పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు


Sun,November 18, 2012 10:41 PM

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కేంద్రంగా తెరమీదికొచ్చింది. భారత పాలక వర్గాలు సరిగ్గా 62 ఏళ్ల కిందట మొదలుపెట్టిన కుట్రాజకీయం మళ్లీ.. నగిశీలు చెక్కుకుని నగ్నంగా దర్శనమిచ్చింది. భూమిపై అధికారం కావాలని నినదిస్తున్న 40వేలమంది ఆదివాసులు, పేద రైతుల ఆందోళనను చూసి కేంద్ర ప్రభుత్వం ముచ్చట పడింది. మురిసి పోయింది. ‘ఇటీవల ఇంత మంచి ఉద్యమం రాలేద’ని పరవశించిపోయింది. ‘ఈ నకమశిక్షణాయుత)పోరాటాన్ని చూసి భారతావని ముగ్దురాలవుతున్నద’ని పులకించిపోయింది. ప్రధాని మన్మోహన్, చిదంబరం లాంటి ప్రపంచ బ్యాంకు మానస పుత్రుల పాలనలో ప్రజా ఉద్యమాలను ముఖ్యంగా ప్రజా, ఆదివాసీ ఉద్యమాలను ‘అంతర్గత భద్రతకు ముప్పు’గా భావించే చోట ఈ మెచ్చుకోలు చూసి దేశం విస్తుపోయింది.

ఆదివాసులు దుక్కులు దున్నుకునేందుకు సమావేశమయితేనే ‘బాసగూడ’లు సృష్టిస్తున్న ప్రభుత్వం 40 వేల మందితో కూడిన ‘జనసత్యాక్షిగహా’న్ని చూసి ఎందుకు మురిసిపోయింది? ఇక్కడ నే ఉన్నది పాలకుల (కుటిల)నీతి. ఇదే.. భారత పాలకులు ఆరు దశాబ్దాలుగా అమలు చేస్తున్న కుట్ర.అది.. చైనాలో గ్రామీణ ప్రాంతాలను విముక్తం చేసి పట్టణాలను చుట్టిముట్టే లక్ష్యంతో..దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సందర్బం.లాంగ్‌మార్చ్‌తో శత్రు దాడులను వమ్ము చేస్తూ అప్రతిహతంగా చైనా విప్లవ పోరాటం సాగుతున్న రోజులు. చైనామీదుగా వీచిన ఈ తూర్పు పవనాలు ప్రపంచాన్నంతా ఉత్తేజపరుస్తున్న కాలం.ఆ ఉదయ కిరణాల వెలుగుల్లో.. నిజాం ఫ్యూడల్ ప్రభువును గద్దెదించడమే కాదు, ‘దున్నేవానిదే భూమి’నినాదంతో ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. మూడు వేల గ్రామాల్లో ఎర్ర జెండాపూగరేసింది. పదిలక్షల ఎకరాలను ప్రజలకు పంచింది.

రాజ్యాధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టింది.ఈ తెలంగాణ విప్లవ కాంతులు దేశ నలుమూలలా విస్తరిస్తూ..నిజమైన విముక్తికి తెలంగాణమార్గమే దిక్సూచిగా మారింది. దీంతో జమీందార్లూ జాగిర్దార్లు మొదలు ఢిల్లీలోని యూనియన్ ప్రభుత్వానికి కూడా భయం పట్టుకుంది. తెలంగాణ పోరాటమే దేశమంతా విస్తరిస్తే.. ఈ ఊహనే భారత పాలకులకు వెన్నులో వణుకు పుట్టించింది. ఈ నేపథ్యంలోనే1947 ఆగష్టు 15 అధికార మార్పిడీ.. నైజాం రాజుతో ‘యథాతథ ఒప్పందం’ చేసుకున్న తర్వాత కూడా భారత యూనియన్ సైన్యాలు తెలంగాణపై దండెత్తుకొచ్చాయి. నాలుగువేల మంది కమ్యూనిస్టు యోధులను, ప్రజలను ఊచకోత కోశాయి. మహత్తర తెలంగాణ పోరాటం ఊచకోతలు,నిర్బంధాలతో ప్రతిబంధకాలను ఎదుర్కొన్నది. దీంతో పోరాటాన్ని చైనా మార్గంలో దీర్ఘకాలిక సాయుధ పోరాటంగా మలిచి కొనసాగించాలా, విరమించాలా అన్న మీమాంస కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నెలకొన్నది. కమ్యూనిస్టు పార్టీ వర్గపునాది, నెహ్రూ కోటు మీది ఎర్రగులాబీ మీద పెంచుకున్న భ్రమలు, వర్గ సంకర రాజకీయాలూ..

చివరికి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం సాయుధపోరాటాన్ని విరమించింది. కానీ..తెలంగాణ సాయుధ పోరాట జ్వాలలు దేశంలో అటు కేరళ మొదలు బీహార్, బెంగాల్ దాకా విస్తరిస్తున్న ఆనవాళ్లు పాలకులకు కనిపించాయి. దీంతో.. తెలంగాణ సాయుధపోరాట చైతన్యాన్ని, ఆచరణాత్మక సందేశాన్ని నీరుగార్చేందుకు, దారి మళ్లించేందుకు భారత పాలక వర్గం పెద్ద పథకమే రచించింది . దీనికోసం తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రంగా ఉన్న నల్లగొండ జిల్లానే ఎంచుకున్నది. హైదరాబాద్‌కు ఆమడ దూరంలో ఉన్న పోచంపల్లిలో కుట్రాజకీయానికి పాలకులు తెరలేపారు. దీనిలోభాగంగానే 1951 ఏప్రిల్ 18న ఆచార్య వినోబాబావే రంగం మీదికి వచ్చారు.‘భూదాన్‌యజ్ఞం’ పేర పేద ప్రజలు భూముల కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదని, భూస్వాములు దొడ్డవారని, వారిని బుజ్జగించి యాచిస్తే తమ భూములను పేదలకు పంచి పెడతారని హితబోధ చేశారు. పోచంపల్లిలోని రెక్కాడితే డొక్కాడని దళితులను 40 మందిని పిలిచి మీకు బతకడానికి ఎంత భూమి కావాలని అడిగారు. తమకు తలా రెండెకరాల చొప్పున 80 ఎకరాలు చాలని విన్నవించుకున్నారు.వినోబాబావే బోధనలతో గుండెకరిగిన భూస్వామి తన దగ్గరున్న వందెకరాల భూమిని పేదలకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.‘చూశారా! దొరలు, భూస్వాముల బందీగా ఉన్న భూమిని ఎంత సులువుగా సాధించ వచ్చో’ అంటూ.. దేశ నలుమూలలా భూస్వాముల భూములను పేదలకు పంచే కార్యక్షికమాన్ని (భూదాన్ యజ్ఞాన్ని)నిర్వహించారు.

అలా బీహార్‌లోనూ, మధ్యవూపదేశ్‌లోనూ వినోబాబావే గిరిజనులకు కూడా భూమి పట్టాలు పంచిపెట్టారు. వినోబాబావే భూదానోద్యమాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి పోరాటాల అవసరం లేకుండానే దొరలు, భూస్వాముల భూములను పేదలకు పంచవచ్చని చెప్పుకొచ్చారు.నాలుగువేల మంది నెత్తుటి త్యాగాలతో నిర్మించిన తెలంగాణ పోరాట సంప్రదాయాన్ని అనవసర, అక్కరలేని ఆయాసంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పాలకులు చేసిన ఈప్రయత్నాన్ని ప్రజలు తమ ఆచరణ ద్వారా తిప్పికొట్టారు. దేశవ్యాప్తంగా భూస్వామ్య విధానంలో అర్ధ బానిసలుగా బతుకులీడుస్తున్న కోట్లాది గ్రామీణ పేదలు, రైతు కూలీలు దున్నే వానికే భూమి నినాదంతో పోరు బాట పట్టారు. తేబాగా,తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం, వైనాడ్ మొదలు నక్సల్‌బరీ, శ్రీకాకుళ పోరాటాలా దాకా ప్రజలు భూమి కోసం, భుక్తి విముక్తి కోసం సాయుధ తిరుగుబాట్లు చేశారు. ఉత్తర తెలంగాణలో రగిలిన రైతాంగ పోరాటాలు, జల్ జంగల్ జమీన్ కోసం దండకారణ్యంలో సాగుతున్న విముక్తి పోరాటాల దాకా త్యాగాల బాటలో సాగుతూనే ఉన్నారు.

అయితే భారత పాలకులు పోరాట సంప్రదాయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను విరమించుకోలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త రూపాలతో, ఎత్తుగడలతో తమ పన్నాగాలను పన్నుతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే 1980ల తర్వాత స్వచ్ఛంద సంస్థల పేరుతో ఎన్‌జీవోలను రంగం మీదికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే కుప్పలు తెప్పలుగా దేశంలో 30 లక్షలకు పైగా ఎన్‌జీవోలు మిడతల దండులా దండెత్తాయి. నిజమైన రాజకీయ పోరాటాలను నీరుగార్చే నిపుణులతో దేశమంతా నిండిపోయింది. ప్రతి 400 మందికి ఒక ఎన్‌జీవో కార్యకర్త ఈ రోజు దేశంలో పని చేస్తూ ప్రజలను సమరశీర పోరాటాల నుంచి దారి మళ్ళించేందుకు పల్లె మొదలు పట్నం దాకా చేయాల్సినంతా చేస్తున్నారు. స్వచ్ఛంద కార్యకర్తల ముసుగులో నేర్పరులైన ఉద్యమకారులుగా, ఉద్యమాల మంచిచెడులకు సర్టిఫికేట్లు ఇచ్చే మేధావులుగా చెలామణి అవుతున్నారు.దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా 4లక్షల 80 వేల ఎన్‌జీవోలున్నాయి. ప్రతి ఏటా 40 నుంచి 80వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈనిధుల్లో సింహభాగం బహుళజాతి కంపెనీలవేనని వేరే చెప్పక్కర లేదు.మాటల్లో అభ్యుదయం, చేతల్లో తిరోగమనం చందంగా ఎన్‌జీవోల పన్నాగం సాగుతూనే ఉన్నది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే నూతన ఆర్థిక విధానాలు 1990లో అమలులోకి వచ్చిన కాలంలో పీవీ రాజగోపాల్ ఆధ్వర్యంలో స్విస్‌ఫండెడ్ స్వచ్ఛంద సంస్థ ‘ఏకతాపరిషత్’ (సీఈఎస్‌సీఐ) దేశంలో అడుగుపెట్టింది. 11 రాష్ట్రాల్లో 11వేల ‘కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన’్లతో ప్రజలను సమీకరిస్తున్నది.


ప్రధానంగా మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కేంద్రీకరించి కార్యక్షికమాలను సాగిస్తున్నది. ఏడెనిమిదేళ్లుగా ఆదివాసులను, గ్రామీణ రైతులను భూమిపై హక్కు కావాలనే నినాదంతో ఢిల్లీకి పాదయావూతలు చేస్తున్నది. ఈ పాదయావూతలకు సమరశీల పోరాటాలకు కేంద్రబిందువుగా ఉండే ప్రాంతాలను క్షేత్రంగా ఎంచుకున్నది. ఇప్పటికే ఎనిమిది సార్లు పాదయాత్రలు నిర్వహించిన రాజగోపాల్ 2007లో 25వేల మందితో యాత్ర నిర్వహించారు. అన్నింటికి మించి గత ఆగస్టులో గ్వాలియర్ నుంచి ఢిల్లీదాకా 40వేల మందితో 350 కిలోమీటర్ల దూరం ‘జనసత్యాక్షిగహ’ పేర రోజుకు 25 లక్షల రూపాయల ఖర్చుతో పాదయాత్ర నిర్వహించారు.ఈ జనాలనందరినీ మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరవూపదేశ్ రాష్ట్రాల నుంచి సమీకరించారు. ఒకవైపు ఈరాష్ట్రాల్లోనే ముఖ్యంగా ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో ప్రభుత్వ విధానాలనెదిరిస్తూ పోరాడుతున్నారు. జనతన సర్కార్‌లను ఏర్పరుచుకుని స్వావలంబన విధానాలతో ముందుకు సాగుతున్నారు. జల్ జంగిల్ జమీన్‌పై తమదే సర్వాధికారమని నినదిస్తున్నారు.

దీన్నే‘దేశ అంతర్గత భద్రతకు ముప్పు’గా కేంద్రం చెబుతున్నది. దండకారణ్యం కేంద్రంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాన్ని అణచేందుకు ప్రభుత్వం ‘గ్రీన్‌హంట్’ పేరుతోయుద్ధం ప్రకటించింది.ఆదివాసులను ఊచకోత కోస్తున్నది. పచ్చని అడవిలో నెత్తుటి ఏరులు పారిస్తున్నది. ఇంద్ర మొదలు బాసగూడ దాకా మారణకాండలు సృష్టిస్తున్నది.ఇలాంటి పరిస్థితుల్లో పీవీ రాజగోపాల్ 40 వేల మందితో చేసిన ఢిల్లీ యాత్ర చూసి తమ పాచికలు పారినందుకు కేంద్ర ప్రభుత్వం మురిసిపోయింది. ప్రజలు పోరాట పథం కాదని ఢిల్లీ చుట్టూ తిరిగే ప్రక్రియను వీనుల విందుగా వీక్షించింది. పీవీ రాజగోపాల్‌ను పోలీస్ అధికారులు మొదలు చిదంబరం, జైరాం రమేశ్ దాకా ప్రభుత్వ పెద్దలంతా మెచ్చుకుంటున్నదీ, మురిసిపోతున్నది అందుకే.

దేశదేశాల్లో విప్లవోద్యమాలను నిర్వీర్యం చేసేందుకు అమెరికా, బహుళజాతి సంస్థలు ఎన్నో కుతంవూతాలు చేశాయి. ఈ క్రమంలోనే దేశంలో 90 శాతం పైగా భూభాగాన్ని హస్తగతం చేసుకుని విప్లవ విజయం ముంగిట ఉన్న ఫిలిప్పీన్స్‌లో.. విప్లవోద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు సామ్రాజ్యవాదులు స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపారు. ప్రపంచంలోనే అత్యధికంగా 60వేల స్వచ్ఛంద సంస్థలు ఫిలిప్పీన్స్ సమాజంలో అడుగు పెట్టాయి. చాపకింది నీరులా చేరి విప్లవోద్యమాన్ని ‘ఏదుతిన్న ఎలక్కాయ’ చేశాయి. విప్లవోద్యమాన్ని నిర్వీర్యం చేశాయి. ఈ ఎత్తుగడలనే ఇప్పుడు మన దేశంలో అమలు చేశారు. చేస్తున్నారు. దీంట్లో భాగమే.. మన దగ్గర ఎన్‌జీవోలు కూడా రైతుకూలీ సంఘం పెడతాయి. గద్దర్ పాటను పరమ సుకుమారంగా గానం చేస్తాయి. అస్తిత్వ ఉద్యమాలంటూ అందమైన పోజులు పెడతాయి. సామాజిక విప్లవాలు ఎలా నిర్వహించాలో నిపుణులైన ఉద్యమకర్తలుగా ఉపాన్యాసాలిస్తుంటారు. నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లాంటి అందరికీ ఆమోదయోగ్యమైన అందమైన ముసుగుల చాటున సామాజిక చైతన్యాన్ని ‘చెద’లా ‘చెర’బడతారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజా పోరాటాలను, చైతన్యాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ఈ నాటిదేం కాదు. 1974 నాటి పోర్చుగల్ కార్నేషన్ విప్లవం, జార్జియాలోని గులాబీ విప్లవం, ఉక్రేయిన్‌లోని ఆరెంజ్ రెవల్యూషన్, నిన్న మొన్నటి జాస్మిన్ విప్లవాల దాకా అన్నింటా అమెరికా బహుళ జాతి సంస్థల నీలినీడలే.అంతిమంగా స్వచ్ఛంద సంస్థలు చేసేదంతా సామ్రాజ్యవాదుల పాద సేవే. ఇవన్నీ ప్రజాచైతన్యాలకు పట్టిన సామ్రాజ్యావాదుల చీడ పీడలే. దీనిలో కొనసాగింపే.. గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో ఆదివాసుల వేట కొనసాగుతున్న సమయంలో.. పీవీ రాజగోపాల్ ఢిల్లీకి వేలాది మంది ఆదివాసులతో జనసత్యాగ్రహ యాత్ర.

-ఎస్. మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు