తొలి తరం దార్శనికుడు.


Sat,October 6, 2012 05:33 PM

పొ.జి. లక్ష్మణ్
ఓయూ టీచర్స్ ఫోరం ఫర్ తెలంగాణ కన్వీనర్‘తెలంగాణ వాదానికి అసలు సిసలైన సిద్ధాంతకర్తలు తెలంగాణ ప్రజలే తప్ప మరెవ్వరు కారని అనేవారు. ఫణికర మల్లయ్యను మించిన సిద్ధాంతకర్త తెలంగాణ లోనే ఎవ్వరు లేరని జయశంకర్ అనేవారు.

jayaskr3లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు వారిని ఉద్దేశించి ఇలా అన్నారు ‘పుటుక నీది చావునీది బ్రతుకం తా దేశానిది’. ఈ మాటలు ప్రొఫెసర్ జయశంకర్ విషయంలో అక్షరాలా వర్తిస్తయి. పుటుక చావు రెండూ జయశంకర్‌వే అయినా, ఆయన బతుకంతా తెలంగాణ కోస మే సాగింది. సహజంగా తత్త్వశాస్త్రం పునాదులు నిరాశా వాదంతో ప్రారంభమై, ఆశావాదంతో ముగుస్తా యి. తెలంగాణలో పారే నదుపూన్ని ఉన్నా ఇక్కడి భూము ల పంటపొలాలకు దక్కడం లేదు. ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎన్ని ఉన్నా నిరుద్యోగులకు అవి లభించడం లేదు. తెలంగాణలో వనరులు, నిధులు ఎన్ని ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దోపిడీయే కారణం.

ఇది విశ్వసించి తెలంగాణ అభివృద్ధి కేవలం స్వరాష్ట్రంలోనే సాధ్యమనీ, తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి ఎందుకు కావాలో వివరిస్తూ తెలంగాణ వాదానికి శాస్త్రీయబద్ధమైన తాత్త్విక పునాదులు చేసిన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్. జయశంకర్‌లో ఈ తాత్త్విక పునాది ఏర్పడటానికి కారణం, ఆయన ఆర్థికశాస్త్రంలో ఆచార్యులు కావడం. వారికి ప్రొఫెసర్ మంజూర్ అలం, టి.పి.ఆర్ విఠల్ లాంటి వారితో ఉన్న పరిచయం. ‘తెలంగాణ విశ్వవిద్యాలయం, కాళోజీ, టీచ ర్స్ ఫెడరేషన్’ తరుఫున ఆనందరావు తోట జయశంకర్‌లు వేసిందే తెలంగాణవాదంపై వచ్చిన మొదటి పుస్తకం. ఆ రోజుల్లో తెలంగాణవాదులందరికి ప్రేరణ ఆ పుస్తకమే. వివిధ రంగాలలో తెలంగాణను కోస్తాంధ్ర ప్రాంతంతో పోల్చితే ఏవిధంగా వెనుకబడి ఉందో, దానికి కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించా రు. ఈ పుస్తకం నేటితరం తెలంగాణవాదులకూ ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోకపోవడమే కాకుండా, అది దోపిడీకి గురి అవుతున్నది. రాష్ట్రసాధన ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ప్రజలకు మోక్షమార్గం చూపిన తెలంగాణ తొలితరం దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్.

ఆ రోజుల్లో నేను, ప్రభాకర్, హరినాథ్, భిక్షం ఎప్పు డు వరంగల్ వెళ్ళినా కాళోజీని, ఆ పిదప జయశంకర్‌గారిని కలిసి వస్తూ వుండేవాళ్లం. కాళోజీ మరణించిన తర్వాత మేము వరంగల్ వెళ్లడం బాగా తగ్గింది. అప్పుడప్పుడు జయశంకర్‌ను హైదరాబాద్‌లోనే కలుస్తూ వుండేవాళ్లం. మా అందరినీ జయశంకర్‌కు పరిచయం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ ఆనందరావు. అప్పుడు జయశంకర్ సీఫెల్‌లో రిజివూస్టార్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఆ విధం గా జయశంకర్‌తో ఏర్పడిన మా పరిచయం క్రమంగా బలపడి వారిచే ప్రభావితులమయ్యాము . 1987లో ‘తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ ట్రస్టును’ స్థాపించాం. జయశంకర్, కాళోజీలు మా ట్రస్టు గౌరవసభ్యులు. 1969 తర్వా త తెలంగాణవాదం మరుగున పడిపోతున్న తరుణంలో మళ్ళీ దానికి ప్రాణం పోయాలంటే ఒక పత్రిక అవసరముందని భావించాం. ‘మా తెలంగాణ’ అనే మాస పత్రికను స్థాపించాం. ‘మా తెలంగాణ’ మాస పత్రికను స్వర్గీ య కొండా మాధవడ్డి, జయశంకర్, కాళోజీలు తమ చేతుల మీదుగా 1987లో ఆవిష్కరించారు.

1983లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే తెలంగాణ వ్యతిరేక విధానాలకు పాల్పడింది. అప్పటి వరకు తెలంగాణ ప్రాంత వనరులు నిధులు దారి మళ్లడం గురించి మాట్లాడే మాకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కొత్త సమస్యలు తెరపైకి వచ్చినయి.

తెలంగాణ ప్రాంతంలోని శాసనసభ, లోకసభ స్థానాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆంధ్రపాంత్రం నుంచి వలస వచ్చిన అనేకమందిని ఎన్నికల్లో అభ్యర్థులుగా టీడీపీ నిలబెట్టింది. ఇది మమ్ములను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక రోజు కాళోజీ, జయశంకర్ ఆనందరావు తోట సమక్షంలో 1983లో జరిగిన హిమాయత్‌నగర్ శాసనసభ ఎన్నికల ఉదంతం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనామకుడు స్థానికుడైన నారాయణ గౌడ్ విజయం సాధించారు. విజయం సాధించానన్న అమితానందంలో అతడు తట్టుకోలేక అకస్మాత్తుగా గుండె పోటుతో అదే రోజు చనిపోయిండు. కొంత కాలానికి అక్కడ ఉప ఎన్నిక జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థానికేతరుడైన ఉపేంద్రను అక్కడ బరిలో దించింది. ఉపేంద్ర అక్కడ పోటీ చేయడాన్ని స్థానిక హిమాయత్‌నగర్ ఓట ర్లు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోయారు.

ఫలితం ఆయన పరాజయం పాలయ్యారు. ఈ ఉప ఎన్నిక మాలాంటి తెలంగాణవాదుల్లో ఆశను రేకిత్తిచింది. అంతేకాకుండా స్థానికేతరులను తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజావూపతినిధులుగా ఎన్నుకోవడానికి తెలంగాణ ప్రజ లు సుముఖంగా లేరని రూఢీ చేసింది. ఇదే అంశం కల్వకుర్తి నియోజక వర్గంలో 1989లో జరిగిన శాసనసభ ఎన్నికలో తేలింది. 1989 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల నుంచి శాసనసభకు జరిగిన ఎన్నికల బరిలోకి దిగారు. ఆంధ్ర, రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తి నియోజకవర్గంలో చిత్తరంజన్‌దాస్ అనే స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి చేతి లో ఓడిపోయారు. తెలంగాణ ప్రజల మనోభావాలు తెలంగాణవాదానికి అనుకూలంగా ఉన్నాయనే విషయా న్ని ఈ ఎన్నికలు రుజువు చేసినయి. 1970లో తెలంగా ణ ఉద్యమం ముగిసిన తర్వాత తెలంగాణ వాదం కనుమరుగైందని భావించిన వాళ్లకు హిమాయత్‌నగర్, కల్వకుర్తి ఎన్నికలు కనువిప్పు కల్గించాయి.

తెలంగాణ వాదానికి తెలంగాణ ప్రజలను మించిన సిద్ధాంతకర్తపూవ్వరూ లేరని రుజువు చేసినయి. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజ ల ఆకాంక్షకు అద్దం పట్టాయి. కానీ టీడీపీ మాత్రం ఈ ఎన్నికల నుంచి ఏ మాత్రం గుణపాఠాలు నేర్చుకోలేదు. 610 జీవోను విడుదల చేసి దాన్ని అమలు చేయలేదు. ఆరుసూవూతాల పథకంలో భాగంగా వచ్చిన ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డులను రద్దు చేసింది. తెలంగాణ అనే పదాన్నే అసెంబ్లీలో ఉచ్చరించేందుకు వీలులేదని శాసించింది. ఈ ఉదంతాలన్నీ తెలంగాణ వాదానికి బలం చేకూర్చాయి. జయశంకర్‌కు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సంబంధాలు ఉండేవి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్లతో మాత్రం ఉండేవికావు. వారికి తెలుగుదేశం పార్టీ అన్నా రాయలసీమ కాంగ్రెస్ నాయకులన్నా గిట్టేది కాదు.

1996లో నాటి ప్రధాని దేవేగౌడ పంద్రాగస్టు నాడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం తెలంగాణ వాదులందరిని తట్టిలేపింది. నాటి నుంచి తెలంగాణ వాదానికి ప్రజాసంఘాల మద్దతు లభించడంతో అది బలపడింది. ఈ మద్దతు కూడగట్టటంలో జయశంకర్ పాత్ర చిరస్మరణీయం. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితితో తన చివరి పదేళ్ల జీవనయానాన్ని కొనసాగించారు. తుదిశ్వాస విడిచే వరకు దాంతోటే కదం కలిపిండు.

జయశంకర్ బి.ఎ, బి.ఇడి, వరకు తెలంగాణలోనే విద్యనభ్యసించి, బనారస్ హిందూవిశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పీజీ చేశారు. అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశారు. ప్రొ॥ నాగరాజు వద్ద పరిశోధన చేపట్టి ‘ఆంవూధవూపదేశ్ లో పారిక్షిశామిక అభివృద్ధి’ అనే పరిశోధనా పత్రం సమర్పించి 1980లో డాక్టరేట్ పొందారు. 1960లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన జయశంకర్ క్రమంగా ఎదిగి రిజివూస్టార్‌గా, చివరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించబడినప్పుడు మా మిత్రులందరు కాళోజీని వెంటబెట్టుకుని జయశంకర్‌ను కలిశాం. వారికి కృతజ్ఞతలు తెలిపి, ఘనంగా సన్మానించాలని మేము భావిస్తున్నామ ని అన్నప్పుడు దానికి వారు నిరాకరించిరి. అప్పుడు నాకు వారు అన్నమాటలు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ‘నాకు సన్మానాలు అంటే గిట్టవు.

ఈ విశ్వవిద్యాలయానికి నేను వీసీగా ఉన్న కాలంలో ఏమైనా తప్పులు చేస్తే కాళోజీ అధ్యక్షతనే ఒక సమావేశం ఏర్పాటుచేసి, దాని కి నన్ను ఆహ్వానించి నన్ను కడగి పారేయండి’ అని అన్న రు. జయశంకర్ మాట్లాడినా, ఉపన్యసించినా ఒక ఉత్తమ ఉపాధ్యాయు డు క్లాస్‌రూంలో పాఠం చెప్పినట్లుగానే ఉండేది. ఆయన ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు. రిజివూస్టారుగా ఉపకులపతిగా పని చేస్తున్న కాలంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనా చలించలేదు. తెలంగాణ సగటు మనిషి బాధలన్నీ తన బాధలుగానే భావించి స్పందించారు. అంతే తప్ప తన బాధలను తెలంగాణ బాధలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించలేదు. అది జయశంకర్‌కు తెలంగాణ అంశం పట్ల ఉన్న నిబద్ధత. పత్రికలు తెలంగాణవాదులు జయశంకర్ గారిని తెలంగాణ సిద్ధాంతకర్త అని సంబోధించినపప్పుడల్లా వారు నొచ్చుకునేవారు.

‘తెలంగాణ వాదానికి అసలు సిసలైన సిద్ధాంతకర్తలు తెలంగాణ ప్రజలే తప్ప మరెవ్వరు కారని అనేవారు. ఫణికర మల్లయ్యను మించిన సిద్ధాంతకర్త తెలంగాణ లోనే ఎవ్వరు లేరని జయశంకర్ అనేవారు. కుటుంబపరంగా, సమాజపరంగా కూడా అతను అనేక ఆటుపోట్లకు గురయిండు. స్థితవూపజ్ఞుడుగా మూర్తీభవించిన వ్యక్తి త్వం జయశంకర్‌ది. ఆయన అన్నింటికి అతీతం. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా రు. వాటి సాకారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి జయశంకర్. అందుకే ఆయన జీవితం తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శం. ఆయన మనకు అందించిన స్ఫూర్తి తో రాష్ట్రాన్ని సాధిద్దాం.

37

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ