గెలుస్తున్నదెవరు? ఓడుతున్నదెవరు?(కట్టా మీఠా)


Fri,March 30, 2012 11:02 PM

వసంతం మళ్లీ వస్తుంది!ఆకు రాలిపోయిందని చెట్టు కూలిపోతుందా కొత్త చిగురు రాకుండా వసంతమెళ్లి పోతుందా? ఆశలు వమ్మయ్యాయని మనిషి నేలకొరగాలా? ఆశయాలు గెలవకుండా కాలమాగిపోతుందా?
బలిదానం బలహీనత, బలిదానం పరాజయం బలిదానం తలొంచడం! పోరాటం ధీరత్వం, పోరాటం వీరోచితం!
తెలంగాణ లయిస్తుంది, తెలంగాణ జయిస్తుంది! రేపటి వెలుగుల కోసం మీ తనువులు నిలపండి! వచ్చే వసంతం కోసం మీ నవ్వులు ఆపండి!ఆత్మహత్యలు ఓటమిని అంగీకరించడం. పరాజయ భావనతో కుంగిపోవడం. కానీ మనం ఓడిపోయామా? పరాజయభారంతో కుంగిపోవలసిన దుస్థితిలో ఉన్నామా? లేదు-మనం గెలిచాం. గెలుస్తున్నాం. ఇక ముందు కూడా గెలుస్తాం...తెలంగాణపై 30 కి పైగా పార్టీలను ఒప్పించి, లేఖలు ఇప్పించి, దేశవ్యాప్త ఏకాభివూపాయాన్ని కూడగట్టి, దీక్షలు చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించగలిగాం. అది మనం సాధించిన తొలి విజయం. తెలంగాణకు అడ్డం పడినవాళ్లను, అడ్డంగా మాట్లాడినవాళ్లను, రాజీపడినవాళ్లను తెలంగాణ సమాజం వెలివేస్తున్నది. చీత్కరిస్తున్నది. వాళ్లను దోషులుగా చూస్తున్న ది. ఈసడించుకుంటున్నది. అడుగడుగునా ఓడిస్తున్నది. ఓడిపోతున్నది తెలంగాణ వ్యతిరేకులు! గెలుస్తున్నది తెలంగాణ ను ప్రేమిస్తున్నవారు. తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నవారు! ఇవ్వాళ తెలంగాణలో బిక్క మొఖం వేసుకుని తిరుగుతున్నది ఎవడు? తప్పు చేసిన భావనతో బిత్తర చూపులు చూస్తున్నది ఎవడు? జనం కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నది ఎవడు? విశ్వాస రాహిత్యంతో దివాళా అంచున నిలబడ్డది ఎవరు? రాళ్లు, చెప్పు లు, కోడిగుడ్లు ఎవరిపై పడుతున్నాయి? జనానికి మొహాలను చాటేస్తున్నది ఎవరు? తెలంగాణలో పుట్టి, తెలంగాణలో ఎమ్మెల్యేలయి, మంత్రులయి దొంగచాటుగా పర్యటనలు చేస్తున్నది ఎవరు? వందలాది మంది పోలీసుల పహారా లేకుండా చివరికి సొంత ఊళ్లకు వెళ్లలేని దుస్థితి ఎవరిది? వాళ్లు టిడిపి, కాంగ్రెస్ నేతలు. ఓడిపోయింది వాళ్లు. ఓడిపోతున్నది వాళ్లు. పరాజయభారంతో కుంగిపోవలసింది, కుమిలిపోవలసింది వాళ్లు.

చేసిన తప్పులకు చెంపలేసుకోవలసింది వాళ్లు. రాజకీయ ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్లు. గెలుస్తున్నది తెలంగాణవాదులు, తెలంగాణవాదం! తెలంగాణ ఇక తెలంగాణవాదులదే. రెండు కళ్లకు, వెయ్యి కాళ్లకు, వంద నాలుకలకు ఇక్కడ స్థానం లేదు. మొన్న పన్నెండు శాసనసభస్థానాల ఉప ఎన్నికలు అదే రుజువు చేశాయి. పోచారం శ్రీనివాసడ్డి ఎన్నిక ఏం చెప్పింది? నిన్న ఆరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలు అదే విషయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పాయి. ఇక ముందంతా ఇదే బాట. తెలంగాణను వాళ్లివ్వడం లేదు. మనం తీసుకుందాం. తెలంగాణలో తెలంగాణవాదుల ప్రమేయం లేకుండా చీమ కూడా కదలని పరిస్థితి తీసుకొద్దాం. అసెంబ్లీలో తెలంగాణవాదుల బలం పెరిగే కొద్దీ ఏమి జరుగుతుందో నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో చూశాం. భవిష్యత్తు అంతా మనదే. అందుకే తెలంగాణను ప్రేమించే బిడ్డపూవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం గెలుస్తున్నాం. వాళ్లు ఓడిపోతున్నారు. వాళ్లది మోసం. మనది ఆశయం. వాళ్లది ద్రోహం. మనది లక్ష్యాన్ని సాధించుకోవాలన్న పటిమ. ఏవిధంగా చూసినా మనం గెలుపు బాటలో ఉన్నాం. మనం చేయాల్సింది కుంగిపోవడం, కృశించిపోవడం కాదు. మనకు పెరగాల్సింది కసి, పట్టుదల. మనకు కావాల్సింది నిరాశా, నిస్పృహలు కాదు. వెన్నుచూపని మొండితనం, మొక్కవోని ధైర్యం.

ఏ విజయమూ యుద్ధం మొదలు పెట్టగానే రాదు. ఏ శత్రువూ పోరాడకుండా ఓటమిని అంగీకరించడు. ప్రథమ స్వాతంవూతసంక్షిగామం విఫలమయిందని భారతీయులు ఆత్మహత్యలు చేసుకుంటే మలి స్వాతంత్య్ర పోరాటం నడిచేదా? ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని బాలగంగాధర తిలక్ పిలుపునిచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాలకు దేశం ఆ హక్కును సాధించుకుంది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 27 ఏళ్లకు బ్రిటిష్ పతాకం అవనతమై,ఎర్రకోటపై త్రివర్ణ పతా కం ఎగిరింది. ఉప్పుసత్యాక్షిగహం, విదేశీ వస్తు బహిష్కరణ, సంపూర్ణ సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా....ఎన్ని ఉద్యమాలు గడిచిన తర్వాత ఈ దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది? జలియన్‌వాలాబాగ్ వంటి దురంతాలు, లాఠీలు, తూటాలు, స్త్రీలపై అత్యాచారాలు, వేలాదిమంది జాతీయ నాయకుల అరెస్టులు ఇవేవీ యువకులను ఆత్మహత్యకు పురికొల్పలేదు. దెబ్బతిని కిందపడిన ప్రతీసారి, రెట్టించిన స్వేచ్ఛాకాంక్షతో, ఉవ్వెత్తున ఎగసిపడింది యువత. దెబ్బకు దెబ్బతీయడానికి ఉపక్షికమించారే తప్ప, తనువులు చాలించలేదు. కుంగిపోలేదు. లొంగిపోలేదు. భగత్‌సింగ్ ఎలా స్పం దించాడు? బ్రిటిష్ పోలీసుల దమనకాండలో లాలాలజపత్‌రాయ్ మరణానికి ప్రతీకారంగా బ్రిటిష్ సైన్యాధికారి శాండర్స్‌ను కాల్చిచంపడమే కాక, పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పొగ బాంబులు విసిరి, బ్రిటిష్ మూకల చేతిలో ఉరికంబం ఎక్కాడు. చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ సైన్యాధికారులతో వీరోచితంగా పోరాడి నేలకొరిగాడు. ఉధంసింగ్ జలియన్‌వాలాబాగ్ దురంతానికి ప్రతీకారంగా 21సంవత్సరాల తర్వాత అప్ప ట్లో పంజాబ్ గవర్నర్‌గా పనిచేసిన మైకేల్ డయ్యర్‌ను కాల్చి చంపాడు. సుభాష్‌చంవూదబోస్ స్వయంగా ఒక సైన్యాన్నే ఏర్పాటు చేసి బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించారు. బొంబాయిలో నావికులు తిరుగుబాటు చేశారు. ఉద్యమాల్లో ఎగుడుదిగుళ్లు ఉంటా యి. గాంధీ ఉద్యమాన్ని ముందుకు ఉరికించిన సందర్భాలున్నాయి. అర్ధంతరంగా ఉద్యమాలను ఉపసంహరించిన సందర్బాలూ ఉన్నాయి. కానీ ఎవరి దారి వారిదే. విప్లవకారులు ఒకవైపు, అతివాదులు మరోవైపు, మితవాదులు ఇంకోవైపు విడివిడిగా జమిలిగా స్వాతంత్య్రం కోసం పోరాడారు. స్వాతంత్య్రం వచ్చింది.

హైదరాబాద్ విముక్తికోసం జరిగిన పోరాటంలోనూ తెలంగాణ ప్రజలు తెగువ చూపారే తప్ప వెన్ను చూపలేదు. ఆత్మహత్యలకు పాల్పడలేదు. పల్లెలపై దాడులు చేసిన దేశముఖుల గుండాలను, రజాకారు తండాలను దెబ్బకుదెబ్బ కొట్టారే తప్ప కుంగిపోలేదు. గెరిల్లా యుద్ధాలు, మెరుపుదాడులతో నిజాంను ఇక పరిపాలించలేని స్థితికి తీసుకువచ్చారు తెలంగాణ ప్రజలు. దేశాలు, జాతుల విముక్తి పోరాటాల చరిత్ర నిండా ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు.ఎదిరించాలే తప్ప బెదిరిపోకూడదు. పోరాడాలే తప్ప పారిపోకూడదు. ఎప్పటికయినా విజయం మనదే. ప్రజాస్వామిక బలాలన్నీ తెలంగాణ పక్షాన ఉన్నాయి. తెలంగాణ ద్రోహులది మందబలం, మనీబలం, నియంతృత్వం. కానీ ప్రజాబలం ముందు వీళ్లు ఎక్కడ నిలబడతారు? కాం గ్రెస్, తెలుగుదేశం పార్టీలు మొన్నటి ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డాయి. డబ్బును నీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టాయి. పోలీసులను ఉపయోగించి తెలంగాణవాదులను కట్టడిచేసే ప్రయ త్నం చేశాయి. అయినా టిడిపికి మూడు చోట్ల డిపాజిట్లు పో యాయి. కాంగ్రెస్ పతనం అంచున నిలబడింది. ఇదంతా తెలంగాణవాదుల గెలుపు కాదా? తెలంగాణను వ్యతిరేకిస్తున్నవారికి తెలంగాణలో భవిష్యత్తు లేకుండా చేయడం ఒక్కటే ఇప్పుడున్న పరిష్కారం. మన తుది విజయం అందులోనే ఉంది. మన రాజకీయ అస్తి త్వం అందులోనే ఉంది.

తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మధ్యలో ఉంది. అన్ని ఉద్యమాల్లో ఉన్నట్టే ఇందులో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉధృతంగా, మరోసారి మంద్రంగా ఉద్యమం సాగవచ్చు. అంతమాత్రం చేత తెలంగాణ ఉద్యమం వీగిపోదు. ఇది తాటా కు మంటకాదు. నాలుగు కోట్ల మంది హృదయాల్లో జ్వలిస్తున్న మంట. తెలంగాణ జీవనాడుల్లోకి అల్లుకుపోయిన ఉద్యమం ఇది. నిజమే, ఈ గడ్డమీద సైంధవులు, శల్యులు, శకునులకు కొదువలేదు. ఇందులో రాజకీయ నాయకులున్నారు. మేధావులున్నారు. ఒకడు సమైక్యవాది జెండా నీడన కూర్చుని పిచ్చిపట్టినవాడిలా అనునిత్యం తెలంగాణ ఉద్యమం మీదకే రాళ్లు విసురుతుంటాడు. మరొకడు నిన్నమొన్నటిదాకా తెలంగాణా ఎలా రాదో చూస్తాం అంటూ గర్జించినవాడు, చిన్నపదవి ఇవ్వగానే ఉద్యమం చల్లారిందంటాడు. 2014 నాటికి ఇంకా చప్పబడిపోతుందంటాడు. ఇంకొకడు ఒళ్లు అలవకుండా తెలంగాణ కోసం నిజంగా పోరాడుతుంది తామేనని రంకెలు వేస్తుంటాడు. మరో పెద్దాయన వెర్రిని వేదాంతంగా, పిచ్చిని సిద్ధాంతంగా చెలామణి చేస్తూ కారుకూతలు కూస్తుంటాడు. బుడ్డగోచిని, పిలకజుట్టును ముడేసే ప్రయత్నం చేస్తుంటాడు. మోకాలును, బోడిగుండును కట్టేద్దామని చూస్తుంటాడు. తెలంగాణ రానేరాదు పొమ్మంటాడు. వంకరగా చూడ డం ఆయన ఫిలాసఫీ. ఆ కళ్ల కు విద్వేషపు పొరలు తప్ప, సైద్ధాంతిక దృష్టిలేదు. ఆ హృదయానికి పైశాచికానందం తప్ప, తెలంగాణ గుండెను తడిమే ఉద్దేశం లేదు. ఆ మెదడుకు శ్లేష్మంలో కొట్లాడ్డం తప్ప విశాలయుద్ధ ప్రాతిపదిక ఏదీ లేదు. వీళ్లను చూసి జాలిపడాలి తప్ప, మన గుండెలు జారవిడుచుకోవద్దు. వీళ్లు మారాలని ప్రార్థించాలి తప్ప, వీళ్లకోసం చనిపోవద్దు. మారకపోతే వీళ్లను దండించాలి తప్ప, మనం బలికాకూడదు. మనం గెలుస్తున్నాం. మనం గెలుస్తాం. తెలంగాణ సాధించుకుని తీరతాం. ఉద్యమం పడింది పడినట్టే ఉండదు.

2009 ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా ఎగసిపడుతుందని అనుకున్నామా? కేసీఆర్ దీక్ష సమయంలో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తుందని ఊహించామా? మన ఉద్యోగలోకం 42 రోజులపాటు చారివూతాత్మకంగా సమ్మె చేయగలదని అనుకున్నామా? ఇంతకంటే తీవ్రమైన ఉద్యమాలు ఇంకా చెలరేగవచ్చు. తెలంగాణ నినాదాన్ని విజయపథానికి నడిపించవచ్చు. ఆశ, ఆశ యం లేకపోవడం పేదరికం. అవి రెండూ ఉంటే భవిష్యత్తు మనదే.

336

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన