ఆహార సంక్షోభంలో అమెరికా


Sat,October 6, 2012 05:18 PM

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమెరికాను ఆహార సంక్షోభం ముంచెత్తింది. ఈ పరిస్థితులు ఇలానే ఉంటే.. తమను ఆ దేవుడే రక్షించాలని స్వయానా ఆదేశ పాలకులే చేతుపూత్తేసి దిక్కులు చూసే పరిస్థితి వచ్చింది. దశాబ్దాలుగా వస్తూత్పత్తి, ఆయుధ వ్యాపారంపైనే ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుని తనకెవరూ సాటిలేరని, రారని అమెరికా విర్రవీగింది. ఆయుధ వ్యాపారం కోసం యుద్ధాలను ప్రపంచదేశాలపై రుద్ది రక్తాన్ని ఏరులుగా పారించింది. ‘ఇరాన్-ఇరాక్ యుద్ధం’ మొదలు నిన్నమొన్నటి అఫ్ఘనిస్థాన్, ఇరాక్ దాకా.. గుట్టలుగా పేరుకుపోయిన ఆయుధాలను ఖర్చు చేయడం కోసం యుద్ధాలను మానవాళిపై రుద్దింది. సహజవనరుల వేటలో దేశాలకు దేశాలను కబళించింది. ఇదంతా అమెరికా దురాక్షికమణ చరివూత లో విస్తరణవాదంలో అంతర్భాగం. దేశాలను కబళించినా, సహజవనరులను కొల్లగొట్టినా.. యుద్ధ ఖర్చు తలకు మించిన భారమై అమెరికా పీకలలోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అతలాకుతలం అవుతున్నది. ఈ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలోనే వాల్‌స్ట్రీట్ ముట్టడులు వాషింగ్టన్‌ను అలలు అలలుగా ముంచెత్తుతున్నాయి. వీటితోనే సతమతమవుతున్న అమెరికాకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా..అమెరికానిప్పుడు కరువు కాటేసింది. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 26 తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 3,033 కౌంటీల్లో (అంటే మనదగ్గరున్న మండలాల లాంటివి) 1,336 కౌంటీలను ఇప్పటికీ కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. అమెరికాలో కొంత భాగం తీవ్రమైన వరదలు, తుపాన్‌లతో సర్వం తుడుచుకుపెట్టుకుపోతుంటే..మరో ప్రాంతం కరువు బారిన పడటంతో.. ఆహారోత్పత్తి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో అమెరికా పౌరులే కాదు, అమెరికా చేసే ఆహారపదార్థాల ఎగుమతులపై ఆధారపడ్డ ఇతర దేశాలు కూడా ఆకలితో అలమటించే రోజులు వచ్చాయిపపంచ ఉత్పత్తిలో మూడవ వంతు మక్కజొన్నను అమెరికానే ఉత్పత్తి చేస్తున్నది. మక్కజొన్న కేంద్రంగా తినుబండారాలను తయారుచేసి అదే ఆహారంగా తనదైన ఆహార సంస్కృతిని పెంచి పోషించింది. దీంతో అమెరికాకు మక్కజొన్ననే ప్రధాన ఆహారం అయ్యింది. అలాగే.. ఈ మక్కజొన్నను రకరకాల ఆహారపదార్థాలుగా ఎగుమతి చేస్తూ వస్తున్నది. అమెరికా ఎగుమతి చేస్తున్న మక్కజొన్నపైనే దాదాపు 90 దేశాలు ఆధారపడ్డాయి. ఇప్పుడు ఈ అమెరికా కరువు ప్రభా వం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయనుందో ఊహించుకోవలసిందే... రైతు తాను పండించిన పంటతో తాను జీవించడం కాకుండా.. మార్కెట్, మారకం కోసమే ఉత్పత్తి చేయ డం అనేది అసహజమైనది. అసంబద్ధ మైనది. వ్యవసా యం ప్రకృతితో, మనిషి జీవితంతో ముడిపడి ఉండే జీవిత విధానం. అందుకే వ్యవసాయాన్ని కేవలం యాంత్రిక ఉత్పత్తిగా కాకుండా వ్యవసాయ సంస్కృతి గా పరిగణిస్తున్నాం. ఈ సహజ ఉత్పత్తి విధానాన్ని అమెరికా ప్రయత్న పూర్వకంగా ధ్వంసం చేసింది. అమెరికాలోని స్థానిక రెడ్ ఇండియన్‌లను రూపుమాపిన వలసవాదులు వారి వ్యవసాయ ఉత్పత్తివిధానాన్ని కూడా నాశనం చేశారు. ప్రకృతి సహజీవనంలో రెడ్‌ఇండియన్‌ల సహజ ఉత్పత్తి విధానాన్ని నాశనం చేసి, ఎగుమతి ఆధారిత వ్యవసాయ ఉత్పత్తి విధానాన్ని రుద్దారు. తామూ అవలంబించారు. తరతరాల సాంస్కృతిక ఉత్పత్తి విధానం ఎప్పుడు ఎక్కడ ధ్వంసమైనా.. అది దీర్ఘకాలికంగా తీవ్రమైన వ్యతిరేక ప్రభావలను కలిగిస్తుందని చరిత్ర మరోసారి రుజువుచేసింది. అమెరికాను కరువు ముంచెత్తడాన్ని ప్రకృతిపరమైనదిగా బుకాయింప చూసినా.., ఇదంతా అమెరికా చేసుకున్న స్వయంకృపరాధమే.


ఈ వికృత వ్యవసాయ విధానాన్ని అమెరికా తాను అవలంబించడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్య విధానాలతో అమలు చేసింది. ఫలితంగా ఒకప్పుడు పైరుపచ్చలతో కలకలలాడిన దేశాలు ఇవ్వాళ.. ఆకలికీ, దారివూద్యానికీ కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ప్రపంచ ముఖచివూతంపై వికృతంగా నిలిచిన సోమాలియా, ఇథియోపియా లు అమెరికా దుర్మార్గానికి ప్రతీకలే. లాటిన్ అమెరికా మొదలు ఆఫ్రికా దేశాల దాకా.. అన్నింటినీ అమెరికా సామ్రాజ్యవాదులు తమ ఆర్థిక విధానాలతో నిర్వీర్యం చేశారు. ఆ దేశాల్లోని తరతరాల సంప్రదాయ వ్యవసాయ విధానాలను నాశనం చేసి కరువు కాటకాలకు బలిచేశారు. ఇక్కడే రెండు ఉదాహరణలు చెప్పుకోవాలి. 1980ల దాకా ఫిలిప్పీ న్స్ సశ్యాశామల దేశం. ప్రపంచదేశాల్లో వరి పండించే దేశాల్లో పేరుగాంచింది. జాతీయోత్పత్తిలో 20 శాతం దాకా ఇతర దేశాలకు వరిని ఎగుమతి చేసేది. 80వ దశకంలో అమెరికా ఆ దేశంలో కాలుమోపింది. తన ఆర్థిక విధానాలతో.. ఆ దేశపు ఆర్థిక, రాజకీ య వ్యవస్థతో పాటు వ్యవసాయాన్నీ ధ్వంసం చేసింది. వరిని నిలిపి వేసి లాభాలు వచ్చే ఎగుమతి ఆధారిత వ్యవసాయ పంటలు పండించాలని రైతులకు బోధించింది. తనదైన ఫార్ములాతో మొత్తంగా అక్కడి ప్రజల జీవన విధానాన్నీ, ఉత్పత్తి విధానాన్నీ నాశనం చేసింది. ఇవ్వాళ ఫిలిప్పీన్స్ ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే దుస్థితికి చేరింది. అలాగే.. మెక్సికోలో మూడేళ్ల కిందట రొట్టెల సంక్షోభం(తోర్తిల్లి క్రైసిస్) వచ్చింది. అంటే.. అక్కడి ప్రజలు కనీసం రోజుకొక రొట్టెముక్క కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. నిజానికి మెక్సికో మక్కజొన్నకు పుట్టినిల్లు. వేల సంవత్సరాల చరివూతలో మెక్సికోలో నాలుగువేల రకాల మక్కజొన్న పంటలు ఉండేవి. ఈ సంప్రదాయక వ్యవసాయక విధానాన్ని అమెరికా ధ్వంసం చేసింది. మక్కజొన్న స్థానంలో అలంకరణకు ఉపయోగించే పూలు, బోకేలలో వాడే రకరకాల పుష్పాలు, క్రోటన్‌లు పెంచాలని రైతులకు బోధించింది. ఇప్పు డు అమెరికా నుంచి దిగుమతి అయ్యే మక్కజొన్న కోసం మెక్సికో ప్రజలు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇలా అమెరికా ఎక్కడ కాలు మోపినా అక్కడి ప్రజల సంప్రదాయక ఉత్పత్తి, జీవన విధానాన్ని విచ్ఛిన్నం చేసింది, చేస్తున్నది. తర్వాత ఆ దేశ ప్రజలను కేవలం వస్తువినియోగదారులుగా మాత్రమే చేసి లాభాలు పిండుకుంటున్నది. సరిగ్గా ఈ పరిస్థితే మనదేశంలో కూడా రాబోతున్నది. ఒకరకంగా చూస్తే.. ఇప్పటికే మనం అమెరికా ఉచ్చులో చిక్కుకున్నాము. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ పుణ్యమాని వ్యవసాయం అంటరానిదైపోయింది. దీనికి పరాకాష్టగా మన పాలకుల నోటితోనే వ్యవసాయం దండగ, వ్యాపార పంటలు పండించాలని చెప్పిస్తోంది. బహుళజాతి కంపెనీలు, అమెరికన్ సామ్రాజ్యవాదుల చెప్పుచేతల్లో నడిచే పాలకుల పుణ్యమాని వ్యవసాయం నిరాదరణకు గురై రైతులు గిట్టుబాటు ధరలు లేక బోరుమంటున్నారు. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దశాబ్దకాలంలోనే దేశంలో రెండులక్షల మంది రైతులు బలవన్మరణాలుకు పాల్పడ్డారు. వ్యవసాయ సంక్షోభాన్ని అధ్యయనం చేయడం కోసం వేసిన స్వామినాథన్ కమిషన్ కూడా రైతుకు వరికి మద్దతు ధర 2,042 ఇవ్వాలని సూచించింది. కానీ.. ప్రభుత్వం 1,030 మాత్రమే మద్దతు ధర ఇచ్చి చేతులు దులుపుకున్నది. మొత్తంగా చూస్తే... ఈ ఆధునిక యుగంలో.. ప్రపంచీకరణలో.. అమెరికా తన ఆర్థిక విధానాలతో ఆకలి దారివూద్యాలను ప్రపంచవ్యాప్తం చేసింది. అశాంతిని, రక్తపాతాలను ప్రజల జీవితంలో విడదీయరాని భాగం చేసి అమెరికన్ సామ్రాజ్యవాదం తన పెట్టుబడి(రక్త) దాహాన్ని తీర్చుకుంటున్నది.

ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో మూలమూలనా.. ఆకలి దప్పులు తాండవిస్తున్నవి. ప్రపంచ వ్యాప్తంగా 1992-2007 మధ్య సరిపడా ఆహారం లేనివారిలో మరో రెండు కోట్ల మంది చేరారు. 7 కోట్ల 50 లక్షల మంది తిండికి దూరమయ్యారు. 12.5 కోట్ల మంది నిరుపేదలుగా మారారు.సరిగ్గా ఈ సమయంలోనే భారత్‌లో రైతులకు గడ్డుకాలం వచ్చింది. రెండులక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ కన్నీటికి, చావులకు అమెరికా పాలకులు అనుసరిస్తున్న దోపిడీ విధానాలే కారణం. ఇంతా చేసి.. ఇప్పుడు ఈ పాపం అంతా తమ తలకు చుట్టుకున్నట్లు అమెరికాను కరువు, ఆహార సంక్షోభం ముంచెత్తే వరకు అమెరికా పాలకులు కిందమీద అవుతున్నారు. ఏకంగా అమెరికా వ్యవసాయమం త్రి మన భారతీయ పల్లెటూరి రైతులా బోరుమంటున్నాడు. ‘వర్షాలు కురువడానికి ప్రత్యేక ప్రార్థన ఉందే మో తెలియదు. వర్షం కోసం నేను ఏ పూజ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు దేవుడి ముందు మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థిస్తున్నాను. ఈ కరువు నుంచి దేశాన్ని గట్టెంక్కించమని దేవుని ప్రార్థించని రోజులేదు. ఇకనుంచి ప్రార్థన సమయాన్ని ఎక్కువ సమయం చేయాల్సి వచ్చేట్టుంది’ అంటూ.. అమెరికా వ్యవసాయమంత్రి ఫ్రాంక్ గాల్గానో వాపోతున్నాడు. ఇంకా ఆయన ‘రైతులు ఇప్పటికే పంట పొలాల్ని వదిలిపెట్టి పట్టణాలకు, నగరాలకు వలస వచ్చేస్తున్నారు. విలువైన వస్తువుల్ని అమ్మేస్తున్నారు. వ్యవసాయ పరికరాలను సైతం అమ్మేసుకుని వలస వచ్చేస్తున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం పోయినప్పుడే ఇలా వలసలు మొదలవుతాయి’ అంటూ.. తన అశక్తతను వెల్లబోసుకుంటున్నాడు ఫ్రాంక్ గాల్గానో. కానీ ఇన్నాళ్లూ ప్రపంచానికి బోధించిందీ, మార్గం చూపిందీ మీరే కాదా.. ప్రపంచ ప్రజలను సమిధలను చేసి తీరా అది మీదాకా వచ్చే వరకు తెలిసి వచ్చిందన్నమాట. కానీ.. ప్రపంచం ఆయన అనుకుంటున్నంత అమాయకంగా ఏమీ లేదు. ఈ సమస్త సమస్యలకు, చెడులకూ మూలకారకుపూవరో ప్రపంచానికి తెలుసు. ఎవడైనా ప్రజాకంటకుడు, పీడకుడు తాను చేసిన దానికి అంతకు అంత అనుభవిస్తాడనేది పాత సామెత. కానీ ఒక వ్యవస్థనే ఈ పరిస్థితిలో ఉంటే.. అదికూడా అలానే అనుభవించక తప్పక పరిస్థితి వస్తుందని గాల్గానో మాటలతో తేటతెల్లమవుతున్నది.ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు. తమ విధానాలే భస్మాసుర హస్తమై మిమ్ములనే బలితీసుకుంటున్నది. అనుభవించక తప్పదు. కాకుంటే.. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల పేదవూపజలు తమ తరతరాల వ్యవసాయ సంస్కృతిని తమ గుండెల్లో కాపాడుకుంటూనే.., పోరాట వారసత్వాన్నీ కొనసాగిస్తున్నారు. అమెరికా మట్టికాళ్ల మహారక్షసి మంట కలిసే రోజు వచ్చింది. ఇక రాబోయే కాలం పేద దేశాలదే. జనతన సర్కారులదే.

-ఎస్. మల్లారెడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు