ఒక అబద్ధం, వందమంది గోబెల్స్


Sat,February 11, 2012 05:06 PM

400 talangana patrika telangana culture telangana politics telangana cinemaచాలా కాలం క్రితం- 2003లో అనుకుంటాను- ఒక ప్రముఖ జర్నలిస్టు యథాలాపంగా ఒక గొప్ప సూత్రం చెప్పారు. అది చాల గొప్ప సూత్రమని తెలంగాణ ఉద్యమ సందర్భంగా నాకు మరింత బాగా అర్థం అయింది. అది తెలంగాణ రాష్ట్ర సాధన, కులాలు, అధికారాలపై చర్చ జరుగుతున్న సందర్భం. ఆయన చెప్పిన విషయం ఆయన మాటల్లోనే ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని, సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకోలేదు. సంపాదించుకున్నా నిలబెట్టుకోలేదు. తెలంగాణ వాళ్లు ఇంకా అమాయకత్వాన్ని అధిగమించి ఎదగలేదు. తెలంగాణ వాళ్లు అధికారంలోకి వచ్చినా మూన్నాళ్లకే వాళ్లకు తాటాకులు కట్టి గద్దె దింపేయగల శక్తులు వారికంటే బలంగా ఉన్నాయి. వాళ్లను ఎదర్కొనే సాధనాలేవీ తెలంగాణ వారి వద్ద లేవు’’ అని ఆయన అన్నారు. ‘‘ఏమిటా సాధనాలు? ఎందుకిలా జరుగుతోంది?’’.
‘‘వేదకాలం, ఇతిహాసకాలం, చరిత్ర, చివరకు ఆధునికాంధ్రప్రదేశ్ నేర్పిన పాఠం నీకు అర్థం అవుతుందా? సమాజంపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి, దానిని జస్టిఫై చేసుకోవడానికి అక్షరం అన్నది ఒక బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నవాళ్లే నాటినుంచి నేటి వరకు సమాజంపై నిరాటంకంగా పెత్తనం కొనసాగించగలుగుతున్నారు. మా విషయమే తీసుకోండి. వేదాలు, ఉపనిషత్తులు, మంత్రం, తంత్రం రాసుకున్నాం. మాకు మేము అతీంద్రియ శక్తులను, అలౌకిక శక్తులను ఆపాదించుకున్నాం. ఈ ప్రపంచమంతా మంత్రభూతమైందని, ఆ మంత్రం తెలిసినవాళ్లం మేమేనని, ఇక్కడ శాంతిగా బతకాలన్నా, దర్పంగా రాజ్యాలు ఏలాలన్నా మమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలన్న స్పృహను సమాజం నిండా వ్యాప్తి చేశాం. మేము కేవలం అక్షరాన్ని, మంత్రాన్ని నమ్ముకున్నాం. చక్రవర్తులయినా మాకు సాష్టాంగపడవలసిందే. దేశాధినేతలయినా మా ఆశీర్వాదం పొందాల్సిందే. అది మా గొప్పతనం కాదు. మా అక్షరం గొప్పతనం. మేము సృష్టించుకున్న సాహిత్యం గొప్పతనం వేల సంవత్సరాలయినా ఆ అక్షరాల మహిమ తగ్గలేదు చూశావా?’’.

‘‘రాజులయినా అంతే. ఇతిహాసం చూడండి. చరిత్రను చూడండి. మంచి రాజులుగా, స్వర్ణయుగకర్తలుగా, సాహితీ వల్లభులుగా చరిత్రలో మిగిలిపోయినవాళ్లెవరు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. రుషి, పండిత, కవి, గాయకులను చేరదీసి సాంస్కృతిక పోషణ చేసిన వారు, తమ పాలనకు సమర్థనగా అపారమైన సాహిత్యాన్ని సృష్టించుకున్నవారు, స్వయంగా అక్షరాలతో సహవాసం చేసినవారు మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా మనకు ఇవ్వాళ మిగిలిపోయారు. వారిని గురించి మాత్రమే బాగా చదువుకుంటాం. గొప్పగా చెప్పుకుంటాం. వారిని గురించి మాత్రమే ఇతిహాసం లేక చారిత్రక కథలు, గాధలు, ఆధారాలు తరతరాలకు అందుతూ వచ్చాయి. ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఎంతమంది రాజులు, చక్రవర్తులు పరిపాలించి ఉంటారు? కానీ మహాభారత, రామాయణ పురుషుల సార్వకాలీనత, భోజరాజు గొప్పతనం, చంద్రగుప్తుని స్వర్ణయుగం, కష్ణదేవరాయల భువనవిజయం. . . ఇలా కొంతమంది గురించి మాత్రమే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం... ఎందుకు? మళ్లీ అక్షరమే కారణం. వారు సృష్టించుకున్న సాంస్కృతిక ప్రతిష్ఠ, సమర్థన, స్థానం(కల్చరల్ ఫేసు, జస్టిఫికేషన్ అండ్ స్పేసే) కారణం. ఆధునిక యుగంలో సీమాంధ్ర రాజకీయ నాయకత్వం, పారిశ్రామిక నాయకత్వం, అందునా సీమాంధ్రకు చెందిన ఒక ప్రధాన సామాజిక వర్గం అటువంటి సాంస్కృతిక, సాహిత్య ఫేసు, స్పేసు సృష్టించుకుంది. ఆ ఫేసు, స్పేసుకోసం పుట్టినవే సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు. తమకు అనుకూలంగా ఉన్నవారి పరిపాలనను జస్టిఫై చేసుకోవడానికి, తమకు నచ్చని వారిని ఎగతాళి చేసి ఎండగట్టడానికి ఈ పత్రికలు ఆది నుంచీ కృషి చేస్తూనే ఉన్నాయి. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఈ పత్రికలు తలుచుకుంటే ‘అనకొండలను, గోలకొండలను దాచగలవు. గోరంతలను కొండంతలు చేయగలవు’. ఒక కులాధిపత్యాన్ని, ఒక ప్రాంతాధిపత్యాన్ని, ఒక నేత ఆధిపత్యాన్ని కాపాడడానికి ఈ మీడియా ఎటువంటి కుట్రలు చేయగలదో ఈ మూడు దశాబ్దాల అనుభవం చాలు. అవినీతి పరుడిని ధర్మరాజుగా చూపగలవు. నీతిమంతుడికి తాటాకులు కట్టి మంట పెట్టగలవు. జలగం వెంగళరావును మహానుభావునిగా చిత్రించి నాలుగేళ్లు ఊరేగించిన పత్రిక, మర్రి చెన్నారెడ్డిని ఏడాది తిరగకుండానే చెన్నారెడ్డి చందాలరెడ్డి అని ముద్రవేసి సాగనంపేందుకు దోహదం చేయగలదు. నాదెండ్ల భాస్కర్‌రావును వెన్నుపోటుదారుగా చిత్రించి, ప్రజాస్వామ్య ఉద్యమం నడిపిన ఆ రెండు పత్రికలు, 1995లో అదే పనిచేసిన నారా చందబాబునాయుడిని ప్రజాస్వామ్య పరిరక్షకునిగా కీర్తించి నిలబెట్టగలవు. తిమ్మిని బమ్మి చేయడం, బమ్మిని తిమ్మి చేయడం అనాదిగా నడుస్తూనే ఉంది. ఆ పత్రికలు నంది అంటే నంది, పంది అంటే పంది. వాళ్లు రాసిందే చరిత్ర. వాళ్లు ఇచ్చేదే కాండక్ట్ సర్టిఫికెట్. తెలంగాణవాళ్ల దగ్గర ఒక పత్రిక లేదు. ఒక చానెల్ లేదు. మీరు ఏం చేయగలరు? మీ ఉద్యమాన్ని ఎలా కాపాడుకోగలరు? మీ మీద జరిగే దాడిని ఎలా తిప్పికొట్టగలరు? తెలంగాణలో బలమైన సాహితీ సృజన ఉంది. కానీ తెలంగాణ రాజకీయాలు, ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాల ప్రతినిధిగా ఒక బలమైన సాంస్కృతిక మీడియం ఏది?’’. ఇదంతా ఆయన ఆందోళనతో చెప్పిన విషయమే. తరచి చూస్తే ఆయన చెప్పింది అక్షరాలా నిజమని తెలిసిపోతుంది. అనేకసార్లు రుజువయింది.

ఎనిమిదేళ్లు గడచిపోయాయి. తెలంగాణకు ఇప్పుడొక పత్రిక వచ్చింది. ఒక చానెల్ వచ్చింది. మరికొన్ని చానెల్‌లు కూడా తెలంగాణవాదాన్ని నిజాయితీగా రిపోర్టు చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని సీమాంధ్ర నాయకత్వం, వారి ఆధిపత్యంలోని టీడీపీ, కాంగ్రెస్‌లు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, నమస్తే తెలంగాణ పత్రికకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి. నమస్తే తెలంగాణను నైతికంగా దెబ్బతీయడానికి వీళ్లు చేయని ప్రయత్నం లేదు. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి వీరు మొదటి నుంచీ అనుసరించే విధానం ఒక్కటే. ఇప్పుడూ అదే పద్ధతి అనుసరిస్తున్నారు. నిజాయితీగా యుద్ధం చేయడం చంద్రబాబు జాతకంలో లేదు. ఎదురొడ్డి పోరాడ్డం ఆయన నైజానికి విరుద్ధం. కుట్రలు, కుతంత్రాలు ఆయనకు బాగా అచ్చొచ్చిన మార్గం. ఆయన కుట్ర ఎలా ఉంటుందంటే ‘ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఒక అబద్ధాన్ని సృష్టించు, వంద మంది గోబెల్స్‌ను తయారు చెయ్యి. ఆ ముఠాతో అదే అబద్ధాన్ని పదేపదే మాట్లాడించు. ఆ అబద్ధ ప్రచారకులు కూడా వీలైతే బడుగు బలహీనవర్గాలకు చెందిన వారయితే మంచిది. నోటిగదరోడయితే ఇంకా మంచిది. పత్రికలు, చానెళ్లలో ఆ అబద్ధానికి కొండంత ప్రచారం వచ్చేట్టు చూడు. పత్యర్థి ఒక నేత కావచ్చు, ఒక ఉద్యమం కావచ్చు. మరో పత్రిక కావచ్చు’. నాడు ఎన్‌టిఆర్ విషయంలో అయినా సరే, నేడు కేసీఆర్ విషయంలో అయినా సరే.

ఎవరి పోలవరం? ఎవరి టెండర్? టెండర్లు ఎలా వేస్తారు? డబ్బులు ఎప్పుడు వస్తాయి? తెలంగాణ ఉద్యమానికి, నమస్తే తెలంగాణకు, పోలవరానికి ఏమిటి సంబంధం? కానీ సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియా లక్ష్యం ఉద్యమాన్ని, ఉద్యమకారుల నైతిక స్తైర్యాన్ని, నమస్తే తెలంగాణ నైతిక బలాన్ని దెబ్బతీయడం. అస్తిత్వంకోసం పోరాడుతున్న ఒక ప్రాంత ప్రజలపై సాగిస్తున్న అనైతిక యుద్ధంలో గెలవడమే తెలుగుదేశం, దాని అనుబంధ మీడియాకు ముఖ్యం. సత్యాసత్యాలు, నిజానిజాలు, ఉచ్ఛనీచాలు తర్వాత సంగతి. తడిగుడ్డలతో గొంతులుకోయడంలో వీళ్లు దిట్టలు. తెలంగాణ ఉద్యమం అదృష్టం-పోలవరం టెండర్ రద్దయి ఈ అబద్ధాల ముఠా నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. కానీ ఒక అబద్ధాన్ని ఇంత నీచంగా మార్కెట్ చేయగలిగిన చందబాబును ప్రజలు ఇంకా ఎందుకు నమ్మాలి? ‘స్యూ’ కంపెనీకి నమస్తే తెలంగాణకు ఏ విధంగానూ సంబంధం లేదు. అది కృష్ణా జిల్లాకు చెందిన స్వర్గీయ వల్లూరిపల్లి నాగేశ్వర్‌రావు అనే పెద్దాయన ఎప్పుడో ఏర్పాటు చేసిన కంపెనీ. అందులో నమస్తే తెలంగాణ చైర్మన్‌కు ఉన్నది మూడు శాతం వాటా. కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, పవర్ బోకర్‌ల సిండికేట్ అయిన టీడీపీకి కంపెనీల గురించి, ప్రాజెక్టుల గురించి, టెండర్ల గురించి, ఆదాయాల గురించి తెలిసినంతగా మరెవరికీ తెలిసే అవకాశం లేదు. సీక్రెట్ కొటేషన్ ద్వారా టెండర్లు పిలవడం అంటేనే, అది తెరిచే దాకా ఎవరికి వస్తుందో తెలియదు. తెరిచిన వెంటనే ప్రభుత్వం ఆమోదించి, అప్పగించాలనీ లేదు. అప్పగించినా డబ్బులు వెంటనే రావు. ఇన్ని విషయాలు తెలిసీ, తెలంగాణ ఉద్యమాన్ని, సకల జనుల సమ్మెను వేలకోట్ల రూపాయలకు అమ్మేశారని, నమస్తే తెలంగాణ పోలవరం డబ్బులతో నడుస్తోందని మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి వారు వాగడం, సీమాంధ్ర మీడియా వాటిని ప్రముఖంగా ప్రచురించడం-ఇవన్నీ అమాయకంగా జరిగేవి కాదు. ఒక ప్రాంతం, ఒక కులం, కొందరు నేతలు మీడియాను అడ్డం పెట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా సాగిస్తున్న అధర్మ, అనైతిక, కుట్రపూరిత యుద్ధంలో భాగం ఈ ప్రచారం. అయితే తెలంగాణ ఒకప్పటి అమాయకత్వంలో ఇప్పుడు లేదు.చంద్రబాబు ఎప్పుడు ఏ జూదం ఎందుకు ఆడతాడో, ఏ కీలుబొమ్మకు ఎప్పుడు కీ ఇస్తాడో, మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి బొమ్మలు ఎందుకు మాట్లాడతాయో ఇప్పుడు తెలంగాణవాదులు తేలికగానే అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణకు ఇప్పుడు అనేక ఆయుధాలు ఉన్నాయి. ఒకనాడు ఆ జర్నలిస్టు ఆశించినట్టు తెలంగాణకు ఇప్పుడు సాంస్కృతిక ఫేసూ, స్పేసూ ఆవిర్భవించాయి. కుట్రలను పసిగట్టగల నేర్పు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉంది. ఆలస్యం అయితే కావచ్చు, కానీ అంతిమ విజేత తెలంగాణ ఉద్యమమే.

[email protected]

512

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా