వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ


Mon,September 16, 2019 01:05 PM

katta-shekar-reddy
ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధారిత, అధిష్ఠాన బానిస రాజకీయ ముఠాలు, మీడియా మాఫియా తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేసేవి. కేసీఆర్ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు రెక్కలు విప్పుకుని చెలరేగిపోవడానికి ఈ శక్తులు పొంచుకుని ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల చరిత్ర అంతా పాతదే. తెలంగాణ ప్రజలకు బాగా తెలిసిం దే. వీళ్లు కొత్తగా రుజువు చేసేది కానీ, అధికారంలోకి వస్తే ఉద్ధరించేది కానీ ఏమీలేదు. మళ్లీ మేమే వస్తాం అని చెబుతున్న కాంగ్రెస్ కు ఒక ఎజెండా లేదు, ఒక నాయకుడు లేడు. బీజేపీ ఎజెండా ప్రజల ఎజెండా కానే కాదు, కేంద్రంలో ఏం ఉద్ధరించిందో, ఇక్కడ ఏమి ఉద్ధరిస్తదో అందరికీ అర్థమయ్యే విషయమే. టీడీపీ తెలంగాణ ద్రోహశక్తి. ఆ పార్టీ ఇప్పుడు ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో తెలంగాణలో చిచ్చు పెట్టాలని ప్రయతిస్తున్నది. తెలంగాణ ఒక నమూనాగా నిలబడింది అంటే అది కేసీఆర్ వల్లమాత్రమే సాధ్యమైంది. తెలంగాణ పథకాలు, తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులు కొత్త పుంతలు తొక్కుతున్నాయంటే అది కేసీఆర్ సంకల్ప బలమే. ఆయన పంతంగా, మొండిగా నిలబ డి చేయడం వల్లనే కరెంటు సమస్య పోయింది. ప్రాజెక్టులు పరుగులుపెడుతున్నా యి. వేల కోట్ల సంక్షేమ ఫలా లు పల్లెలకు అందుతున్నా యి. పేద పిల్లలకు అద్భుతమైన విద్య లభిస్తున్నది. స్వరాష్ట్ర ఫలాలు తెలంగాణ కు అందుతున్నాయి. నిజాని కి కొన్ని విషయాల్లో కేసీఆర్ మాకు నచ్చడం లేదు. తెలంగాణ ఉద్యమం నాటి టీమ్ స్పిరిట్‌ను కొనసాగించడంలేదన్న కోపం ఉంది. ఒకప్పుడు ఒక్కుమ్మడిగా కొట్లాడిన టీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పుడెందుకో ఉదాసీనంగా ఉంటున్నది.

బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ కోసం జరిగిన ఏ ఉద్యమంలోనూ కలసి రాలేదు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, ఎమ్మెల్యేల రాజీనామాలు...ఏ సందర్భంలోనూ వారు ముందుకు రాలేదు. కాంగ్రెస్ అయితే మరీ దారుణం. వారు ఏం చేయాలన్నా ఢిల్లీ అనుమతి కావాలి. తెలంగాణపై వారిది పెదవిదాటని ప్రేమ. వారు ఇవ్వాళ తెలంగాణకు వారసులుగా వస్తే ఏమి జరుగుతుందో చెప్పనవసరం లేదు.కేసీఆర్ తలుచుకుంటే ఈ సమస్యలను అధిగమించడం చిటికెలో పని. అది చేస్తలేరని నాలాంటి వారికి బాధకలుగుతున్నది. అయినా తెలంగాణకు కేసీఆరే కావాలి. ఆయన లేకపోతే తెలంగాణను ఆగంపట్టించుడు తెలంగాణ వ్యతిరేకులకు తేలిక. బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మితే తెలంగాణ చిల్లాకల్లం అవుడుతప్ప ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేదు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్‌ల నేతలు ఢిల్లీ చేతి కీలుబొమ్మలు. వారు స్వయం ప్రకాశితాలు కారు. స్వయంశక్తి కాలిగిన నాయకులు కారు. వారితో ఎప్పటికయినా తెలంగాణకు ప్రమాదమే. తెలంగాణ ప్రయోజనాలకంటే వారికి అధిష్ఠానం ప్రయోజనాలే ముఖ్యం. ఆ రెండు పార్టీలే మాటకు కట్టుబడి ఉంటే తెలంగాణ మరో పదేళ్లక్రితమే వచ్చి ఉండేది. ఎప్పటికయినా మనోడు మనోడే, మందోడు మందోడే- అని ఒక ఎన్నారై మేధావి ఇటీవల ఒక ఇష్టాగోష్టిలో అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకా చాలా విషయాలు చర్చించారు. మతవాదాన్ని, ఉద్వేగాలను, అసత్యాలను ముందేసుకుని వచ్చే ఏ రాజకీ య పార్టీ అయినా జనం అసలు సమస్యలు పరిష్కరించదు. సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడంకోసం వారికి భావోద్వేగాలే ఆయుధం అని ఆయన స్పష్టం చేశారు. మేమే వస్తాం అంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పదేపదే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆ మేధావి మాటలు గుర్తు చేయాలనిపించింది. బీజేపీ ఇటీవల తెలంగాణలో మరీ శృతిమించిన విశ్వాసంతో అడ్డగోలు మాటలు చెబుతున్నది. బీజేపీకి తెలంగాణకు సంబంధం లేదు. బీజేపీ చాలా చిత్రంగా అనేక విషయాలు మాట్లాడుతున్నది. సెప్టెంబరు 17 గురించి పెద్దపెద్ద మాటలు చెబుతున్నది. తెలంగాణ విమోచనోద్యమం నాటికి వీరి పార్టీ పుట్టలేదు. తెలంగాణ తిరగబ డి పోరాడుతున్న వేళ వీరు బిస్తీలు తీసుకుంటూ కాలక్షేపం చేశారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్‌లు మాత్రమే ఆరోజు కత్తుకట్టి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు.

వీరెవరి వారసత్వమూ బీజేపీకి లేదు. హైదరాబాద్ విమోచన పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్‌ల ఉమ్మడి నిర్ణయం. ప్రధానికి తెలియకుండా ఒక్క పటేలే సైన్యాన్ని పంపించారని బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని ప్రయత్నిస్తున్నది. ప్రధాని అనుమతి లేకుండా హోంమంత్రి సొంతంగా అంతపెద్ద నిర్ణయం తీసుకోలేడు. నైజాంలో పరిస్థితి చేయిదాటకముందే స్వాధీనం చేసుకోవాలని కేంద్రం భావించింది కాబట్టే ఆరోజు ఆగమేఘాలపై సైన్యం వచ్చింది. ఆ రోజు జరిగిన పరిణామాలతో అప్ప టి జనసంఘ్‌కు గానీ ఇప్పటి బీజేపీకి కానీ కించిత్ సంబంధం లేదు. అయినా హైదరాబాద్‌ను తామే విమోచన చేసినట్టు బాగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారికి పూనకం ఎక్కువ అన్నట్టు, తెలంగాణ చరిత్రతో తమకేదో గొప్ప సంబంధం ఉన్నట్టు ఊగిపోతున్నది. చరిత్రకు కాషాయ రంగును పూసే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర తెలియని తరాన్ని బాగా మత్తులో ముంచి మోసం చేయాలని చూస్తున్నది. తెలంగాణ ఉద్య మం విషయంలోనూ వీరిది విద్రోహ పాత్రే. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ర్టాల ఏర్పాటు తీర్మానం చేసింది 1998 పార్లమెంటు ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు, 18.3 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1999లో టీడీపీతో కలిసి బీజేపీ పోటీచేసి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అంతే తెలంగాణ నినాదాన్ని పాతిపెట్టారు. కాంగ్రెస్ కూడా అంతే తెలంగాణ వారికి రాజకీయ తురుపు ముక్క. తెలంగాణ ఎమ్మెల్యేలు 2000 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని డిమాండు చేస్తూ సోనియాగాంధీకి లేఖ ఇచ్చారు. కానీ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాగానే వారంతా పడకలు వేశారు. టీఆర్‌ఎస్ వచ్చి తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ఎత్తుకునే వరకు ఎవరూ నోరు మెదపలేదు.

బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ కోసం జరిగిన ఏ ఉద్యమంలోనూ కలసి రాలేదు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, ఎమ్మెల్యేల రాజీనామాలు...ఏ సందర్భంలోనూ వారు ముందుకు రాలేదు. కాంగ్రెస్ అయితే మరీ దారుణం. వారు ఏం చేయాలన్నా ఢిల్లీ అనుమతి కావాలి. తెలంగాణపై వారిది పెదవిదాటని ప్రేమ. వారు ఇవ్వాళ తెలంగాణకు వారసులుగా వస్తే ఏమి జరుగుతుందో చెప్పనవసరం లేదు. బీజేపీ ఆరేళ్లుగా అధికారంలో ఉంది. ఇప్పటిదాకా చూపించి ట్రైలరే, సినిమా ముందుంది అని ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నారు. ఆయన దేశంలోని వాస్తవిక పరిస్థితులను, సంక్షోభ వాతావరణాన్ని గుర్తించి మాట్లాడుతున్నారో లేక కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారో ఈ డైలాగును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైనా మంచి చేసి ఉంటే, ఇంకా చాలా మంచి చేస్తామని చెప్పుకోవడం ఒక పద్ధతి. ఇప్పటిదాకా దారుణాలు చేసి ఉంటే, ఇంకా దారుణంగా ఉండబోతుందని చెప్పడం ఇంకో పద్ధతి. నరేంద్ర మోదీకి ఏది వర్తిస్తుందో చాలామందికి అనుభవంలో ఉన్నదే. ఆయనకు ఆర్థిక సామాజిక అభ్యున్నతికి సంబంధించిన అంశాలతో పనిలేదని, కేవలం భావోద్వేగాలు రేపెట్టి దేశా న్ని ఒక మత్తులో ముంచేసి ముందుకు నడిపించాలనుకుంటున్నారని ఈ పరిణామాలన్నీ చెప్పకనే చెబుతున్నాయి. జమ్ముకశ్మీరులో 370 అధికరణం రద్దు చేయడం గొప్ప నిర్ణయమని కొందరు, లేదు ఆ అధికరణాన్ని పునరుద్ధరించాలని ఇంకొందరు వాదిస్తుంటే విస్మయం కలుగుతున్నది. నిజానికి 370 అధికరణం ఉన్నా లేకపోయినా కశ్మీరు పరిస్థితిలో మార్పు లేదు. కశ్మీరులో అణిచివేత 370 అధికరణాన్ని రద్దు చేయకముందు నుంచే ఉంది. కాంగ్రెస్ హయాంలో ఉంది. బీజేపీ హయాంలో కొనసాగింది. ఇప్పుడు ఇంకా తీవ్రతరమైంది. అణిచివేతను పరాకాష్టకు తీసుకెళ్లడమే గొప్ప విజయంగా బీజేపీ ఇవ్వాళ దేశానికి సినిమా చూపిస్తున్నది.

ఇక ఇతర రంగాలలో బీజేపీ వైఫల్యాల గురించి మనం చెప్పాల్సిన పనేలేదు. బీజేపీ ఏరికోరి తెచ్చుకున్న ఆర్థికవేత్తలు ఒక్కొక్కరే సలహాదారులుగా, ఆర్‌బీఐ గవర్నర్లుగా పనిచేయలేమని చేతులెత్తేసి వెళ్లిపోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎంత దారుణంగా ఉందో బీజేపీకి చెందిన కొందరు ఆర్థిక నిపుణులు కూడా ఆందోళ న వ్యక్త చేస్తున్నారు. కంపెనీలు మూతపడుతున్నాయి. బ్యాంకులు మూతపడుతున్నాయి. లక్షలాదిమంది ఉపాధికోల్పోతున్నారు. వ్యాపారాలు దివాళా తీస్తున్నాయి. బ్యాంకులను ముంచి విదేశాల కు వెళ్లేవాళ్లు వెళుతూనే ఉన్నారు. దేశంలో కొన్ని కంపెనీలు ఆడింది ఆట పాడింది పాట. ప్రజాస్వామ్యం కాదు కంపెనీ స్వామ్యం నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అవినీతిలో కాంగ్రెస్ పీహెచ్‌డీ చేస్తే, బీజేపీ డబుల్ పీహెచ్‌డీ చేస్తున్నది. రాత్రికి రాత్రి ప్రభుత్వాలు పార్టీ ఫిరాయిస్తాయి. రాజకీయ ప్రత్యర్థులను వేటాడే సంస్కృతి పరాకాష్ఠకు చేరుతున్నది. ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన భ్రష్ట రాజకీయాలన్నీ ఇప్పుడు బీజేపీ చేస్తున్నది. మేము వస్తామని చెబుతున్నారు సరే, మీరు చెప్పే గొప్ప ఆర్థిక ఎజెండా ఏమిటి? రైతు బంధులాగా ఎకరానికి పదివేలు ఇస్తారా? లేక కొందరి ముఖాన ఆరు వేలు విసిరేసి అదే ఘనకార్యమని ఊరేగుతారా? ఆరోగ్యశ్రీలాగా పేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఇస్తా రా? టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలను అదే స్థాయి లో కొనగించగలరా? ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇంత వేగంగా పూర్తి చేయగలుగుతారా? అంతదాకా ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుకో, మరో ప్రాజెక్టుకో జాతీయ హోదా తెస్తామని ఇప్పటికిప్పుడు మీరు చెప్పగలరా? ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరిస్తారా? ఉపాధి అవకాశాలు కల్పిస్తారా? మూతపడిన కంపెనీలను తెరిపిస్తారా? ఇవేవీ మీ చేతు ల్లో ఉన్న పనులు కాదు.

ఢిల్లీ పెద్దల చేతులో పనులు. అందువల్ల మీరు వస్తే తెలంగాణ గడ్డుపరిస్థితుల్లో కూరుకుపోవడం ఖాయం. ఎందుకంటే మీరు మీరు కాదు. మీ గొంతు మీది కాదు. ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పినట్టు, తెలంగాణ వ్యతిరేకులు, విభజనను జీర్ణించుకోలేని శక్తులు ఇప్పుడు తెలంగాణపై మరో దండయాత్ర మొదలు పెట్టాయి. మొదటి దండయాత్ర తెలంగాణ వచ్చిన కొత్తలోనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అస్థిరత్వం సృష్టించి తెలంగాణ విఫలమైందని రుజువు చేయడానికి చంద్రబాబునాయు డు ప్రత్యక్షంగా చేయించిన దండయాత్ర. తెలంగాణ ప్రభు త్వం అప్రమత్తంగా ఉండి ఆ కుట్రను భగ్నం చేసింది. ఆ తర్వాత 2018 లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, ఆయన పల్లకీ మోసే ఆంధ్రా మీడియా కాంగ్రెస్‌ను అడ్డంపెట్టుకుని ఇక టీఆర్‌ఎస్ పని అయిపోయింది, అధికారంలోకి వచ్చేస్తున్నాం అన్నంత బిల్డప్ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో వందల కోట్లు కుమ్మరించారు. సర్వే ల పేరుతో జనాన్ని మోసం చేయాలని చూశారు. తెలంగాణ ప్రజలే అప్రమత్తంగా ఉండి ఈ దండయాత్రను బొందబెట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబు మనుషులు, అదే చంద్రబాబు మీడి యా బీజేపీ, కాంగ్రెస్‌ల ద్వారా ప్రాక్సీ వార్ చేస్తున్నది. బీజేపీ అగ్రనాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జీర్ణం కావడంలేదని నరేంద్ర మోదీ, అమిత్‌షా మాటల్లో పదే పదే బట్టబయలు అయింది. అందుకే తెలంగాణ వ్యతిరేక శక్తులకు, ఆంధ్రా మీడియాకు, బీజేపీకి భావసారూప్యత కుదిరింది. తెలంగాణలో ఏదో జరిగిపోతోందన్న ఒక భ్రమను, అబద్ధాన్ని ప్రచారంలో పెడుతున్నది. చంద్రబాబు మీడి యా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎటువంటి విచ్ఛిన్నకర పాత్రను పోషిస్తున్నదో ఇప్పుడూ అదే పనిచేస్తున్నది. ఇది తెలంగాణపై తెలంగాణ వ్యతిరేక శక్తుల మూడో దండయాత్ర. తెలంగాణ ప్రజలు ఈ దండయాత్రనూ తిప్పికొట్టడం ఖాయం. మనలో మనకు ఎన్ని ఉన్నా తెలంగాణ అంతా ఒకటి. ఎవరో ఆడించే కీలుబొమ్మలు, తోలుబొమ్మల చేతికి తెలంగాణను వెళ్లనివ్వరు.

[email protected]

3445

KATTA SHEKAR REDDY

Published: Sun,November 3, 2019 07:11 AM

మర మనుషులు

మనుషులుగా అంతరించేవారే కాదు, మహోన్నత మానవులుగా వ్యవహరించేవారూ చాలామంది ఉన్నారు. చిరుగుపాతల బట్టలతో ఒక మహారణ్యాన్ని పెంచిన అమ్మల గు

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు