దొరతనం వదిలించింది ఎవరు?


Sat,October 5, 2019 11:39 PM

katta-shekar-reddy
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాలుష్యాన్ని వెదజల్లడానికి ప్రయత్నిస్తున్నా యి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లభించిన అయాచిత విజయాలతో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అసత్యాలు, అర్ధసత్యాలను అలవోకగా కుమ్మరిస్తున్నాయి. ద్వేషం, అక్కసు, ఉన్మత్తత కలగ లిపిన మాటలతో మునుపెన్నడూ లేనంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నాయి. స్వరాష్ట్ర ఉద్య మం ఉధృతంగా నడుస్తున్నకాలంలో తెలంగాణ ద్రోహులతో కలిసి వెన్నుపోటు పొడిచిన శక్తులు ఇటీవల ఒక సభ పెట్టుకొని అందులో ఉద్యమనాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనరాని మాటలు అన్నాయి. ఆ సభలో మాట్లాడినవారంతా వివిధ సందర్భాల్లో ఆంధ్ర ఆధిపత్యశక్తు ల మోచేతి నీళ్లకు ఆశపడి అమ్ముడుపోయినవారే. వారివ్వాళ తెలంగాణకు ఏదో అన్యాయం జరిగిపోతుందని అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఎన్ని సమస్యలున్నా తెలంగాణ సమాజం ఇప్పు డు ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తున్నది. అన్ని రం గాల్లో అసాధారణమైన ప్రగతిని సాధిస్తున్నది. మొన్న ఒక అధికారి చెబుతున్నారు. తన మూడు దశాబ్దాల సర్వీసులో తెలంగాణ పల్లెలకు ఇంత డబ్బు అం దడం ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఐదేండ్ల కాలంలో ప్రజలకు పంపిణీ చేసిన నిధులు సుమారు ఐదు లక్షల కోట్లు ఉంటుంది. సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా.. ఇంకా అనేక పథకాల రూపేణ ప్రజలకు అందినవి. ఇక అభివృద్ధి సంగతి చెప్పనక్కర లేదు. ప్రతి ఊరుకు భగీరథ చేరింది. అత్యధిక గ్రామాల్లో మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడ్డాయి. ఇప్పుడు నీటి పారుదల ప్రాజెక్టులతో ప్రతి చెరువును నింపుకుంటున్నాం. ప్రతి చెరువు మత్స్య పరిశ్రమ కేంద్రంగా మారుతున్నది. ప్రతి ఊర్లో రోడ్లు బాగుపడినాయి. మునుపెప్పుడైనా ఇలా జరిగిందా? కాంగ్రెస్, బీజేపీల ఇలాకాల్లో ఇలా ఎప్పుడన్నా చేశారా? అని ఆ అధికారి ప్రశ్నించారు. పనులు చేయడం సంగతి దేవుడెరుగు. ప్రజలతో మంచిగా వ్యవహరించడం కూడా వారివల్ల కాలేదు. మొన్న హుజూర్‌నగర్ నుంచి ఒక పెద్దమనిషి వచ్చారు. ఆయన చెబుతున్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఇలా ఎప్పుడూ చూడలేదు. అంతెత్తు మనిషి ఆయన గంభీరంగా దొరతనమే ప్రదర్శించేవాడు.

తెలంగాణ రాష్ట్ర సాధన పుణ్యంలో కాణీ వాటా కూడా లేని మనిషి ఉత్తమ్. తెలంగాణ నుంచి తరిమేసిన చంద్రబాబును మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తెలంగాణకు తీసుకొచ్చి బట్టగట్టిన రాజకీయ దుర్బలుడు ఆయన. ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులెవరికీ తెలంగాణ ఆత్మగౌరవం అంటే అర్థం కాదు. అర్థం అయితే చంద్రబాబుతో జతకట్టేవారు కాదు. వారికి రాజకీయాలే ముఖ్యం. వారికి ఎమ్మెల్యే పదవి అంటే కిరీటం, హోదా. ప్రజలు ఓట్లువేసే యంత్రాలు. ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యే అన్న సోయి కాంగ్రెస్ నాయకులకు ఎవరికీ లేదు. నీళ్లు రావడం లేదంటే కాలువల వెంట నడిచేవాడు కావాలి. ఆపద వచ్చిందంటే రెక్కలు కట్టుకొని వాలేవాడు కావాలి. సమస్యలు ముసురుకున్నాయంటే ముందుకువచ్చి పరిష్కరించేవారు కావాలి.


డబ్బులతో, పనులతో జనాన్ని మచ్చిక చేసుకోవడం, గెలువడం తప్ప, నేను జనం మనిషిని అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆయనకు ఫోన్ చేస్తే తీయడు. ఇంటికెళితే ఎందుకు వచ్చారు అన్న ట్టు మాట్లాడేవారు. ఈసడించుకునేవారు. ఇంగ్లీషు తిట్లు తిట్టేవా డు. అట్లాంటి మనిషి ఇప్పుడు జనం కడుపులో తలపెట్టి మాట్లాడుతున్నాడు. దొరబట్టలు విడిచిపెట్టి వచ్చి మీ మనిషిని, మీతోనే ఉంటా అని కొత్త కొత్త డైలాగులు చెబుతున్నారు. దొరతనం దర్పం అన్నీ వదలి చిన్నాపెద్దా అందరి వద్దకు వెళ్లి చేతులు కైమోడ్చి వేడుకుంటున్నాడు అని ఆ పెద్దాయన వివరించారు. ఆయన ఒక్కరే కాదు ఒకప్పుడు జనాన్ని తమ దగ్గరకే పిలిపించుకొని తాము సింహాసనాలపై కూర్చొని ఆశలు కల్పించి, డబ్బులు వెదజల్లి, ఆదేశాలు జారీచేసి ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నేలకు దిగారు. ఇంటింటికి తిరిగారు. గదుమలు పట్టుకొని బతిమాలుకున్నారు. అయినా జనం తిరస్కరించారు. దీని అర్థం ఏమిటి? కాంగ్రెస్ నాయకుల దొరతనాన్ని, తెలంగాణ రాజకీయాలకు పట్టిన దొరతనాన్ని వదిలించిన శక్తి తెలంగాణ రాష్ట్ర సమితి, దాని నాయకత్వమే. రాజకీయాలను ప్రజల మార్గం పట్టించిన శక్తి టీఆర్‌ఎస్సే. తెలంగాణ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం, అధికారులు, నాయకులు ప్రజ ల ముందుకువచ్చారు. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడూ నియోజకవర్గాన్ని వదిలి ఉండటం లేదు. నిరంతరం జనంతో మమేకం అవుతున్నారు. ఒకప్పుడు మంత్రి అంటే పెద్ద దొర. వారెప్పుడో కానీ కనిపించేవారు కాదు. ఇప్పుడు మంత్రులు పెద్ద పాలేర్ల మాదిరిగా జనం కోసం తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు ఊర్లు వదిలిపెట్టి ఉంటున్నకాలం తక్కువ. నిరంతరం ఏదోఒక పథకం, కార్యక్రమా ల అమలు కోసం పల్లెలకు వెళుతున్నారు. ఇవ్వాళ రాజకీయ ఆశ్ర యం దొరుకనివారు, తమకు అధికారం దక్కకుండా పోయిందని కుమిలిపోతున్నవారు ఎంతైనా కడుపు చించుకోవచ్చుగాక తెలంగాణ సాధించిందేమిటో ప్రజలకు తెలుస్తూనే ఉన్నది. తెలంగాణ ప్రజలకు నీళ్ల భాష తెలిసింది. కరెంటు భాష తెలిసింది. వ్యవసాయంపై మక్కువ పెరిగింది. అభివృద్ధి ఎలా చేసుకోవాలో తెలిసిం ది. కరెంటు కోసం, నీళ్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ప్రజలను ఎంత గోస పెట్టాయో ఇంకా మరువలేదు.


ఇవ్వాళ తెలంగాణ సమాజం నింపాదిగా వ్యవసాయం చేసుకుంటున్నదంటే అది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భరోసానే. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పటికీ తెలంగాణ ఆత్మగల పార్టీలు కాలే వు. ఎందుకంటే వారి ఆత్మ ఢిల్లీలో ఉంటుంది. వారి ఎజెండా ఢిల్లీ నాయకుల ఎజెండా అవుతుంది. బీజేపీది మత, జాతీయవాద నినాదాలతో భావోద్వేగాలు రెచ్చగొట్టి జనాన్ని అభివృద్ధికి, రోజువారి ఆకలి మంటల పోరాటానికి దూరంచేసే ఎజెండా. తెలంగాణ బీజేపీ నాయకత్వం తెలంగాణ కోసం చేసిన మంచిపని ఒక్కటీ లేదు. ఆ పార్టీలో కొందరు వ్యక్తులు ధైర్యంగా ఉద్యమంలో పాల్గొన్నారు తప్ప, పార్టీగా ఉద్యమంలో దూకింది ఎన్నడూ లేదు. కాం గ్రెది మరీ బానిస బుద్ధి. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఊరేగుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిది తెలంగా ణ పట్ల విద్రోహ చరిత్ర. తెలంగాణ అంతా ఉద్యమిస్తున్న వేళ, కాం గ్రెస్‌లో కూడా ఎంపీలు, కొందరు మంత్రులు తెలంగాణ కోసం రాజీనామాలకు సిద్ధపడిన వేళ అప్పటి ముఖ్యమంత్రి, తెలంగాణ వ్యతిరేకి కిరణ్‌కుమార్ రెడ్డికి నమ్మిన బంటులాగా మంత్రి పదవిని పట్టుకొని వేలాడిన స్వార్థపరుడు. తెలంగాణ రాష్ట్ర సాధన పుణ్యంలో కాణీ వాటా కూడా లేని మనిషి ఉత్తమ్. తెలంగాణ నుంచి తరిమేసిన చంద్రబాబును మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తెలంగాణకు తీసుకొచ్చి బట్టగట్టిన రాజకీయ దుర్బలుడు ఆయన. ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులెవరికీ తెలంగాణ ఆత్మగౌరవం అంటే అర్థం కాదు. అర్థం అయితే చంద్రబాబుతో జతకట్టేవారు కాదు. వారికి రాజకీయాలే ముఖ్యం. వారికి ఎమ్మెల్యే పదవి అంటే కిరీటం, హోదా. ప్రజలు ఓట్లువేసే యంత్రాలు. ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యే అన్న సోయి కాంగ్రెస్ నాయకులకు ఎవరికీ లేదు. నీళ్లు రావడం లేదంటే కాలువల వెంట నడిచేవాడు కావాలి. ఆపద వచ్చిందంటే రెక్కలు కట్టుకొని వాలేవాడు కావాలి. సమస్యలు ముసురుకున్నాయంటే ముందుకువచ్చి పరిష్కరించేవారు కావాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి. ఓటు దాటిన తర్వాత బోడ మల్లన్న అని ముఖం చాటేసే నాయకులను ప్రజలు కనిపెట్టి ఉండకపోతే రాజకీయాల్లో జరిగిన తప్పులే మళ్లీమళ్లీ జరుగుతాయి. హుజూర్‌నగర్ ఎన్నిక రాజకీయ వ్యాపారులకు గుణపాఠం చెప్పా లి. రాజకీయాల్లో ఆబ్సెంటీ లాండ్ లార్డులకు స్వస్తిచెప్పాలి.

[email protected]

2154

KATTA SHEKAR REDDY

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం