ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!


Wed,February 25, 2015 11:54 PM

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల్లో పౌరు లు తమ ఓటు ద్వారా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలపై నాయకులపై వెల్లడిస్తా రు. అంటే ఈ వ్యవస్థలో ప్రజాభిప్రాయం ఓట్ల రూపంలో వెల్లడవుతుందన్నమాట. ఎన్నికల ఫలితాలు వెల్లడించేది ప్రజాభిప్రాయాన్నే. ఓట్ల ద్వారా వెల్లడయ్యే ఈ ప్రజాభిప్రాయానికి ఓడలను బండ్లుగా బండ్లను ఓడలుగా మార్చగల సత్తా వుంటది. ఇది ఈ వ్యవస్థ ప్రత్యేకత, గొప్పతనం. ఎన్నికల ద్వారా వెల్లడయ్యే ప్రజాభిప్రాయాన్ని ప్రతి రాజకీయపార్టీ విశ్లేషించుకుని తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలి. ఫలితాలకనుగుణంగా తమ తప్పిదాలను సరిదిద్దుకునే రాజకీయపార్టీలే మనుగడ సాధించగలవు. లేకపోతే అవి ప్రజాక్షేత్రంలో ఉనికిని కోల్పోతాయి.

తాజాగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాల నుంచి రాజకీయ పార్టీలు నాయకులు నేర్చుకోవలసింది ఏంటిదన్నది ప్రశ్న. ఎన్నికలలో విజయాలకు అపజయాలకు సవాలక్ష కారణాలుంటాయి. ఢిల్లీ తీర్పును ఒక రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పుగా గాకుండా, దేశ ప్రజలిచ్చిన తీర్పుగా చూడాలి. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలుంటారు. అది ఒక మినీ ఇండియా. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో వెల్లడయిన ప్రజాభిప్రాయం ప్రతి రాష్ట్రానికి చెందిన పౌరులది. అందుకే ఆ ఎన్నికలకు అంత ప్రాధాన్యం. ఆ ప్రాధాన్యాన్ని దృష్టిలో వుంచుకునే న్యూయర్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, సీఎన్‌ఎన్ బీబీసీ, లండన్ టెలిగ్రాఫ్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి ఫలితాల ద్వారా దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు ఢిల్లీ ఓటర్లు ఇచ్చిన సంకేతాలేమిటో పరిశీలించాల్సిన అవసరమున్నది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేజ్రీవాల్ ఢిల్లీ ఓటర్లనంతా రెండు వర్గాలుగా భాజాపా అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీల్చి బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రత్యామ్నాయం తప్ప మిగతా పార్టీలేని కావు అన్న సందేశాన్ని ఓటర్లకు ఇచ్చారు. దీంతో బీజేపీ వ్యతిరేక ఓటర్లంతా సంఘటితమై తమ ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలకుండా ఆప్‌కు మద్దతుగా నిలిచిన్రు. దీంతో మూడోపార్టీకి స్థానం లేకుండా పోయింది. అందుకే బీజేపీ- ఆప్ పార్టీల అభ్యర్థులు మినహా మిగతా పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణతో ఢిల్లీ గ్రామీణ పరిసరాల్లోని భూ యజమానుల్లో అసంతృప్తి వుంది.

ఈ గ్రామీణ ప్రాంతాల్లోని 18 సీట్లకు 18 సీట్లను ఆప్ గెలుచుకున్నది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఒక్క సీటు కూడా ఆప్ గెలువలేదు. ఢిల్లీలో పూర్వాంచల్ ఓటర్ల ప్రభావం దాదాపు 25 స్థానాల్లో వున్నది. మొదటి నుంచి పూర్వాంచల్ వాసులకు, పంజాబీ సంతతికి చెందిన వారి మధ్య సామాజిక వైరుధ్యముంది. పంజాబీ సంతతికి చెందిన కిరణ్‌బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పూర్వాంచల్ ఓటర్లలో అత్యధికులు బీజేపీకి దూరమయ్యారు. పూర్వాంచల్ వాసులకు బీజేపీ రెండు సీట్లు ఇస్తే.., అప్ పదిమందికిచ్చింది. ఆ పదికి పదింటిని ఆప్ గెలుచుకున్నది. అదేవిధంగా తృణముల్ కాంగ్రెస్ ఆప్‌కు ఈ ఎన్నికల్లో మద్దతు ప్రకటించడంతో బెంగాలీలు అధికంగా వుండే ప్రాంతాల్లో కూడా ఆప్ గెలిచింది.

ఢిల్లీ జనాభాలో 12 శాతం పైగా వున్న మైనార్టీలు కాంగ్రెస్ రేసులో లేకపోవడంతో బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ ఒక్కటేనని విశ్వసించి సంఘటితమై తమ ఓట్లు పార్టీల మధ్య చీలకుండా ఆప్‌కు వేశారు. ఫలితంగా మైనార్టీల ప్రభావమున్న సీట్లన్నింటిని ఆప్ దక్కించుకున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీ చేసిన వ్యూహాత్మక తప్పిదం కిరణ్‌బేడీని పార్టీలోకి ఆహ్వానించి ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే. ఆమె గతంలో ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారిగా వున్నప్పుడు వ్యవహరించిన తీరును ఇప్పటికీ జీర్ణించుకోలేని కార్మికులు శ్రామికులు న్యాయవాదులున్నారు. ఇంకా రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దుకాణాదారులంతా సంఘటితమై ఆప్‌కు మద్దతు పలికిన్రు. ఆప్ విజయానికి దోహద పడ్డ కారణాలు స్థూలంగా ఇవే అయినా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజాక్షేత్రంలో పటిష్టపరిచేందుకు ఒక సంవత్సరకాలం నుంచి చేయని ప్రయత్నం లేదు.

ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆప్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రజా మ్యానిఫెస్టో రూపకల్పన వరకు అన్ని స్థాయిల్లో ఓటర్లను భాగస్వాములుగా చేస్తూ నిర్ణయాలు తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు. సగానికి పైగా ఆప్ అభ్యర్థులు 30 ఏళ్ళకు కొంచెం అటుఇటుగా వున్నవారే గాకుండా రాజకీయాలకు కొత్త ముఖాలు కూడా. 30 వేల మంది కార్యకర్తలతో 300 పైగా సభలు నిర్వహించి ప్రతిసభలో నేను రాజీనామా చేసి తప్పుచేశాను నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. ఢిల్లీ డైలాగ్ పేరిట ప్రతి నియోజకవర్గానికెళ్ళి వేలమందితో సమావేశాలు నిర్వహించి ప్రజాసమస్యలు తెలుసుకుని వారి సూచనల ప్రాతిపదికగా ఎన్నికల ప్రణాళిక రూపొందించారు. ప్రజా క్షేత్రంలో ఆవిర్భవించిన ఈ ప్రజా మ్యానిఫెస్టో ప్రజల చేత- ప్రజల వల్ల- ప్రజల కోసం అన్నచందాన రూపొందించిండు. స్వరాజ్ చట్టం తీసుకొచ్చి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలకు కట్టబెడతాననే వాగ్దానంతో ఓటర్లంతా ఆప్‌కు మద్దతుగా నిలిచిన్రు. అందుకే కేజ్రీవాల్‌ను నక్సలైట్, పిరికోడు, బజారు మనిషని బీజేపీ చేసిన ఆరోపణలను ఢిల్లీ ఓటర్లెవరు పట్టించుకోలేదు.

ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ 40 వేల కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరుల నుంచి 30 వేల కోట్లు. మిగతా 10వేల కోట్లు కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వొస్తది. ఈ బడ్జెట్ ఆప్ ప్రజా మ్యానిఫెస్టో అమలుకు సరిపోతుందా అన్న ది ప్రశ్న. ఆప్ తమ ఎన్నికల ప్రణాళికలో 2 లక్షల ప్రజా మూత్రశాలలు, 500 పాఠశాలలు, 25 ఆస్పత్రులతో పాటు 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో పాటు వ్యయప్రాయాసాలతో కూడుకున్న అనేక అంశాల గురించి ప్రస్థావించింది. ఢిల్లీ రాష్ట్రానికి భూమి కొరతతో పాటు నిధుల కొరత కూడా వుంది. అలాంటప్పుడు ప్రజా మ్యానిఫెస్టో అమలు సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న.
ఢిల్లీ ఎన్నికలు దేశంలోని మధ్యతరగతి ప్రజల మనోభావాలను ప్రతిబింబింపజేసి ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆకాంక్షించే యువతకు స్ఫూర్తినిచ్చినయని చెప్పవచ్చు. ఢిల్లీలో విజయంతో ఆమ్ ఆద్మి పార్టీ ఇతర రాష్ట్రాలలో విస్తరించే అవకాశాలున్నాయి. దేశంలో వరుస విజయాలతో ముందుకు దూసుకెళుతున్న నరేంద్రమోడీ, అమిత్‌షాల నాయకత్వంలోని బీజేపీని ఓడించడం సాధ్యం కాదని భావిస్తున్న తరుణంలో కేజ్రీవాల్ అది సాధ్యమేనని నిరూపించారు.

దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఢిల్లీ ఓటర్లు ఓదారి చూపిన్రు. కాంగ్రెస్‌తో సహా బీజేపీని వ్యతిరేకించే పార్టీలు దినదినం బలహీనపడ్తున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అవసరమైతే ఆప్‌తో కలిసి బీజేపీని ఎదుర్కోగలమని దాని వ్యతిరేక పార్టీలు ముఖ్యంగా వామపక్షాలు, లౌకక శక్తులు భావించి భవిష్యత్తులో జతకట్టే అవకాశాలు లేకపోలేదు. బహుముఖ పోటీలలోనే బీజేపీ బయటపడ్తుంది తప్ప దానికి భిన్నంగా అన్ని పార్టీలు ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ముఖాముఖి పోటీలకు దిగితే మాత్రం ఢిల్లీ ఫలితాలే పునరావృతమవుతాయ న్న సంకేతాన్ని ఈ ఎన్నికలు ఇచ్చినయి.

ఇటీవల సంకీర్ణ ప్రభుత్వాలతో జనం ఎంతగా విసిగిపోయారంటే.. ప్రతిపక్షమనేది లేకుండా చేసేంతటి మెజార్టీని తమకు నచ్చిన పార్టీకి ఇస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదో రకంగా ప్రమాదకరమైన ధోరణి అని చెప్పవచ్చు. ప్రతిపక్షం లేదని కేజ్రీవాల్ భావించకుండా ప్రజలిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జవాబుదారీ తనంతో వ్యవహరించాలి. పారదర్శక పాలనతో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసి ఢిల్లీని అభివృద్ధిపరిచి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఢిల్లీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అప్పుడే ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆప్ నెరవేర్చినట్లు అవుతుంది.

742

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles