అపనమ్మకం ఇంటిపేరు, కుట్ర అసలు పేరు


Sat,January 28, 2012 02:42 AM

546546 talangana patrika telangana culture telangana politics telangana cinemaనన్ను ఒకరు బాలుడన్నారు. వారు నన్ను ఒకవైపే చూశారు. రెండోరూపం వారికి తెలియదు....అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదు. సీఎం కుర్చీనే వారి జీవిత లక్ష్యం.

-సినీనటుడు నందమూరి బాలకృష్ణ


బాలకృష్ణ సినిమాల్లో తొడగొడితే సౌండ్ ఎఫెక్ట్ ఇస్తారు. కాబట్టి చప్పుడు బ్రహ్మాండంగా వినిపిస్తుంది. పరిసరాలన్నీ గడగడా ఊగిపోతాయి. నిజజీవితంలో తొడగొడితే చప్పుడు రాదు. తొడ వాచిపోతుంది. ఆయన ఊగిపోతారు.బాలకృష్ణకు సినిమా జీవితానికి, నిజ జీవితానికి ఇంకా తేడా తెలిసినట్టు లేదు. ఇప్పటికీ బ్రహ్మనాయుడు లాగా చెయ్యడ్డంపెట్టి రైలు ఆపగలననుకుంటున్నాడు.తనలో ఒక అపరిచితుడు ఉన్నాడని చెబుతున్నాడు. రెండో రూపం గురించి, మూడో రూపం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు తెలియని విషయం ఏమంటే, ఆయన అన్ని రూపాలూ తెలుగు ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయాయి. సొంత ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఆయనలోని అపరిచితుడు తొలిసారి తెలిశారు. ఎన్నికల ప్రచారంలో ‘నీ ఊరికొచ్చా, నీ ఇంటికొచ్చా’ అని అక్క పురందేశ్వరి ఇంటి ముందు తొడగొట్టి సవాలు చేసి, కాంగ్రెస్ బావ దగ్గుబాటి వెంక గెలిపించి వచ్చినప్పుడు, రాష్ట్రమంతా తిరిగితిరిగీ గొంతువాచేట్టు డైలాగుల వర్షం కురిపించినా తెలుగు ప్రజలు ఓట్ల వర్షం కురిపించడానికి నిరాకరించినప్పుడు ఆయన రెండో రూపం చూసే ఉన్నారు. ఇప్పుడు ఇక ఎటునుంచి చూసినా అదే రూపం. కొత్తగా కనిపించేదిగానీ, వినిపించేదిగానీ ఏమీ లేదు. తెలిసేది అంతకన్నాలేదు.

కాకపోతే సిని మా హీరో కదా కాస్తంత వినోదం. ఇక అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదు అన్నారు చూశారూ! సూపర్ డైలాగ్! కానీ అది మీరు కొట్టాల్సిన డైలాగ్ కాదు. అధికారం కోసం తండ్రిని బలిపెట్టి, పార్టీని హైజాక్ చేసి బావ చేతిలో పెట్టిన అపర ఔరంగజేబుల్లో తమరు కూడా ఉన్నారు! ఎన్‌టిఆర్‌ను స్వయంగా బలితీసుకున్నవారు ఆయన వారసత్వాన్ని పునరుద్ధరిస్తామని చెబితే ఎవరు నమ్మగలరు? పార్టీని అమ్మినవాడు గొప్పా? లేక తండ్రి ని బజారుపాలు చేసి, పార్టీని పాతరేసినవాడు గొప్పా? ఎవరు గొప్ప? సీఎం కుర్చీపై యావలేకపోతే ఇప్పుడెందుకు సార్ మీరు, మీ బావ వీధుల్లో పడి తొడలు చరుస్తున్నారు. అధికారం కోసం కాకపోతే సెక్ర పల్లీలు అమ్ముకోవడానికి రాజకీయాలు చేస్తున్నారా సార్? డైలాగులే కాదు, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. సంభాషణల రచయితను పెట్టుకుంటే మంచిది.
chandra-babu talangana patrika telangana culture telangana politics telangana cinema

పార్టీకి పూర్వవైభవం తెస్తా.... మళ్లీ అధికారంలోకి వస్తాం....అడ్డొస్తే కొండలనయినా పిండి చేస్తాం...

-తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుచంద్రబాబునాయుడు చెబుతున్నది నిజమేనా? ఆయనకు ప్రజలు నిజంగానే బ్రహ్మరథం పడుతున్నారా? తండోపతండాలుగా జనం వస్తున్నారని నాయుడిగారి మీడియా ఊదరగొడుతున్నది వాస్తవమేనా? బాబు పర్యటనలతో ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు తమ్ముళ్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారన్న కొన్ని పత్రికల పులకింతను నమ్మవచ్చా? 2009 ఎన్నికలకు ముందు కూడా ఇటువంటి పత్రికా రాతలు, చానెళ్ల బాకాలు చాలా చూశాం. ఆ ఎన్నికల్లో బాలకృష్ణకు, ఆయనను మించి జూనియర్ ఎన్‌టిఆర్‌కు జనం బారులుతీరి స్వాగతాలు పలికిని మాటా నిజమే. కానీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ముఖం చాలా స్పష్టంగా కనిపించింది.చంద్రబాబునాయుడును జనం నమ్మలేదని, గ్రహణ చంద్రుడి నీడలో ఊరేగిన స్టార్స్‌ను జనం పెద్దగా పట్టించుకోలేదని ఓట్ల డబ్బాలు తేటతెల్లం చేశాయి. ఇంటింటికీ నగదు పంపి ణీ చేస్తామంటే కూడా చంద్రబాబును జనం నమ్మలేదుపజల్లో చంద్రబాబునాయుడుకు ఉన్న అపనమ్మకం అటువంటిది.

చంద్రబాబు ఇంతటి అపనమ్మకాన్ని ఎలా మూటగట్టుకున్నారు?
చంద్రబాబు ఇంతటి అపనమ్మకాన్ని, అప్రతిష్ఠను పోగేసుకోవడం, విశ్వసనీయతను కోల్పోవడం ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలోనో జరిగింది కాదు.గత ఒకటిన్నర దశాబ్దకాలంలో పరంపరగా జరిగిన అనేక పరిణామాలు ఎప్పటికప్పుడు ఆయనను దోషిగా నిలబెడుతూ వచ్చాయి. ఆయన ఒక ఉదాత్త నాయకుడిగా ఎదగడానికి బదులు మ్యానిప్యులేటర్‌గా, మాకియ నానాటికీ రుజువవుతూ వచ్చారు. కుట్రతో రాజసూయం ప్రారంభించి ప్రతిమలుపులోనూ కుట్రపూరితంగానే వ్యవహరిస్తూ వచ్చారు. చివరికి అది ఆయన స్వభావమేమో అనుకునేంతగా స్థిరపడిపోయింది. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం సడలిపోవడానికి కారణం ఎన్‌టిఆర్‌కు ఆయన చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోవడమే.చంద్రబాబు ద్రోహం చేసింది కేవలం ఎన్‌టిఆర్‌కు మాత్రమే కాదు, 1994లో ఎన్‌టిఆర్‌కు అఖం డ విజయం చేకూర్చిన ప్రజలకు కూడ. ఎన్‌టిఆర్ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు తిరగదోడారు. అక్కడ మొదలైన విద్రోహాల పర్వం 2004 దాకా కొనసాగింది. ఆయన అనుసరించిన విశ్వాసఘాతుక విధానాలు అన్నీ ఇన్నీ కాదు.

రాస్తే పెద్ద జాబితాయే అవుతుంది: సబ్సి డీ బియ్యం రద్దు చేయడం, మద్య నిషేధాన్ని సడలించడం వైన్‌షాపులకు అనుమతినివ్వడం, వ్యవసాయ విద్యుత్‌పై సబ్సిడీ ఎత్తివేయడం, విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం, ఇంటి కరెంటు చార్జీలు పెంచ డం, బస్సుచార్జీలు, నల్లా బిల్లులు, భూమి పన్ను, రిజివూస్టేషన్ చార్జీలు పెంచ డం, వ్యవసాయానికి సబ్సిడీలు రద్దు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ పూర్తిగా నిలిపివేయడం, సింగరేణిని ప్రైవేటీకరించడం, అనేక ప్రభు త్వ రంగ కంపెనీలను తెగనమ్మడం, మూసేయడం...చంద్రబాబు ఘనకార్యాలు ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. ఇవన్నీ ఎన్‌టిఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం నుంచి ప్రజలు ఆశించని పరిణామాలు.

చంద్రబాబు తాను ముఖ్యమంవూతిని అన్న విషయం మరచిపోయి ప్రపంచబ్యాంకు మేనేజరులాగా వ్యవహరించడాన్ని జనం సమ్మతించలేదు. అందుకే వెన్నుపోటు తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ చంద్రబాబుకు జనామోదం లభించలేదు. 1995 వెన్నుపోటు తర్వాత రెండుసార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఓట్లు, సీట్ల మెజారిటీ లెక్కల ప్రకారం రెండుసార్లూ ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. 1999లో గెలవడం వెనుక మరో నమ్మక ద్రోహం ఉంది. 1996, 199 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలు, మధ్యేవాద పార్టీలతో కలసి జాతీయ ఫ్రంట్‌తో అంటకాగిన చంద్రబాబు, వీర లౌకికవాదిగా పోజులు పెట్టిన చంద్రబాబు, బీజేపీని అంటరాని పార్టీగా ప్రకటించిన చంద్రబాబు 1999 ఎన్నికలకు వచ్చేసరికి ప్లేటు ఫిరాయించారు. దానికీ కారణం ఉంది. 199 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 1 శాతం ఓట్లతో నాలుగు లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. చంద్రబాబును ఈసారి ఇంకా తీవ్రంగా జనం తిరస్కరించారు. ఈ పరిణామం చంద్రబాబుకు అశనిపాతమైంది.

తన పునాదులు కదలిపోతున్నాయని భావించా రు. కేవలం ఇరవైనాలుగు గంటల వ్యవధిలో బాబు జెండాను ఎజెండానూ మార్చారు. అప్పటిదాకా కలసి ఉన్న మిత్రులను నట్టేట ముంచేసి కేంద్రం లో బీజేపీకి మద్దతు ప్రకటించారు. 1999లో అది ఆయనకు ఉపయోగపడింది. రాష్ట్రంలో ముందే బలంగా ఉన్న బిజెపికి కార్గిల్ యుద్ధంలో గెలుపు, కేంద్రంలో అర్ధంతరంగా ప్రభుత్వాన్ని కూలదోయడంతో వాజ్‌పేయిపై సానుభూతి వెల్లు బాగా ఉపయోగపడింది. చంద్రబాబు ఈ సందడిలో దూరి ప్రయోజనం పొందారు. మరోసారి అధికారంలోకి వచ్చారు. కానీ చంద్రబాబుపై జనాక్షిగ హం తగ్గలేదనడానికి ఆ తర్వాత వెల్లు తెలంగాణ ఉద్యమం మరో ఉదాహరణ. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు, అంగన్‌వాడీ కార్మికులను గుర్రాలతో తొక్కించడం ఒక దాష్టీకాల కాలం అది.
hhhh talangana patrika telangana culture telangana politics telangana cinema

అవసరం కోసం బీజేపీని కౌగిలించుకున్న బాబు, అది తీరిపోగానే మళ్లీ మతతత్వ పార్టీగా ముద్రవేసి లౌకికవాదిగా మారాలని చూశారు. కానీ ఎవ రు నమ్ముతారు? ఎంతకాలం నమ్ముతారు? దాని పర్యవసానం 2004 ఎన్నికల్లో బాబు పతనం. 2009 ఎన్నికలకు ముందే బాబు పడవ మునిగిపోవలసింది. చిరంజీవి రాకతో అసలే కుంటుతున్న బాబు నావ మరీ కకావికలైంది. టీఆర్‌ఎస్ చిరంజీవితో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో టీడీపీ ఆనాడే ఖాళీ అయిపోయేది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరో విధంగా ఉండేది. కానీ నాయుడుగారు, ఆయనగారి మీడియా ఎన్నికల రుతుపవనాలను ముందుగా పసిగట్టడంలో నేర్పరులు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేయకపోతే తెలంగాణలో తెలుగుదేశం అంతరించిపోతుందని తెలుసు. అందుకే కమిటీ వేసి, చర్చలు చేసి, బోలెడంత బిల్డప్ ఇచ్చి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసింది. అయినా తెలంగాణ తెలుగుతమ్ముళ్లు టీఆర్‌ఎస్ ఎవరితో చేతులు కలుపుతుందో చూసి రాజకీయ నిర్ణయం తీసుకుందామని అప్పటికే ఒక అవగాహనకు వచ్చారు.

తెలుగు తమ్ముళ్లు కొందరు టీఆర్‌ఎస్‌తో, కొందరు చిరంజీవితో మంతనాలు కూడా జరిపారు. టీఆర్‌ఎస్, పీఆర్‌పీ మధ్య పొత్తు కుదిరితే రెండు పార్టీల్లోకి దూకడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు.
ఈ ప్రమాదాన్ని నివారించడానికి రాజకీయ బ్రోకర్లు, మీడియా పెద్దలు కొందరు రంగంలోకి దిగి పావులు కదిపారు. టీఆర్‌ఎస్‌ను తమవైపునకు తిప్పుకోవడానికి తొలుత టీడీపీ చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని ఆఫర్లు లేవు. టీఆర్‌ఎస్ కూడా టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని ఆశించి, చివరకు అటు మొగ్గు చూపింది. అది చరివూతాత్మక తప్పిదమని తీరా ఎన్నికలు సమీపించే కొద్దీ తెలుస్తూ వచ్చింది. ఫలితాల తర్వాత టీడీపీ కుట్ర పూర్తిగా తెలసిపోయింది. టీడీపీ తాను పోటీ చేసిన స్థానాలను గెలవడానికి, టీఆర్‌ఎస్ స్థానా ల్లో ఆ పార్టీని ఓడించడానికి చేయాల్సిందంతా చేసింది. అదనంగా 32 మందికి బీ ఫారమ్స్ ఇచ్చి టీఆర్‌ఎస్‌కు ఇచ్చిన స్థానాల్లో టీడీపీని దింపి ఓడించాలనుకున్నాడు. అన్నంత పనిచేశాడు. అన్ని స్థానాల్లో, అందరు టీడీపీ వాళ్లు అలా మోసం చేసి ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసి మరీ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయించినట్టు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆ తర్వాత ఆరోపించారు.

అప్పు డు కూడా ఆయన లక్ష్యం ఒక్క టీఆర్‌ఎస్‌ను ఓడించడం కాదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు నేలకూలతాయనుకున్నాడు. ఇటు టీఆర్‌ఎస్, అటు తెలంగాణవాదం రెంటినీ దెబ్బతీయాలన్నది చంద్రబాబు కుట్ర. అలా ఆయన విశ్వా స ఘాతుకాల జాబితాలో 2009 ఎన్నికలు కూడా చేరిపోయాయి. టీఆర్‌ఎస్ తాత్కాలికంగా దెబ్బతిని ఉండవచ్చు. కానీ తెలంగాణవాదం ఫీనిక్స్‌లాగా ఉవ్వెత్తున ఎగసింది. ఆయనపై అపనమ్మకం పరాకాష్ఠకు చేరడానికి లేటెస్టు ఉదాహరణ 2009 డిసెంబరు 7,,9,10 తేదీలలో ఆయన మాటమార్చిన తీరు. ‘చేతనైతే తెలంగాణపై తీర్మానం పెట్టండి’ అని సవాలు చేసిన వ్యక్తి, మరుసటిరోజే ‘అర్ధరాత్రి నిర్ణయం ఎలా తీసుకుంటారు’ అని అడ్డం తిరిగారు. అర్ధరాత్రే కుట్ర చేసి, తెల్లవారేసరికి రాజీనామాల డ్రామాను ఆవిష్కరించారు. ఇప్పుడు తనకు రెండు కళ్లు అని చెబుతున్నాడు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినప్పుడు కూడా ఈ పెద్ద మనిషికి రెండు కళ్లు ఉన్నాయి. సీమాంధ్ర, తెలంగాణ అప్పుడు కూడా ఉన్నాయి. తీర్మానం చేసి న కమిటీకి నాయకత్వం వహించిన ఎర్రన్నాయుడు సీమాంవూధవారే. సమస్యలు, సవాళ్లు వచ్చినప్పుడు నాయకుడు నిలబడాలి. తప్పించుకునేవాడిని, తప్పుకు తిరిగేవాడిని జనం విశ్వసించరు.

ఒక నాయకుడికి కీర్తి అయినా, అపకీర్తి అయినా ఒకటి రెండు మాసాల్లో నో, సంవత్సరాల్లోనో రాదు. చాలా కాలం పడుతుంది. ఒకటి రెండు సార్లు తప్పులు చేస్తే ప్రజలు ఒకసారి శిక్షిస్తారు, ఆ తర్వాత క్షమిస్తారు. అదేపనిగా తప్పులు చేసేవారిని, అలవాటుగా నమ్మకవూదోహానికి పాల్పడేవారిని, అవసరం వచ్చినప్పుడల్లా విధానాలు మార్చేవారిని, అత్యంత అవకాశవాదిగా వ్యవహరించేవారిని జనం క్షమించరు. అపనమ్మకాన్ని, విశ్వాసరాహిత్యాన్ని పోగేసుకోవడం చంద్రబాబునాయుడు 1995 నుంచి ఇప్పటివరకు అవిక్షిశాంతంగా కొనసాగిస్తున్నారు. అదే రేటున ప్రజల్లో ఆయన అప్రతిష్ఠ పెరుగుతూ వచ్చింది. తెలుగుదేశం ఓటు బ్యాంకు కరుగుతూ వస్తున్నది. ఇంకా పతనం కావడమే తప్ప, అది కోలుకునే అవకాశాలు మృగ్యం. కాంగ్రెస్, జగన్ పరస్పరం అంతం చేసుకుంటే తప్ప చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల.

436

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles