కనిపించని శత్రువు(మాటకుమాట)


Sun,July 17, 2011 03:33 AM

mataku-MATA-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

ఉగ్రవాద దాడులన్నింటినీ ఆపడం కష్టం. దేశంలో 99 శాతం దాడులను నిఘా, సమాచార సేకరణ చర్య ల ద్వారా నిరోధించగలిగాం. కానీ ప్రతి ఒక్క దాడినీ అడ్డుకోవడం అంటే కష్టం. -ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ

అధినేత ఒక్క శాతం అలుసిస్తే
అధికారులు వందశాతం తీసుకుంటారు
పరిపాలించేవాడు చేతులెత్తేస్తే
కాపలాకాసేవాడు లాఠీ పారేస్తాడు
ఒక్కశాతానికే ఇన్ని మారణహోమాలు జరిగితే
ఒక్కశాతానికే ఇంత మంది మరణిస్తే
ముంబై మరో కరాచీ కావడానికి ఎంతసేపు!
ఇది నిజాయితీ కాదు, నిర్భీతీ కాదు,
చేతగాని తనం, చేతులెత్తేసేతనం!

ముంబైలో బాంబు పేలుళ్ల మృతుల చితిమంటలు ఆరక ముందే, క్షతగావూతుల ఆర్తనాదాలు ఇంకా సద్దుమణగక ముందే మన భవిష్యత్ ప్రదాత రాహుల్‌గాంధీ చక్కని గీతోపదేశం చేశారు. ఇది ఇంతే, ఇంతకంటే సాధ్యం కాదని యువ ప్రభువులు సెలవిచ్చా రు. తొంభైతొమ్మిది శాతం దుర్మార్గాలను నిరోధిస్తున్నారట! ఒక్క శాతం మాత్రమే నిరోధించలేకపోతున్నారట! నిరోధించడం కష్టమేనని కూడా తేల్చేశారు. ఢిల్లీలో పార్లమెంటు మొదలుకుని ముంబై ఇండియాగేటు దాకా, జైపూర్ మార్కెట్ మొదలుకుని హైదరాబాద్‌లో గోకుల్ చాట్ దాకా, పవిత్ర కాశీ మొదలుకుని బెంగుళూరు సైన్స్ ఇన్స్టిట్యూట్ దాకా...అన్నీ ఈ ఒక్క శాతంలోనే ప్రభూ! ఒక్కోచోట మూడేసి సార్లు, నాలుగేసి సార్లు....బాంబులు పేలుతూనే ఉన్నాయి ఈ ఒక్క శాతంలోనే! దేశంలో బాంబుపేలుళ్ల మృత్యుఘోషలు వినిపించని దిక్కులేదు నాయకా! నిజ మే...ఇంత పెద్ద దేశంలో అన్ని ఉపద్రవాలు నిరోధించలేకపోవచ్చు! అది వాస్తవమే కావచ్చు. కానీ దేశాన్ని ఏలేవాడు ఆ మాట అనకూడదు మహాప్రబో! పాలకుడు గుప్పిట విప్పకూడదు, పట్టు సడలించకూడదు. అధినేతలు గంభీరంగా ఉంటేనే పోలీసు అధిపతులు ఇంత నీరసంగా ఉన్నారు. మీరు కూడా జారిపోతే, ప్రజలకు అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతమే గతి!

***

తెలంగాణ రాష్ట్రం వచ్చే దాకా ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయవద్దు. మా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధిస్తాం. -తెలుగుదేశంపార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు

గెలవని పేరంటానికి
ఎన్నికలెందుకు? ఎన్నికలెందుకు?
పిలవని పేరంటానికి
యాత్రలెందుకు? జాతరలెందుకు?
ఒకే మాట చెప్పని నోరెందుకు ఊరెందుకు?
ఒకే దారి చూపని రెండు కళ్లెందుకు?
నమ్మని బాగోతానికి ఇన్ని నాటకాలేందుకు?
విశ్వసనీయతలేని వీరలాపలెందుకు?
అవును. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం, అక్కడ సమైక్యాంవూధకోసం చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే పోరాటాలు చేస్తారు! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ, సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ-రెండింటా తెలుగుదేశమే ముందుండాలని మీ బాబుగారు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి మరీ చెబుతున్నారు. ఒకే నాయకుడు, ఒకే జెండా, ఒకే గుర్తు! రెండు కళ్లు, రెండు నాల్కలు, రెండు ఎజెండాలు-అనేక అవతారాలు!

ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? విశ్వసనీయత కోల్పోయిన నాయకుడిని, మాటమీద నిలబడని నాయకుడిని, మాటిమాటికి మాటమార్చే నాయకుడిని ప్రజలు ఎంతకాలం మోస్తారు? డిసెంబరు పది 2009న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర సూత్రధారుల్లో చంద్రబాబునాయుడు ముఖ్యుడు. రాష్ట్రాన్ని యథేచ్ఛగా పాలించి, దోచుకున్న కాంగ్రెస్, టీడీపీల్లోని రెండు సీమాంధ్ర సామాజిక వర్గాలు నాటి నుంచీ నేటిదాకా తెలంగాణకు అడ్డుపడుతున్నాయి. ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడే నాయకుడు. మరో సామాజిక వర్గానికి కాంగ్రెస్‌లో అనేక మంది నాయకులు. లగడపాటి రాజగోపాల్ తెలంగాణకు కనిపించే ప్రత్యర్థి. కనిపించే ప్రత్యర్థిని ఎదుర్కోవడం సులువు. చంద్రబాబునాయుడు కనిపించని శత్రువు. తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు ఈ సూక్ష్మాన్ని గ్రహించకుండా భ్రమలలోకంలో, సీమాంధ్ర మీడియా కల్పించిన కృత్రిమ ఊపూ ఉత్సాహాల మైకంలో ఏవేవో ఊహించుకుంటున్నారు. పాపం ఎర్రబెల్లి!

***

రాజీనామాల ద్వారా తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించదు. రాత్రికి రాత్రే తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనలేం. తెలంగాణ సమస్య జటిలమైంది. దానిపై ఏకాభివూపాయ సాధనకు సంప్రదింపులు అవసరం...మధ్యవూపదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసిన ఆరేళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్ ఏర్పడింది. -కేంద్ర విపత్తుల నివారణ కమిటీ

ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌డ్డి
గాడిదలకు ఓర్పు, నక్కలకు
అతివినయం జన్మ లక్షణం!
నాయకులకు తెగువ,
త్యాగం చేసే నేర్పూ కావాలి!
అతి ఓర్పు, అతివినయం
నాయకుల లక్షణం కాదు
రాజీనామాలు చేయవద్దు-గెలిపించిన వారికి నామాలు పెట్టాలి. రాజీనామాలు వద్దేవద్దు-రాజీ పడి, పదవులు పట్టుకొని వేలాడడమే ముద్దు. రాత్రికి రాత్రే పరిష్కారాలు సాధ్యంకాదు, పదేళ్లు పదవులు అనుభవించిన తర్వాత తీరిగ్గా చూడవచ్చు. మళ్లీ అధికారం కోల్పోయినప్పుడు మాత్రం మాట్లాడడానికి తెలంగాణ సమస్య మిగిలే ఉండాలి. తెలంగాణలో ఆరువందల మంది విద్యార్థి యువకులు బలిదానం చేసుకోవడం విపత్తు కాదు - వరదలు, కరువులు మాత్రమే విపత్తు. చెన్నాడ్డి ధీరోదాత్తంగా పోరాడి ఓడిపోయి, రాజీపడ్డారు. శశిధర్‌డ్డి బీరువులా పారిపోయి, రాజీపడి, పైగా నంగనాచి కబుర్లు చెబుతున్నారు.

ఇప్పటిదాకా సాధించిన ఏకాభివూపాయం ఏకాభివూపాయం కాదు. ఇప్పుడు మరో రెడ్డొచ్చి మళ్లీ మొద లు పెడతాడు. ఏకాభివూపాయం అన్న పదమే ఒక బూటకం. ‘కాన్సెన్సస్’ అన్న పదానికి ఆధిపత్యభావజాలం సృష్టించిన పదం ఏకాభివూపాయం. కాన్సెన్సస్‌కు సరైన అర్థం ‘మెజారిటీ అంగీకారం, స్థూల అంగీకారం’ అని. అందరూ అంగీకరించాలని కాదు. రాష్ట్రాల ఏర్పాటు అధికారం పార్లమెంటుది. మెజారిటీ అంగీకారం అంటే పార్లమెంటులో మెజారిటీ అని. పార్లమెంటులో 400 మందికిపైగా సభ్యుల మద్దతు ఉన్న సుమారు 35రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినవే. ఇంకా ఏం ఏకాభివూపాయం కావాలి? ఎవరి అభివూపాయం కావాలి? తెలంగాణ విడిపోవడానికి సీమాంవూధుల ఆమోదం కావాలా? తమిళుల ఆమోదంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందా? తెల్లోల్ల ఆమోదంతోనే దేశానికి స్వాతం త్య్రం వచ్చిందా?

ఆ కల నిజం కాకూడదు

ఫేస్ బుక్‌లో ఒక మిత్రుడు తనకు వచ్చిన కల గురించి రాశారు. అది చదివి ఒళ్లు గగుర్పొడిచిం ది. ‘తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పత్రికలు, చానెళ్లపై దాడి చేసి నిప్పు పెట్టినట్టు, అవి కాలిపోతున్నట్టు కలగన్నాను. లేచి చూసే సరికి ఏమీ లేదు. అంతా ప్రశాంతంగా ఉంది’ అని రాశారు. ‘ఆ కల నిజం కావాలని కోరుకుంటున్నాను’ అని కూడా రాశారు. అటువంటి కలలు నిజం కారాదని అంద రూ కోరుకోవాలి. ఎందుకంటే ‘ఉద్యమం అదుపు తప్పితే అది మనలను మింగేస్తుంది’ అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలు అందరికీ శిరోధార్యం కావాలి. మనం తప్పులు చేస్తే, వేలెత్తి చూపడానికి అవతల ఒక మీడియా ప్రపంచమే కాచుకుని చూస్తోంది. అయినా ఆ చానెళ్లను చూసి భయపడాల్సింది ఏమీ లేదు. ఆ చానెళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి, ఏడిపిస్తే ఏడవడానికి, ఎగతాళి చేస్తే ఉడుక్కోవడానికి, అవమానిస్తే సహించడానికి తెలంగాణలో ఇంకా అమాయకులు ఎవరూ లేరు. ఇష్టం లేకపోతే ఆ చానెళ్లను చూడకండి. కానీ చూసి రెచ్చిపోకండి. ప్రజాస్వామిక ఉద్యమం ఎప్పటికయినా జయించి తీరుతుంది.

412

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా