ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం


Sat,October 6, 2012 05:18 PM

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగట్టాడు. అన్నింటినీ అధిగమించి అజేయుడుగా నిలిచాడు. సుఖమయ జీవనానికి పునాదులు వేశాడు. అభివృద్ధికి బాటలు వేశాడు. సరిగ్గా ఇక్కడే.. మనిషి దారి తప్పాడు. అభివృద్ధిపేరుతో.. వస్తూత్పత్తిని పెంచి దానినే సంపదగా భావించాడు. భోగలాలసాలనుంచి ఆనందాన్ని అనుభవించొచ్చు అనుకున్నాడు.కానీ...అనుకున్నవన్నీ ఆవిరై పోయాయి. ఊహించనివన్నీ.. ఉరితాళ్లై బిగుసుకుంటున్నాయి.‘అభివృద్ధి’ అంతా ఆపదై కూచున్నది.సుందర ప్రపంచాన్ని నిర్మించుకుందామనుకున్న మనిషికి అదే స్మశానంగా మారిం ది. మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. అడుగడుగునా ఆపదలను తెచ్చి పెట్టింది. ఇదే పర్యావరణ సమస్య. వాతావరణ కాలుష్యం.

ఆధునిక ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారింది పర్యావరణ సమస్య. పారిక్షిశామిక విప్లవం పేరిట జరిగిన అభివృద్ధితో ఉనికిలోకి వచ్చిన యంత్రభూతాలు సమస్త మానవాళినే కాదు, భూగోళాన్నే కబళించి వేశాయి. మట్టినీ, నీటినీ, గాలినీ కాటు వేశాయి. ప్రాణి కోటికి జీవనాధారంగా ఉన్న ప్రకృతి వనరులను విషతుల్యం చేశాయి. సమస్త మానవాళిని కకావికలం చేస్తున్న ఈ పర్యావరణ కాలుష్యం పై ప్రపంచంలోని పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాలు హార్వార్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్,అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లాంటి వన్నీ 2011 జనవరి 12న సమావేశమయ్యాయి. ప్రపంచాన్ని పీడిస్తున్న కాలుష్య సమస్యపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించాయి. ఈ గతి తప్పిన అభివృద్ధి విధానంతో ప్రపంచంలోని 179 దేశాలలో మెజారిటీ దేశాలు పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నాయని అభిప్రాయ పడ్డారు.

ప్రపంచదేశాలలో బ్రెజిల్ పర్యావరణ కాలుష్యంతో అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నదని, ఆ తరువాత స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయని తెలిపారు. భారతదేశం కాలుష్యవూపమాదంలో ప్రపంచంలో ఏడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. పర్యావరణ సమస్యను విస్తృతార్థంలో చెప్పుకుంటున్నాం. మనిషి జీవనానికి అవసరమైన‘ఆవరణం’లోని భూమి, నీరు, గాలి..సమస్తం కాలుష్యమయమై పోవడాన్నే పర్యావర ణ కాలుష్యం అంటున్నాము. పారిక్షిశామిక విప్లవాల అనంతర కాలంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన పారిశ్రామిక అభివృద్ధి జీవావరణాన్ని నాశనం చేసింది. పరిక్షిశమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలిలో కలిసి గాలిని కలుషితం చేశాయి. భూమిలోకి ఇంకి మట్టినీ, భూగర్భ జలాలనూ విషతుల్యం చేశాయి. నదీ, సముద్ర జలాలనూ కలుషితం చేసి సమువూదంలోని జీవరాసులు,చేపలు జీవించడానికి వీలులేకుండా చేశాయి. అభివృద్ధికి సంకేతాలుగా చెప్పుకున్న యంత్రభూతాలు, పరిక్షిశమలు సమస్త ప్రాణికోటికి ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టాయి.
వాతావరణ కాలుష్యం:-వాతావరణ కాలుష్యంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గాలి కాలుష్యం. గాలిని కలుషితం చేస్తున్న వాటిలో ప్రధానమైనవి పరిక్షిశమలు అయితే.., దీనికి తోడు ఆధునిక జీవనం కూడా గాలి కాలుష్యానికి కారణమవుతున్నది. గాలి కాలుష్యంలో భారతదేశమే అగ్రభాగాన ఉన్నది.

చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మనదేశంలోనే గాలిలో ప్రమాదరకమైన స్థాయిలో కాలుష్యాలున్నాయిపమాదకరమైన అత్యంత సూక్ష్మమైన పీఎం.2.5 ధూళికణాలు వాతావరణంలో ఉన్నాయి. దేశంలో 70 శాతం గాలి కాలుష్యానికి వాహనాలే కారణమని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ ధూళికణాలతో.. ప్రమాదకరమైన టీబీ, శ్వాస కోశ సంబంధ వ్యాధులు, పిల్లల్లో ఊపిరి తిత్తుల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఒక దేశ రాజధాని ఢిల్లీనే తీసుకుంటే.పతి సంవత్సరం రోడ్లపైకి పదివేల కార్లు, ఇతర వాహనాలు వస్తున్నాయి. ఇవి విడుదలచేసే పొగతో గాలి అంతా కార్బన్ మయం అవుతోంది. ఈ గాలి కాలు ష్యం కారణంగానే దేశంలో బెంగళూరు ఆస్తమా కేంద్రంగా మారిపోయింది.బెంగళూరులోని పది పది మందిలో ఒకరు శ్వాసకోశ సంబంధవ్యాధి, ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది గాలి కాలుష్యంతో 20 లక్షల మంది చనిపోతున్నారు.

భూమి కాలుష్యం:-పర్యావరణ కాలుష్యంలో అతి ముఖ్యమైనది భూ కాలుష్యం. పారిక్షిశామిక వ్యర్థాలు, రసాయనాలు భూమిపొరల్లోకి పోయి జీవావరణానికి మూలమైన మట్టిని కాటేశాయి. దీంతో చెట్టు చేమా మొలకెత్తకుండా భూమి చవుడు నేలగా మారిపోతున్నది. భూపొరల్లోని నీరు కలుషితం కావడమే గాక, మట్టిలోని ఉపయోగకర సూక్ష్మక్షికిములు నశించిపోతున్నాయి. చినుకుపడితే సుగంధాలు వెదజల్లే నేల దుర్వాసన కొట్టే పరిస్థితి దాపురించింది. దుక్కుల్లో గులాబీలుగా వెలికి వచ్చే ఆరివూదలు ఆనవాలు లేకుండాపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా పారిక్షిశామిక కాలుష్యంతో.. ప్రతియేటా..ండు శాతంభూమి పనికిరాకుండా పోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రానున్న కాలంలో.. మనిషి మనుగడకు మూరెడు భూమికూడా మిగలని పరిస్థితి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నీటి కాలుష్యం:-పర్యావరణ కాలుష్యంలో అన్నింటికన్నా మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది నీటి కాలుష్యం. పరిక్షిశమాధిపతులు ఈ కాలుష్యాలను నేరుగా నదులలోనూ, సమువూదాలలోనూ వదులు తుండటంతో.. జల కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోతున్నది. దీంతో..జీవకోటిలోని 288 రకాల జీవరాశులు ఇప్పటికే కాలుష్యంతో అదృశ్యమైపోయాయి. ఐక్యరాజ్యసమితి 2010 మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ప్రపంచానికి పరిక్షిశమలనుంచి విడుదలవుతున్న వ్యర్థాలే 90 శాతం నీటి కాలుష్యానికి కారణమని తెలిపింది. యూఎన్‌ఓ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 20 లక్షల 20 వేల మంది నీటి కాలుష్యంతో చనిపోతున్నారు. లక్షా 80 వేలమంది అయిదేళ్లలోపు పిల్లలు నీటి కాలుష్యంతోనే చనిపోతున్నారు. దేశంలోని 82 శాతం మంది నీటి కాలుష్యం కారణంగా రకరకాల వ్యాధులతో సతమతమవుతున్నారు.

ఎన్నో చారివూతక కట్టడాలు, ప్రకృతి అందాలు వాతావరణ కాలుష్యంతో అందవిహీనంగా తయారవుతున్నాయి. ప్రపంచవింతల్లో ఒకటైన పాలనురుగు లాంటి అందమైన తాజ్‌మహల్ పసుపుపచ్చగా మారిపోతున్నది. భూ ఉపరితలంపై ఉన్న అందమైన కాశ్మీర్‌లోని దాల్ సరస్సు అందాలను కోల్పోతున్నది. కాలుష్యకాటుకు గురై నానాటికీ పర్యాటకులకు, స్థానిక ప్రజలకు పనికిరానిదిగా మారిపోతున్నది. దాల్‌సరస్సుపై ఆధారపడి దాదాపు 70 వేలమంది జీవిస్తున్నారు. ఈ జనమంతా ఇప్పుడు దాల్ సరస్సుపై ఆధారపడి జీవించే పరిస్థితి లేదు. అలాగే.. ఈ 70వేల మంది కారణంగా దాల్ సరస్సుకు ముప్పు పొంచి ఉన్నది.పర్యావరణ సమస్యలనుంచి బయటపడేందుకు ప్రపంచమంతా ప్రయత్నిస్తున్నది.అయితే అభివృద్ధి పేరుతో జరుగుతున్నదంతా మానవ మనుగడకు ముప్పుగా పరిణమించేదేనని అందరూ గుర్తిస్తున్నా.. నివారణ చర్యలు మాత్రం శూన్యం. అగ్రరాజ్యం అమెరికా మొదలు అభివృద్ధిచెందుతున్న దేశాలదాకా పర్యావరణంపై శ్రద్ధ వహించాలని, కాలుష్యకారకాలను తగ్గించుకోవాలని చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో 5 శాతంగా ఉన్న అమెరికా ప్రపం చ వ్యాప్తంగా 25 శాతం వాతావర ణ కాలుష్యానికి కారణమవుతున్నది. 30 శాతం పనికిరాని చెత్తను ప్రపంచంపై వదిలిపెడుతున్నది. ఇలా అభివృద్ధిచెందిన దేశాలే ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరంగా తయారయ్యాయి. కానీ..కాలుష్యానికి అభివృద్ధిచెందుతున్న పేద వెనుకబడిన దేశాలే కారణమని చెప్పుకొస్తున్నాయి. అవసరమైన నిధులు కేటాయించటంలేదని ఆగ్రహం వ్య క్తం చేస్తున్నాయి. ప్రకృతి వనరులను కొల్లగొట్టి సుఖాలు అనుభవిస్తూ.., త్యాగాలు మాత్రం పేద దేశాలు చేయాలని బోధిస్తున్నాయి.

ఈనేపథ్యంలోనే 2011 జూలై 1న ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ‘పేదరికమే కాలుష్యానికి ప్రధాన కారణ’మని సెలవిచ్చారు. ప్రపంచ బ్యాంకు భావజాలం తలకెక్కించుకున్న ఆయ న పర్యావరణ సమస్యను, కాలుష్యాన్ని తలకిందులు చేసి చెబుతున్నారు. కాలుష్యానికి కష్టజీవులైన పేదలు కారణం ఎప్పుడూ కాదు. కష్టజీవుపూప్పుడూ తన చుట్టూ ఉన్న పరిసరాలను సంరక్షించుకుంటూ..పోషిస్తూ జీవిస్తారు. ప్రకృతిని ప్రాణవూపదంగా ప్రేమించే పేదలు కాలుష్యానికి ఏరూపంలోనూ కారణం కాలే దు. కారు. కానీ అదే ధనికులు ప్రకృతి వనరులను సొంతం చేసుకొని, వాటిపై పెత్తనం చెలాయిస్తూ.. కాలుష్యానికి కారణమవుతున్నారు.

ఆర్భాటాలు, విలాసాలతో..ధనికులు అన్ని రకాల కాలుష్యాలకు కారణమవుతున్నారు. పేదలు, కష్టజీవులు పట్టణాలలో కాలుష్యవూపదేశాలలో(మురికివాడల్లో)జీవిస్తున్నారు. మురికి వాడలు ఏర్పడటానికి కారకులు ధనికులు. కాలుష్యానికి పేదలు కారణమని చెప్పి ప్రధాని మన్‌మోహన్ మురికి వాడలనుంచి కూడా పేదలను తరిమేయాలని చూస్తున్నట్లున్నారు. పేదలను తరిమేస్తే కాలుష్యం పోదు. కాక పోగా నగరాల మధ్యలో కాలుష్యం పేరుకుపోయి నగరాలే కాలుష్యకాసారాలుగా మారుతాయి. పర్యావరణానికీ, ప్రపంచానికీ హాని ధనికులతో ఉన్నదని గుర్తించాలి. విలాస జీవితాలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలుసుకోవాలి. ఆ దిశగా.. మనమంతా ఆలోచించాలి. ప్రపంచపేదలంతా కదలాలి. కాలుష్యకారకులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. పర్యావరణ దినోత్సవాల పేరుతో ఉత్సవాలు జరిపితే కాలుష్యం పోదు. పర్యావరణ పరిరక్షణకోసం ఉద్యమించడం అంటే.. ధనస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడటంగా గుర్తించాలి. అలాంటి ఉద్యమాలే.. పర్యావరణాన్ని రక్షిస్తాయి. ప్రపంచం పర్యావరణ సమస్య నుంచి విముక్తి అవుతుంది.

-ఎస్.మల్లాడ్డి ,(పర్యావరణ దినోత్సవం సందర్భంగా..)

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు