ఒకటే లక్ష్యం, ఒకటే నిర్ణయం


Tue,August 28, 2012 07:40 PM

తెలంగాణ సాధనకోసం ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు చాలు. అన్ని పార్టీలతో తెలంగాణవాదానికి జైకొట్టించడంకోసం, క్రమంగా శక్తిని కూడగట్టుకోవడం కోసం తెలంగాణవాదులు ఒకప్పుడు కాంగ్రెస్‌తో, మరొకప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకోవలసి వచ్చింది. తెలంగాణవాదానికి అన్ని పార్టీల ఆమోదాన్ని సంపాదించడానికి అది ఉపయోగపడిన మాట వాస్తవం. ఎన్నికల పొత్తులే ఒక్కోసారి ఒక్కోపార్టీకి తెలంగాణకు జైకొట్టకతప్పని రాజకీయ అనివార్య పరిస్థితుల ను సృష్టించాయి. అటువంటి ఒకానొక రాజకీయ అనివార్యత కారణంగానే తెలుగుదేశం సైతం ఆరోజు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఆ అనివార్యత తీరిపోగానే ఆ పార్టీ రాజకీయ, ప్రజాస్వామిక మర్యాదలనన్నింటినీ విస్మరించి అవకాశవాదంతో వ్యవహరించిం ది. తెలంగాణకు ద్రోహం చేసింది. కాంగ్రెస్‌ది ఇంకా దారుణం. అవసరమైనప్పుడల్లా తెలంగాణను అడ్డంపెట్టుకుని లాభపడడం, ఆ తర్వా త వంచించడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఈ రెండు పార్టీలూ తెలంగాణలో బలంగా ఉండడం వల్లనే, రెండు పార్టీలకూ తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడం వల్లనే ఇన్ని ఆటలు ఆడగలిగాయి. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు సకల జనుల సమ్మె సందర్భంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఉంటే తెలంగాణ సమస్య అప్పుడే తేలిపోయేది. కానీ ఆ పార్టీలు అలా చేయలేవు. ఎందుకంటే ఆ పార్టీల పగ్గాలు సీమాంధ్ర నాయకత్వాల చేతిలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు సీమాంధ్ర నాయకత్వాల కనుసైగల ప్రకారం మాత్రమే పనిచేస్తారని అనేక సందర్భాల్లో రుజువయింది. ఆ రెండు పార్టీల తెలంగాణ ఎమ్మెల్యే లు, మంత్రులు స్వతంవూతించి వ్యవహరించలేరని, తెలంగాణ రాష్ట్ర సాధన సంగతి దేవుడెరుగు కనీసం తెలంగాణ ప్రయోజనాలకోసమైనా పోరాడలేరని, మాట్లాడలేరని పలుసార్లు అనుభవమయింది. సీమాం ధ్ర ఆధిపత్యాల కింద ఉన్నంతకాలం ఈ పార్టీల ఎమ్మెల్యేలు ఇందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదు.


ఇటువంటి పరిస్థితుల్లో ఇకపై ఏం చేయాలి? తెలంగాణకు అడ్డం పడకుండా ఈ పార్టీలను కట్టడి చేయడం ఎలా? అవకాశవాద వైఖరితో తెలంగాణ ప్రజలతో ఆటలాడుకుంటున్న ఈ పార్టీలను దారికి తేవడం ఎలా? ఇందుకు మిగిలిన ఏకైక మార్గం - తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పక తప్పని అనివార్య పరిస్థితులను సృష్టించడం. అందుకు రెండు మార్గాలు- మొదటిది, రెండు పార్టీలలోని తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాలపై మరోసారి ఒత్తిడి తెచ్చి నిర్ణయం చేయించడం. రెండవది, ఈ రెండు పార్టీలకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం. గతంలో ఎటువంటి రాజకీయ అనివార్యత సృష్టించి చంద్రబాబు మెడలు ఎలా వంచారో ఇప్పుడు అటువంటి అనివార్య తే మరోసారి సృష్టించాలి. తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాగస్వరానికి తోకలు ఆడించడం మానుకుని, ఎన్నికల మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉండే విధంగా చంద్రబాబును ఒప్పించడానికి ప్రయత్నించా లి. 200లో కూడా దేవేందర్‌గౌడ్ వంటివారు తెలం గాణకు అనుకూలంగా నిర్ణయం చేయాలని గట్టిగా కొట్లాడి ఒత్తిడి పెంచారు కాబట్టే చంద్రబాబు కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేశారు. ఇప్పుడు అటువంటి ప్రయత్నమే మరోసారి జరగాలి.

తెలుగుదేశాన్ని కాపాడుకోవడం కోసమైనా తెలంగాణ నేతలు చంద్రబాబును ఒప్పించక తప్పదు. తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని మరోసారి స్పష్టం చేయనంతకాలం ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశమే లేదు. కాంగ్రెస్‌కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అధిష్ఠానాలను ఒప్పించడం లేకపోతే రాజకీయంగా అస్తిత్వాన్ని కోల్పోవడం ఏదో ఒకటి తేల్చుకోవలసిన అగత్యం తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల ముందుంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌లు తెలంగాణపై తేల్చనప్పుడు ఇక ఇక్కడి ప్రజలకు మిగిలిన ప్రత్యామ్నాయం ఏమిటి? తెలంగాణ విషయంలో స్పష్టమైన విధానాన్ని తీసుకోవడమే కాకుండా, రాజీలేకుండా పోరాడుతున్న పార్టీలను గెలిపించడం. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్షికసీ, బీఎస్‌పీ.....ఏపార్టీ అయినా పర్వాలేదు. కేవలం ఉప ఎన్నికల్లోనే కాదు, ఇక ముందు జరిగే ప్రతి ఎన్నికలోనూ తెలంగాణ ఓటరు నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. తెలంగాణ పై స్పష్టమైన వైఖరిని అవలంబించలేని నాయకుడెవరూ తెలంగాణలో గెలవ డానికి వీలులేని పరిస్థితి రావాలి.
తెలంగాణపై స్పష్టత, ఏకీభావం ఉన్న శక్తులన్నీ ఒక వేదిక మీదకు రావాలి. టీఆర్‌ఎస్, సీపీఐల మైత్రి ఈ దిశగా ఒక మంచి ముందడుగు. తెలంగాణలో ఇవ్వాళ ఒక్క సీపీఎం తప్ప మిగిలిన వామపక్ష శక్తులన్నీ తెలంగాణ కోరుకుంటున్నాయి. సీపీఐ, న్యూడెమోక్షికసీ చాలా స్పష్టమైన వైఖరితో తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుకోసం కృషి చేస్తున్నాయి. ఎన్ని అవరోధాలు ఎదురయినా అదరక బెదరక ఒకే విధా నాన్ని కొనసాగిస్తున్న పార్టీలు అవి. అటువంటి శక్తులతో టీఆర్‌ఎస్ ఒక దీర్ఘకాలిక విధానంతో కలసి పనిచేయవలసిన అవసరం ఉంది. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఈ సంబంధాలు కొనసాగాలి. రాజకీయ సంబంధాల్లో పరస్పర ప్రయోజనమూ ముఖ్యమే. ఇచ్చి పుచ్చుకునే ధోరణి కూడా ఇరు పక్షాలకూ అవసరం. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా ఈ విషయంలో టీఆర్‌ఎస్సే చొరవ, విశాల దృష్టిని ప్రదర్శించాలి. ఈ దోస్తీ 2014 దాకా కొనసాగాలి.

తెలుగుదేశానికి మద్దతు ఇవ్వలేకపోవడం బాధాకరమే అని నారాయణ అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చింది. ఆయన నిజంగానే బాధపడ్డారో లేక ఆయన తరఫున ఆ పత్రికలు బాధపడ్డాయో తెలియదు. అచ్చులో అయితే వచ్చింది. నారాయణ బాధ పడవలసింది ఏముందో అర్థం కాదు. ఇది బంధు త్వాల వ్యవహారం కాదు. చంద్రబాబు చిరకాల మిత్రుడూ కాదు. రాజకీయ సంబంధాల విషయం లో చంద్రబాబునాయుడు ఎంత నిర్దయగా వ్యవహరిస్తారో 199, 1999లలోనే రుజువైంది. రాత్రికిరాత్రి యునైటెడ్ ఫ్రంట్ జెండా దించేసి, ఎన్‌డిఎ జెండా ఎలా పట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇప్పటికీ జ్ఞాపకమే. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఒక్క సీటు కూడా గెలవలేదు. అప్పు డు చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. సీపీఐని కనీసం అఖిలపక్ష సమావేశాలకు కూడా పిలువకుండా అవమానించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి చంద్రబాబు. కమ్యూనిజానికి కాలం చెల్లిం దని, ఇక టూరిజమే మిగిలిందని సిద్ధాంతీకరించిన చంద్రబాబును నారాయణ ఎలా మరచిపో గలరు?

195, 1994, 1995లలో టీడీపీ-వామపక్షాల స్నేహం పరస్పర అవసరాలపై ఆధారపడ్డదే. 1995లో వామపక్షాలు సూత్రవిరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించి, వెన్నుపోటు అప్రదిష్ట నుంచి చంద్రబాబునాయుడును కాపాడాయి. తాచెడినప్పుడల్లా మంచివాళ్లను ముందు పెట్టుకుని ఆత్మరక్షణ చేసుకోవడం చంద్రబాబు వ్యూహం. ఎవరితోనయినా పొత్తు పెట్టుకోవడానికి, నిరాకరించడానికి చంద్రబాబుకు ప్రయోజనమే ప్రాతిపదిక. సూత్రబద్ధత ఏమీ ఉండదు. 2009లో కూడా మహాకూటమి ఆవిర్భావానికి అవసరమే ప్రాతిపదిక అయింది. ఆశల వల విసరడం, పొత్తు లోకి లాగ డం, తర్వాత వెన్నుపోటు పొడవడం....ఇవన్నీ చంద్రబాబు పాచికలు. 2009లో టీఆర్ ఎస్ విషయంలో చంద్రబాబు చేసింది ఇదే. మహాకూటమి విఫలం కావడానికి చంద్రబాబు, ఒక పత్రికాధిపతి ఎలా దోహదం చేశారో, తెర ఎంత కుట్ర జరిగిందో సీపీఐ అగ్రనాయకులకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు మళ్లీ అదే పాచికతో ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం ప్రతినిధులు సీపీఎం వద్దకు వెళ్లి మనం మనం సమైక్యవాదులం అన్నట్టు మాట్లాడారు. సీపీఐ వద్దకు వెళ్లి మేమూ తెలంగాణవాదులమే అన్నట్టు మాట్లాడారు. ఇలా రెండు నాల్కలు వినిపించడంలోని జాణతనం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే.
ఏ సూత్రానికీ కట్టుబడకుండా, ఏ విధానానికీ నిబద్ధు డు కాకుండా, ఎన్ని అడ్డదారులు తొక్కయినా, ఎన్ని రకాలుగా మభ్యపెట్టి అయినా, ఎన్ని అబద్ధాలు ప్రచా రం చేసి అయినా, అందితే జుట్టు అందక పోతే కాళ్లు పట్టుకుని అయినా రాజకీయాల్లో చెలామణి కావాలన్నది చంద్రబాబు సరళి. ఇటువంటి నీతి కొంతకాలం నడుస్తుంది. కొన్నిసార్లు ఫలిస్తుంది. ఎల్లకాలం ఎలా పనిచేస్తుంది. అందుకే చంద్ర బాబుకు ఇవి దుర్దినాలు. ఇటువంటి నేతతో ఏ పార్టీ అయినా ఎలా చేతులు కలుపుతుంది? సీపీఐకి సూత్రబద్ధమైన వైఖరి ఉండాలి. ఒక ఉద్యమం మధ్యలో, సంక్షోభ సమయంలో, ఆకాంక్షల విఫల భూమిలో నిలబడి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర డిమాండు విషయంలో పిల్లిమొగ్గలు వేస్తున్నవారితో చేతులు కలిపితే చేసుకున్న పుణ్యం కాస్తా చెరువుపాలవుతుందని ఆ పార్టీకి తెలుసు. తెలంగాణ రాకపోవడంలో తెలుగుదేశం పాపమూ ఉందని తెలంగాణవాదులందరూ నమ్ముతున్న ట్టుగానే తెలంగాణ ప్రాంతంలోని సీపీఐ నాయకత్వమూ నమ్ముతుంది. కష్టమయినా నష్టమయినా సూత్రబద్ధమయిన విధానంతో ముందుకుపోవాలని వారు భావించారు. 2014 ఎన్నికల్లో ఏం జరగబోతోందన్న వాదనతో నిమిత్తం లేకుండా ప్రస్తుతానికి ధర్మబద్ధంగా వ్యవహరించాలని వారు నిర్ణయించారు.

తెలంగాణ ప్రజలు కూడా పాలను నీళ్లను వేరు చేసినట్టు ద్రోహుపూవరో, చిత్తశుద్ధితో నిలబడిన వారెవరో గుర్తించి ఓటు వేయవలసిన అవసరం ఉంది. ఒకటే లక్ష్యం-తెలంగాణ సాధన, ఒకటే నిర్ణయం. అందుకు నిజాయితీగా కృషి చేసే వాళ్లను గుర్తించి ఎన్నుకోవడం. ఉద్యమం ముందా ఓటు ముందా అన్న మీమాంస ఇప్పుడు అనవసరం. విడివిడిగా జమిలిగా అన్ని ప్రవాహమై సాగాల్సిందే. ఉద్యమం చేసేవారిని ఎవరూ ఆపలేరు. ఓటును అర్థవంతంగా ఉపయోగించడమూ ఉద్యమమే. ఓటు కూడా ఆయుధమే. ఇకపై ప్రతి సందర్భమూ తెలంగాణపై తీర్పు చెప్పే సందర్భమే కావాలి. నోరుపెట్టుకుని బతకాలనుకుంటున్న వాళ్లకు కీలెరిగి వాతపెట్టాలి.

కట్టా శేఖర్‌రెడ్డి

311

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా