ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే


Sat,December 3, 2011 01:05 AM

దేశంలో ప్రజలంతా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అయితే అత్యంత అవినీతి రాజకీయ వ్యవస్థలోనే ఉంది. ఎక్కువమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దానిని నిర్మూలించడం సాధ్యమవుతుంది... పేదలు, అభాగ్యుల వద్దకు వెళ్లండి...వాళ్లను కలవండి...వారికి చేయూత నివ్వండి... వారి సమస్యలు తెలుసుకోండి. వారికోసం పోరాడండి’

-కాంక్షిగెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీఢిల్లీ పీఠంకింద పరుచుకున్న/ అవినీతి ఊడలపై ఊయలలూగుతున్నవాడు నీతి సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం /రమ్మని ఆహ్వానం పలుకుతున్నాడు! ఇంటిని కడుక్కోలేనివాడు/దేశాన్ని శుద్ధి చేద్దాం రమ్మని పిలుపులిస్తున్నాడు! బురదమడుగులో కూరుకుపోయినవాడు పక్కవాడి మచ్చలను చూపి వెక్కిరిస్తున్నాడు!
సర్వాధికారాలు ఉండీ చేష్టలుడిగినవాడు కార్యదక్షులు కావాలని కథలు చెబుతున్నాడు!
రాహుల్! మీకు కావలసిన యువకులు ఎవరు? మీకు కావలసింది పొలిటికల్ కెరీరిస్టులు/ ఇప్పుడు కాంగ్రెస్‌లో కోకొల్లలు! ఏ సిద్ధాంతాలు, ఎమోషన్స్ లేని /రాజకీయ వ్యాపారులు అక్కడ కుప్పలు తెప్పలు!
మీకు కావలసిన యువకులు మీ అసలు రూపం గుర్తించని వారు! మీ ముసుగులు తొలగించనివారు!
ముసుగులు తొలగించిన వారు మీ ఏలుబడిలో ఎన్‌కౌంటర్ అవుతారు! స్వేచ్ఛ గురించి మాట్లాడిన డాక్టర్
జైలు ఊచలు లెక్కపెడుతుంటాడు! రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలమైంది. ఆయన యువజన కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టీ, లక్షలాది మంది కార్పొరేట్ యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చీ చాలా యేళ్లయింది. ఢిల్లీ దర్బారులో రెండు పర్యాయాలుగా యువరాజు ప్రభుత్వమే రాజ్యమేలుతున్నది. గత దశాబ్దకాలంగా యువరాజు...నీతులు, విలువలు, పేదల గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

పేదల ఇళ్లను సందర్శించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. మహారాష్ట్ర లో ఆత్మహత్య చేసుకున్న రైతు భార్యను ఇంటికి వెళ్లి మరీ ఓదార్చి వచ్చారు. వారితో కలసి భోంచేసిన విషయమూ మర్చిపోలేదు. కాకా హోటళ్లలో పేదలతో కలసి టీ తాగిన విషయమూ దేశానికి తెలుసు. కానీ ఏమైంది? మాటలు కోటలు దాటాయి, చేతలు గడపదాటలేదు. అవినీతి ఊడలు దశదిశలా పర్చుకున్నదీ ఈ పదేళ్లలోనే. ఒకరు, ఇద్దరు...మంత్రులు, అనేక మంది కార్పొరేట్ గద్దలు తీహార్ జైలు పాలైందీ ఈ దశాబ్దంలోనే. ఈ పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. ఢిల్లీ వచ్చిన రైతు భార్యకు రాహుల్ దర్శనమే లభించలేదు. అవినీతి తగ్గలేదు. ధరలు పెరగడమూ మానలేదు. ప్రజస్వామిక ఉద్యమాలనూ బతకనివ్వలేదు. ప్రజల ఆకాంక్షలనూ లెక్కపెట్టలేదు. దుర్మార్గమైన ఆర్థిక విధానాలను అమలు పరిచే విషయంలో ఎప్పుడూ సంకోచించలేదు. అటువంటి విధానాలను అమలు పర్చడానికి ఏకాభివూపాయ సాధన, అఖిలపక్ష చర్చలు, గోంగూర కట్టా....ఏదీ అవసరం లేకపోయాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయం వచ్చే వరకు ప్రాంతీయ, ఉపవూపాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చర్చలు అవసరమని దాటవేస్తారు.

మీరు ఎవరికి ఆదర్శం? మీరు నీతులు చెప్పాల్సింది దేశానికి, యువకులకూ కాదు. మీ అంతరాత్మకు! మీ ప్రభుత్వానికి! మీరు కడగాల్సింది దేశంలోని రాజకీయ వ్యవస్థను కాదు, మీ సొంత ఇంటిని, మీ సొంత పార్టీని!

అమీబా చిదంబరం
శిఖండికి రెండు తలలు మాత్రమే ఉంటాయి. అది రెండు వైపుల మాత్రమే పాకగలదు.అమీబాకు బహుముఖాలు. అన్ని వైపుల ప్రయాణించగలదు. ఎప్పుడు ఏ వైపు ప్రయాణిస్తుందో చెప్పడం కష్టం. కానీ అది దాని సహజ లక్షణం. బతకడంకోసం ఆ పని చేస్తుంది. రాజకీయాల్లో కాంగ్రెస్ అమీబాను మించిన బహుముఖ జీవి. దీనికి బహుముఖాలేకాదు. వేయినాల్కలు. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటి కామాటలాడి తప్పించుకు తిరగడం’ కాంగ్రెస్ పెద్దల నైజం! దశాబ్దపు ఉద్యమం తర్వాత, అనేక వాగ్దానభంగాల తర్వాత, డజన్లకొద్ది డెడ్‌లైన్‌ల తర్వాత, పలు కమిటీలు, కమిషన్‌లు అభివూపాయసేకరణల తర్వాత ప్రజాస్వామిక ప్రక్రియలన్నీ వమ్మయిన తర్వాత....మళ్లీ చిదంబరమొచ్చి మొదలుపెడతాడట. నాలుగు పార్టీలు డిసెంబరులోగా తెలంగాణపై నిర్ణయానికి వస్తే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఏదోఒకటి తేలుస్తామని చిదంబరం సెలవిస్తాడు.

ఎంత విడ్డూరం! ఎంత వెటకారం! ఎంత అపహాస్యం! ఏకాభివూపాయం లేకున్నా, ఏ చర్చలూ జరపకపోయినా, దేశమం తా గగ్గోలు పెడుతున్నా ప్రపంచబ్యాంకు ఎజెండాను, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడడానికి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం ఎంతకయినా తెగిస్తున్నది. ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు చిల్లర వర్తకం రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో వెనుకకు తగ్గేది లేదని మన్‌మోహన్ భీకర ప్రతిజ్ఞలు చే స్తా డు. వెనుకటికి అణుఒప్పందం విషయంలోనూ ఇలాగే పంతంపట్టి పని జరిపించుకున్నారు. కానీ తెలంగాణ విషయంలో అందరూ అంగీకరించి, మాటతప్పిన విష యం తెలిసీ ఏకాభివూపాయం కావాలంటూ వంకలు పెడుతున్నారు. ఇటువంటి నా యకత్వాన్ని ఈ దేశం ఎందుకు భరించాలి? ఎందుకు క్షమించాలి? ఇంతటి దివాళాకోరు పార్టీలను ప్రజలు ఎందుకు సహించాలి?

మంత్రి గీత
‘ఓడిపోతే ఓడిపోతాం...ఓ ఐదేళ్లు రెస్టు తీసుకుందాం...మళ్లీ ఐదేళ్లకు గెలిచినోడిమీద జనానికి మొహంమొత్తి తిరిగి మనల్నే గెలిపిస్తారు. వరుసగా గెలుస్తున్నాం...గెలిచినప్పటి నుంచి జనం ముందు కనిపిస్తూ ఉండాలె... ఈ పని అని, ఆ పని అని అస్తమానం జనం విసిగిస్తూ ఉంటారు... విశ్రాంతి లేదు. సుఖం లేదు..ఎంత సంపాదించుకున్నా అనుభవించింది లేదు...తెలంగాణ వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు దానికోసం మనం ఇంకా చించుకోవడం అనవసరం... ఉన్న రెండున్నరేళ్లూ ఏదోలా గ కాలం గడిపేస్తూ, పనులు చక్కబెట్టుకుంటే చాలు... తెలంగాణ గోల వదిలేసి మీకేం పనులు కావాలో చేయించుకోండి... మీరసలు పరేషాన్ కావద్దు...’తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ మంత్రి సన్నిహితులకు చేసిన హితోపదేశం ఇది. తెలంగాణ విషయంలో గట్టిగా నిలబడకపోతే గడ్డికరిచిపోతామని, ఏదో ఒకటి చేయాలని వెంటపడుతున్న సహచరులతో ఆ మంత్రిగారు కుండబద్దలు కొట్టినట్టు అసలు విషయం చెప్పారు. అవును! రాజకీయ నాయకుడు జూదగాడిలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆట కాకపోతే మ రో ఆట గెలుస్తాం...అన్ని ఆటలు మనవి కాదు... వెయ్!

దేశముదురు తమ్ముడు
తెలంగాణ పని అయిపోయినట్టే... జనానికి జ్ఞాపక శక్తి తక్కువ. నాలుగురోజులకు అన్నీ మర్చిపోతారు. వారి మతిమరపే మన బలమని మానాయకుడు పదేపదే చెబుతుంటారు. మొన్న నియోజకవర్గానికి వెళ్లాను...కావాలని సెంటర్లో కాసేపు కూర్చున్నా...ఓ ఇరవై మంది వచ్చి అల్లరి చేశారు...ఆ తర్వాత పోలీసు లు పట్టుకపోయారు....నేను తలుచుకుంటే ఆ ఇరవై మందిని అక్కడే తన్నగలిగి ఉండేవాడిని...(ఎందుకు తన్నలేదు? వింటున్నాయన ప్రశ్నించాడు). అమ్మా! ఆ పనిచేస్తే నియోజకవర్గ ప్రజల్లో తిరుగుబాటు రాదూ! అసలే ఇప్పుడు మాపై జనం కోపం మీద ఉన్నారు. అందుకే అన్నీ సహిస్తున్నాం. కొంతకాలమయితే అన్నీ మర్చిపోతారు. ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోతాయి. మళ్లీ డబ్బులు పెట్టాల్సిం దే...మాయ చేయాల్సిందే... లేకపోతే ముం.....కొడుకులు (జనం) ఓట్లేస్తారా....?’ మాటలు, తుప్పిర్లు వర్షంలా కురిపిస్తున్నాడా తెలంగాణ తెలుగుదేశం తమ్ముడు. ఆయనకు ఎప్పుడూ గజం దూరంలో నిలబడి మాట్లాడాలట(లేదంటే మీ ముఖం తడిసిపోతుందట)!. చంద్రబాబు నీడలో ఎంతకాలముంటారు? ఎందుకిలా చేస్తున్నారు? అని అడిగిన మిత్రులతో ఆ దేశముదురు చేసిన వ్యాఖ్యలివి. మీడియా ముందు ముసుగు మనుషులు మాట్లాడతారు. ఆంతరంగికుల వద్ద అసలు మనుషులు మాట్లాడతారు. తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లకు జనం అంటే, ప్రజాస్వా మ్యం అంటే ఎంత గౌరవమో, తెలంగాణ అంటే ఎంత ప్రేమో తెలియడం లేదూ?

విచిత్ర బంధం!
బంధాలు, అనుబంధాలు, ఆర్థిక హోదాలు ప్రాంతాలు, కులాలు, మతాలు, దేశాల సరిహద్దులను చెరిపేస్తాయి. చిత్తూరు, నిజామాబాద్, పాలకొల్లులను కలిపిన బంధం ఇదే. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను పెనవేసిన అనుబంధ మూ ఇదే. మూడు వేర్వేరు సామాజిక నేపథ్యాలను ఒక్కటిగా చేసిన సూత్రమూ ఇదే. అపోలో అధినేత అరగొండ ప్రతాప్ చంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం అరగొండ గ్రామం. పెదడ్ల కుటుంబం నుంచి వచ్చినవారు. కాగా ఆయ న కూతురు శోభనను చేసుకున్నవారు, నిజామాబాద్ దొమకొండ సంస్థాన వారసుడు కామినేని అనిల్. ఇప్పుడు అనిల్ కూతురు ఉపాసనను వివాహమాడుతున్న మగధీరుడు కొణిదెల రాంచరణ్ తేజ. మెగా హీరో చిరంజీవి తనయుడు. చిరంజీవి పశ్చిమగోదావరి పాలకొల్లు బిడ్డ. అస్తిత్వ కాంక్ష ప్రాంతాల విభజనకోసం పోరాడుతుంటే, అనుబంధాలు కలసిపోవడానికి ఆరాట పడుతున్నాయి. దేనిదారి దానిదే! బెస్ట్ విషెస్ టు ఆల్!

385

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles