తెలంగాణ చోదకశక్తి


Sat,April 28, 2012 01:52 AM

తెలంగాణ రాష్ట్ర సమితి పదకొండేళ్లు పూర్తిచేసుకోవడం ఒక చారివూతక విశేషం. ఈ పదకొండేళ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర రాజకీయాల్లో తెచ్చిన మార్పు అసాధారణం. ‘తెలంగాణ’పదం ‘ఉచ్చరించడానికి వీలులేని’ పరిస్థితి నుంచి తెలంగాణ పదం ‘ఉచ్చరించకుండా ఉండలేని’ పరిస్థితి రావడం ఈ పదకొండేళ్లకాలం లో వచ్చిన గొప్ప మార్పు. ఒక్కరు ఇద్దరు ముగ్గురు పదుగురై ఒక మహా ఉద్యమంగా పరిణమించిన సందర్భం. తెలంగాణ ఇవ్వడమో లేక రాజకీయంగా చావడమో తప్పని పరిస్థితిని కాంగ్రెస్ ముందుంచిన రాజకీయ ప్రస్థానం ఇది. తెలంగాణపై స్పష్టమైన తీర్మానాన్ని చేయడమో లేక శాశ్వతంగా తెలంగాణ విద్రోహులుగా మిగిలిపోవడమో-ఏదో ఒకటి తేల్చుకోవలసిన కీలకదశకు తెలుగుదేశాన్ని నెట్టిన విశిష్ట ఘట్టం ఇది. తెలంగాణ సమాజం అంతా ఒకవైపు, మిగిలిన తెలంగాణ ద్రోహులంతా ఇంకోవైపు మోహరించబడిన ప్రత్యేక పరిస్థితి ఇది. ఒక్క దశాబ్దకాలంలో ఇంత మార్పు, ఇన్ని పరిణామాలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ మార్పులకు చోదక శక్తి ఎవరు? ఎన్ని కష్టాలు పడితే ఇది సాధ్యమైంది? ఎన్ని ఎదురుదెబ్బలు, ఎన్ని కష్టనష్టా లు, ఎన్ని బాధలు, కన్నీళ్లు, త్యాగాలు, విద్రోహాలు చవి చూసింది తెలంగాణ ఉద్యమం?

తెలంగాణ ఉద్యమంపై జరిగినన్ని రాజకీయ దాడులు ఏ ఉద్యమంపైనా జరగలేదే మో! తెలంగాణ ఉద్యమ సారథి కె.చంద్రశేఖర్‌రావుపై జరిగినంత దుష్ప్రచారం, విమర్శలదాడి రాష్ట్రంలో ఏ నాయకుడిపైనా జరగలేదు. కేసీఆర్ వ్యక్తిగత జీవితంపై జరిగినంత చర్చ ఏ నాయకుడి జీవితంపై జరగలేదు. చాలాసార్లు సీమాంధ్ర నాయకత్వంలోని రాజకీయ పక్షాలు, పత్రికలు, చానెళ్లు విడివిడిగా, జమిలిగా ఒక పథకం ప్రకారం దాడి చేశాయి. కానీ అవేవీ కాలపరీక్షకు నిలబడలేదు. దూదిపింజల్లా తేలిపోయాయి. తొలుత చంద్రబాబునాయుడు, తర్వాత రాజశేఖర్‌డ్డి టిఆస్‌పై, కేసీఆర్‌పై ఎన్ని కుట్రలు చేశారని? చంద్రబాబు కొందరు తెలంగాణ నాయకులను కొనుగోలు చేస్తే, రాజశేఖర్‌డ్డి ఏకంగా తెలంగాణ ఎమ్మెల్యేలనే కొనుగోలు చేశా రు. చంద్రబాబు ఉద్యమాన్ని ఆగంపట్టించాలని చూస్తే, రాజశేఖర్‌డ్డి టీఆస్‌ను పాతరేయాలని చూశారు. కేసీఆర్ ఉద్యమాలు, త్యాగాల పునాదులపై ఒక్కొక్క మెట్టే నిర్మించుకుంటూ వస్తే, మరోవైపు అడుగడుగునా విద్రోహాల ముళ్ల కంచెలు పరిచి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాల ని చూశారు బాబు, వైఎస్. తరచూ అసత్యాలు, అర్ధసత్యా లు కుమ్మరించి, అవే పత్రికల్లో రాయించి తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేశారు. కొన్ని సార్లు విజయం సాధించారు కూడా.

ఎన్నికలను ఎలా మేనేజ్ చేయాలో, ఎన్నికల్లో డబ్బు లు ఎలా ఖర్చు చేయాలో నేర్పించినవాడు చంద్రబాబునాయుడు. ఎన్నికల సమయంలో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా అందరినీ ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చినవాడు చంద్రబాబునాయుడు. రాజకీయా ల్లో క్విడ్ ప్రో క్వో పద్ధతిని ప్రవేశపెట్టినవాడు చంద్రబాబు. కంపెనీలకు మేలు చేసి, వారి నుంచి ఆర్థిక మేళ్లు పొందడం చంద్రబాబుతోనే మొదలైంది. అయితే ఈ విద్యల్లో చంద్రబాబు, వైఎస్‌ల బడి ఒక్కటే. డిగ్రీల తేడా! చంద్రబాబు డిగ్రీ చదివితే, రాజశేఖర్‌డ్డి పీజీ చదివారు. పీహెచ్‌డీ కూడా చేశారు. బడా కంపెనీల నుంచి వందల కోట్ల ఎన్నికల నిధులు సేకరించడం, టిక్కెట్ల పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఇతరపార్టీల నాయకులను కొనుగోలు చేయడం, ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో తిరుగుబాట్లు చేయించడం...బాబుకు, వైఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య. బాబు, వైఎస్-ఇద్దరూ కుటుంబ రాజకీయాలపై ఆధారపడినవారే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా తమ కుటుంబ సభ్యులను గెలిపించుకున్నవారే. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించినవారే. ఏ నీతిని, ఏ విలువలనూ గౌరవించని నాయకులు వీరు. కానీ వీరి నీతిబాహ్య రాజకీయాల గురించి గానీ, వీరి వ్యక్తిగత జీవితం గురించి గానీ ఏరోజూ ఏ నాయకుడూ, ఏ పత్రికా, ఏ చానెల్ మాట్లాడిందీ, రాసిందీ, ప్రసారం చేసిందీ లేదు. ‘చంవూదబాబు రాత్రి ఏమి తింటారు? ఎక్కడికి వెళతారు? ఎవరిని కలుస్తారు? వైఎస్ రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏం చేస్తారు? ఏం మద్యం సేవిస్తారు? ఎవరిని కలుస్తారు?’ అని ఏ పత్రిక అయినా, ఏ నాయకుడయినా మాట్లాడారా? లేదు.

కానీ కేసీఆర్ గురించి మాట్లాడని అంశం లేదు. టికెట్లు అమ్ముకుంటారని, చందాలు వసూలు చేస్తారని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, మద్యం సేవిస్తార ని...ఇంకా అనేకానేక విమర్శలను అదేపనిగా కుమ్మరించారు. సీమాంధ్ర పార్టీలు, సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని కేసీఆర్‌కు ఒక చెడుమువూదను ఆపాదించే పని చేశా యి. కానీ తెలంగాణ విషయంలో ఆయనకున్న నిబద్ధత కారణంగా ఆ విమర్శలు ఎక్కువకాలం నిలవలేదు. నిజానికి విమర్శలు చేసే వారి టార్గెట్ కేసీఆర్‌ను వ్యక్తిగతం గా కించపర్చడం కాదు, తెలంగాణవాదాన్ని నైతికంగా దెబ్బతీయడం. కేసీఆర్‌ను బలహీన పర్చితే తెలంగాణ వాదాన్ని బలహీనపర్చవచ్చన్నది వారి అసలు ఉద్దేశం. కానీ తెలంగాణ ఉద్యమం, టీఆస్ చాలా పరిణతితో ఆ దాడులన్నింటినీ తిప్పికొడుతూ వచ్చింది. పది మంది టీఆస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినప్పుడు, 2008 ఉప ఎన్నికల్లో పార్టీ కొన్ని స్థానాల్లో పరాజయం పాలైనప్పుడు, రాజశేఖర్‌డ్డి తిరిగి గెలిచినప్పుడు తెలంగాణవాదం పని అయిపోయిందని, కేసీఆర్ ఇక ఇంట్లో కూర్చోవలసిందేనని సంబురాలు జరుపుకున్నవారు ఉన్నారు. సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు తన్మయత్వంతో ఊగిపోయాయి.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన రాజశేఖర్‌డ్డిని ధీరునిగా, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోవడం కేసీఆర్ ఓటమిగా కుప్పలుతెప్పలుగా విశ్లేషించాయి. కానీ వారి సంబరం ఆవిరికావడానికి, తన్మయత్వం వదిలిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. తాత్కాలిక విరామాలు, పరాజయాలు ఎదురయి ఉండవచ్చు, కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు వారి అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చారు. దెబ్బతిన్న ప్రతిసారీ ఫీనిక్స్ పక్షిలాగా మరింత బలంతో పైకి లేస్తూ వచ్చారు. ఉద్యమపతాకాన్ని ఎగరేస్తూ వచ్చారు. ఆయన పంతం, ఓర్పు, నేర్పు తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సజీవంగా, గతిశీలంగా కొనసాగిస్తూ వచ్చాయి. ఉద్యమ శక్తులన్నింటికీ ఆయనే ఒక చోదక శక్తిలాగా పనిచేస్తూ వచ్చారు. తెలంగాణవాదాన్ని జాతీయ రాజకీయ గగనతలంపై సమున్నతంగా ఎగరేశారు. రాష్ట్రంలోని రాజకీయ శక్తులన్నీ తెలంగాణవాదం చుట్టూ ఒకే కక్ష్యలో పరివూభమించేట్టు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇంకా అనేక శక్తులు చురుకుగా పాల్గొన్న సంగతి నిజమే, కానీ వారిలో చాలామంది ప్రేరక శక్తుల పాత్రలోనే ఉండిపోయారు. తెలంగాణకోసం యుద్ధం చేయాలని, మిలిటెంట్ పోరాటాలు చేయాలని, సీమాంవూధుల ఆర్థిక మూలాలపై దాడులు చేయాలని పిలుపులిచ్చే వారే తప్ప, ఆచరణలో వారు పెద్దగా పురోగతి సాధించలేకపోయారు. ఎటుచూసినా ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఒక్కరే పెద్ద దిక్కుగా మిగిలారు.

‘మన ఓట్లతో మన సీట్లను మనమే గెల్చుకుని’ తెలంగా ణ అస్తిత్వ పతాకాన్ని ఢిల్లీలో ఎగరేయాలన్న కాంక్ష ఇప్పు డు తెలంగాణ నలుచెరగులా పరుచుకుంటున్నది. రాష్ట్రాన్ని ఎవరో ఇవ్వడం కాదు, మనమే తెచ్చుకునే పరిస్థితి రావాల ని, యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి ఎదగాలని తెలంగాణ అంతరంగం కోరుకుంటున్నది. తెలంగాణవాదం ఇవ్వాళ జనజీవనంలో ఎంతగా ఇంకిపోయిందో రెండు రోజుల క్రితం ఒక డాక్టర్ మాట్లాడిన తీరు చూస్తే అర్థమవుతుంది-‘‘మన పార్టీలకు, నాయకులకు వివేకం లేదు. దూరదృష్టీ లేదు. అంతా మరుగుజ్జులు. తక్షణ లక్ష్యాలపైనే(షార్ట్ గోల్స్) మక్కువ. తెలుగు ప్రజల మేలుగోరే పార్టీలేవైనా తెలంగాణ సమస్యను ఇంతకాలం నాన్చుతారా? సందిగ్ధం తో రాష్ట్రం నాశనమవుతుంటే ఇలాగే నాటకాలాడతారా? తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉంటే కొంపలు మునుగుతాయా? ముందంతా ఒప్పుకుని ఇప్పుడు ఈ కుప్పిగంతులు దేనికి? ఒకసారి అవునని, మరోసారి కాదని ఎన్నిరకాలుగా పిల్లిమొగ్గలు వేస్తారు? ఇవి ప్రజల బాగోగులు కోరే రాజకీయ పార్టీలేనా? వీళ్లు రాష్ట్రాన్ని ఉద్ధరించే నాయకులేనా? వీళ్లను ‘సన్నాసులు, దద్దమ్మలు’ అని కేసీఆర్ విమర్శించడంలో తప్పేముంది? దేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా పునర్వ్యవస్థీకరించాలి. పెద్ద రాష్ట్రాలను పాలనాసాధ్యమైన, నిర్వహణాసాధ్యమైన భాగాలు (మేనేజియబుల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్)గా విభజించాలి. ఇది దేశానికీ మంచిది. ప్రజలకూ మంచిది’’. ఆయన గొప్ప రాజకీయ పండితుడు కాదు. మహా జర్నలిస్టూ కాదు. రాజకీయ మనోవిశ్లేషకులూ అంతకంటే కాదు. ఇరవై నాలుగు గంటలూ వృత్తిలో తలమునకలై ఉండే ప్రముఖ వైద్యుడు. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కూడా కాదు. కేవలం కామన్ సెన్స్‌తో ఆయన మాట్లాడారు. ఈ కామన్ సెన్స్ కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాలకు లేకపోవచ్చు, కానీ ప్రజలకు ఉంది. నాయకుల పదవీరాజకీయాలు, రెండుకళ్ల సిద్ధాంతాలు ఇప్పుడు జనానికి చాలా తేలిగ్గా అర్థమవుతున్నాయి. ఈ చైతన్యానికి చుక్కాని టీఆస్.

ఒక మండలంలోని స్థానిక పత్రిక నుండి న్యూయార్క్ టైమ్స్ దాకా, లండన్ థేమ్స్ నది ఒడ్డునుండి వాషింగ్టన్ వైట్‌హౌస్ వీధి వరకు తెలంగాణ చిరపరిచితమయింది. ఫేస్‌బుక్, ట్విటర్‌లలో నిత్య తెలంగానం విశ్వజనీనమయింది. వీధి ధర్నాలనుండి విదేశాల్లో ర్యాలీల వరకు విరాజిల్లుతోంది.
ఇదంతా కేవలం పదకొండేళ్లలో ఒకే ఒక వ్యక్తి వల్ల. ఇది అందరికీ తెలుసు. తెలంగాణవాదులనుండి తెలంగాణ ద్రోహుల వరకు. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం ఇప్పుడిక అనవసరం.

[email protected]

335

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles