశమైన మావోయిస్టులు తారసపడితే ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని, 20 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు చెప్పారు. కానీ.. నిజానికి ఆ ఘటన వెనక పెద్ద ప్రతీకారగాథనే ఉన్నది. బస్తర్ డివిజన్‌లో బాసగూడ చిన్న పట్టణం. పోలీస్‌స్టేషన్, ఒక ఔట్‌పోస్టు ఉన్నాయి. బాసగూడకు దగ్గరలోని లింగగిరి దగ్గర ఓ నీటిపారుదల ప్రాజెక్టు ఉం డేది. బాసగూడ చుట్టూ ఉన్న ఏడెనిమిది గ్రామాలకు సాగు, తాగునీరందించేది. అది ఇరవై ఏళ్లకిందట తెగిపోయింది. తెగిన కట్టను పూడ్చలేదు. ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. అప్ప టి నుంచి ఆ ప్రాంతమంతా కరువు కాటకాలకు నిలయంగా మారింది. తాగు, సాగునీరు లేక ఆదివాసులు అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లోనే ఆ ప్రాంతానికి (1998లో) దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (డీఏకేఎంఎస్) వచ్చింది. ఆదివాసీ సమస్యలపై అనేక పోరాటాలుచేసింది. ఆ ప్రాం తానికి ఉన్న నీటి సమస్య పరిష్కారం కోసం గిరిజనులతో చర్చించి లింగగిరి ప్రాజెక్టును పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించింది.40వేల రూపాయల ఫండ్‌ను సమకూర్చింది.

పరిసర ఆదివాసీ గ్రామా లనుంచి 400 మందిని ఏకం చేసి తెగిన కట్టను పూడ్చడానికి పూనుకున్నది. 26 రోజులు రాత్రింబగళ్లు కష్టపడి ఆనకట్టను పూడ్చారు. ఈ పనిలో పాల్గొన్న ఆదివాసులకు 52 క్విం టాళ్ల బియ్యం పంచారు. ప్రజలు స్వ చ్ఛందంగా కదిలి ప్రాజెక్టును నిర్మాణం చేసుకోవడం చూసిన ప్రభు త్వం తన పట్టు సడలిపోతున్నదని రాత్రికి రాత్రి ఆ ప్రాజెక్టు కోసం 20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లులేని సాయం ఇప్పుడెందుకని ఆదివాసులు స్థానిక నేతలను, ప్రభుత్వ అధికారులను నిలదీశారు. ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించారు. అంతటితో ఆగకుడా దండకారణ్యంలో డీఏకేఎంఎస్ నాయకత్వంలో 110 చెరువులు, నాలుగు చెక్ డ్యాంలు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వానికి గిట్టలేదు. తమ సాయాన్ని తిరస్కరించి మావోయిస్టుల నాయకత్వంలో అభివృద్ధి కార్యక్షికమాలను నిర్వహించుకోవటం ప్రభుత్వం సహించలేకపోయింది. ఆదివాసులపై కక్షగట్టి అదను కోసం ఎదురుచూసింది. ఎలాగైనా గిరిజనులకు తగిన శాస్తి చేయాలని కత్తిగట్టింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాగానే విత్తనాల పండుగ నిర్వహణ, కొత్త కుటుంబాలకు భూ పంపకం కోసం జూన్ 27 రాత్రి ఏడు గంటల ప్రాంతంలో బాసగూడకు కూతవేటు దూరంలో సొర్కెగూడ మరో రెండు గ్రామాల మధ్య సమావేశమయ్యారుపతీకారంతో అదనుకోసం ఎదురు చూస్తున్న పోలీసులకు విషయం తెలిసింది. అంతే.. నలువైపుల నుంచీ చుట్టుముట్టి వెన్నెల రాత్రిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురు విద్యార్థులు, పసి పిల్లలతో సహా 17 మంది గిరిజనులు చనిపోయారు. ఇదీ బాసగూడ రక్త చరిత్ర. ప్రభుత్వం ప్రతీకారంతో చేసిన హత్యాకాండ.


బాసగూడ ఉదంతం ఒకటి మాత్రమే రాజ్య ప్రతీకారానికి నిదర్శనం కాదు. ఇవ్వాళ దేశంలో ఘటనలన్నింటిలోనూ రాజ్య ప్రతీకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. శాంతియుత ఉద్యమాలపై బుల్లెట్లు కురిపించడంతోపాటు ఆ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఉద్యమకారులపై లెక్కలేనన్ని కేసులు పెట్టి హింసిస్తున్నది. ఒక్కొక్కరిపై వందలాది కేసులుపెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇలాంటి గాథ ల్లో ఒకటి- ప్రఫుల్ల సమంతరది. దేశంలో మొదటి తరం పౌరహక్కుల నేత లోక్‌నాయక్ జయవూపకాశ్ నారాయణ్ పిలుపుతో నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో దూకాడు. 1975 ఎమర్జెన్సీకాలంలో ఏడాది పాటు నిర్బంధింపబడ్డాడు. అప్పుడు ఆయనను దేశమంతా పౌరహక్కుల ఉద్యమ యువకిశోరంగా కీర్తించింది. ఎమ్జన్సీ చీకటి రోజుల్లో వెలుగులు పంచిన యోధుడుగా ఆదర్శంగా చెప్పింది. కాలం గడిచింది. ప్రభుత్వాలు మారాయి. పాలకులూ మారారు. సమంతర ఆనాటి నుంచి నేటిదాకా జయవూపకాశ్ నారాయణ్ బాటలోనే నడుస్తున్నాడుపజాపక్షపాతిగా నిరంతంరం ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాడు. ‘లోక్‌శక్తి అభియాన్’ ఒడిషా చాప్టర్ అధ్యక్షుడిగా ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ప్రజాపోరాటాల జాతీయ సమన్వయ కమిటీ కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తూ.. ఒడిషాలో బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్న వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడు. ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేస్తూ జీవన విధ్వంసానికి పాల్పడటం తగదని వాదిస్తున్నాడు. దీంతో ప్రభుత్వం ఆయనను టెర్రరిస్టుగా ప్రకటించింది. దేశవూదోహిగా ముద్రవేసి తీవ్రవాదిగా ప్రకటించింది. 200లకు పైగా కేసులు మోపి జైలు పాలు చేసింది. ఇది ఈ ఒక్క ప్రఫుల్ల సమంతర పరిస్థితి మాత్రమే కాదు. కూడంకుళం అణు రియాక్టర్‌కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న ఎస్‌పీ ఉదయ్‌కుమార్‌పై ప్రభుత్వం 700 కేసులు పెట్టింది.

ఆయన అనుచరుడు పుష్పరాయన్‌పై 325 కేసులు బనాయించింది. శాంతియుతంగా సమువూదతీరంలో నిరసనలు తెలుపుతున్న మూడువేల మందిపై ప్రభుత్వం వేలాది కేసులు పెట్టింది. విశాల్ పాటిల్‌ది మరో విషాద గాథ. విశాల్ 20 ఏళ్లుగా ప్రజలపక్షాన పోరాడుతున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నిర్మించ తలపెట్టిన జైతాపూర్ అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. దీంతో అక్కడి పోలీసులు ఆ ప్రాంతానికి పోవద్దం టూ నిషేధం విధించారు. అయినా విశాల్ పాటిల్ బురఖా వేసుకుని ప్రజలకు నాయకత్వం వహించి ఎనిమిదివేల మందితో ధర్నా నిర్వహించారు. దీంతో..ఆమెను మహారాష్ట్ర పోలీసులు రకరకాల నేరారోపణలతో అరెస్టు చేశారు.అరెస్టుచేసి నాన్ బెయి లబుల్ కేసులు, దేశవూదోహ నేరం మో పి జైలుకు పంపారు. ఇక అభయ్ సాహూది మరోగాథ. మొదటి నుంచీ తనకు నచ్చిందేదో చేసుకుపోతుంటాడు. గనుల వెలికితీత పేరుతో ప్రజలను నిర్వాసితులను చేయడం ఆయనకు అన్యాయమనిపించింది. వారిని ఏకం చేసి ‘పోస్కో ప్రతిరోధ్ సంగ్రా మ్ సమితి’ ఏర్పాటు చేసి ఒడిషాలో అనేక పోరాటాలు చేశాడు. పోస్కో కంపెనీ కోసం నాలుగువేల ఎకరాల పంటభూమిని ప్రజల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని అక్రమమన్నాడు. ఆయనపై సీఆర్‌పీసీలో ఉన్న అన్ని రకాల సెక్షన్‌లతో 50 కేసులు మోపారు. మధ్యవూపదేశ్‌కు చెందిన సునిలాం ఉదంతం మరోటి. మధ్యవూపదేశ్‌లో అభివృద్ధి కార్యక్షికమాల పేరుతో రైతుల నుంచి భూములు గుంజుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించాడు.‘కిసాన్ సంఘర్ష్ సమితి’ని స్థాపించి రైతు హక్కుల కోసం గొంతువిప్పాడు. దీంతో ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేశారు. 133 కేసులు బనాయించారు.ఫాసిజానికి మరో రూపమే ప్రతీకార స్వభావంతో కూడిన రాజ్యపాలన. ఇవ్వాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులం ఎక్కడలేని అసహనం పుట్టుకొస్తున్నది. హక్కుల మాటెత్తుతున్న వాళ్లనంతా మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా ముద్రవేస్తున్నారు. దేశంలో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న హక్కుల ఉద్యమ స్ఫూర్తిని నిరాకరిస్తున్నారు. 1931లో హిజ్లీ జైలులో రాజకీయ ఖైదీలపై కాల్పులు జరపడాన్ని ఖండిస్తూ కలకత్తాలో రవీంవూధనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ‘సిటిజన్స్ కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్’ సంస్థను ఏర్పాటు చేసి పౌరహక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించారు. సరిగ్గా 82ఏళ్ల తర్వాత జైలులో ఉన్న రాజకీయ కార్యకర్తల విడుదల కోసం సీఆర్‌పీపీ నాయకత్వంలో హైదరాబాద్‌లో సభ జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. నాటి తెల్లదొరల ప్రభుత్వాన్ని తలదన్నే రీతిలో ప్రజల హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తున్నది.ఈ రాజ్య దమననీతికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అణచివేతనే ఆయుధంగా ఎంచుకున్న పాలకుల విధానాలను ఎదిరించాలి. స్వావలంబన, స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడు తున్న ప్రజలకు అండగా నిలవాలి.

-ఎస్.మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు