ఆజాదూ జాదా హోగయా!(మాటకుమాట)


Sun,July 17, 2011 05:32 AM

mataku mata-katta shekar reddy namaste tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవిద్రోహ శిఖరం
ఒకడు ఆడి తప్పినవాడు
మరొకడు మాట మార్చినవాడు
ఇంకొకడు తిన్నింటివాసాలు లెక్కపెట్టినవాడు
ఒకడు రెండు కళ్ల వాడు
మరొకడు వేయినాల్కలవాడు
ఒక పార్టీ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తుంది
మరోపార్టీ పిల్లిమొగ్గలు వేస్తుంది
ఇంకోపార్టీ ఆత్మాహుతుల చితిమంటలపై చలికాచుకుంటోంది
ఆ పార్టీలను మార్చేయండి
ఆ జెండాలను దింపేయండి
ఆ ఎజెండాలను తగలేయండి


babu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
ఒకడు తెలంగాణ డిమాండు అన్యాయమైనదని ఊదరగొడతాడు. తెలంగాణలో హింస తప్ప ఉద్యమం లేదనీ వాగుతాడు. తెలంగాణ వాళ్లు భాష మార్చుకోవాలని హితబోధ చేస్తాడు.మరొకడు రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉద్యమాలు చేయిస్తుంటాడు. జై తెలంగాణ నినాదంతో మేనిఫెస్టోలు రాసిన చేతులతోనే సమైక్యాంధ్ర జెండాలనూ పట్టిస్తాడు. ఇక్కడ రాజీనామాలు చేసిన వెంటనే అక్కడ రాజీనామాలు చేయిస్తాడు.ఇంకొకడు తెలంగాణ వాళ్లు ఇంకా ఓపికపట్టాలని, సంయమనం పాటించాలని చెబుతున్నాడు. ప్రజాస్వామ్యం గురించి, సంప్రదింపుల గురించి, ఏకాభివూపాయం గురించి మాట్లాడుతున్నాడు.


మిస్టర్ పరకాల ప్రభాకర్!
ఎన్నికల యుద్ధభూమిలో చిరంజీవి సేనలో నిలబడి వైఎస్ రాజశేఖర్‌డ్డి పక్షాన యుద్ధం చేసిన విద్రోహ శిఖరం(ఫిఫ్త్ కాలమిస్టువు) నువ్వు. సామాజిక తెలంగాణ నినాదాన్ని పీఆర్పీ ఎజెండాలో స్వహస్తాలతో లిఖించి ఆనక నాలుక తిప్పేసి విశాలాంధ్ర విషవాదాన్ని మోస్తున్న వంచనాశిల్పం నువు. కేంద్ర ప్రణాళికా సంఘం టాస్క్‌ఫోర్సు స్వయంగా తెలంగాణాలోని పది జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గుర్తించి, నిధులు కేటాయిస్తుంటే, దొంగ లెక్కలు మూటగట్టుకుని ఢిల్లీ వీధుల్లో ఊరేగుతున్న కుహనా మేధావివి నువ్వు. దురహంకార భావజాలాన్ని, అబద్ధాల చరివూతను, తెలంగాణపై నిలు ద్వేషాన్ని, అక్కసును ప్రచారం చేస్తున్న నీకు ప్రజాస్వామ్యం గురించి, న్యాయాన్యాయాల గురించి, తెలంగాణవాదుల భాష గురించి మాట్లాడే అర్హత ఉందా?

‘తెలంగాణ డిమాండు అన్యాయమైనద’ని ఢిల్లీ అందరితో అనిపించాలని చేసిన ప్రయత్నం మీ గూబనే పగులగొట్టింది చూశావా? కరడుగట్టిన సమైక్యవాది కావూరి సాంబశివరావు సైతం ‘తెలంగాణ డిమాండు అన్యాయమైనదని చెప్పను’ అని మీరు కూర్చున్న వేదికపైనే ప్రకటించారు. మీరు ఏరికోరి పిలుచుకున్న ప్రధాని మాజీ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు సంజయ్ బారు కూడా ‘తెలంగాణ డిమాండు అన్యాయమైనదని చెప్పలేను’ అని మీ సమక్షంలోనే అన్నారు.

ఈ వ్యాఖ్యలు ఏమి చెబుతున్నాయి? మీ అవగాహన స్థాయిని, మీ సంకుచితత్వాన్ని, మీ ప్రాంతీయ దురహంకార ధోరణిని బట్టబయలు చేయలేదా? వీరంతా తెలంగాణ వెనుకబాటుతనాన్ని గుర్తించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మీరు తెచ్చిన దొంగలెక్కల గుట్టును చెప్పకనే చెప్పలేదా? మీరు నీతులు చెప్పే పెద్దమనిషులయ్యారా ఇప్పుడు?తెలంగాణలో హింస తప్ప ఉద్యమం లేదా! ఏది హింస ప్రభూ! పదేళ్లుగా ఒక్కొక్క పార్టీయే తెలంగాణ రాష్ట్ర డిమాండుకు జైకొట్టి, తీరా కేంద్రం ప్రకటించాక, ప్రజాస్వామిక స్ఫూర్తికి తూట్లు పొడిచి, మాటమార్చి, కేంద్రాన్ని ఏమార్చి ఆరువందల మంది యువకుల ఉసురుపోసుకున్నారే? ఇది హింసకాదా పెద్ద మనిషీ! ‘జై బోలో తెలంగాణ...’ అంటూ మా వాళ్లు పెట్రోలు మంటల్లో కాలిపోయారే తప్ప ఒక్కడికయినా హాని చేశారా ప్రభాక ర్! తుపాకి తూటాను ముద్దాడిన కిష్టయ్యలు, ఉరితాళ్లను ప్రేమించినవాళ్లు, రైలు కింద తల పెట్టినవాళ్లు, పురుగుల మందు సేవించిన వాళ్లు.... ఎందరు... ఎందరు బలయ్యారని? మీకు మానవత్వం ఉందా? ఒక ఉద్యమం గురించి, ఒక ప్రాంత ప్రజల మనోభావాల గురించి నీ అవగాహన స్థాయి ఇదా! ఎంతటి అసత్యాలను ఎంత ఆలవోకగా మాట్లాడావు

మిస్టర్ పరకాల!
తెలుగుజాతి 150 యేళ్లు తప్ప మిగిలిన కాలమంతా కలిసే ఉందట. ఏ చరిత్ర పుస్తకాల్లో చదివావు పరకాలా! ఎక్కడ పరిశోధించావు? నీకున్న సాధికారత ఏమిటి నాయనా! అబద్ధం ఎన్నిసార్లు చెప్పినా నిజం కాబోదు. తెలుగుజాతి కలసి ఉన్న కాలమే స్వల్పం. ఆ స్వల్పకాలం కూడా గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతమే కలసి ఉంది. విడివిడిగా జీవించిన కాలమే ఎక్కువ. చరిత్ర గురించి జ్ఞానమున్న సాధారణ విద్యార్థికి కూడా అర్థమయ్యే విషయం ఇది. నీకూ తెలియదనుకోను. బుకాయించ దల్చుకున్నవాడికి వాస్తవాలతో పని ఏముంటుంది?

తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందట. తెలంగాణ ఉద్యమంలో ఉంది టీఆస్, నక్సలై మీ వంటి తేనెపూసిన కత్తుల కంటే, పార్టీలను, విధానాలను అవసరాలకు అనుగుణంగా మార్చుకునే మీ వంటి ఊసర కంటే, సాటి మనుషుల ప్రజాస్వామిక ఆకాంక్షలను గుర్తించని మీ వంటి నాజీ మనస్తత్వాలకంటే తుపాకులు పట్టిన ఆ నక్సలైట్లే నయం. తెలంగాణకు నక్సలైట్లతో సహజీవనం తెలుసు. శృతిమించినప్పుడు నక్సలైట్లతో పోరాడడమూ తెలుసు.

బాబూ.. చంద్రబాబూ!?
ఇక్కడ తెలంగాణ తమ్ముళ్లు రాజీనామా చేసి, వీరులనిపించుకున్న మరుక్షణమే అక్కడ బెజవాడలో సమైక్యాంధ్ర నినాదంతో పచ్చజెండాలు రోడ్డెక్కాయి. సీమాంధ్ర అంతటా సమైక్యాంధ్ర నినాదాలతో అందరికంటే ముందుగా వీధుల్లోకి వచ్చిందీ తెలుగు తమ్ముళ్లే! అప్పుడు సమైక్యాంవూధకోసం అందరికంటే ముందుగా రాజీనామా చేసింది మీ హిందూపురం తెలుగు తమ్ముడే! ఎర్రన్నాయుడు, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, చంద్రమోహన్‌డ్డి....ఎలా వీరంగమేస్తున్నారో, సమైక్యాంధ్ర యోధులుగా క్రెడిట్ కొట్టేయడానికి ఎలా పావులు కదుపుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బాబూ! పాపం... తెలంగాణ టీడీపీ తమ్ముళ్లకు రాజీనామా చేసి క్రెడిట్ కొట్టేసిన సంతోషం ఒక్క పూట కూడా మిగలనివ్వలేదు మీ రెండు కళ్ల సిద్ధాంతం. తెలంగాణకు ఒక నాయకుడు, ఒక జెండా, ఒకే ఎజెండా కావాలి.సమైక్యాంధ్రకోసం నినదించే జెండాను తెలంగాణ పట్టుకోలేదు. రెండు ఎజెండాలను మోసే ఒకే నాయకుడిని తెలంగాణ భరించదు. ప్రాంతానికో పాలసీని అమలు చేసే పార్టీలను తెలంగాణ ఇంకా సహించలేదు.

తెలంగాణ టీడీపీ యోధులారా!
‘పోరాడితే పోయేదేమీ లేదు సీమాంవూధుల ఆధిపత్యం తప్ప’ తెలంగాణ ప్రజ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది. ఎజెండా ఏమిటో మీకు తెలుసు. ఏ జెండా అయినా పర్వాలేదు. కానీ పాత జెండాలను దించేయండి! ఏ గుర్తు అయినా పర్వాలేదు. కానీ పాత గుర్తులను చెరిపేయండి. సమైక్యవాదులు పట్టుకున్న జెండాలనే మీరూ పట్టుకుని వస్తే ఇప్పటికే నిస్పృహకు లోనవుతున్న తెలంగాణ విద్యార్థి యువకులు ఏం కావాలి? రెండు పడవల ప్రయాణం ఇంకెంతదూరం? రెండు నాల్కల నీతి ఇంకెంతకాలం? నాయకుని మెడలు వంచి తెలంగాణకోసం లేఖ ఇప్పించండి. నాయకుడి మనసు మార్చండి. లేకపోతే మీరయినా మారండి.

ఆజాదూ జాదా హోగయా!
తెలంగాణపై నిర్ణయం చేయడానికి ఏకాభివూపాయం కావాలా! ఇంకా సంప్రదింపులు జరపాలా? రెడ్డొచ్చిన ప్రతిసారీ నాటకం మొదలు పెట్టడం ఇక సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలు ఎన్నిసార్లు ప్రజాస్వామ్య పరీక్షకు నిలబడాలి? ఎన్నిసార్లు ఏకాభివూపాయం సాధించాలి? ఎన్ని సార్లు సంప్రదింపులు జరుపుతారు? ఏకాభివూపాయం సాధించకుండానే 9 డిసెంబరు 2009న ప్రకటన వచ్చిందా? సంప్రదింపులు జరపకుండానే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలయిందా? అసలు డిసెంబరు 9కి ముందు ఏమీ జరగనట్టు కేంద్రం ఎందుకు నాటకం ఆడుతోంది? ఎవరు ఎవరిని వంచించారు? ఎవరు మోసం చేశారు? అఖిలపక్ష సమావేశాల్లో, అసెంబ్లీలో, పార్లమెంటులో అన్ని పార్టీలు చేసిన బాసలు ఏమయ్యాయి? అన్ని ప్రాంతాల వారి నుంచి ఇప్పుడు అనుమతి తీసుకుంటారట! ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తమిళ ప్రజల ఆమోదం తీసుకున్నారా? దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటన్ల అనుమతి అవసరమా? వద్దు...ఇకచాలు పరీక్షలు... ఆజాదూ... జాదా హోగయా ఆప్‌కా తారిఫ్!

401

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా