ఆ పాటకు మరణం లేదు...


Sat,October 6, 2012 05:19 PM

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు, జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడిం ది. ఇది పాలకులకు కంటగింపు అయ్యింది. రాజ్యం కక్ష గట్టి కత్తి నూరింది. విముక్తి పాట ను పాడిన గొంతును తెగ నరికింది. కాలికి గజ్జె కట్టి ఆటఆడి పాట పాడినందుకు.. ఆడిపాడిన ఆ అవయవాలను ఖండఖండాలుగా 17 ముక్కలుగా నరికిందీ రాక్షస రాజ్యం.
బెల్లి లలిత రాజ్యం కుట్రకు బలై 13 ఏళ్లైంది. 1999 మే 26 సాయంత్రం ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్‌మిల్లు నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తనని బయటకి వెళ్లింది. అంతే.. రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్య్రతేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గానకోకిల బెల్లి లలితకు రాజ్యం ఏదైనా అపాయం తలపెట్టవచ్చని రాష్ట్రవ్యాప్తంగా అం దరూ భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందరినీ పలకరిస్తూ.. నిత్యం తమ కళ్లముందు తిరిగే బెల్లిలలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఆబాలగోపాలం రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీశారు.

బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో.. కొందరి ప్రమేయముందని వారి కుట్రకు బలయ్యే ప్రమాదముందని వెంటనే తన చెల్లెలిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శనలు చేశారు. ధర్నా, రాస్తారోకోలతో ప్రభుత్వ దమన నీతి ని ఖండించారు. ఆందోళనలు జరుగుతుండగానే ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ఓ నకిలీ లేఖను సృష్టించారు. దానిలో ఆకుకు అందని, పోకకు పొందని కాకమ్మ కథలు రాశారు. ఆ లేఖ సారాంశం మొత్తం లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగానే ఉండటంతో.. అది నకిలీ లేఖ అని ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరును అనుమానించారు. ఇంతలో నాలుగోరోజు భువనగిరి తూర్పుభాగాన ఉన్న దర్గా సమీపంలో ఉన్న వ్యవసాయబావులలో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే.. ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది.

అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలవిల లాడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు. అయినా.. ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా.. బెలి ్లలలితవి కావని బుకాయించింది. లలిత ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళాల్లోకి వెళ్లి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ‘బెల్లి లలితను అలా ముక్క లు ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అన్నింటిలాగే బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేస్తాం గదా’ అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తేలాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలనుంచి వస్తున్న ఒత్తిడి, నిందితులకు ప్రభుత్వం కొమ్ము కాస్తున్నదని విమర్శలు రావడంతో.. చివరికి ఇద్దరు అనుమానితులను తెరమీదికి తెచ్చారు. ఆ ఇద్దరి చేత అనేక అసత్యాలు చెప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో.. బెల్లి లలిత వ్యక్తిత్వానికి మసి పూసేందుకు ప్రభుత్వం, అప్పటి హోంమంత్రి మాధవడ్డి కూడా ప్రయత్నించాడు. అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలోనే బెల్లి లలితను వ్యక్తిగత కక్షలతోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. అయితే.. బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవ్వరూ ప్రభుత్వ దుర్మార ్గవూపచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక ఆడ కూతురును రాక్షసంగా ముక్కలు ముక్కలుగా నరికిచంపి, పైగా అపనిందలు వేస్తున్నారని ప్రజలంతా ఈసడించుకున్నారు.

బెల్లి లలిత నిరుపేద కుటుంబంలో పుట్టిన ముద్దుల ఆడబిడ్డ. ఒక అన్న బెల్లి కృష్ణకు, తోబుట్టువుల్లో లలిత నడిపి చెల్లె. ఇక్కడ బెల్లి లలిత కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతా ఉమ్మడి కుటుంబంగా ఉంటూ.. సందడి సందడిగా.. ఉండేది. కొత్తగా చూసి న వారికి ఓ పండుగలా ఉండేది. ప్రాథమిక విద్యకూడా పూర్తికాకుండానే ఆగిపోయిన చదువుతో.. కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నప్పటి నుంచి భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్‌మిల్లులో కార్మికురాలిగా చేరింది. జీవన పోరాటంలో కార్మికురాలుగా.. పనిచేస్తూనే.. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. 28 ఏళ్లు నిండకుండానే ఇద్దరు పిల్లల తల్లి అయింది. తనదైన జీవితంనుంచి నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ఇచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్యపు దీప్తిగా తీర్చి దిద్దాయి. సరిగ్గా అప్పుడే.. భువనగిరిలో సాహితీ మిత్రమండలి తన కార్యక్రమాలతో ప్రత్యామ్నాయ సాహిత్య, రాజకీయ కృషిని ప్రారంభించింది. ప్రతి బుధవారం అధ్యయన తరగతులు, సాహిత్యసభలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకు కార్యాచరణను చేపట్టింది. సీఐటీయూ రివిజనిస్టు రాజకీయాల డొల్లతనాన్ని త్వరగానే తెలుసుకున్న బెల్లి లలిత.. నిజమైన ఉద్యమ కార్యాచరణను ఎన్నుకున్నది. ఆ క్రమంలో.. భువనగిరిలో ఓ నిత్యచైతన్య జ్వాలయై వెలిగింది. భువనగిరిలోని బస్తిల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టిం ది. మహిళలను చైతన్య పరిచి, సంఘటితం చేసేందుకు ‘మహిళా స్రవంతి’ని ఏర్పాటుచేసింది.

మహిళల హక్కుల కోసం, యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్‌పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది. యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమానికి బాటలు వేసింది. భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి పడుపువృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. వ్యభిచార నరక కూపంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి తల్లిదంవూడుల చెంతకు చేర్చింది. ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా.. అక్కడ ప్రత్యక్షమై తనదైన పాటలతో, మాటలతో.. ప్రజలను చైతన్యం చేసేందుకు జీవితకాలాన్నంతా వెచ్చించింది.

1997 మార్చిలో జరిగిన మొట్టమొదటి ‘దగాపడ్డ తెలంగాణ’ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్యపాత్ర పోషించింది.రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా, గుసగుసగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా.. తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఎనలేనిది. భువనగిరి సభ మొదలు..నాటి నుంచీ.. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయ పదంగా మారింది బెల్లి లలిత. తెలంగాణ జనసభ కార్యక్షికమాల్లో పాల్గొంటూనే.. తెలంగాణ కళామండలి రాష్ట్ర కో కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పాటే జీవితంగా ఎంచుకున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే..తెలంగాణ ఉద్యమానికి జవ జీవాలు పోసింది బెల్లి లలిత. బెల్లి లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపు మాపవచ్చని పాలకులు కుట్రపూరితంగా హత్యచేశారు. ఈ దుర్మార్గాన్నంతా కొంతమంది వ్యక్తులపై నెట్టేసి తన చేతుల రక్తపు మరకలను దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయ త్నం చేసింది. కొంత మంది అమాయకంగా ఇదినిజమేనని నమ్మారు కూడా. కానీ.. ఇది పచ్చి అబద్ధం. ఇది రాజ్యం చేసిన హత్య. రాజ్యం కొంతమందిని ఆయుధాలుగా వాడుకుని తప్పించుకున్నదిపజలు నెమ్మదిగా నైనా నిజాన్ని గుర్తించారు. పాలకుల కుట్రలను ఓడించారు. బెల్లిలలిత గొంతును తెగనరికి తెలంగాణ పాటను ఆపామని కలగన్న పాలకులకు కోట్ల గొంతులలో తెలంగాణ పాట హోరెత్తుతున్నది. వలసపాలకులు పారిపోక తప్పని పరిస్థితి తెస్తున్నది. ఇదంతా.. బెల్లి లలిత త్యాగాల్లోంచి వచ్చిన వారసత్వమే.

బెల్లి లలిత జీవితం, త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలిత చెల్లె భర్త ముక్క కరుణాకర్, అక్క భర్త శ్రీరాములును ఈ రాజ్యమే దుర్మార్గంగా హత్యచేసింది. ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న రాజ్యం రక్తదాహానికి పచ్చని గూడు కకావికలమైంది. అజ్ఞాతంగా అడుక్కుతింటున్న దీనస్థితిలో ఉన్నది. నిజంగా తెలంగాణ ప్రేమికులంతా.. బెల్లిలలిత కుటుంబం చేసిన త్యాగాలకు ఏమి చేసినా తక్కువే. పాటకు పోతపోసిన రూపం బెల్లి లలిత. తెలంగాణ ఉద్యమ పాటకు ఊపిరి లలిత. ఆ పాటను చంపాలనుకున్న పాలకులు లలిత శరీరాన్ని 17 ముక్కలు చేశారు. కానీ.. మాయమైన పాట 17 రోజుల తర్వాత తల,మొండెంగా నీటిపై తేలి అలలుగా తెలంగాణ అంతటా తెలంగానమై విస్తరించింది. పాటకూ, పోరాటానికీ.. ప్రతీకయైన బెల్లి లలిత.. చివరికి చేయి పై పొడిపించుకున్న పచ్చబొట్టుగా మిగిలి తన ఆచూకీని చాటింది. ఆ పచ్చబొట్టు సాక్షిగా.. తెలంగాణ పోరాట, త్యాగాల వారసత్వాన్ని కొనసాగిద్దాం.

-ఎస్. మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు