నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్


Sat,July 12, 2014 12:07 AM

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు అందుబాటులోకి వచ్చేది. దాంతోపాటు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలను ఈ ఐటీ ఐఆర్ ప్రాజెక్టులోని పరిశ్రమలతో అనుసంధానిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.

కాలానుగుణంగా మారేది మనుగడ సాధించగలదు. మారనిది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కాలానుగుణంగా మానవ సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ నూతన పుంతలు తొక్కుకుంటూ ముందుకు సాగుతుంటా యి. శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పులను మానవుడు సమాజ అభివృద్ధికి ఉపయోగించుకుం టే ఆ సమాజం పురోగమన పథంలో పయనిస్తుం ది.లేకుంటే తిరోగమనమే అనివార్యంగా దాని మార్గమవుతుంది. ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక సమాజం వరకు కాలానుగుణంగా అభివృ ద్ధి చెందుతూ వస్తున్న ఈ శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావంతో మానవ సమాజంలో చెలామణిలోవున్న కొన్ని అంశాల నిర్వచనాలు కూడా పూర్తిగా మార్పుకు గురవుతున్నాయి. దీంతో నూతన నిర్వచనాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయి.

ఒకప్పు డు అక్షర జ్ఞానం వున్నవారినే అక్షరాస్యులుగా పరిగణిస్తే ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం వున్నవారినే అక్షరాస్యులుగా పరిగణించడం జరుగుతున్నది. ఈ విషయమే మారుతున్న నిర్వచనాలకు ఒక ఉదాహరణ. ఒకప్పుడు విద్యలేని వాడిని వింతపశువుగా పరిగణించిన సమాజం నేడు కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారిని వింత పశువుగా పరిగణించే కాలం వచ్చింది.అంటే కంప్యూటర్ పరిజ్ఞానం దాని ఆవశ్యకత నేడు ఎంతటి కీలకదశకు చేరుకుందో దీనివల్ల మనకు అవగతమవుతుంది. అభివృద్ధి చెందిన సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో నేడు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది.

మనదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సంఖ్య 27 లక్షలకు చేరుకున్నది. దీనిబట్టి ఐటీ రంగం ఎంతవేగంగా అభివృ ద్ధి చెందుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఐటీ శాఖ కేటాయించబడిన మంత్రులు అలకబూని ముఖ్యమంత్రిపై అసమ్మతి వ్యక్తం చేసిన రోజులున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడదొక కీలకమైన మంత్రిత్వశాఖగా ఎదిగింది.లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగించే శాఖ అది. 2012లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంతంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. దీంతో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఐటీ పరిశ్రమల వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే ఐటీ రంగానికి చిరునామాగా వున్న నగరం ఐటీఐఆర్ రాకతో మరిన్ని పరిశ్రమలకు కేంద్రంగా మారు తుంది.అమెరికాలోని సిలికాన్ వ్యాలీని పోలిన అభివృద్ధికి గ్రేటర్ హైదరాబాద్ ఇక నుంచి కేంద్రం కానుంది అని నిపుణుల అంచనా. నిపుణులు ఆశించిన విధంగా ఈ ప్రతిపాదిత ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తి అయితే అది చైనాలోని షేన్‌జెన్ ఐటి సెజ్‌ను సహితం మరిపించగలదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ప్రతిష్ఠాత్మకంగా చేపడ్తున్న ఈ ప్రాజెక్టును తెలంగాణ పునర్నిర్మాణానికి తొలి అడుగుగా భావించడమే గాకుండా నూతన రాష్ర్టానికి దిశా నిర్దేశం చేసేదిగా పేర్కొనవచ్చు.

ఇప్పటివరకు మన రాష్ట్రంలో వున్న ఐటీ పరిశ్రమలు 1268.వాటిలో పనిజేస్తున్న ఉద్యోగస్తులు 3,18,624 మంది. సాలీనా ఈ పరిశ్రమలు నిర్వహిస్తున్న లావాదేవీలు 53,246 కోట్లు. సాఫ్ట్‌వేర్ రంగంతోపాటు ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది. 60 వేల మంది ఉద్యోగస్తులతో రాష్ట్రంలోని 300 ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా సాలీనా జరుగుతున్న ఉత్పాదన 6500 కోట్లు.అంటే ఐటీ దాని అనుబంధ పరిశ్రమ లు ఏ స్థాయికి ఎదిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమలు ఐటీఐఆర్ రాకతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యాభైవేల ఎకరాల్లో విస్తరించనున్నవి. ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వం రెండుదశల్లో పూర్తి చేయాలని యోచిస్తున్నది. మొదటి దశను 2018 నాటికల్లా పూర్తిచేసి రెండవ దశను 2038 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. ఐటీఐఆర్ ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలోకి 1.18 లక్షల కోట్లు ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సెక్టారులోకి 1.01లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని నిపుణుల అంచనా.

49,912 ఎకరాల్లో విస్తరించబోతున్న ప్రతిపాదిత ఐటీఐఆర్‌కు 3348 మెగావాట్ల విద్యుత్తుతో పాటు 452 ఎంఎల్‌డీల నిరంతర నీటి సరఫరా అవసరం. నిపుణుల అంచనా ప్రకారం ప్రతిపాదిత ఐటీఐఆర్. ఆశించిన స్థాయిలో పూర్తయితే, 13,63,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తుం ది. దీంతోపాటు మరో నాలుగింతల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశమున్నది.

ప్రత్యక్షం గా, పరోక్షంగా ఒక్క సాఫ్ట్‌వేర్ రంగంలోనే దాదాపు 53,64,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న మాట. దీనికితోడుగా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగంలో ప్రత్యక్షంగా 1,40,000 మందికి పరోక్షంగా 2,30,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నట్లు నిపుణుల అంచనా. ఆశించిన స్థాయిలో ఇవి పూర్తి అయితే వీటి ద్వారా సాలీనా జరిగే లావాదేవీలు 5,73,909 కోట్ల వరకు వుంటాయని నిపుణుల అంచనా. ఐటీ రంగంలో నేడు దేశంలో నాల్గవ స్థానంలో వున్న మన రాష్ట్రం 2038నాటికి మొదటి స్థానానికి అతి త్వరలోనే చేరుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. ఐటీఐఆర్ పరిధిలోని ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించారు.దీంతో ఇప్పటి వరకు ఐటీ పరిశ్రమలు కేవలం హైదరాబాద్ పశ్చిమానికే పరిమిమయ్యాయి.ఇప్పుడు నగరం నలుదిశలుగా వ్యాపించి నగరాభివృద్ధికి దోహదపడుతుంది.

ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు నగరాన్ని వైఫై హబ్‌గా మార్చాలని యోచిస్తుంది. దేశంలో ఉచిత వైఫై సేవలందిస్తున్న తొలి నగరంగా బెంగుళూరు కొద్దినెలల క్రితమే మారింది. బెంగుళూరు నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది.దీనికి భిన్నంగా మన దగ్గర హెచ్‌ఎండిఏ పరి ధి మొత్తాన్ని వైఫై ఆధారితంగా మార్చాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో రానున్న కొద్ది రోజుల్లో గ్రేటర్ హైద్రాబాద్ పరిధి వైఫై ఆధారిత నగరంగా మారబోతున్నది.దీంతో తెలంగాణలోని సగం జనాభాకు వైఫై సేవలు అందుబాటులోకి రాబోతున్నా యి. ఈ సౌలభ్యం వల్ల రోజుకు మూడు గంటల చొప్పున 50 ఎంబీ డేటా వరకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఐటి రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ నగరానికి వైఫై సేవలు తోడవడంతో నగరం ఇక నూతన సాంకేతిక శోభను సంతరించుకోనున్నది.

G-LAXMAN ప్రభుత్వ రంగసంస్థల్లో ఉద్యోగాలు లభించేది తక్కువ మందికి మాత్రమే.ఉద్యోగాలు అధికంగా లభించేది ప్రైవేటు రంగంలోనే, ప్రయివేటు రంగంలోని ఉద్యోగాల్లో అత్యధిక శాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. ఉపాధి అవకాశాలు మెండుగా వుండే ఈ రంగం పరిశ్రమలు ఉద్యోగ నియామకాల్లో ప్రతిభకే పట్టం కడ్తయి తప్ప ఎలాంటి రిజర్వేషన్లు పాటించవు. వాళ్ల అవసరాలను తీర్చే విద్యా నైపుణ్యాలు వున్నవారినే వాళ్లు ఆదరించేది. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగాలను బట్టి మన విద్యా నైపుణ్యాలుంటేనే మనకు వాటిలో ప్రవేశం దక్కేది. అందుకే ప్రతిపాదిత ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు అందుబాటులోకి వచ్చేది. దాంతోపాటు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలను ఈ ఐటీ ఐఆర్ ప్రాజెక్టులోని పరిశ్రమలతో అనుసంధానిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.అలాగే మనం ఆశిస్తు న్న నవ తెలంగాణ నిర్మాణానికి దిశానిర్దేశం ఒనగూరుతుంది.


1393

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles