తెలంగాణకు ఉద్యమమే దశదిశ


Sat,October 6, 2012 05:19 PM

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మంలో మన ప్రయాణం ఎటు? ఎంతదూరం, ఎంతకాలం అని ఆలో చిస్తున్న సందర్భంలో.. ఇది తప్పని సరి. రాష్ట్ర సాధన అనేది పూర్తిగా రాజ్యాంగ పరిధిలోని సమస్యలాగా బయటికి కనిపిస్తున్నది. ‘పార్లమెంటులో బిల్లు పెడితే సరి, తెలంగాణ వచ్చేస్తుంది’ అని ఇవ్వాళ చాలామంది నమ్ముతున్నారు. రాజకీయ పార్టీల వారూ నమ్మబలుకుతున్నారు. దీనికి తెలంగాణవాదాన్ని రాజకీయశక్తిగా మార్చిన టీఆర్‌ఎస్ ఒక కారణమైతే.., గతంలో ఏర్పడ్డ రాష్ట్రాల ఉదంతాలు కూడా ఒక కార ణం. వెరసి మొత్తం తెలంగాణ సమాజమంతా ఇవ్వాళ పార్లమెంటులో బిల్లు ఎప్పు డు పెడతారు? ఏం చేస్తే పెడతారో నని ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా.. కేంద్రంలోని ప్రభుత్వ దయా దాక్షిణ్యాలకోసం దేబురించే పరిస్థితి వచ్చింది.

దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నాం. ఎన్నికలు గెలుస్తున్నాం. ప్రతి ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని మరింత ఉన్నతంగాఎత్తి పడుతున్నాం. పదేళ్ల కిందటి మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు, నేటి దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపించి ఆకాంక్షను చాటుతున్నాం. ఇప్పడు మళ్లీ పరకాల వచ్చింది. పరకాలలోనూ.. తెలంగాణవాదాన్ని తప్పక గెలిపించుకోవాల్సిందే. అయితే ఇదేనా తెలంగాణ ఉద్యమమం ఈ గానుగెద్దు తిరుగుడు లాంటి ప్రస్తుత తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రం సాధించగలమా? కేంద్రం మెడలు వంచగలమా? అంటే.. లేదనే చెప్పాలి. ఇక్కడే.. కొంద రు తెలియక, అమాయకంగా కొన్ని విషయాలను నమ్ముతున్నారు. మరికొందరు (మేధావులు) మరింకేమీ చేయలేక నమ్మినట్లు నటిస్తున్నారు. మొత్తం మీద అందరూ కలిసి టోకుగా ప్రజలను వంచిస్తున్నారు.

ఇక్కడే, మనం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు మొదలు, నిన్నమొన్న టి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు దాకా చరివూతను చూడాలి. జాతీయోద్యమ కాలంలో వివిధ ప్రాంతాల ప్రజలను జాతీయోద్యమంలో కూడగట్టడం కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన, భాషావూపయుక్త రాష్ట్రాలను స్వాతంవూత్యానంతరం ఏర్పాటు చేస్తామన్నది కాంగ్రెస్. కానీ.. స్వాతంవూత్యానంతరం రాష్ట్రాల ఏర్పాటు విషయంలో పదేళ్లైనా పట్టించుకోలేదు. సువిశాల మార్కెట్, వ్యాపార అవకాశాలున్న భారత్‌ను చిన్న రాష్ట్రాలు చేస్తే బడాపెట్టుబడిదారుల వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని భయపడింది. బ్రిటిష్ పెట్టుబడిదారీ వలసాధి పతుల, దేశీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడే పూచీకత్తుపై స్వాతంత్య్ర పగ్గాలు అందుకున్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాలుగా విభజించడానికి ఇష్టపడలేదు. దీంతో..ఈ అలసత్వాన్ని ప్రశ్నిస్తూ.. దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలే చేయాల్సి వచ్చింది. చివరికి ప్రాణత్యాగాలు చేస్తే గానీ కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి మొట్టమొదటి భాషావూపయుక్త ‘ఆంధ్ర రాష్ట్రా’న్ని ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ఏర్పాటుకు పెద్ద ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. పాలనను స్తంభింపచేయాల్సి వచ్చింది. కానీ.. ఏ రాష్ట్ర ఏర్పాటులోనూ.. స్థానిక ప్రజల అభీష్టాన్ని గౌరవించి కేంద్రం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన చరివూతలేదు. స్వాతంవూత్యోద్యమ నాయకత్వ కాలం నుంచీ.. స్థానిక ప్రజల ఆకాంక్షలను గౌరవించి స్వయం పాలనాధికారాన్ని అప్పగించిన దాఖలాలు లేవు.

ఇది చారివూతక వాస్తవం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభు త్వం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవించి పార్లమెంటులో బిల్లు పెడుతుందని ఆశిస్తే.. అమాయకత్వమైనా కావాలి. లేదా ఆత్మవంచన అయినా కావాలి.ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా అడగకుండానే ఇచ్చినట్లు, బీజేపీ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. బీహార్ లాంటి ప్రాంతంలోనైతే..‘రాష్ట్ర విభజ న అంటూ జరిగితే అది నా శవం మీదనే జరగాల’ని అక్కడి అసెంబ్లీలో లాలూవూపసాద్ హెచ్చరించారు. అయినా.. బీజేపీ జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. దీనికి నాడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులే కారణం తప్పా మరోకటి కాదు. అక్కడి ప్రజల ఆకాంక్ష అంతకంటే కాదు. బోటా బోటీ మెజారిటీతో.. ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న బీజేపీ మునుముందు సంఖ్యాబలం పెంచుకునేందుకు కసరత్తు చేసింది. ఉత్తరాదిలో బీజేపీని పాదుకొల్పేందుకు విశాల భూభాగంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో.. బీజేపీని పాదుకొల్పడం సాధ్యం కాదని గ్రహించింది. బీహార్‌లో యాదవ్‌లు, మధ్యవూపదేశ్‌లో జాట్‌లు, రాజవంశీయులు, మహారాష్ట్రలో బడా వ్యాపా ర వర్గాల ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే.. ఆ రాష్ట్రాలను విభజించాలని ఆలోచించింది.

అప్పటికే ఏళ్లకేళ్లుగా తిష్టవేసి ఉన్న కాంగ్రెస్ పార్టీని, కొత్తగా ఉనికిలోకి వచ్చి పాదుకొనిపోయిన ప్రాంతీయ పార్టీలను ఓడించి బీజేపీ బలం పుంజుకోవడం సాధ్యం కాదని గ్రహించింది. సామాజిక కారణాలు, కుల సమీకరణల నేపథ్యంలో చిన్న రాష్ట్రాలు అయితేనే.. బీజేపీకి ప్రాణం పోయవచ్చని భావించింది. సరిగ్గా ఈ రాజకీయ అనివార్యత, బీజేపీ రాజకీయ అవసరం నేపథ్యంలోనే ఎన్‌డీఏ హయాం లో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బీజేపీ వేసిన లెక్కలు నిజమయ్యాయి. కొత్త రాష్ట్రా ల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే... ఓ చారివూతక సందర్భంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తన రాజకీయ అవసరాల కోసం ఏసిన ఎత్తుల్లో భాగంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంతే గానీ.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ ప్రజల ఆకాంక్షను బీజేపీ గౌరవించి ఏర్పాటు చేయలేదు. మొత్తం మీద ఈ రాష్ట్రాల ఏర్పాటు సాంకేతికంగా చూస్తే.. పార్లమెంటులో బిల్లు పెట్టడంతోనే ఏర్పాడ్డాయని కనిపిస్తున్నా.. వాటి వెనుక ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉన్నా యి. కాదంటే.. ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అధికార పార్టీలను ఊపిరి సలపనీయకుండా చేయడం ద్వారా నైనా రాష్ట్ర ఏర్పాట్లు సాధ్యమయ్యాయి.


ఇప్పుడు ఈ చారివూతక అనుభవాల వెలుగులో తెలంగాణ రాష్ట్ర సాధన ఎలా సాధ్య మో ఆలోచించాలి. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఓ రాజకీయ అవసరం, లేదా స్వార్థం ఉండాలి. తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని అది భావించాలి. అప్పుడే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాం టి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్నాయా? అంటే లేదనే చెప్పాలి. తెలంగాణ ఏర్పాటు చేస్తే మొదటినుంచీ తెలంగాణవాదాన్ని నెత్తిన మోస్తున్న, పోరాడుతున్న టీఆర్‌ఎస్ పార్టీకి నైతిక విజయం చేకూరి ఆ పార్టీ బలం పుంజుకుంటుంది. ఇంకా చెప్పాలంటే అధికారం చేజిక్కించుకుంటుంది. పోనీ సీమాంవూధలోనైనా కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుతుందా అంటే.. అదీ లేదు. అక్కడ వైఎస్ జగన్ పాగా వేసి ఉన్నాడు. ఏవో అనుకో ని అద్భుతాలు జరిగితే తప్ప ఆయనను దెబ్బతీసి, సీమాంవూధలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం అసాధ్యం. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకోసం తెలంగాణ ఏర్పాటు చేస్తుందని ఆశించడం అత్యాశ. ఇంకా లేదంటే దురాశ.

ఇక మిగిలింది ఉద్యమాలతో ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించడమే. అయితే.. మొదటినుంచీ పార్లమెంటరీ రాజకీయ పార్టీగా పార్లమెంటులో రాజకీయ తీర్మానం ద్వారా తెలంగాణ సాధించవచ్చని నమ్ముతున్న టీఆర్‌ఎస్ పార్టీ దానికనుగుణంగానే కార్యాచరణను ఎంచుకున్నది. లాబీయింగ్ చేసింది. అయినా కేసీఆర్ ఆశించినట్లుగా రాష్ట్రసాధన దిశలో ఎన్నోమెట్లు ఎక్కినా.. సాధన ప్రకటన మాత్రం కనుచూపు మేర లో కనిపించడంలేదు. ఈ లాబీయింగ్‌లు, శాపనార్థాలు, బెదిరింపులతో కేంద్రం కదిలివచ్చే పరిస్థితి లేదు. పార్లమెంటరీ రాజకీయ పార్టీగా కేసీ ఆర్ బలం, బలహీనతలు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి తెలు సు. అందుకే ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా, హెచ్చరికలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఖాతరు చేయడం లేదు. అనేక సందర్బాలలో కేసీఆర్ స్వయంగా తానే చెప్పుకున్నట్లు.. ‘ప్రజాసంఘాలు తమ ఎజెండాను, ఉద్యమ పంథాను నన్నుచేయమని డిమాండ్ చేస్తున్నాయి. వారు అనుకున్నట్లు ఉద్యమాన్ని నిర్వహించడంలేదని ఆడిపోసుకుంటున్నారు. వారు చెప్పే ఉద్యమమేదో వారే చేయొచ్చు కాదా?’అని చాలా స్పష్టంగా నే చెప్పారు. తాను అనుకున్న పద్ధతి ఇదే. దానికి పోరాట రూపమంతా ఎన్నికలే. దానికనుగుణంగానే నేనుంటానని ప్రకటించారు. ఒక పార్లమెంటరీ రాజకీయ పార్టీగా, ఎన్నికల పార్టీ నేతగా కేసీఆర్‌కూ, టీఆర్‌ఎస్‌కూ ఆపరిమితి, పరిధి అంతే.ఇక ఉద్యమం గురించి టీఆర్‌ఎస్ నుంచో, కేసీఆర్‌నుంచో ఎక్కువ ఆశిస్తే.. అది అత్యాశ. ఎవరు ఔనన్నా, కాద న్నా తెలంగాణ ఉద్యమానికి జాతీయ స్థాయిలో సమ్మతిని కూడగట్టడంలో గణనీయమైన పాత్రపోషించారు. తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదంగా మారారు. దీనికి కేసీర్ వాక్‌చాతుర్యమూ, ఎత్తుగడలూ ప్రముఖపావూతవహించాయి. మొత్తం మీద తెలంగాణ ఉద్యమం ఈనాడున్న స్థితికి టీఆర్‌ఎస్ బలం ఎంత కారణమో బలహీనతా అంతే కారణం.

ఇన్నాళ్లూ తెలంగాణ వాదానికి జవంగా జీవంగా ఉన్న ప్రజాసంఘాలు, ఉద్యమ శక్తులు తమ చారివూతక బాధ్యతను గుర్తించాలి. మలిదశ ఉద్యమం ఊపిరిలు పోసుకున్న నాటినుంచీ.. అన్నీ తామై తెలంగాణ రాష్ట్ర ఏర్పటు కోసం అనన్య త్యాగాలు చేశాయి. ఓ చారివూతక బాధ్యతను నిర్వర్తించాయి. తెలంగాణ వాదాన్ని ప్రచార దశనుంచి ఉద్యమ దశకు తీసుకెళ్లే క్రమంలో ఉద్యమ శక్తులకు ఆనాడున్న పరిమితుల కారణంగా రాజకీయ ఉద్యమంగా మలచలేకపోయాయి. ఈ సంధికాలంలోనే.. తెలంగాణ ఉద్యమాన్ని బూర్జువాశక్తుల చేతుల్లో పెట్టి, ఓ ప్రజాస్వామిక ఉద్యమ స్వరూపం ఇవ్వడానికి ప్రయత్నించాయి. ఈ చారివూతక నేపథ్యంలోనే కేసీఆర్ రంగంమీదికి వచ్చారు. ఊహించినదానికంటే ఉద్యమానికి ఉపు తెచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నదల్లా ఉద్యమాన్ని రాష్ట్రసాధన దిశగా ఎలా పట్టాపూక్కించాలన్నదే ప్రధాన సమ స్య. రాష్ట్రాల అవతరణ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు గత చారివూతకానుభవాలు చెబుతున్నట్లుగా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచే ఉద్యమనిర్మాణం ఇప్పటి ఆవశ్యకత. వలసాంధ్ర దోపిడీ పాలకులకు దీటుగా ప్రజలను ఉద్యమ బరిలో నిలపాలి. ఆ దిశలో ప్రజాసంఘాలు, ఉద్యమశక్తులు తమ చారివూతక బాధ్యతను గుర్తించి దీర్ఘకా లిక పోరాటరూపాలకు పునాదులు వేయాలి. 850 మంది పైగా బలిదానాల సాక్షిగా రాష్ట్రసాధనకు పోరుబాట పట్టాలి. తెలంగాణకు ఎన్నికలు ఒక పోరాట రూపమే తప్ప, అవే సర్వస్వం కాదు. హక్కులకైనా, విముక్తికైనా పోరాటమే ఏకైక మార్గం.

-ఎస్.మల్లాడ్డి

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

కన్నీటి కడలిలో ‘ అమ్మ’

మా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు