రాజీనామాలతోనే తెలంగాణ


Sat,October 6, 2012 05:32 PM

తెలంగాణ ప్రజలు ఎంతో సహనంతో దశాబ్దం పాటు ఎదురు చూశారు. ఇంకా ఎదురు చూస్తున్నారు. తమ ప్రజాస్వామ్య ఆకాంక్ష తెలంగాణ అని చాటడానికి చేయగలిగినదంతా చేశారు. ప్రతి రాజకీయ నాయకుడికి- వారి గతం, భవిష్యత్ ఉద్దేశాలు ఏమయినప్పటికీ- ప్రజలు మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో వారు కొన్ని చేదు సత్యాలు తెలుసుకున్నారు. వారు రాష్ట్రపతి ప్రసంగాన్ని విన్నారు. కనీస ఉమ్మడి కార్యక్షికమాన్ని చదివారు. అనేక హామీలు ఇవ్వడం, కమిటీలు వేయడం వారికి తెలుసు. ప్రతి సారి ఇక ఇదే చివరి చర్య అని తెలంగాణ వస్తుందని నమ్మారు. ప్రజాస్వామ్యంపైన, వ్యవస్థలపైన నమ్మకం ఉంచారు. 2009 డిసెంబర్ తొమ్మిది ప్రకటన కూడా వెలువడింది. అది వెనక్కు పోయి మరో కమిటీ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ కోసం ఏడాది ఎదురుచూస్తే చివరికి నిరాశే మిగిలింది. కమిటీ గడువు కాలంలో మరో సగమంత- ఆరు నెలల కాలం గడిచింది. కానీ జరిగిందేమీ లేదు. మధ్యలో ఎన్నికలు, ఫలితాలు, ఉద్వేగం అన్నీ చవి చూశాం. ఎన్ని నిరాశలు ఎదురైనా, మొత్తం దశాబ్దమంతా ప్రజలు ప్రతి పిలుపునకు, సభలకు, ఎన్నికలకు స్పందించారు. దశాబ్దకాలంలో తెలంగాణపై ప్రతి మనిషి పాల్గొన్న మొత్తం సమావేశాలను లెక్కిస్తే మిలియన్‌ల సంఖ్యలో ఉంటాయి.

సభలకు హాజరైన మొత్తం జనసంఖ్యను లెక్కిస్తే తెలంగాణ జనాభా కన్నా ఐదు రెట్లు ఉంటుంది. తమ మద్దతు, సౌహార్దతను వ్యక్తం చేయడానికి ప్రతి తెలంగాణ వాడూ ఈ సభలకు హాజరయ్యాడు. అయినా 2009 డిసెంబర్ తొమ్మిదవ తేదీన చేసిన ప్రకటన ప్రకారం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం లేదు. తెలంగాణ ప్రజలు అర శతాబ్దానికి పైగా తమ వాదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. ఆరు వందల మందికి పైగా ప్రాణత్యాగం చేశారు. దశాబ్దం పాటు శాంతియుత, ప్రజాస్వామ్య ఉద్యమాలు చేశారు. ఎన్నో కమిటీలు వచ్చాయి. హామీలు లభించాయి. అయినా అర శతాబ్దానికి పైగా తమ వాదానికి కట్టుబడి పోరాడుతున్నా తెలంగాణ రాష్ట్రం ఎందుకు సిద్ధించడం లేదు. ఇప్పుడు మరొక ప్రశ్నను కొందరు అడుగుతున్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ వస్తుందా అని. దీనికి సమాధానం- అవును.. అవును.. అవును వస్తుంది. రాజీనామాల వల్ల తెలంగాణ ఎందుకు వస్తుంది? ఇది తెలువాలంటే ఇప్పటి వరకు మనకున్న అవగాహనను సమీక్షించుకోవాలె. ఇప్పటి వరకు మనకున్న అవగాహన ఈ విధంగా ఉంది-

- కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలంగాణకు అనుకూలంగా క్రియాశీలకమైన నిర్ణయం తీసుకుంటాయి. 2009 డిసెంబర్ తొమ్మిదిన అటువంటి నిర్ణయమే జరిగిన తరువాత, ప్రతివారు ఏదో ఒక రోజు ఆ నిర్ణయం అమలు జరుగుతుందని నమ్మారు. కానీ అది జరగడం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటన పర్యవసానంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రక్రియను మళ్ళీ ప్రారంభిస్తుందని అనుకుంటే అది పొరపాటే. కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలో పడితే తప్ప వారు మళ్ళీ ప్రక్రియ ప్రారంభించరు. అది సాధ్యం కాదు.

- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నడుస్తున్నంత కాలం, అది ఎంత అసమర్థంగా, అధ్వాన్నంగా ఉన్నా కేంద్రం బిల్లు ప్రవేశ పెట్టదు.
అందువల్ల- మొదట మంత్రులను లక్ష్యం చేసుకోవాలె. రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ మంత్రులు ఉన్నంత కాలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆమోదనీయత లభిస్తుంది. దానిని స్పష్టంగా కూలదోయాలె. సమష్టి కార్యాచరణ దిశగా కృషి: ఏ కొద్ది మందో మినహాయిస్తే, తెలంగాణలోని దాదాపు నాయకులందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకునే వారే. అయితే రాష్ట్రంలోని, ఢిల్లీలోని అధికార కేంద్రంలో వీరికున్న శక్తి శూన్యమే. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు, కాంగ్రెస్‌పై పోటీకి దిగిన విఫల రాజకీయ నాయకుడితో గడిపారు. కానీ తెలంగాణ నాయకుల కోసం కొంత సమయమైనా వెచ్చించలేదు. అందరు నాయకులు కూడబలుక్కుని ఒకే సారి దెబ్బ కొడితే తప్ప ఫలితం ఉండదు. ఒత్తిడి వస్తే తప్ప ఈ నాయకులు ఈ విధంగా వ్యవహరించరు. నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వీడే విధంగా ప్రజలు ఒత్తిడి చేయాలె. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్ అనే భావన ధ్వంసమైపోతుంది. తెలంగాణపై స్థూల ఆమోదం లేదనే అభివూపాయం కూడా చెల్లకుండా పోతుంది. రాజకీయ నాయకులపైనే కాదు, రాజకీయేతరులపైన కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. ఆంధ్ర నాయకులు బలవంతులని కాదు, తెలంగాణ నాయకులకు దిశానిర్దేశం లేనందు వల్ల నమ్మకం పోతున్నది. నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనపై దృష్టి సారించడానికి బదులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ ప్రయోజనాల విషయమై దృష్టి పెడుతున్నారు.

ఉద్యమం స్పష్టంగా లక్ష్య నిర్దేశంతో సాగాలె. ప్రధానమైన విషయం- ఈ అంతిమ దశ పోరాటం ధర్నాలు, బంద్‌లు, రాస్తా రోకోల మాదిరిగా అస్పష్టంగా ఉండకూడదు. సదస్సులు, అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేయడం వృథా. తెలంగాణ రాష్ట్రం కావాలనే విషయంలో తెలంగాణ వారందరికి స్పష్టత ఉంది. అందువల్ల భవిష్యత్ ఉద్యమం లక్ష్యం దిశగా సాగాలె, గమ్యం వైపుగా దృష్టిసారించాలె. తెలంగాణ రాజకీయ నాయకులందరూ రాజీనామాలు చేసే విధంగా వారిని చైతన్యవంతులను చేయాలె. వాదించి ఒప్పించాలె. ఒత్తిడి చేయాలె, కూడగట్టాలె. ఢిల్లీలో కూచుని జాతీయ వాదం గూర్చి మాట్లాడుతున్న, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఏమి చేయాలో సూచించిన మహా సిద్ధాంత వేత్త కూడా ఇందుకు మినహాయింపు కాదు. మొదట ఇతడినే రాజీనామా చేయవలసిందిగా ఒత్తిడి చేయాలె. ఆయన తనను ఎన్నుకున్న ప్రయోజనాలు కాపాడడం లేదు. ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగనట్టయితే, ఈ సారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు డిపాజిట్ కూడా దక్కదు. తెలంగాణ ఏర్పడే వరకు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులు అంటూ ఎవరూ ఉండకూడదు.

కొన్ని సూచనలు:
1. ఆత్మహత్యలు వద్దు: జేఏసీ, పార్టీలు, పౌర సమాజ నాయకులు, మేధావులు, కార్మికులు,రైతులు అందరూ కలిసి యువతకు ఆత్మహత్యలు చేసుకోకూడదని పిలుపు ఇవ్వాలె. బలిదానాలకు బదులుగా రాజకీయ నాయకులను తమ బాధ్యతలు నిర్వర్తించవలసిందిగా ఒత్తిడి చేయాలె. ఆత్మహత్యలకు పాల్పడకుండా బతికి ఉండి పోరాడుతూ ఉండాలని చెప్పాలె. 2. కేంద్రంలోని, రాష్ట్రంలోని మంత్రులను లక్ష్యం చేసుకోవాలె. మంత్రులందరూ రాజీనామా చేయాలని మొదట పిలుపునివ్వాలె. వచ్చే వర్షాకాల సమావేశంలో బిల్లును ప్రవేశ పెట్టే విధంగా కచ్చితమైన హామీ ఇచ్చి, ప్రక్రియను ప్రారంభించమని వారు కోరాలె. ఈ విధంగా వారు తమ పార్టీలపై ఒత్తిడి చేయాలె. మంత్రులు తమ రాజీనామా పత్రాలను పత్రికలకు విడుదల చేయాలె. ఎవరైనా మంత్రి రాజీనామా చేయనట్టయితే వారిని తెలంగాణ ద్రోహిగా ప్రకటించాలె. ఆ నాయకులు ఒక నెల తరువాత రాజీనామా చేసినా ద్రోహిగానే మిగిలిపోతాడు. 3. తెలంగాణ మంత్రులు పాల్గొనే ఏ కార్యక్షికమాన్ని అయినా శాంతియుతంగా నిరసించాలె. ఆంధ్రకు చెందిన ఏ నాయకుడైనా, పార్టీ అధ్యక్షుడైనా తెలంగాణకు సంబంధించని వ్యక్తిగా ప్రకటించాలె. 4. అన్ని పార్టీల ఎన్నికైన ప్రతినిధుల రాజీనామా: తెలంగాణ బిల్లు వర్షాకాల సమావేశంలో ప్రవేశ పెట్టాలని కోరుతూ టిఆర్‌ఎస్‌తో సహా అన్నిరాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజనామా లేఖలను తమ పార్టీ అధ్యక్షులకు పంపాలె. ఎవరైనా ఈ విధంగా రాజీనామా లేఖ పంపనట్టయితే అతడిని తెలంగాణ ద్రోహిగా జేఏసీ ప్రకటించాలె. 5. ఆం ధ్ర ప్రదేశ్ రాష్ట్రమనే భావన మాత్రమే ఇంకా మిగిలి ఉంది. దానిని కూడా ధ్వంసం చేయాలె. ప్రభుత్వానికి ఆమోదనీయత లేకుండా చేయాలె. తెలంగాణ కోసంపోరాటం ఢిల్లీలో కాదు, హైదరాబాద్‌లోనే చేయాలె. ఢిల్లీ హైదరాబాద్‌కు దిగి వచ్చి, తెలంగాణ ఏమంటున్నదో వినాలె. ఏడాదిన్నర కింద ఇచ్చిన హామీని నెరవేర్చాలె.

ఇది చివరి అవకాశం. ఇది చేజారి పోతే, తెలంగాణ నాయకులందరూ తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని అవమానభారంతో గడపవలసి రావచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడే, వారిపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వారు కీచులాడుకోవచ్చు. పదవుల కోసం కలహించుకోవచ్చు. ప్రజాస్వామ్యం అంటేనే ఆ విధంగా ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందే తన్నులాటకు దిగితే వారు జీవితాంతం పైరవీకారుల మాదిరిగానే బతకాల్సి ఉంటుంది. తెలంగాణ అంతా పరివర్తనకు సిద్ధంగా ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కొత్త ఆరంభానికి పూనుకోవడానికి ఇది మంచి అవకాశం. తెలుగు సంస్కృతికి, ఆత్మగౌరవానికి రెండు రాష్ట్రాలు ఉండడం మంచిది. ఇప్పుడున్న ఏకైక మార్గం కేవలం నామమావూతంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌ను తొలగించడమే. నాయకులు పదవులకు రాజీనామా చేయడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. ఆరు వందల మంది బలిదానాలు చేసిన తరువాత కూడా నాయకులు పదవులు పట్టుకుని వేళ్ళాడుతున్నందు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం లేదు. 2009 డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరణించినట్టుగా ప్రకటించినప్పటికీ, ఈ నాయకులు మంత్రిపదవులలో కొనసాగడం వల్లనే ఇంకా నామమావూతంగానైనా మిగిలి ఉన్నది. చిదంబరం ఆంధ్ర ప్రదేశ్‌కు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చిండు. ఇక మిగిలింది ఆ మృతదేహానికి అంత్యక్షికియలు జరపడమే. తెలంగాణకు చెందిన మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసినప్పుడు ఈ కార్యక్షికమం మొదలవుతుంది. ఇది ఒక్కటే గురి తప్పని దెబ్బ. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఆంధ్ర నాయకులు ఆపడం లేదు. తెలంగాణ నాయకులే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆమోదనీయతను అందిస్తున్నారు.

- ప్రొ. హరనాథ్, ప్రొ. లక్ష్మణ్,
టి. ప్రభాకర్, డా. భిక్షం గుజ్జా
(తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ ట్రస్టు)
35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Featured Articles