ద్రోహులుగా మిగలకండి


Sat,October 6, 2012 05:33 PM

రాజీనామాలు చేసిన ప్రజావూపతినిధులంతా.. రెండుమూడు రోజుల్లో తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోవాలి. అలాగే.. ప్రభుత్వ అధికార కార్యక్షికమాల్లో, పదవుల్లో కొనసాగరాదు. రాజీనామాలకు కట్టుబడి ఉంటూ..కేంద్రవూపభుత్వంపై ఒత్తిడి పెంచి వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టడం కోసం పోరాడాలి.

తెలంగాణ ఇవాళ ఓ చారివూతక సన్నివేశంలో ఉన్నది. త్యాగాల, పోరాటాల చరివూతను కొనసాగింపు క్రమంలో ముందుకు సాగుతున్నది. జూలై 4న తెలంగాణ వూపజావూపతినిధులంతా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసి, తమ పోరాట వారసత్వాన్ని మరోసారి చాటారు. జూలై 4 దొడ్డి కొమురయ్య అమరత్వంతో.. తెలుగునేలలో గుణాత్మక మార్పుకు అంకురార్పణ జరిగింది. అప్పటి దాకా సాగుతున్న నిజాం వ్యతిరేక పోరాటాన్ని సాయుధపోరాటంగా మార్చిన దొడ్డికొమురయ్య అమరత్వం చరివూతలో నిలిచిపోయింది. సరిగ్గా అదే రోజున తెలంగాణ ప్రజావూపతినిధులంతా.. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం రాజీనామాలు చేయడం చరివూతలో నిలిచిపోతుంది. తెలంగాణ సాధనలో తప్పకుండా ఓ మైలు రాయిగా నిలుస్తుంది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల కనుగుణంగా.. తెలంగాణలోని 100 మంది ప్రజావూపతినిధులు రాజీనామాలు చేయడంతో తెలంగాణ పౌరుషాన్ని చాటినటె్లైంది. దీంతో.. ఏళ్లకేళ్లుగా.. తెలంగాణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తన విశ్వసనీయతను పోగొట్టుకుంది . అలాగే.. పాలనార్హతను కోల్పోయింది. ఈ సందర్భంలో కేంద్రవూపభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కులేదు.

తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తెలంగాణలో ఇవాళ ఏ రాజకీయ పార్టీ లేదు. 95 శాతంమంది ప్రజావూపతినిధు లు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా రాజీనామాలు చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వమే లేదు. ఉంటే అది సీమాంధ్ర ప్రభుత్వమే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రవూపదేశ్ అనేదే లేకుండాపోయింది. ఈ పరిస్థితి అంతా.. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షకు నిలు సాక్షం. ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. అయినా.. ఇప్పటికీ.. ఏకాభివూపాయ సాధన అనే పాత పాటనే కేంద్ర ప్రభుత్వం పాడుతున్నది.

తెలంగాణలోని ప్రజావూపతినిధులంతా రాజీనామా చేసిన తర్వాత కూడా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఏకాభివూపాయసాధన అనడం అర్థ రహితం. ఇంతదాకా వచ్చిన తర్వాత తెలంగాణ సాధన కోసం ఇప్పుడేం చేయాలనేది అసలు సమస్య. మొదటగా.. రాజీనామాలు చేసిన ప్రజావూపతినిధులంతా.. రెండుమూడు రోజుల్లో తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోవాలి.అలాగే.. ప్రభుత్వ అధికార కార్యక్షికమాల్లో, పదవుల్లో కొనసాగరాదు. రాజీనామాలకు కట్టుబడి ఉంటూ.. కేంద్రవూపభుత్వంపై ఒత్తిడి పెంచి వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టడం కోసం పోరాడాలి. అలా కాకుండా అది ఇదంటూ.. కాలయాపన చేసి.. కుంటిసాకులతో తప్పించుకో చూస్తే... తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.

మరోవైపు తెలుగుదేశం ప్రజావూపతినిధులంతా.. తమ పార్టీ అధినేత ద్వంద్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. పార్టీ అధ్యక్షుడిగా.. తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించే వరకు పోరాడాలి. అలా చేయకుండా.. పార్టీ అధ్యక్షుడిగా.. సమైక్యవాది చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ.. తెలంగాణ ప్రజల ముందుకు పోతే.. ఎవరూ నమ్మరు గాక నమ్మరు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో.. తెలంగాణ టీడీపీగా ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకుంటేనే.. తెలంగాణ ప్రజలు నమ్ముతారు. అప్పటిదాకా.. టీడీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించరు.

ఇక ఈ సమయంలో కూడా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. రాజీనామాలు చేయకుండా.. పదవులకు అంటిపెట్టుకొని ఉన్న నేతలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణ ప్రజలు ఉద్యమించాలి. రాష్ట్రంలో ముఖ్యంగా..కేంద్రంలో ఉన్న జైపాల్‌డ్డి లాంటివారు పదవులకు రాజీనామాలు చేయకుండా.. నాటకాలు అడుతున్నారు. వీరిపై తెలంగాణ ప్రజలు ఒత్తిడి తీవ్రం చేయాలి. 48 గంటల్లో రాజీనామా చేయకుంటే.. తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలి. వారిని ఎక్కడా కాలుపెట్టనీయకుండా అడ్డుకోవాలి. తెలంగాణకోసం అనేక సార్లు పదవీ త్యాగాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన టీఆర్‌ఎస్ నేతలు తమ రాజీనామాలను ఆమోదింపచేసుకొని అందరి కంటే ముందునిలవాలి. అలాగే.. బీజేపీ, సీపీఐ పార్టీ నేతలను అదే బాటలో పయనింపచేసి కేంద్రవూపభుత్వంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచి తెలంగాణ రాష్ట్రసాధన యత్నాలను ముమ్మరం చేయాలి.

అలాగే.. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్‌కు ఉన్న భయాందోళనలు, అపనమ్మకాలను తొలగించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభద్రత అవసరం లేదని భరోసా ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు ప్రేమకూ.., ఆదరణకూ.. ఆదర్శవూపాయులని అర్థం చేయించాలి. తరతరాల వివక్ష అణిచివేతలోనూ.. ఎప్పుడూ.. ప్రతీకార ధోరణి లేని తెలంగాణనేల గొప్పతనాన్ని చాటి చెప్పాలి. ఒక ధర్మపోరాటం కోసం 600 మందిని బలిదానం చేసిన చరిత్ర తెలంగాణది. కానీ.. ఒక హింసాత్మక సంఘటనకు తావివ్వని తల్లి ప్రేమ తెలంగాణదని తెలియజెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో వారినీ భాగస్వాములను చేయాలి. తద్వారా.. తెలంగాణ సాధన కోసం ముందడుగువేయాలి.

తెలంగాణ ఇప్పటికే.. ఎన్నో డెడ్‌లైన్లను చూసింది. ఎన్నో ద్రోహాలను చవి చూసింది. కానీ.. ఇప్పుడు మునుపెన్నడూ లేని పరిస్థితి వచ్చింది. తెలంగాణ కనుచూపు మేరలో కనిపిస్తోంది. ఇప్పుడే.. తెలంగా ణ ప్రాంత ప్రజావూపతినిధులంతా.. రెట్టించిన ఉత్సాహంతో .. ఇంకా పట్టుదలగా పోరాడాలి. తెలంగాణ రాష్ర్ట కల సాకారానికై కదిలిపోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తే.. వారిని భావితరాలు కూడా క్షమించవు. చరివూతకూడా క్షమించదు. చరివూతలో ద్రోహులుగా మిగిలిపోతారు.

- ప్రొ.లక్ష్మణ్, ప్రొ.హరినాథ్, టి. ప్రభాకర్, డా. భిక్షమ్ గుజ్జ
తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ ట్రస్ట్


35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

country oven

Featured Articles