ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె


Sun,September 27, 2015 05:57 AM

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుంచి అప్పులు తీసుకున్న వారికి వర్తించదు. రైతులు మరణించిన పిదప కూడా అతని కుటుంబాన్ని వడ్డీ వ్యాపారస్తులు వెంటాడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతులలో 86 శాతంగా ఉన్న ఈ చిన్నసన్నకారు రైతులను వడ్డీ వ్యాపారస్తుల నుంచి కాపాడే నిమిత్తం ప్రైవేటు వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించే చట్టాలు తీసుకురావాలి.

laxman


మనది ప్రధానంగా వ్యవసాయిక దేశం. రాష్ట్ర జనాభాలో 62 శాతం వరకు ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. ఈ ప్రజల జీవనాధారం వ్యవసాయం. ఈ వ్యవసాయమంతా 80 శాతం వరకు వర్షాధారం. వర్షాలు అదునుబట్టి సకాలంలో పడితేనే వ్యవసాయం నడిచేది. రైతులు, రైతుకూలీల బతుకులు సాఫీగా సాగేది. లేకుంటే రైతన్నకు అన్నీకష్టాలే. మన రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా వర్షాలు అదునుబట్టి సరిగా పడక సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోతుంది. వాస్తవానికి గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అనావృష్టిని ఈ ఖరీఫ్ సీజన్ ఎదుర్కొంటున్నది. కృష్ణా గోదావరి నదుల ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురువక ఇప్పటికీ మన రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు అయినటువంటి శ్రీశైలం నాగార్జునసాగర్ శ్రీరాంసాగర్‌లు నిండని దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం ఈ జలాశయాలు నిండుకుంటాయనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్రం లో ఖరీఫ్ సగటు వర్షపాతం 715 మిల్లీ మీటర్లు. సెప్టెంబర్ రెండో వారం నాటికి కురువ వలసిన వర్షపాతం 630 మిల్లీ మీటర్లు.

కానీ ఇప్పటి వరకు కురిసింది 490 మిల్లీమీటర్లు మాత్రమే. ఖరీఫ్‌లో రాష్ట్ర సగటు వర్షాపాతం సాధారణం కన్నా 22 శాతం తగ్గింది. ఇప్పటికీ ఇంకా 220 మండలాల్లో వర్షపాతం భారీలోటులోనే వున్నది. మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 10.50 లక్షల హెక్టార్లు కాగా ఈ సంవత్సరం సాగైంది 5.96 లక్షల హెక్టార్లలోనే. ఇది సాధారణ సాగు విస్తీర్ణంకన్నా 44 శాతం తక్కువ.ఇతర ఆహార ధాన్యాల పంటలసాగు కూడా 32 శాతం తగ్గినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదికలు తెలుపుతున్నాయి. తెలంగాణలో గత ఐదేళ్లలో ఇంత దారుణం గా సాగు విస్తీర్ణం తగ్గలేదు. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా అది రబీ పంటల సాగుకే ఉపయోగపడ్తుంది తప్ప ఖరీఫ్‌కు అంత గా ఉపయోగపడదు.

ఖరీఫ్ పంటలు అదునులో వేయకపోతే దిగుబడి తగ్గుతుంది. వ్యవసాయం దెబ్బతింటే దాని ప్రభావం గ్రామీణ వ్యవస్థపైనా మరీ ముఖ్యంగా రైతులు, రైతుకూలీలపైన ఘననీయంగా ఉంటుంది. వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు గ్రామా ల్లో వీళ్లకు ప్రత్యామ్నాయ పనులు దొరకక బతుకు భారమవుతుంది. రెండేళ్లుగా వరుస కరువుల తో భూగర్భ జలమట్టాలు అడుగంటి బోర్లు మూగబోయిన పర్యవసానంగా పంట నష్టానికి తోడుగా వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలు ఇలా అనేక కారణాల వల్ల రైతులు నిస్సహాయ దయనీయ స్థితికిలోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

రైతుల ఆత్మహత్యలు స్పష్టంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా మొదలయింది కచ్చితంగా చెప్పలేము. 1950 నుంచే జాతీయ నేరగణాంకాల నమోదు సంస్థ అధికారికంగా దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలపై వివరాలు సేకరించి ప్రచురిస్తున్నా 1995 నుంచి మాత్రమే రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా సేకరించి ప్రచురిస్తుంది. ప్రచురించనంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు అంతకు ముందు జరుగలేదని కాదు. జరుగుతూనే ఉన్నాయి. జాతీయ నేరగణాంకాల నమోదు సంస్థ నివేదిక ప్రకారం 2010లో 1,34,599 ఆత్మహత్యలు జరిగితే అందులో రైతులవి 15,963. 2011లో 1,35,585 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో రైతులు 14,207 మంది. 2012లో 1,35,445 మంది ఆత్మహత్యలకు పాల్పడితే అందులో 13,754 మంది రైతులు. 1995-2013 మధ్యకాలంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డది 2,96,438 మంది అందులో ఒక్క మహారాష్ట్ర నుంచే. 60 వేల మంది ఉన్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

దేశంలో ప్రతి 32 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చొప్పున ప్రతి రోజు సగటున 41 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన కారణాలను విశ్లేషిస్తూ ఉత్సాపట్నాయక్, జయతీఘోష్, ప్రభాత్ పట్నాయక్‌లు నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలే ఈ బలవన్మరణాలకు మూలం అని అభిప్రాయపడితే, రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసిన నిపుణులు మాత్రం రైతుల ఆత్మహత్యలకు కారణం ఒకటి ఉండదు అనేకం. అందులో అధిక శాతం వ్యవసాయానికి సంబంధించిన కారణాలుంటే మిగితావి ఇతర కారణాలు. అవి 1. రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం (2) తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండటంసగటున ఒక హెక్టారు. (3) అధిక వడ్డీకి తెచ్చిన ప్రైవేటు అప్పులు (4) వర్షాభావ పరిస్థితులు (5) బోర్లు ఎండిపోవడం.(6) పంటలు దెబ్బతినటం (7) పండిన పంటకు రాని గిట్టుబాటుధర (8) ఎదిగిన కూతుళ్ల పెండ్లిళ్లు. (9) వేరే ఆదాయ వనరులు లేకపోవడం (10) కుటుంబ బాధ్యతల సమస్యలు (11) వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు (12) నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేకపోవడం (13) వ్యవసాయంపై పెట్టుబడులు పెరగటం (14) కల్తీ విత్తనాలు, పురుగుల మందులు, రసాయన ఎరువులు. (15) ఆరోగ్య సమస్యలు, (16) ఇంట్లో ఒక్కరికి కూడా ఉద్యోగం లేకపోవడం (17) కుటుంబ పోషణ ఖర్చులు పెరగటం.

ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయేతర ఆదాయం చాలా తక్కువ. ప్రత్యామ్నాయ ఉపాధి దొరకడం అంత సులువుకాదు. రైతుల్లో 86 శాతం చిన్న సన్నకారు రైతులే. వారి సాగు విస్తీర్ణం తక్కువ. సగటున హెక్టారులోపే. కుటుంబ సభ్యులందరికి వ్యవసాయమే జీవనాధారం. పెట్టుబడులు సొంతంగా పెట్టుకోలేక, బ్యాంకుల నుంచి రుణా లు పుట్టక, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కపంట కోల్పోతే మూడేళ్లపాటు కోలుకోలేరు. ప్రత్యామ్నాయం లభిస్తే వ్యవసాయం నుంచి తప్పుకోవడానికి 78 శాతం పైగా రైతులు సిద్ధంగా వున్నట్లు అర్జున్‌సేన్ గుప్తా కమిటీ తమ నివేదికలో పేర్కొంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారంతా ఒక హెక్టారులోపు సాగుభూమి ఉన్న చిన్నసన్నాకారు రైతులే. మరీ ముఖ్యంగా వీళ్లంతా బడుగు బలహీనవర్గాలకు చెందిన వాళ్లు. వీళ్లల్లో ఒక్కొక్కరికి సగటున రెండులక్షల వరకు అప్పుంటుంది.

ఈ రైతుల ఆస్తుల విలువలో 70 శాతం వరకు అప్పులుంటున్నాయి. ఆస్తుల విలువలో 50 శాతంపైగా అప్పులుంటే ఆ అప్పుల ఊబి నుంచి బయటపడటం అంత సులువుకాదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు రైతుల భూములు కాజేయాలనే దురుద్దేశంతోటే వారి ఆస్తుల విలువలో 70 శాతం వరకు అప్పులిస్తుంది. దీనికి ఉదాహరణ మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని ఎల్కాల గ్రామం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు 34 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డరు. ఎల్కాలలో ఉన్న వారంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే. సాగుభూమి నాలుగు ఎకరాలకు మించిన రైతులేడు. రైతులందరికి సాగుభూమి ఇరువది గుంటల నుంచి నాలుగు ఎకరాల వరకు వుంది. ప్రతి రైతు రెండు మూడు బోర్లు వేసి దివాలా తీసిన్రు. ఉన్న కొద్ది నీళ్లతో వీల్లు పండించేది మక్కజొన్న కూరగాయలు. ప్రతి రైతుకు అప్పులు రెండు లక్షలకు పైగానే ఉన్నా యి. వీళ్లకున్న ఆస్తి విలువలో అప్పులు 75 శాతం పైగానే వున్నాయి.

-రైతుల ఆత్మహత్యలు నిర్మూలించేందుకు చేపట్టాల్సిన చర్యలు
(1) ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుంచి అప్పులు తీసుకున్న వారికి వర్తించదు. రైతులు మరణించిన పిదప కూడా అతని కుటుంబాన్ని వడ్డీ వ్యాపారస్తులు వెంటాడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతులలో 86 శాతంగా ఉన్న ఈ చిన్నసన్నకారు రైతులను వడ్డీ వ్యాపారస్తుల నుంచి కాపాడే నిమిత్తం ప్రైవేటు వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించే చట్టాలు తీసుకురావాలి. దాంతోపాటు ప్రభుత్వ అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారాన్ని నడపడాన్ని తీవ్రంగా పరిగణిం చి శిక్షించాలి. గతంలో ఇలాంటి చట్టాలను 1877లో బ్రిటిష్ పాలకులు డెక్కన్ రయి ట్స్ సందర్భంగా తీసుకొచ్చిన్రు. అలాంటి పగడ్బంది చట్టాలను తీసుకొచ్చి రైతులను వడ్డీ వ్యాపారస్తుల నుంచి కాపాడాలి.

(2) రైతులను బోరుబావుల కష్టాల నుంచి ఆదుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటిని కాల్వల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలి. (3) రైతు కుటుంబాలను వ్యవసాయ అనుబంధ రంగాల్లో లేదా కుటీర పరిశ్రమలు పెట్టుకునేందుకు పెట్టుబడిని సమకూర్చి ఇవ్వాలి. దాంతోపాటు గొర్రెలు, బర్రెలు, కోళ్ల పెంపకాలను ప్రోత్సహించాలి. (4) బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలందరికి పరిహారం సకాలంలో అందేలా చూడాలి. (5) రైతులకు విత్తనాలు, విద్యుత్, సాగునీరు, ఉపకరణాలు, ఎరువులు, రుణాలు అవసరమొత్తంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. (6) ప్రకృతి వైపరీత్యాలనుండి పంట నష్టం బారి నుంచి రైతును ఆదుకోవడానికి సకాలంలో పరిహారం చెల్లించాలి.

1142

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష