ఇప్పటికయినా చెంపలేసుకుంటారా?


Sat,March 24, 2012 03:20 PM

TDP_01బుకాయించి భూములేలవచ్చన్నది పాతమాట. నమ్మకం కలిగించి, విశ్వాసాన్ని చూరగొని మాత్రమే ప్రజల హృదయాలను గెల్చుకోవచ్చునని మరోసారి రుజువయింది. ఉప ఎన్నికల ఫలితాలు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. గుణపాఠాలు స్వీకరించి తమతమ బుద్ధులను మార్చుకుంటే సరి, లేకుంటే భవిష్యత్ ఎలా ఉండబోతున్నదో ఈ ఫలితాల ద్వారా ఓటర్లు హెచ్చరించారు. బుకాయించి, దబాయించి, అబద్ధాలు ప్రచారం చేసి, ప్రత్యర్థులపై బురదజల్లి, మేనేజ్ చేసి రాజకీయాల్లో చెలామణి కావచ్చునని చంద్రబాబు, ముఖ్యమంత్రి ఇంతకాలం నమ్ముతూ వచ్చారు. అదే వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చారు. ‘తెలంగాణ ఉద్యమం చల్లారిపోయింది. అంతా ప్రశాంతంగా ఉంది. చూడండి మేము స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. మా యాత్రల కు జనం వస్తున్నారు’ అని చాటిచెప్పేందుకు చంద్రబాబు, ముఖ్యమంత్రి శతధావూపయత్నాలు చేశారు. తెలంగాణ ఉద్యమం చల్లారలేదని, అది ప్రశాంతంగా ఉండడం కాదని, సమయం వచ్చినప్పుడు ప్రజలు కాటేసి తీరతారని ఉప ఎన్నికలు స్పష్టం చేశా యి. ఇంతకాలం తమలో గూడుకట్టుకున్న అసమ్మతిని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రజ లు ఓటు ఆయుధంతో తీర్చుకున్నారు.

టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి క్రెడిబిలిటీ క్రైసిస్‌లో కొట్టుకుపోతున్నాయి. దానిని గుర్తించి, ఆ సంక్షోభంలోంచి బయటపడే ప్రయత్నం చేయకపోగా బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం ద్వారా సంక్షోభాన్ని రోజురోజుకు పెంచుకుంటున్నాయి. పార్టీని నడిపించే నాయకులకు విశ్వసనీయత, నిబద్ధత, ఒక స్పష్టమైన విధా నం ఉండడం ముఖ్యం. నాయకుడిపై గురి కుదిరితేనే జనం ఓట్లేస్తారు. వెంటనడుస్తారు. వారికోసం యుద్ధాలు కూడా చేస్తారు. నాయకులు కూడా తప్పులు చేస్తారు. కానీ వాటిని సరిదిద్దుకునే అవకా శం కూడా జనం ఇస్తారు. తప్పులు ఒప్పుకుని జనం ముందుకు వస్తే నాయకుడిలోని నిజాయితీని గుర్తిస్తారు. అలా కాకుండా నోరు పెద్దది చేసుకుని, స్థాయి ని మరిచి, ఎంతమాట వస్తే అంతమాట మాట్లాడుతూ, అందరిపై బురదజల్లుతూ, తాను నెగ్గుకు రావాలని చూస్తే జనం నాయకుడిలోని మోసాన్ని పసిగడతారు. ‘నాకు ఎలాగూ చెడ్డపేరు వచ్చింది. నన్ను నమ్మడం లేదు. ఇతర పార్టీల నాయకులనూ భ్రష్టుపట్టిస్తే పోలా. వాళ్లపైనా నమ్మకం పోగొడితే సమానం అవుతాం కదా’ అని చంద్రబాబు లేక మరోనేత అనుకుంటే ఏం జరుగుతుందో ఈ ఫలితాలు చెప్పకనే చెప్పాయి. పడ్డవాడు, చెడ్డవాడు తిరి గి కోలుకోవాలంటే మళ్లీ కష్టపడాలి. మళ్లీ మొదలు పెట్టాలి. అంతేకాని చుట్టూ ఉన్నవాళ్లందరినీ పడేయడానికో, చెడగొట్టడానికో పూనుకుంటే సమాజంలో మంచి మిగలదు.

చంద్రబాబు తాను కోలుకోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని, దానికి నాయకత్వం వహిస్తున్న టిఆస్‌ను పడగొట్టాలని, చెడగొట్టాలని, ఆ పార్టీకి వీలైనంత ఎక్కువ బురదపూయాలని విశ్వవూపయత్నం చేశారు. టిఆస్‌పై పెంట కుప్పలు కుమ్మరించడంకోసం ఇద్దరు ముగ్గురు నోటితీటగాళ్లను నియోగించారు. కొత్త కొత్త అసత్యాలు, కట్టుకథలు తయారు చేసి దాడిచేయించారు. స్థాయీ, సోయి మరచి ఉద్యమ నాయకత్వంపై విమర్శలు చేయించారు. ఏమాత్రం పొంతనలేని అంశాలను తెలంగాణ ఉద్యమానికి ముడివేసి ప్రచారం చేశారు. పోలవరం టెండ ర్ల వ్యవహారం ఇందుకు ఉదాహరణ. ఆ టెండర్లు వేసిన కంపెనీ స్యూ నాగార్జునసాగర్ నిర్మాణం కాలం నుంచీ ఉంది. ఆ కంపెనీని కృష్ణా జిల్లాకు చెందిన వల్లూరిపల్లి నాగేశ్వర్‌రావు అనే ఒక పెద్దాయన నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ కంపెనీలో వారి కుటుంబానిదే పెద్ద వాటా. స్యూతో చంద్రబాబు కూడా నిన్నమొన్నటిదాకా అంటకాగినవారే. అసలు టీడీపీని నడిపిస్తున్నదే కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలు.

కుడి ఎడమల కాంట్రాక్టర్లను, ముందు కార్పొరేట్ కంపెనీలను, నెత్తిన ఎల్లో మీడియాను పెట్టుకుని ఊరేగే చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి, ప్రచారం చేసి, పత్రికలు, చానెళ్లలో రాయించి, ఆరుమాసాలపాటు జనంలో గందరగోళం సృష్టించగలిగారు. స్యూ పోలవరం టెండర్ దాఖలు చేయడాన్ని సకల జనుల సమ్మె విరమణకు ముడివేసి, ఒక అద్భుతమైన కట్టుకథను రక్తికట్టించారు చంద్రబాబు. టెండర్లు ఎలా వేస్తారో, ఎలా ఖరారు చేస్తారో, వాటిపై డబ్బులు ఎప్పుడు వస్తాయో తొమ్మిదేళ్లు ముఖ్యమంవూతిగా పనిచేసిన చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. అయినా తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి ఒక అబద్ధాన్ని సృష్టించాలనుకున్నాడు. పోలవరం టెండర్‌కోసం టీఆస్ అమ్ముడుపోయిందనే అబద్ధాన్ని అలాగే ముందుకు తెచ్చాడు. చంద్రబాబు మాటకు తిరుగులేని కాలంలో, అన్ని పత్రికలకూ, అన్ని చానెల్‌లకూ చంద్రబాబు ఒక్కడే ఎడిటర్‌గా ఉన్నకాలంలో, ఆంధ్రా ప్రయోజనాలే అన్ని పత్రికలు, చానెల్‌ల ప్రయోజనాలుగా నడుస్తున్న కాలంలో ఆయ న ఆటలు సాగాయి. ఇప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయ మీడియా అవతరించి, చంద్రబాబు కుళ్లును, కుట్రలను, కట్టుకథలను చీల్చి చెండాడుతున్నది. జనానికి ఇప్పుడు అసలు పార్శ్వాలు కూడా తెలుస్తున్నాయి. చంద్రబాబు ఇక అడ్డదారి, దొడ్డిదారి, దొంగదెబ్బలు మానుకుని, తననుతాను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే తెలంగాణ తమ్ముళ్లు తమదారి తాము చూసుకోవాలి. తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగస్వాములు కావాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

ఉప ఎన్నికలపై ఒక సంస్థ ఫిబ్రవరి 20-25 తేదీల మధ్య ఒక సర్వేను మార్చి 5-10 తేదీ ల మధ్య మరో సర్వేను నిర్వహించింది. చంద్రబాబు, ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్‌డ్డిలు సభ్యత, సంస్కారం అన్నీ మరచి కెసిఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై దుష్ర్పచారాన్ని ఉప ఎన్నికల ప్రచారంలో పతాకస్థాయికి తీసుకెళ్లారు. వీళ్ల ప్రచారం ఎంతగా పనిచేసిందంటే, తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వచ్చే సరికి టీడీపీ ఓట్ల శాతం 2 నుంచి 10 శాతం తగ్గిపోయింది. అదే సమయంలో టిఆస్‌వైపు 2 నుంచి పది శాతం ఓట్లు పెరిగింది. విచిత్రం ఏమంటే పెద్దగా నోరుపారేసుకోకుండా ప్రచారం చేసిన కాంగ్రెస్‌కూ ఇదేకాలంలో ఓట్ల శాతం పెరిగింది. ఒక అబద్ధాన్ని వందసార్లు, వందమందితో వీలైనంత గట్టిగా మాట్లాడిస్తే అది నిజమైపోదు. జనానికి అర్థమవుతుంది. ఛీకొడతారు. ఉప ఎన్నికల్లో అదే జరిగింది.

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఒక వంచన. ఒక ద్రోహపూరిత విధానం. మనిషికి రెండు కళ్లు ఇచ్చిందిండు చూపులకోసం కాదు. ఒకే చూపుకోసం. సమ్యక్‌దృష్టికోసం. దేవుడు రెండు కళ్లు ఇచ్చా డు, కానీ రెండు నాల్కలు ఇవ్వలేదు. ఎందుకంటే చూపు, మాట, బాట ఒకటి కావాలని. ఇన్ని చూపు లు, ఇన్ని మాటలు, ఇన్ని బాటలు నడిచే బాబును ఏమనాలి? ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒక మాట కు నిలబడి ఉంటాడనే నమ్మకం జనానికి కలగాలి. అది లేని నాడు ఎవడూ నమ్మడు. ‘తెలంగాణను అడ్డుకున్నామని, సమైక్యవాదానికి అండగా నిలిచామని కోవూరులో మమ్మల్నేం ఆదరించలేదు. 11 కోట్లు ఖర్చు చేసినా మా నియోజకవర్గాన్ని మేము దక్కించుకోలేకపోయాం. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని, టిఆస్ అభ్యర్థులపై పోటీ పెట్టడడం లేదని ప్రకటించి, వేర్పాటువాదానికి పరోక్షంగా మద్దతుఇచ్చిన జగన్ అభ్యర్థిని కోవూరులో ఘనంగా గెలిపించారు. ఇక్కడ అర్థం అవుతున్నది ఏమంటే చంద్రబాబును నమ్మలేదు. జగన్‌ను నమ్మారు.

మావాడు ఇప్పటికయినా తెలుసుకుంటే మంచిది’ తెలుగుదేశం సీనియర్ నాయకుని విశ్లేషణ ఇది. చంద్రబాబు, ఆయన వందిమాగధ బృందం, ఎల్లో మీడియా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నిజాయితీని ప్రదర్శించలేదు. తమ ఓట్లు పెరిగాయని, 2014నాటికి ఇంకా ఏదో పొడిచేస్తామని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2010లో జరిగిన 12 నియోజకవర్గాల ఉప ఎన్నికల కంటే ఇప్పు డు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్లు పెరిగాయట! కించిత్ రాజకీయ అవగాహన ఉన్నవారికెవరికయినా వీరి పోలిక చూస్తే నవ్వొస్తుంది. ఆ పన్నెండు నియోజకవర్గాలు టిఆస్ నియోజకవర్గాలు. ఆ నియోజకవర్గాల్లో టిడిపికి ఎప్పుడూ టికానా లేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన ఆరు నియోజకవర్గాల్లో 2009లో ఐదు నియోజకవర్గాల్లో టిడీపీ పోటీ చేసింది. మూడు చోట్ల గెలిచింది. అప్పట్లో ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 3.. కానీ ఇప్పుడు వచ్చిన ఓట్ల శాతం 19.2. సుమారు 20 శాతం ఓట్లు తగ్గిపోయాయి. మూడుచోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి.

తెలుగుదేశానికి ఇప్పటికీ సమయం మించిపోలేదు. తెలంగాణలో మనుగడ సాధించడం అన్నది ఆ పార్టీ చేతిలోనే ఉంది. తెలంగాణపై పార్టీ చేసిన తీర్మానానికి కట్టుబడి కేంద్రానికి లేఖ ఇస్తే సకల పాపాలూ హరించుకుపోతాయి. ఇక అప్పుడు కాంగ్రెస్ మాత్రమే దోషిగా మిగులుతుంది. కాంగ్రెస్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకతప్పని అగత్యం ఏర్పడుతుంది.

383

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles