ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం


Fri,October 26, 2012 05:39 PM

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు త్వ యాంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రజలను వేపుకుతింటారు. ఖద్ద రు బట్టలూ, రాజకీయ రంగూ పులుముకున్న మాఫియాలే ప్రభుత్వాధినేతలైతే.. అది ఎట్లా ఉంటుందో తెలిసి వచ్చింది. అది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంలా ఉంటుందని అర్థమైంది. ఇప్పటి దాకా దేశంలో జరిగిన, జరుగుతున్న కుంభకోణాలకూ, అధికార దుర్వినియోగానికీ ఢిల్లీలోని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం మొదలుకొని, మన రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ ప్రభు త్వం దాకా చెప్పుకుంటున్నాం. ఆశ్రీత పక్షపాతానికీ, అధికార దుర్వినియోగానికీ పరాకాష్టగా వైఎస్ సర్కార్‌ను చూస్తున్నాం. కానీ.. వీటన్నింటినీ తలదన్ని ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అక్కడ చీకటి రాజ్యాన్ని నెలకొల్పింది. కేవలం ఆర్థిక కుంభకోణాలకు పాల్పడటమే కాదు, తమ దారికి రాని వారిపై కక్షగట్టి రాక్షసపాలనను అమలు చేస్తున్నది.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్న మాటనే అపహాస్యం చేస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌కు దేశంలో సహజవనరులకు పుట్టినిల్లుగా పేరున్న ది. దేశంలో మరే ప్రాంతంలో లేని విధంగా అత్యంత విలువైన సహజవనరులు బొగ్గు గనులు మొదలుకొని బాక్సైట్, ఇనుము, అల్యూమినియం, రాగి, కోబాల్ట్ తదితర లోహాలు అక్కడి భూ గర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. భారతీయ జనతాపార్టీ ఏ ఉద్దేశ్యంతో ఛత్తీస్‌గఢ్‌ను ఏర్పరిచిందో గానీ.. జరుగుతున్న తతంగాన్ని చూస్తే.. సహజవనరుల ను యథేచ్ఛగా లూటీచేసేందుకే అన్నంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. ఛత్తీస్‌గఢ్‌కు రమణ్‌సింగ్ ముఖ్యమంవూతిగా 2003లో అధికారంలోకి వచ్చింది మొదలు పెద్దడేగల కళ్లన్నీ ఛత్తీస్‌గఢ్‌పైనే పడ్డాయి. రాష్టం లో 70వేల ఎకరాలలో విస్తరించి ఉన్న సహజవనరుల నిక్షేపాలను వెలికి తీయడం కోసం ఇప్పటిదాకా బహుళజాతి కంపెనీలు, స్థానిక బడా కంపెనీలతో 108 ఎంఓయూలను చేసుకున్నది. దీంతో.. ఆ కంపెనీలన్నీ.. సహజవనరులపై పడి దోచుకుపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో విస్తారంగా ఉన్న అటవీ సంపదను నాశనం చేస్తున్నాయి. స్థానిక ప్రజలు, ఆదివాసులను నిర్వాసితులను చేస్తూ ప్రజల జీవితాలను ధ్వంసం చేస్తున్నాయి.

అధికారాన్ని అడ్డం పెట్టుకున్న రమణ్‌సింగ్ రాష్ట్రాన్ని సొంత జాగీర్‌గా చేసుకుని, ఇప్పటిదాకా దేశంలో జరిగిన అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగాలన్నింటినీ తలదన్నే విధంగా వ్యవహరిస్తున్నారు. తన అవినీతి అక్రమాలకు అండగా అక్కడి పత్రికా యాజమాన్యాలను పాదాక్షికాంతం చేసుకుని ఆడింది ఆటగా, పాడింది పాటగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా విమర్శనాత్మక గొంతు పెకిలితే..

లొంగదీసుకుంటున్నారు.రాయ్‌పూర్‌లోని ‘పవూతిక’ ఎడిటర్ గిరిరాజ్ శర్మకు ముఖ్యమంత్రి కార్యాలయంనుంచి రెండు పెద్ద గిఫ్ట్ బాక్స్‌లు అందాయి. వాటిని తెరిచి చూస్తే.. ఒకదాని నిండా మంచి నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మరో బాక్స్‌ను తెరిచి చూస్తే.. దానిలో అత్యధునిక వీడియో కెమె రా, 51వేల నగదు, నగిశీలు చెక్కిన ఒక బంగారు కిరీటం ఉన్నాయి. వీటిని ఆయన ముఖ్యమంత్రికి తిరిగి పంపించేశారు. అసలు విషయం ఏమిటంటే.. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ ప్రభుత్వ అక్రమాలను గురించి రాసేది ఈ ఒక్క పత్రిక మాత్రమే. ఈ పత్రిక నోరు మూయించేందుకు ముఖ్యమంత్రి వేసిన గాలం ఈ గిఫ్ట్ బాక్స్‌లని ఎడిటర్ గిరిరాజ్ శర్మ అన్నారు. అవినీతి, అక్రమాలపై తన పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. దీంతో.. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అసలు రూపం ప్రదర్శించారు. మరుసటి రోజే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి పత్రిక కార్యాలయాన్ని తగులబెట్టారు. ఇంతటితో ఆగలేదు ఆయన ప్రతీకారం.. పత్రిక బ్యూరో చీఫ్ భార్య అక్కడ ఓ ప్రభుత్వ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగిని. ఆమెను సస్పెండ్ చేయాల్సిందిగా సదరు శాఖకు స్వయంగా ముఖ్యమంత్రే లేఖ రాశారు. దీంతో.. ఆమెను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది.

అక్కడ ‘దైనిక్ భాస్కర్’, ‘హరీ భూమి’ అనే మరో రెండు పత్రికలున్నాయి. అవి ప్రభుత్వానికి వంతపాడుతూ.. దోపిడీలో భాగస్వాములై అటు సర్క్యులేషన్‌ను, ఇటు ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నాయి. దైనిక్ భాస్కర్ పేపర్ యాజమాన్యానికి రాయగడ్ జిల్లాలో 91.6 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను అప్పజెప్పారు. ఒక పవ ర్ ప్లాంటును కూడా బహుమతిగా ఇచ్చారు.రమణ్‌సింగ్ అధికార దుర్వినియోగానికి అంతేలేదు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తన బాల్యమివూతుడు సురేష్ కొచ్చర్‌కు ఆర్థికలాభం చేకూర్చేందుకు పెద్ద కుంభకోణానికి తెరలేపారు.

సురేష్‌కొచ్చర్ ‘మా బాంబులేశ్వరీ మైన్స్ లిమిటెడ్’ పేరుతో ఓ కంపెనీ నెలకొల్పాడు.దానిని నెలకొల్పిన రెండు రోజులకే రమణ్‌సింగ్ ప్రభుత్వం 661.08 హెక్టార్‌ల గనులను అప్పగించింది. ఈ కంపెనీకి ఎలాంటి మైనింగ్ చేసిన అనుభవం, చరిత్ర లేదు. అయినా.. ప్రభుత్వం అయనకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చేందుకు ఒడిగట్టింది. అలాగే సూర్యా ఫౌండేషన్ అనేపేరు తో బీజేపీ అండదండలతో నడిచే ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది. ఈ సంస్థ బీజీపీ కోసం సర్వేలు చేసి పెడుతుంది. దీని యజమాని జై ప్రకాశ్ అగర్వాల్‌కు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పదికోట్ల టన్నుల బొగ్గు గనులను అప్పగించింది. బీజేపీ ఎంపీ అజయ్ సంచేటీకి చెందిన కంపెనీకి 8 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలను, విలువైన ఐరన్ ఓర్ నిక్షేపాలను అప్పగించింది. ఈ గనులను 32 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 25 వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది. మరో బీజేపీ నేత నినాసింగ్‌కు చెందిన కంపెనీ నవభారత్ ఫ్యూజ్‌కు 220 హెక్టార్‌ల గనులను కట్టబెట్టింది. ఈయనగారికి చెందిన మరో కంపెనీ నవభారత్ కోల్ ఫీల్డ్ కు 36 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాల ను అప్పనంగా అప్పజెప్పింది. దీంతో.. ఈ కంపెనీల యాజమాన్యాలకు కనిష్టంగా వెయ్యి కోట్ల రూపాయలు దండుకుంటారు.

రమణ్‌సింగ్ బావమర్దికి మధ్యవూపదేశ్‌లో 920 హెక్టార్‌ల ఐరన్ ఓర్ గనులను అప్పజెప్పారు.సంజయ్, అతుల్ జైన్ అనే ఢిల్లీకి చెందిన ఇద్దరన్నదమ్ములు ఢిల్లీలోని కుందేవాలన్ బజార్‌లో ఓ షాపును నడుపుకుంటున్నారు. జూన్ 2004లో పుష్ఫస్టీల్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. తమకు 2.25 లక్షల స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు. జనవరి 2005న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వీరి కంపెనీతో 380 కోట్లరూపాయల ఎంఓయూ చేసుకున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే.. లెక్కలేనన్ని కుంభకోణాల చరిత్ర రమణ్‌సింగ్ ప్రభుత్వానిది. ఇదంతా బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియకుండానే జరిగిందని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ దగ్గరి చుట్టాలకు రమణ్‌సింగ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూ ర్చే సహజవనరుల నిక్షేపాలను బహుమతిగా ఇచ్చింది. నితిన్ గడ్కరీ బినామీ పేర్లతో నడుపుతున్న కంపెనీలకూ కోట్ల రూపాయల విలువ చేసే బొగ్గు నిక్షేపాలను అప్పజెప్పింది.

బీజేపీ పైకి ఎన్ని నీతులు చెప్పినా.. కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభు త్వం, గాలి జనార్దన్‌డ్డి, ఛత్తీస్‌గఢ్‌లోని రమణ్‌సింగ్ ప్రభుత్వాలు ఓ మచ్చుతునకలు మాత్రమే. దేశ సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీపడుతున్నాయి. ప్రజా వ్యతిరేక చర్యలలో రెండు పార్టీలు ఒకే తానులోని గుడ్డలేనని రుజువుచేసుకున్నాయి. కాంగ్రెస్‌కు ఒక నవీన్‌జిందాల్ ఉంటే.., బీజేపీకి ఒక అజయ్ సంచేటి ఉంటాడు. కాంగ్రెస్‌కు కొమ్ముకాయడానికి ‘లోక్‌మత్’ అనే పత్రిక ఉంటే.., ‘బీజేపీకి హరీభూమి’ఉంటుంది. ఈ రెండు పార్టీలు, వాటి అధికారంలోని ప్రభుత్వాలు చేస్తున్నది మాత్రం ఒకటే. దేశ సహజవనరులను బహుళ జాతి కంపెనీలకు దోచిపెట్టడం. ప్రజలను సమిధలను చేయడం. ప్రశ్నించిన వారిని నిర్మూళించడం.ఇంత జరుగుతున్నా.. ఎవరూ నోరు మెదపడంలేదా..అంటే.. ఉన్నారు. సాహస్‌రాం నాగ వంశీ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం సహాయంతో.. ప్రభుత్వంపై అక్రమ గనుల తవ్వకాలపై హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశాడు. దీంతో జిల్లా అధికారులు పిల్‌ను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అయినా నాగవంశీ వినలేదు. అంతే.. అతను సొంతంగా నిర్వహించుకుంటున్న వర్క్‌షాప్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కాల్చి బూడిద చేశౠరు. ఆ తర్వాత అతని ఇంటిని కూడా కాల్చివేశారు.

ఇదీ బీజేపీ మార్క్ జాతీయ భావాల చీకటి రాజ్యం. ప్రజలు కోరుకుంటున్నది ఇలాంటి ప్రత్యామ్నాయ పార్టీల ప్రభుత్వాలను మాత్రం కాదు. నిజమైన ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం, అభివృద్ధినమూనా కలిగిన ప్రత్యామ్నాయ రాజకీయాలు ఇప్పుడు ఈ దేశానికి కావాలి. దేశ ప్రజలను, సహజ వనరులను రక్షించాలి. దేశ స్వావలంబనను కాపాడాలి.

-ఎస్.మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు