హక్కులడిగితే దేశవూదోహమా..!


Sat,October 6, 2012 05:18 PM

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడుపులో చల్ల కదలకుండా కూర్చొని కబుర్లు చెప్పుకోకుండా.. కష్టప డే వారికోసం కాలు కదుపుతున్నావా? అయితే.. నీచుట్టూ నీకు తెలియకుండా నల్ల చట్టాల ఉచ్చు ఏదో.. బిగుసుకుంటుంది. ఆ ఉచ్చు ఎప్పుడు ఏరూపంలోవచ్చి నిన్ను గద్ద కోడి పిల్లను తన్నుకు పోయినట్లు తన్నుకుపోతుందో చెప్పలేం. నల్లచట్టాల నిర్బంధపు విషపు కోరలు నిన్ను నిర్బంధించవచ్చు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో.. ప్రతి పౌరుని అడుగూ ప్రమాదపు అంచున పడుతున్నది. ఏ క్షణమైనా.. నీవూ ఆ నిర్బంధపు కోరలకు ఎర కావచ్చు. అది సీమా ఆజాద్ లాగా, విశ్వవిజయ్ లాగా.. నీవూ కావచ్చు.

సీమా ఆజాద్ కథ, నిర్బంధ కథల్లో కెల్లా ప్రత్యేకమైనది. సీమా ఆజాద్, విశ్వాస్ విజయ్ అనే ఇద్దరు హక్కుల కార్యకర్తలకు అలహాబాద్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జీవిత ఖైదు విధించడంతో పాటు.. ఒక్కొక్కరిపై 20వేల జరిమానా విధించింది. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పౌర, ప్రజాస్వామ్య ప్రేమికులు సీమా ఆజాద్ ఉదంతాన్ని అసాధారణ ఘటనగా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పౌరసమాజంపై, పౌరహక్కులు, ప్రజల స్వేచ్ఛపై ప్రభుత్వ దాడిగా చూస్తున్నారు. ఇంతకూ వారు చేసిన నేరం ఏమిటి..?!
సీమా ఆజాద్ ఉత్తర భారతంలో పేరెన్నికగన్న యూనివర్సిటీలో ఉన్నత చదువు లు చదివారు. తాను చదివిన సామాజికశాస్త్రాల వెలుగులో తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించే క్రమంలో.. తీవ్రంగా కలత చెందారు. కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న సాధారణ ప్రజలకు చేయూతనివ్వాలని

నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు సహచరుడిగా విశ్వాస్ విజయ్ నడిచాడు. ఇద్దరూ.. ప్రజల కన్నీళ్లు తుడువడానికి నడుంకట్టారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రజల హక్కులను రక్షించేందు కు హక్కుల కార్యకర్తలుగా కార్యరంగంలోకి దిగారు. పీయూసీఎల్ కార్యకర్తలుగా ఉత్తరభారతంలో ప్రజలకు అండగా నిలిచారు. సీమా ఆజాద్ ప్రజల గొంతుకగా ‘దస్తక్ సీమా’అనే పత్రిక ను స్థాపించారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజ ల హక్కులకు భంగం కలిగినా అక్కడ వాలారు. ముఖ్యంగా.. ‘గంగా ఎక్స్‌వూపెస్ వే’ పేరుతో.. పేదల భూములను ప్రభుత్వం లాక్కోవడాన్ని నిరసించా రు. గంగా ఎక్స్‌వూపెస్‌వే కారణంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా నిలిచారు. ఇదే క్రమం లో.. ల్యాండ్ మాఫియా ఆగడాలతో పాటు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను దస్తక్ సీమా పత్రికలో ఎండగట్టారు. అలాగే.. ఉత్తరవూపదేశ్‌లోని అజామ్‌గర్‌లో ముస్లిం యువకులపై జరుగుతున్న అమానుషాలను ప్రపంచానికి చాటారు. ఓ పద్ధతి వూపకారం ముస్లిం యువతను లక్ష్యంగా చేసుకుని వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని నిరసించారు.

ఇలా సీమా ఆజా ద్, విశ్వాస్ విజయ్ ఒక్క ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితమై పనిచేయలేదు. బీహార్, ఉత్తరవూపదేశ్, ఉత్తరా ఖండ్ తదితర రాష్ట్రాల్లో వారి కార్యక్షికమాలను విస్తరించి ప్రజల పక్షాన నిలిచారు. అడుగడుగునా ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఎదిరించారు. ప్రజల పక్షాన నిలిచి వారి గొంతుగామారా రు. గొంతులేని వారికి గొంతునిచ్చారు. అస్తిత్వమే ప్రశ్నార్థమైన వారికి ప్రశ్నించడం నేర్పారు. ఇదే ప్రభుత్వానికి కంటగింపు అయ్యింది. వీరు ఇలాగే పనిచేస్తూపోతే.. తమ మనుగడకే ప్రమాదమని పాలకు లు భావించారు. ముఖ్యంగా ల్యాండ్ మాఫి యా సీమాఆజాద్, విశ్వాస్ విజయ్‌లను తమకు అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దీంతో.. వీరిపై కత్తి గట్టిన ప్రభుత్వం నల్లచట్టాల తో వేటాడింది. 2010లో ఢిల్లీలో ఓ ‘బుక్ ఫెయిర్’కు హాజరై తమకు నచ్చిన పుస్తకాలను కొనుక్కుని సీమా, విజయ్ తిరుగు ప్రయాణమయ్యారు.

అలహాబాద్‌లోని ఖల్దాబాద్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 9గంటలకు దిగారు. అంతే.. పోలీసులు చుట్టుముట్టారు. వారి బ్యాగులను సోదాచేశారు. వారి సంచుల్లో బుక్ ఫెయిర్‌లో కొనుక్కున్న పుస్తకాలను చూసి అవి మావోయిస్టు సాహిత్యమని, నిషేధిత మావోయిస్టు పార్టీ సాహిత్యం కలిగిఉన్నందుకు అరెస్టు చేస్తున్నామని ప్రకటించారు. నిజానికి అవేవీ మావోయిస్టు పార్టీ సాహిత్యం కాదు. అవన్నీ.. సాధారణ పుస్తకాల షాపులో దొరికే పుస్తకాలే. అయినా.. ‘రాజులు తలుచుకుంటే.. దెబ్బలకు కొదువా అన్నట్లు...’ అదం తా నిషేధిత మావోయిస్టు సాహిత్యమైపోయింది. అంతటితో ఆగకుండా మావోయిస్టులకు కొరియర్‌లుగా పనిచేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తూ.. దేశవూదోహ నేరం మోపారు. చట్ట వ్యతిరేక కార్యక్షికమాల నిరోధక చట్టం (యూఏపీఏ)వూపయోగించారు.

అలా అప్పటి నుంచి రెండున్నర ఏళ్లుగా అక్రమ నిర్బంధంలో ఉన్న సీమా ఆజాద్, విశ్వాస్ విజయ్‌ల కేసును అలహాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించింది. పోలీసులు మోపిన నేర అభియోగాలను ఉన్నది ఉన్నట్లుగా నమ్మిన సునీల్‌కుమార్ సింగ్ అనే న్యాయమూర్తి వీరిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంతటితో ఆగకుం డా..ఆకోర్టు తలా ఒక్కంటికి 20 వేల చొప్పున జరిమానా విధించింది. కక్షసాధిం పు చర్యగా రాజ్యం పౌరహక్కుల కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయించి, జైలు పాలు చెయ్యడం, శిక్షలు విధించడం ఇదే మొదలు కాదు. ఈనాటి పరిస్థితులు చూస్తుంటే.. ఇవే చివరివి కావని తేటతెల్లమవుతున్నది.

గత కొన్నేళ్లుగా.. భారత పాలకులు హక్కుల కార్యకర్తలం ఒంటికాలుపై లేస్తున్నారు. పౌరహక్కులు, ప్రజా సమస్యలు అనే మాటలు వింటేనే అసహనం ప్రదర్శిస్తున్నారు. అందుకే చరివూతలో మునుపెన్నడూ లేనంతగా, ఏ మిలిటరీ పాలనా దేశా ల్లో లేని విధంగా.. హక్కుల కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మహారాష్ట్రలో 2007లో పీయూసీఎల్ కార్యకర్త అరుణ్ ఫెరైరాను అక్రమంగా అరె స్టు చేసి మావోయిస్టులకు సహకరిస్తున్నారని కేసులు బనాయించారు. నాలుగేళ్లు జైల్లో నిర్బంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలకు వైద్యసేవ లు అందిస్తూ.., ఆదివాసీహక్కుల కోసం పోరాడిన బినాయక్ సేన్‌ను అరెస్టు చేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారని దేశవూదోహనేరం మోపి యావజ్జీవ శిక్ష వేశారు. ఆయన చేసిన వైద్యసేవలకు గాను దేశదేశాల్లో అత్యున్నత అవార్డులు ప్రకటిస్తు న్నా.., మన పాలకులు మాత్రం ఆయనను దేశవూదోహిగానే చూశారు.

ప్రభుత్వం నిత్యం నిర్బంధంతో వేంటాడి వేధించింది. దేశంలోని ప్రజాస్వామికవాదులు, అంతర్జాతీయంగా వచ్చిన నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనను బెయిల్‌పై విడుదలచేసింది. అలాగే.. ఆదివాసీ హక్కులు, వారి సంస్కృతిక పరిరక్షణ కోసం ఆట ఆడి పాటపాడిన జీతన్ మరాండినీ తప్పుడు కేసు లో ఇరికించి ఉరిశిక్ష విధించింది. దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనతో ఉరిశిక్ష రద్దు అయినా..ఇంకా జీతన్ మరాండీ అక్రమ నిర్బంధంలోనే మగ్గుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. రాజ్యం హక్కుల ఉద్యమకారులపై కత్తిగట్టిన దుష్టాంతాలు కోకొల్లలు.

మన రాష్టంలోనైతే.. జాపా లకా్ష్మడ్డి, నర్రా ప్రభాకర్‌డ్డి, పురుషోత్తం,ఆజం ఆలీ.. ఎందరో హక్కుల ఉద్యమంలో రాజ్యహంసకు బలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజా గా రాష్ట్రంలో ఆరుగురు ప్రజా కార్యకర్తలను అరెస్టు చేసిన వరం గల్ పోలీసులు పనిలోపనిగా నిరంతరం హక్కు లంటూ, తెలంగాణ అంటూ ఉద్యమిస్తున్న కాశీం, ఆకుల భూమయ్య, గంటి ప్రసాదంలపై ‘ఉపా’ చట్టాన్ని ప్రయోగించారు. చట్టవ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం (యూఏపీఏ)చట్టాన్ని మోపి వారిని నిర్బంధించేందుకు పథక రచన చేశారు. వీరికి ఏ విధమైన శిక్షలు విధిస్తారో కొద్ది రోజుల్లోనే మనమూ చూడబోతామన్నమాట.

రాజ్యం తల్లి కోడిలా తన ప్రజలను తన రెక్కల కింద కాపాడాలని ఓ గ్రీకు తత్వవేత్త అంటాడు. పాలకులు ఎలా ఉండాలో.., ప్రజలను ఎలా సంరక్షించా లో చెపుతూ..తల్లికోడి పోలికను ఆయ న చెప్పాడు. కానీ ఇవ్వాళ రాజ్యం తన బిడ్డలనే కాల్చుకు తింటున్నదని అత్యున్నత న్యాయస్థానం అభివూపాయపడే స్థితికి చేరుకున్నది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం భక్షిస్తున్నది.

అయితే.. నాటి నుంచి నేటి దాకా.. వేల సంవత్సరాల కాలంలో..పాలితులు రాజ్య పీడితులుగా, బాధితులుగా పోరాడుతూనే ఉన్నారు. ప్రజల పోరాటాలతోనే రాజ్యం తన రూపు రేఖలను మార్చుకుంటూ వస్తున్నది. ప్రజాస్వామ్యమనే అందమైన మేలిముసుగు కప్పుకున్నా..,నేటికీ రాజ్యం ప్రజల హక్కులపట్ల ఎట్లా వ్యవహరిస్తున్నదో.. తన చర్యలతో చాటుకుంటూనే ఉన్న ది. అయితే.. పీడిత, తాడిత ప్రజలు తమ అస్తిత్వం కోసం నిలబడినప్పుడల్లా, పోరాడినప్పుడల్లా రాజ్యం తన వికృత రూపంతో వికటాట్టహాసం చేస్తూనే ఉన్నది. ఆధునిక సమాజంలో అభివృద్ధి ఫలాలు కొంతమేరకు సొంతం చేసుకున్న వర్గాలు స్వేచ్ఛా స్వాంతంవూత్యాలు, భావ ప్రకటనా సేచ్ఛలు అనుభవిస్తున్నామన్న భ్రాంతిలో ఉన్నా.., సీమా ఆజాద్, విశ్వాస్ విజయ్ లాంటి ఉదంతాలు వాటిని పటాపంచలు చేస్తున్నాయి. ఇప్పటికైనా.. అందరూ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైనది. హక్కులం చూస్తున్న పాలకుల తీరును ఎదిరించాలి. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారంతా హక్కుల కొరకై ఉద్యమించాలి. సంకెళ్లు లేని సమాజం కోసం సమరం సాగించాలి.

-ఎస్. మల్లాడ్డి


35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు