అఖిలేశు, లోకేశు,చంద్రబాబు...


Sat,March 10, 2012 11:28 PM

KattaS talangana patrika telangana culture telangana politics telangana cinemaమేము మాయావతి విగ్రహాలను కూల్చం’, ‘గూండాగిరికి పాల్పడితే సొంత పార్టీవారినయినా సహించబోము’, ‘రాజకీయాలే అటువంటివి. గత ఎన్నికల్లో మేము ఓడాం, ఈ ఎన్నికల్లో గెలిచాం. వచ్చేసారి మేము ఓడిపోవచ్చు. అదే విధంగా రాహుల్ ఈసారి ఓడిపోయారు, వచ్చేసారి గెలవచ్చు. ప్రతీకార రాజకీయాలకు తావులేదు’-ఈ వ్యాఖ్యలు వింటుంటే ఎంతో పరిణతి చెందిన, తలపండిన రాజకీయవేత్త చేసినట్లు అనిపిస్తాయి. కానీ 3 ఏళ్లకే రెండుసార్లు ఎంపీగా గెలిచిన అఖిలేశ్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితా లు పూర్తిగా వెలువడిన తర్వాత, అధికారం తమ చేతికి రావడం ఖాయమైన తర్వాత ఉడుకురక్తం ఉరకపూత్తే ఒక యువ రాజకీయవేత్త చేసిన వ్యాఖ్యలివి. ఆయన ఈ మాటలకు కట్టుబడి ఉంటారా? భవిష్యత్తంతా ఇంతే నిబ్బరంగా ఉంటారా? అన్నది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు.

ఆచరణలో ఆయన పార్టీ కార్యకర్తలు గూండాగిరిని నిలిపివేయడమూ వెంటనే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక మంచి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సంయమనం, సౌమ్యత, పరిణతి ఆయనలో ఉన్నాయని మాత్రం ఈ మాటలను బట్టి తెలుస్తున్నది. ఐదురాష్ట్రాల కు ఎన్నికలు జరిగినా ఉత్తరప్రదేశ్ ఫలితాలే దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. అక్కడి గెలుపోటములే భవిష్యత్తు రాజకీయాలను నిర్ణయిస్తాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 22 లోక్‌సభ స్థానాలు ఉంటే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 0 స్థానాలు ఉన్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ 21, బిఎస్‌పి 20 లోక్‌సభ స్థానాలను గెల్చుకోగా, ఎస్‌పి 23 స్థానాలను గెల్చుకుంది. 2004లో తొమ్మిది లోక్‌సభ స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్‌కు 2009 ఎన్నికల ఫలితాలు పెద్ద ఉత్సాహాన్నే ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో 91 శాసనసభ స్థానాల పరిధిలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హరించి వేశాయి.
Kataa talangana patrika telangana culture telangana politics telangana cinema
2009 ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం వికటించి కాంగ్రెస్ నాయకులతో అతిగా మాట్లాడించింది. దిగ్విజయ్‌సింగ్, సల్మాన్ ఖుర్షీద్, బేనివూపసాద్ వర్మ, రీటా బహుగుణ, చివరికి రాహుల్‌గాంధీ కూడా తరచూ మాట మీరుతూ వచ్చారు. అన్నా హజారే, రాందేవ్ వంటి వారిపై దిగ్విజయ్‌సింగ్ నోరుపారేసుకోవడం పట్టణ మధ్య తరగతిలో కొంత విస్మయాన్ని కలిగించినమాట వాస్తవం. రాజకీయాల్లో దురుసుతనాన్ని, అధికార దురహంకారాన్ని రెండింటినీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. రాజకీయ దురుసుతనానికి కాంగ్రెస్ ప్రతీకగా మారితే, అధికార దురహంకారానికి, దుర్వినియోగానికి మాయావతి తార్కాణంగా మిగిలారు. మరో విషయం ఏమంటే, రాహుల్‌గాంధీని వారసత్వ భారం ఒకటి వెంటాడుతూ వచ్చింది. ఉత్తరవూపదేశ్ వెనుకబాటుకు సంబంధించిన ప్రతిపాపంలోనూ రాహుల్‌గాంధీకీ వాటా ఉందన్న వాదాన్ని ఎస్‌పి సమర్థంగా ప్రజలకు వివరిస్తూ వచ్చింది.

బుందేల్‌ఖండ్ గురించి రాహుల్ ఎన్ని మాటలు చెప్పా రు? చివరికి ఏం జరిగింది. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండీ ఉత్తరవూపదేశ్‌కు ఏమీ చేయలేకపోగా ఎలా పడితే అలా, అతిగా మాట్లాడారు. ఆ అతి కొంపలు ముంచింది. మాయావతి అతి చేష్టలను, అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు, కాంగ్రెస్ నేతల అతిని కూడా జీర్ణించుకోలేకపోయారు. బిజెపి ‘న ఘర్‌కా, నఘాట్‌కా’ అన్నట్టు ఎవరికీ దగ్గర కాలేకపోయింది. బిజెపికి ఒక ఎజెండా, ఫోకస్, బలమైన, జనాకర్షణ కలిగిన నాయకత్వం లేకుండాపోయాయి. ముస్లింలను నొప్పించ కూడదన్న ధ్యాసతో నరేంవూదమోడిని సైతం ఎన్నికల ప్రచారానికి దూరం గా ఉంచిన బిజెపి అగ్రనాయకత్వం, ఇటు హిందువులను, అటు ముస్లింలను ఎవరినీ పూర్తిస్థాయిలో పార్టీ వెనుక సంఘటిత పర్చలేకపోయింది. సమాజ్‌వాది పార్టీ ఈ పార్టీలు చేసిన తప్పులేవీ చేయకుండా చాలా నింపాదిగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పోయింది. అఖిలేశ్ జనానికి అతీతమైన నాయకునిగా, ఎక్కడి నుంచో దిగివచ్చిన నాయకునిగా కాకుండా, జనంలో ఒకడిగా కలసిపోయి, వారితో ఐడెంటిఫై కావడానికి కృషి చేశారు. ప్రజలతో హుందాగా, సౌమ్యంగా ఉండడానికి అఖిలేశ్ ప్రయత్నించారు. ప్రభుత్వ వ్యతిరేకత, సామాజిక సమీకరణలు అందుకు తోడయ్యాయి. ఇవన్నీ 2014లో కూడా అఖిలేశ్‌కు కలసి వస్తాయా? ఇప్పుడున్న ఈ ప్రతిష్ఠను కాపాడుకోవడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

కాంగ్రెస్‌కు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఒక గుణపాఠం. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో 36 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. ఉత్తరవూపదేశ్‌లో గెల్చుకున్న 21తోపాటు పంజాబ్‌లో , ఉత్తరాఖండ్‌లో మొత్తం 5 స్థానాలను కాంగ్రెస్ గెల్చుకుంది. 2014లో ఎన్ని గెలవబోతుందన్నది యూపీఏ మనుగడ ను నిర్ధారిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్‌లో అమే థీ, రాయ్‌బరేలీతో సహా అన్ని స్థానాల్లోనూ పరిస్థితి కష్టంగానే ఉంది. పంజాబ్‌లో 2009 లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడిన అకాలీదళ్ మళ్లీ బలపడి, తిరిగి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోనూ కాంగ్రెస్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. గోవా ఏకపక్షంగా బిజెపిని వరించింది. కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తున్నద ని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంటే పంజా బ్, ఉత్తరాఖండ్‌లలోనయినా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలపడి ఉండాలి.

కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ మూడేళ్ల క్రితం నాటికీ నేటికీ దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌ను దెబ్బతీసి ఉండవచ్చు. క్షీణించిన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికి కాంగ్రెస్‌కు రెండేళ్ల సమయం ఉంది. నిలబెట్టుకున్నా, కూలిపోయినా కాంగ్రెస్ స్వయంకృతమే అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడా మెరుగుపడలేదు. పైగా గత ఎన్నికల్లో 33 లోక్‌సభ స్థానాలను అందించిన ఆంధ్రవూపదేశ్‌లో ఆ పార్టీ పతనం అంచున ఉంది. తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆంధ్ర ప్రాంతం ఎలాగూ కాంగ్రెస్‌కు దక్కే అవకాశం లేదు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ద్వారా కనీసం ఈ ప్రాంత ప్రజల మనసులను గెల్చుకోవడానికి ఆ పార్టీకి ఇప్పటికీ అవకాశం ఉంది. కేరళలో ఐదేళ్లకు ఒకసారి తీర్పులు మార్చే అలవాటు అక్కడి ప్రజలకు ఉంది. అలా జరిగితే కాంగ్రెస్ కు అది అశనిపాతమే. తమిళనాడు సరేసరి. ఎటొచ్చీ కాస్త మెరుగుపడే అవకాశం కర్ణాటకలోనే ఉంది.

కొత్త బెలూన్‌ల లోకం
ఉత్తరవూపదేశ్‌లో సైకిల్ గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా సైకిల్ వస్తుందని చంద్రబాబు ఆశపడుతూ ఉండవచ్చు. అఖిలేశ్ లాగే లోకేశ్ కూడా ఎదిగి వస్తారని ఆయ న సంబరపడిపోవచ్చు. ఏ తండ్రి అయినా అలా ఆశించడం అసహజం కాదు, కానీ నిజంగా ఉత్తరవూపదేశ్‌లో జరిగిన దానికి, ఇక్కడి రాజకీయాలకు సంబంధం ఉందా? పోలిక ఉందా? చంద్రబాబు ఉందని చెబుతారు. ఎందుకంటే చెదరిపోతున్న పార్టీ శ్రేణులను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ఏవో బెలూన్‌లు ఎగరేస్తూ ఉండడం చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగం. సైకిల్‌కు గెలిచిన చరివూతతోపాటు ఓడిన వారసత్వమూ ఉంది. ఉత్తరవూపదేశ్‌లో సమాజ్‌వాది పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన సైకిల్ మణిపూర్‌లో ఇదే ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మణిపూర్ పీపుల్స్ పార్టీ ఇదే సైకిల్ గుర్తుతో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం వరుసగా ఇది నాలుగవసారి. అందువల్ల నాయకులు పోల్చుకోవలసింది గుర్తులను, కొడుకులను, పేర్లనూ కాదు, వారి లక్షణాలను, విధానాలను!
చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష ఆయన లక్షణాన్ని తెలియజేస్తున్నాయి.

మాయావతి విగ్రహాలపై అఖిలేశ్ చేసిన వ్యాఖ్య, చంద్రబాబుకు, ఆయనకు మధ్య తేడాను ఇట్టే పట్టిస్తుంది. ‘వైఎస్ రాజశేఖర్‌డ్డి విగ్రహాలను తక్షణం తొలగించాలి. ప్రభుత్వం తొలగించకపోతే మేమొచ్చిన తర్వా త కూల్చేస్తాం’ అని చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందే ప్రకటించారు. ‘పందులని, గజదొంగలని, దున్నపోతులని’ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా నోటికి ఎంత మాటవస్తే అంతమాట ఉపయోగిస్తున్నారు. సభ్యత, సంస్కారం కోల్పోతున్నారు. ఆయనలో అసహనం నానాటికీ పెరుగుతున్నది. అఖిలేశ్ అధికార పార్టీతో లేక ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఘర్షణపూరిత రాజకీయాలకు దిగలేదు. మాటమార్చడం, మడమతిప్పడం చేయలేదు. అఖిలేశ్ అధికారపక్షాన్ని, ఇతర ప్రత్యర్థులను దుర్భాషలాడడం మాని, తాము ఏం చేయదల్చుకున్నారో, ఇతరులకంటే తాము ఎలా భిన్నమైన వారో చెప్పడంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు. చంద్రబాబునాయుడు నిరంతరం ఘర్షణపూరిత రాజకీయాలకు దిగుతున్నారు. పాలకుర్తికి ఒక దండయావూతగా వెళ్లారు. ప్రత్యర్థి పార్టీలపై విద్వేషపూరిత దాడులను, విష ప్రచారాన్ని చేస్తూన్నారు.

వీలైనన్ని అబద్ధాలను, ఇంకా వీలైనంత గట్టిగా, వీలైనంత ఎక్కువమందితో మాట్లాడిస్తే ఎన్నికల్లో చెలామణి కావచ్చునని, ప్రజలను బురిడీ కొట్టించవచ్చున ని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన ఎంతసేపటికీ బుకాయించి, దబాయించి, గందరగోళం సృష్టిద్దామని యోచిస్తున్నారు తప్ప, హుందాగా, సౌమ్యంగా, సూత్రబద్ధ రాజకీయాలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొందామన్న స్పృహలో లేరు. ఆయ న ఇంకా ఆంధ్రవూపదేశ్ ఒక కంపెనీ అని, తాను సీఈఓనని భావిస్తున్నట్టున్నారు. ప్రజలను ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారే తప్ప, ప్రజలతో ఎలా మమేకం కావాలా అని ఆలోచించడంలేదు. ఆశల బెలూన్‌లు ఎగరేసి, భ్రమల ఇంధ్రధనుస్సులను సృష్టించి పార్టీ శ్రేణులను కట్టిపడేయాలనుకుంటున్నారు తప్ప, క్షేత్రంలో నిలబడి పనిచేయాలని, పునాది ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సాగు చేయాలని అనుకోవడం లేదు. క్లిష్టమైన సమస్యలను దాటవేయాల ని, తప్పించుకోవాలని చూస్తున్నారే తప్ప, వాటిని పరిష్కరించి దక్షుడయిన నాయకునిగా పేరు తెచ్చుకోవాలను కోవడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేస్తున్నారు తప్ప, చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అవకాశవాద వైఖరితో ఎటూ కొరగాకుండా పోతున్నారే తప్ప, ఒక స్పష్టమైన విధానాన్ని చెప్పి జనం హృదయాలను గెల్చుకోవాలని చూడడం లేదు. ఒకసారి అబ ద్ధం చెబితే, మాటమార్చితే ఇంట్లో వాళ్లే నమ్మరు. ఇన్ని లక్షలు, కోట్ల మంది ఎలా నమ్ముతారు? చంద్రబాబు అసలు సమస్య ఇదే. దీనిని అధిగమించకుండా ఏం చేసినా, ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు.

322

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా