భారత్‌లో అమెరికా ఆగడాలు


Sat,October 6, 2012 05:17 PM

obama-indiaచాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో మన పాలకవూ పభుత్వాలను, మన మిలిటరీని నేరుగా అమెరికానే నియంవూతిస్తుందని, ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యం చేసుకుంటుందని అనుమానపడ్డాం. ఈ అనుమానాలు, భయాలన్నీ నిజమయ్యాయి. శిక్షణ పేరుతో, వ్యూహాత్మక రక్షణ ఒప్పందాల పేరుతో.. అమెరికా నేరుగా తన మిలిటరీ నిపుణులను భారత్‌లో దింపి మన రక్షణ వ్యవహారాల ను నియంవూతిస్తున్నది. భారత ప్రజల రక్షణ బాధ్యత మరెవ్వరికంటే తమకే ఉందని అమెరికా మిలిటరీ అధికారులు అంటున్నారు. ఏ ఉద్యమాలతో భారత్‌కు ముప్పు ఉన్నదో చెబుతూ.. పెట్టుబడులు రావాలంటే ఆ ఉద్యమాలను రూపుమాపాల్సిందేనని తుపాకీని ఎటువైపు ఎక్కు పెట్టాలో, ఎవరిపై గురిపెట్టాలో ఆజ్ఞలు జారీ చేస్తున్నారు.

‘భారతీయులు మరే ఇతర దేశీయులకు చేయలేని సాయాన్ని మేం భారతీయులకు చేస్తున్నాం. ఇది ఇండియన్స్‌తో మాకు ఉన్న అనుబంధాన్ని, బాధ్యతను తెలుపుతుంది’ అలాగే.. ‘భారతీయులు తమ రక్షణార్థం తాముగా చేసుకోలేని పనిని మేం చేసి పెడతాం. భారతీయుల రక్షణకై మేం నిలబడ తాం’ అంటూ.. అమెరికాకు చెందిన నేవీ అడ్మిరల్ మైక్ ముల్లెన్ ప్రకటిస్తున్నాడు. అంటే.. భారతీయులను రక్షించే బాధ్యత తమకే ఎక్కువ ఉందని చెప్పుకొస్తున్నాడు. ‘గత కొన్ని దశాబ్దాలుగా ఇండో-అమెరికా సంబంధాలన్నీ వర్తక వాణిజ్య సంబంధాలుగా ఉండేవి.

మారుతున్న కాలం, ప్రపంచ పరిస్థితి దృష్ట్యా ఇకనుంచి ‘మిలిటరీ-మిలిటరీ సంబంధాలుగా ఉంటాయ’ని అమెరికా మిలిటరీ ప్రతినిధులు అంటున్నారు. అంటే ఇన్నా ళ్లూ ఆయుధాల అమ్మకాలు, కొనుగోళ్ల వరకే కొనసాగి న అమెరికా- భారత సంబంధాలు ఇకనుంచి ప్రత్యక్షం గా అమెరికా మిలిటరీ ప్రత్యక్ష కార్యాచరణతో ఉంటాయ ని అమెరికా చెబుతున్నది. అమెరికా మిలిటరీ ప్రతినిధులు చెబుతున్న మాటలు, వాడిన పదజాలం ఎలా ఉన్నా.. రాబోయే కాలం లో అమెరికా మనదేశంలో ఏం చేయబోతున్నదో.. బహిరంగంగానే ప్రకటించింది. అయితే.. ఈ విధమైన అమెరికా మిలిటరీ విధానాలకు పెద్ద చరివూతనే ఉన్నది.

సోవియట్ యూనియన్ పతనానికి ముందు భారతదేశం దీర్ఘకాలిక రక్షణ ఒప్పందాలు, ఆయుధ కొనుగోళ్లన్నీ రష్యాతో కుదుర్చుకునేది. రక్షణ,యుద్ధసామాగ్రి ‘సాయపడటం’ విషయంలోఅమెరికా పాకిస్థాన్‌కు చేదోడు వాదోడు గా ఉంటే.., ఈ విషయంలో రష్యా భారత్‌కు అండగా ఉండేది. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న సాంప్రదాయ శత్రు వైఖరిని ,అమెరికా, రష్యా ఇరుదేశాలూ తమ ఆయుధాలను అమ్ముకోవడానికి వాడుకున్నాయి.

ఇండియా పాకిస్థాన్ దేశాల మధ్య ఏ సమస్య వచ్చినా అమెరికా పాక్ పక్షాన నిలబడింది. వ్యూహాత్మక రక్షణ సంబంధాలలో భాగంగా ఇండియా రష్యా పంచన చేరింది. ఎప్పుడైతే.. సోవియట్ యూనియన్ పతనం అయ్యిందో.. అమెరికా మెల్లగా పావులు కదపడం మొదలుపెట్టింది. భారత్‌ను తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు వ్యూహాత్మక రక్షణ సంబంధాల పేరిట భారత్‌తో రక్షణ ఒప్పందాల ను ముమ్మరం చేసింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో మొదలైన అమెరికా ప్రయత్నాలు నేటికి పరిపూర్ణమయ్యాయి. నేరుగా.. అమెరికా మిలిటరీ ప్రతినిధులే మన రక్షణ దళాలకు శిక్షణనిస్తూ.. దేశంలో తిష్ట వేశారు. భారత దేశంలో ‘డిఫెన్స్ పాలసీ గ్రూప్’(డీపీజీ)ను ఏర్పాటు చేసి దేశంలోని రక్షణ దళాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

భారత వైమానిక దళం, అమెరికా వైమానిక దళం సంయుక్తంగా దేశంలో పెరిగిపోతున్న తిరుగుబాటు ఉద్యమాలను ఎలా కట్టడి చేయాలో వ్యూహరచ న చేస్తున్నారు. ప్రత్యేక దళాలకు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రత్యేక స్థలాల్లో అటవీ యుద్ధంలో శిక్షణనిస్తున్నారు. మిజోరాంలోని వైరాంగ్టేలో ‘జంగిల్ వార్ ఫేర్’ లో గూర్ఖా ట్రూప్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికాకు చెందిన ముగ్గురు అధికారుల బృందం ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాలను సందర్శించింది. ఛత్తీస్‌గఢ్ అధికార పక్షనేతలు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో విడి విడిగా , ఉమ్మడిగా కూడా సమావేశం నిర్వహించి మావోయిస్టు ఉద్యమాన్ని ఎదుర్కొంటున్న తీరును సమీక్షించారు. అంతర్జాతీయంగా ఉన్న బహుళజాతి కంపెనీల పెట్టుబడులు రావాలంటే.. మావోయిస్టు ఉద్యమాన్ని కట్టడి చేయాలని సూచించా రు. దీనికి కావాల్సిన సాయమే కాదు, ఈ ముప్పు నుంచి భారత్‌ను రక్షించే బాధ్యత అమెరికా పైనే ఎక్కువ ఉన్నదని మన పాలకులకు భరోసా ఇచ్చారు.

ఇప్పటి దాకా అమెరికా తన ఆప్త దేశం ఇజ్రాయిల్‌కు అందించిన కీలక ఆయుధాలన్నింటినీ ఇవ్వాళ భారత్‌కు సాయంగా అందిస్తున్నది. ఏది, ఎవరు ఎక్కడ ఉన్నా కనిపెట్టగలిగే అత్యంత శక్తిమంతమైన ‘గ్లోబల్ పోజిషనింగ్ సిస్టం’ (జీపీఎస్)ను సమకూర్చింది. స్నిపర్ రైఫిల్స్, నైట్ విజన్ గూగుల్స్, స్పెషల్ బాడీ ఆర్మోర్ అండ్ థర్మల్ ఇమేజింగ్ ఎక్విప్‌మెంట్ లాంటి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుతున్నది. వీటి వినియోగంలో భారత మిలిటరీ, పోలీస్ అధికారులకు శిక్షణ నిస్తున్నది. అలాగే మానవరహిత యుద్ధ విమానాలను లెక్కకు మించి సమకూర్చుతున్నది.

అమెరికా చేస్తున్న ఈ యుద్ధ సాయాలు, సన్నాహాలన్నీ.. భారత్‌లో పెరిగిపోతున్న తిరుగుబాట్లను అణచేందుకని అంటున్నారు. అంటే.. ముఖ్యంగా ఇవ్వాళ దేశంలో మన పాలకులు చెప్తున్న దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిన మావోయిస్టు ఉద్యమాన్ని అణచేందుకేనని వేరే చెప్పక్కర లేదు. మధ్యభారతంలోని అటవీ ప్రాంతంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను, ఖనిజ సంపదను కొల్లగొ బహుళజాతి కంపెనీలకు అండగా అమెరికా రంగంలోకి దిగింది. అడవిలో ఆదివాసుల పక్షాన పోరాడుతున్న మావోయిస్టులను తుదముట్టించేందుకు పథక రచన చేస్తున్నది. అఫ్ఘనిస్థాన్, పాక్ సరిహద్దుల్లోని తోరా బొరా కొండల్లో దాగిన ఆల్‌ఖైదా నేతల ను మానవ రహిత యుద్ధవిమానాలతో బాం బులు కురిపించి ఎలా చంపి వేస్తున్నదో, అలా గే మావోయిస్టు నేతలను కూడా హత్యచేయాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలోనే దండకారణ్య ఆదివాసులపై ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట యుద్ధం ప్రకటించింది.

అయితే.. అమెరికన్ సామ్రాజ్యవాదులు కలలు కంటున్నట్లు దాని ఆటలు అంతటా సాగవు. పెట్రో వనరుల కోసం మధ్య ప్రాచ్య దేశాలను కబళించిన విధంగా దండకారణ్యాన్ని కబళించాలంటే కుదరదు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతున్న లక్షలాది మంది ఆదివాసుల ను చంపి సహజ వనరులను కొల్లగొట్టాలనుకుంటే.. భార త ప్రజలు చూస్తూ ఊరుకోరు. సుదీర్ఘ పోరాట చరిత్ర, చైత న్యం కలిగిన భారత ప్రజలు అమెరికా కుట్రలను, భారత పాలకులు చేస్తున్న విద్రోహాన్ని ఎదిరిస్తారు. అమెరికా దగ్గర అంతులేని ఆయు ధ సంపద ఉండవచ్చు.

భారత ప్రజలు, ఆదివాసులకు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నది. గూండాధర్ మొదలు కొమురం భీం దాకా పోరాటాల చాలు ఉన్నది. దండకారణ్యంలో పురుడు పోసుకుంటున్న జనతన సర్కార్‌లను దృఢ పరుచుకొని ప్రజారాజ్యాన్ని దేశ వ్యాప్తంగా విస్తృత పరుస్తారు. పల్లె పట్నం ఒకటి అవుతయ్. అమెరికా సామ్రాజ్యవాదుల ఆగడాలకు, భారత పాలకుల దళారీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాతారు. ఇకనైనా దేశం మేల్కోవాలి. ఈదేశ ప్రజలనూ, మట్టినీ ప్రేమించే వాళ్లుగా దేశ భక్తియుత పోరాటాన్ని ముమ్మరం చేయాలి.అంతిమంగా సామ్రాజ్యవాద మట్టికాళ్ల మహారాక్షసికి గోరీ కట్టాలి.
-ఎస్.మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు