ఒబామా గెలుపు శాంతికి ముప్పు


Sat,December 1, 2012 05:48 PM

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక్షునిగా రెండో దఫా గెలిచారు. ఈ గెలుపుపై సామాజిక శాస్త్రవేత్తల అభివూపాయాలు ఎలా ఉన్నా, మీడియా మాత్రం పెద్ద హంగామానే చేసింది. అయితే ఒబామా గెలుపు అమెరికా వ్యవహారం ఎంత మాత్రమూ కాదు. అది ప్రపంచ ప్రజల కు సంబంధించిన వ్యవహారం. అలాగే ప్రపంచశాంతికి సంబంధించి ఓ సవాల్. రెండోసారి గెలిచిన వెంటనే తమ పార్టీ కార్యాలయంలోని పెద్ద బహిరంగసభలో ‘ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుతా’నని ప్రకటించాడు. అలాగే.. ‘అమెరికా ప్రస్తు తం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కడం కోసం ఎంతటి పనులకైనా సిద్ధ’మని ప్రకటించాడు. దీన్నిబట్టి ఒబామా ఏం చేయబోతున్నాడో ఊహించడం కష్టమేమీ కాదు.

నిజానికి ఒబామా అమెరికా రాజకీయ పటంపైకి రావడమే ఓ కుట్ర. 1930 నాటి ఆర్థిక సంక్షోభం కంటే ఎక్కువగా పీకలలోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా తన సంక్షోభ భారాన్ని ప్రపంచ ప్రజలపై రుద్దేందుకు పథకాలు రచించింది. దేశ దేశాల్లో అంతర్గత కలహాలు, అల్లకల్లోలాలు సృష్టించి ఆయుధ వ్యాపారం చేసింది. ఇరాన్-ఇరాక్ యుద్ధాన్ని దశాబ్దకాలం సాగే ట్లుచేసి ఇరు దేశాలకూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంది. ఇంకా అనేక లాటిన్ అమెరికా,ఆఫ్రికా దేశాల్లో అంతర్గత జాతి కలహా లు సృష్టించి ఆదేశాలను అస్థిరత్వం పాలు చేసి ఆయుధాలను అమ్ముకున్నది. ఇథిహోపియా, సోమాలియా లాంటి దేశాల్లో లక్షలాదిమంది ఊచకోతకు పరోక్షం గా కారణమయింది. తన ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా పాలనా, ఆర్థిక విధానాలను రచించింది. ఆయా దేశాలను ఆకలిదప్పులకు ఎరవేసి లక్షలాది మరణాలకు కారణమైంది. అయినా సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితిలేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు మూల స్తంభంగా నిలుస్తున్న చమురు నిలువలపై ఆమెరికా కన్నేసింది. దీనికోసం మధ్యవూపాచ్య దేశాల్లో విస్తారంగా ఉన్న చమురు నిల్వలను కాజేసేందుకు అరబ్ దేశాలను కబళించేందుకు పావులు కదిపింది. దీనిలో భాగంగా బుష్ పాలనలోనే అరబ్ ప్రపంచంపై యుద్ధం ప్రకటించి ఒక్కొక్క దేశాన్ని కబళించడం ప్రారంభించింది. ఇంకా దుర్మార్గం ఏమంటే.. ‘తన వేలుతోనే తన కన్ను పొడిచే’ నీతిని అమెరికా సమర్థంగా అమలు చేసింది.

కువైట్ పై దాడి సాకుతో ఇరాక్‌పై దాడిచేసిన అమెరికా.. ఆ దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతున్ని చేయడమే కాదు ఆ దేశ నడిబొడ్డున పార్లమెంటు ముందర ఉరితీసి చంపింది. వాస్తవానికి కువైట్ భూభాగం నుంచి చము రు తవ్వకాలను చేస్తూ.. స్లాంట్ డ్రిల్లింగ్ ద్వారా ఇరాక్ భూభాగంలోని చమురు నిల్వలను అక్రమంగా వెలికితీయడం ప్రారంభించింది. పైకి చూడటానికి కువైట్ తన భూభాగం నుంచి చమురును తీస్తున్నట్లుగా కనిపించినా.. అమెరికా తన దగ్గరున్న టెక్నాలజీతో అక్రమ తవ్వకాలు చేస్తూ ఇరాక్‌ను కవ్వించింది.ఇరాక్ ఎన్నిమార్లు హెచ్చరించినా.. కువైట్ వినలేదు. అమెరికా దన్నుతో.. కువైట్ పాలకులు తమ తవ్వకాలను ఇంకా ముమ్మరం చేశారు. దీంతో గత్యంతరంలేక ఎక్కడైతే అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారో ఆ ప్రాంతాలపై ఇరాక్ దాడులు చేసి ఆ తవ్వాకాలను నిలిపేసింది. అలాగే ఆర్థికవ్యవస్థ అంతా చమురు ఎగుమతులపైనే ఆధారపడ్డ ఇరాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం ఒపెక్ దేశాల ఒప్పందాలను కాదని చమురును ఎక్కువగా వెలికి తీసి తక్కువ ధరలకే చమురు ఎగుమతులు చేసి ఇరాక్ ఆర్థిక వ్యవస్థను కునారిల్లే కుట్రలకు అమెరికా పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఇరాక్ కువైట్ భూభాగాలపై దాడి చేసి చమురు వెలికితీతను ధ్వంసం చేసింది. దీన్ని గొరంతను కొండంతగా చేసి, దురాక్షికమణగా చిత్రీకరించి, ఇరాక్‌ను దురాక్షికమణదారు విష ప్రచారం చేసింది. కువైట్ ప్రభుత్వానికి సా యం పేరుతో.. రంగంలోకి దిగిన అమెరికా సేనలు ఇరాక్ లక్ష్యంగా దాడులు చేశాయి. చివరికి ‘ఇరాక్ అంతమే మధ్య ప్రాచ్యంలో శాంతికి రక్షణ’ అంటూ.. ఇరాక్‌ను ఆక్షికమించేందుకు పూనుకున్నది. ఐక్యరాజ్యసమితి యుద్ధ నియమాలన్నింటినీ తుంగలో తొక్కి సామాన్య పౌరులను పొట్టన పెట్టుకుంటూ.. సద్దాం హుస్సేన్‌కు మద్దతుగా ఉంటాయనుకున్న నగరాలన్నింటిని నేల మట్టం చేసింది. లక్షలాది మంది ఇరాకీయులను చంపి రక్తపుటేరులు పారిం చింది. ఈ క్రమంలో అమెరికా తన దగ్గరున్న ఆయుధ సంపత్తినంతా ప్రదర్శించడమే లక్ష్యంగా అత్యాధునిక ఆయుధాలను ఇరాక్ ప్రజలపై ప్రయోగిస్తూ.. ఈ యుద్ధ దృశ్యాలన్నింటినీ ప్రపంచానికి చూపెట్టింది.

విదేశీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చరాదనే ఐక్యరాజ్యసమితి నిబంధనలను కాలరాచి ఏ దేశాన్నైనా ఇలాగే కబళిస్తానని ప్రపంచానికి హెచ్చరికలు పంపింది. అయి తే..బుష్‌లాంటి వారి నాయకత్వంలో అరబ్ ప్రపంచాన్ని కబళిస్తే.. ప్రపంచ ప్రజలు ముఖ్యంగా ముస్లిం ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని అమెరికా భావించింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే.. ఒబామా తెరమీదికి వచ్చాడు. అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఇలా ఒబామా మొదటిసారి గెలిచినప్పుడు లేనిపోని ప్రాసంగికతలను అంటగట్టారు. నల్ల జాతీయుడని, ఓ ముస్లిం అని ఒబామాను ప్రపంచ రాజకీయాల్లో ఓ మంచి మార్పుకు సంకేతంగా చెప్పుకొచ్చారు. కొన్ని దశాబ్దాలుగా పెద్దన్న పాత్రను పోషిస్తూ.. దేశ దేశాల్లో అమెరికా చేస్తున్న జోక్యానికి తెరపడుతుందని ఆశించారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పోలీస్ పాత్ర తగ్గుతుందని భ్రమపడ్డారు.కానీ.. ఆయన పదవి చేపట్టిన ఏడాది కాలానికి గాని అసలు రూపం తెలియలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న బహుళజాతి సంస్థలు ఆడుతున్న నాటకంలో తెరమీదికి వచ్చిన ఓ పావు మాత్ర మేనని తేలిపోయింది. ఒబామా అధ్యక్షుడిగా చేసింది ఏమైనా ఉందంటే.. అరబ్ ప్రపంచాన్ని దేశాలను ఒక్కొక్కటిగా అమెరికా కబళించడమే. ఇరాక్ మొదలు.. లిబియా దాకా.. మధ్య ప్రాచ్యదేశాలన్నింటినీ అమెరికా ఆక్రమించి అక్కడ ఉన్న చమురు నిక్షేపాలపై తిష్టవేసింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆడింది ఆటగా చెలామణి కావాలం కంట్లో నలుసుగా ఇంకా రెండు దేశాలు మిగిలి ఉన్నాయి. అవి ఒకటి ఇరాన్, రెండో ది క్యూబా. ఈ రెండు దేశాలపై యుద్ధం ప్రకటించి పాదాక్షికాంతం చేసుకోవడం ఇంకా మిగిలి ఉన్నది.

ఆ పని కూడా అమెరికా బహుళజాతిసంస్థలు అనుకున్న రీతిలో సజావుగా సాగాలంటే ఒబామా అవసరం. ఇందుకోసమే మరోసారి బారాక్ ఒబామా రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా అవసరమయ్యాడు, గెలిచాడు. ఇక రాబోయే రోజుల్లో ఇప్పటి దాకా హూంకరింపులు, అదిరింపులు, బెదిరింపులతో ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న అమెరికా ఇక యుద్ధ సన్నాహాలు చేయబోతుందన్నమాట. దీనికోసం ఇప్పటికే ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అనేక అంతర్జాతీయ నిబంధనలను కాదని అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించింది. దీంతో ఇరాన్ ప్రజలు, చిన్నారుల సరియైన ఆహార పదార్థాలు, మందులు అందక లక్షలసంఖ్యలో చిన్నారు చనిపోయారు. ఈ ఆంక్షలను అంతర్జాతీయ సమాజం ఎంతగా నిరసించినా అమెరికా పెడచెవిన పెట్టి తన పెద్దన్న పాత్రతో, ఆధిపత్యంతో ఆంక్షలను కొనసాగిస్తున్నది. ఇరాన్ అధ్యక్షుడు నేజాద్ తమ దేశ శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్షికమాలు సాగుతున్నాయని, తమ దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు లేవని అంతర్జాతీయ సమాజానికి చెప్పారు. అవసరమనుకుంటే యూఎన్‌ఓ నాయకత్వంలో ఓ కమిటీ తమ అణు కార్యక్షికమాలను పరిశీలించవచ్చని ఆహ్వానించారు. అయి నా.. అమెరికా వీటన్నింటినీ పెడ చెవిన పెట్టి యుద్ధ సన్నాహాలు చేస్తూ.. బెదిరింపులకు, కవ్వింపులకు దిగుతున్నది. మరోవైపు కొన్ని దశాబ్దాలుగా అమెరికాకు పక్కలో బల్లెంగా పొరుగునే ఉన్న క్యూబా ఉండనే ఉన్నది. ఈ దేశాలను కబళించేందుకు అమెరికా సామ్రాజ్యవాదానికి ఒబామా అవసరం. అందుకోసం ఒబామా చేతిలో మరిన్ని మారణాయుధాలు చేతిలో పెట్టి మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. ఇలా అమెరికా బహుళజాతి సంస్థ లు, పెట్టబడిదారుల చేతిలో ఒబామా ఓ కీలుబొమ్మ.

తన మొదటి దఫా పదవీ కాలాన్నంతా యుద్ధ సన్నాహాలు చేస్తూ.., ప్రపంచ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ.. దేశాలను కబళించి దేశాధ్యక్షులను చంపి ప్రజల ను ఊచకోత కోసి రక్తపు పారించిన ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి తమ ప్రయోజనాలను నెరవేర్చినందుకు సత్కరించిన అమెరికా పెట్టుబడిదారులు ఇప్పుడు మరింత బలంతో ప్రపంచంపైకి ఉసిగొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో రెండోసారి ఒబామా ఎన్నికను శాంతికాముక ప్రపంచ ప్రజలంతా నిరసించాలి. ప్రపంచ ప్రజలపై యుద్ధాలను రుద్దుతున్న అమెరికా సామ్రాజ్యవాదపు పాచికలను దేశ దేశాల ప్రజలు ప్రతిఘటించాలి. అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రపంచం ఏకమవ్వాలి. ఈ అర్థంలో రెండోసారి బారాక్ ఒబామా గెలుపు ఓ ప్రమాద హెచ్చరిక. అమెరికా యుద్ధోన్మాదం ప్రపంచ దేశాలను కబళించే ఓ చీకటి అధ్యాయానికి ప్రారంభం.
-ఎస్. మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Wed,December 26, 2018 04:24 PM

సెల్ టవర్లతో ఆరోగ్యానికి ముప్పు

జనావాసాల మధ్య సెల్ టవర్ల నిర్మాణం చేపట్టవద్దని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థతో సహా అనేక ప్రజా సంక్షేమ సంస్థలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి.

Published: Wed,December 26, 2018 03:42 PM

ఒబామాకు మోదీ చాయ్!

యూపీఏ హయాంలో అణు ఒప్పందం దేశ ప్రయోజనాలకు భంగకరమని భావించి నాడు దాన్ని అటకెక్కించారు. దానికి ఆమోదం తెలిపే క్రమంలో మన్మోహన్‌సింగ్ ప్

Published: Wed,December 26, 2018 04:20 PM

వస్తుమయ విధానాలే పర్యావరణానికి చేటు

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ మంతటా వాడవాడలా పర్యావరణం గురించి సభలు, సమావేశాలూ, చర్చాగోష్టులు జరుగుతున్నాయి. ఉపాన్యాసా

Published: Wed,December 26, 2018 04:47 PM

తెలంగాణ ఉద్యమం-విజయాలు

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది.స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు అరవై ఏళ్లుగా చేస్తున్న పోరాటం విజయం సాధించింది. ఈ సందర్భంగా

Published: Wed,December 26, 2018 04:09 PM

మహాకవిగా మావో..

నవ చైనా నిర్మాతగా, జన చైనా విప్లవ నాయకుడిగా మావో వేల పేజీల వచన రచన చేశాడు. అందులో సిద్ధాంత వ్యాసాలున్నాయి. ఆచరణాత్మక సమస్యలను పరి

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు