కబ్జా రాజకీయాలు


Sun,September 8, 2019 12:30 AM

katta-shekar-reddy
రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజువవుతూ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టా ల్లో ఇప్పుడు ఇటువంటి ఒరవడి ఒకటి నడుస్తూ ఉన్నది. నిన్నమొన్నటి ఎన్నికల్లో ప్రజలతో తిరస్కరించబడిన నాయకులు, పార్టీలు దేశభక్తి జెండా కప్పుకోవడానికి పడుతున్న తాపత్రయం చూస్తుం టే, వారి దేశభక్తి గీతాలు వింటుం టే ఆశ్చర్యం కలుగుతున్నది. రెం డురోజుల కిందట శ్రీనివాస్ అనే మిత్రుడు ఒక మెయిలు పంపా రు. రాజకీయాల్లో చాపకింద నీరులా వేగంగా జరుగుతున్న మార్పులను గమనిస్తున్నారా? తెలంగాణకు ముంచుకొస్తున్న ప్రమాదం అర్థమవుతున్నదా? అన్నది ఆ మెయిలు సారాంశం. మనం గెలువలేకపోతే, గెలిచిన పార్టీలు మనవి కావాలి. ఎక్కడైనా మనమే ఉండాలి. ఏ పార్టీ అయినా మనదే కావాలి. మనకు పార్టీలు, జెండాలు ముఖ్యం కానేకాదు. మన ప్రయోజనాలు ముఖ్యం. మన ఆధిపత్యం కాపాడుకోవడం చాలా అవసరం. మనలను మనం రక్షించుకోవడం ఇంకా ఎక్కువ అవసరం. బీజేపీలో చేరండి. కాంగ్రెస్‌లో చేరండి. ఎక్కడ ఉన్నా మనదే పైచేయిగా ఉం డాలి అన్నట్టుగా చంద్రబాబునాయుడు ఆడుతున్న నాటకం గుర్తించారా అని ఆ మిత్రుడు ప్రశ్నించారు. ఈ కోణం అందరూ గమనిస్తున్న దే. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు కాంగ్రెస్‌ను, యూపీఏను కబ్జా చేసి తెలంగాణపై పెత్త నం చేయాలని సర్వశక్తులూ ఒడ్డిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయిన తర్వాత ఆడుతున్న కొత్త రాజకీయ చదరంగం అత్యంత ప్రమాదకరమైందని ఆ మిత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మిత్రుని ఆందోళన నిజమే. ఎన్నికలు పూర్తయిన వెంటనే చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితులు, తన రాజకీ య వ్యాపారానికి పెట్టుబడిదారులూ అనదగిన ప్రముఖ నాయకులను బీజేపీలోకి సాగనంపారు.

ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నవాళ్లు ఏ రోజూ తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడినవాళ్లు కాదు. తెలంగాణ ఉద్యమంతో కలసి వచ్చినవాళ్లు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరిగిందని ఇప్పటికీ వాదించే అమిత్ షా, నరేంద్ర మోదీ వారి వారసులు తెలంగాణ భక్తులు ఎలా అవుతారు? తెలంగాణ ప్రయోజనాలను వారెలా కాపాడుతారు? నిన్నగాక మొన్న తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని ఇటు హైదరాబాద్‌లో కాకుండా, అటు అమరావతిలో కాకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన నెల్లూరుకు తరలించుకుపోతారు. ఫ్లోరైడు పరిశోధనా కేం ద్రాన్ని చౌటుప్పల్ నుంచి కర్ణాటకకు తరలించుకుపోతారు. తెలంగాణ ఏడు మండలాలను తెలంగాణ అనుమతి లేకుండా పోలవరానికి ఇచ్చేస్తారు. జాతీయ పార్టీలకు ఉన్న జబ్బే ఇది.


అప్పటిదాకా బీజేపీని ఆంధ్రకు బద్ధ శత్రువుగా చిత్రీకరించిన చంద్రబాబు, ఆయన మనుషులు అకస్మాత్తుగా బీజేపీకి బంధువులుగా మారిపోయారు. అందరూ చంద్రబాబుకు చెప్పే చేరుతున్నారు. కొందరు నాయకులు కన్నతల్లి వంటి పార్టీని వీడటం బాధగా ఉందంటూనే కొత్త జెండాలు చేతబడుతున్నారు. ఇంతకాలం చంద్రబాబును మోస్తూ బీజేపీని ఏకిపారేసిన పచ్చమీడియా కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్‌షాల ధైర్యసాహసాలను వేనోళ్ల కీర్తిస్తున్నది. చంద్రబాబు దగ్గరి మనుషులు ముందుగా బీజేపీలో చేరిపోతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నుంచి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి నుంచి తనకు పెద్ద ఆపదలేవీ రాకుండా చూసుకోవడం కోసం చంద్రబాబునాయుడు ఈ ఎత్తు వేశారని అం దరూ అనుకుంటున్న విషయమే. చంద్రబాబు తెలంగాణలో కూడా అదే పాచిక ప్రయోగిస్తున్నా రు. తనకు నమ్మకమైన మనుషులుగా ఉన్న నాయకులను, తన సామాజిక వర్గానికి చెందిన నాయకులను ముందుగా బీజేపీలోకి పంపుతున్నారు. కలమట మోహనరావు ముందుగా బీజేపీ జెండా ఎత్తుకున్నారు. అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా చంద్రాబాబును అంటిపెట్టుకున్న రేవూరి ప్రకాశరెడ్డి, తెలంగాణ ఉద్యమం అంత తీవ్రంగా నడుస్తున్న కాలంలో కూడా చలించకుండా బాబు భజన చేస్తూ వచ్చిన ప్రకాశరెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా దేశభక్తుని అవతా రం ఎత్తారు. తాను చంద్రబాబుకు చెప్పే బీజేపీలో చేరినట్టు ప్రకాశరెడ్డి ఢిల్లీలో చెప్పారు. వీరే కాదు రాబోయేకాలంలో తెలంగాణలో టీడీపీని ఖాళీచేసి బీజేపీని బలోపేతం చేసే పనులన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగబోతున్నాయి. కాంగ్రెస్ ఎలాగూ చంద్రబాబు ఆత్మబంధువు చేతుల్లోకి చేరబోతున్నది. ఇక తెలంగాణ బీజేపీని కూడా చంద్రబాబు బీజేపీగా మార్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చంద్రబాబుకు ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. పార్టీ ఏదై నా ఆత్మ ఆయనతో ఉంటే చాలు. బీజేపీని, కాంగ్రెస్‌ను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆ మిత్రుడు చెప్పింది నిజం.

వీళ్లందరి లక్ష్యం ఒక్కటే తెలంగాణను ఎలాగైనా కట్టడి చేయాలి. తెలంగాణ వచ్చి సాధించిందేమీ లేదని ప్రచారం చేసే ఒక కుతం త్రం, అప్పుడే బాగుండె అనే దుర్మార్గపు ప్రచారం అందులో భాగ మే. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను మరుగునపర్చడం, తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు, ప్రాజెక్టులకు మసిపూసి మారేడు చేయడం ఈ కుతంత్రంలో భాగమే. తెలంగాణ ప్రభుత్వం కొన్ని తప్పటడుగులు వేసి ఉండవచ్చు. సమన్వయ లోపాలు కొనసాగుతూ ఉండవచ్చు. వ్యక్తులు, వ్యక్తిత్వాల సమస్య లు అడ్డుపడుతుండవచ్చు. కానీ అవేవీ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాధించిన విజయాలను మరుగునపర్చలేవు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవ్వాళ దేశానికి ఆదర్శంగా నిలిచిన మాట వాస్తవం. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి పథకాలను స్వయంగా కేంద్రంలోని బీజేపీయే స్వీకరించింది. అనేక రాష్ర్టాల ప్రభుత్వాలు తెలంగాణకు వచ్చి అధ్యయనం చేసి వెళ్లి, తమ రాష్ర్టాలలో తెలంగాణ నమూనాలను అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నాయని అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయికంగా కనీవిని ఎరుగని ప్రయోజనాలు పొందుతున్నది. సంక్షేమరంగంలో తెలంగాణ దేశానికి ఒక ఆదర్శం అని మన పథకాలపై అధ్యయనం చేస్తున్న బెంగళూరు మేధావి ఒకరు ఇటీవల అభిప్రాయపడ్డారు. చాలా అల్పమైన విషయాలను ముందుకుతెచ్చి ఈ విజయాలకు మకిలి అంటించే ప్రయ త్నం జరుగుతున్నదని కూడా ఆయన అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఒక అద్భుతమే. ఒక గొప్ప రికార్డు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు తమ జీవితకాలంలో చెప్పుకోదగిన గొప్ప విజయాలేవీ సాధించలేదు. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడో మూడు దశాబ్దాల కిందట అంజయ్య శంకుస్థాపన చేశా రు. మళ్లీ 2004 తర్వాత వైఎస్ శంకుస్థాపన చేశారు.


మళ్లీ చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఈ రోజుకు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాణహిత చేవెళ్ల గురించి ఇంతగా గోల చేస్తున్న కాంగ్రెస్ సాధించింది ఏమిటో ప్రజలందరికీ తెలుసు. నీళ్లు మళ్లించాల్సిన తుమ్మిడిహట్టి వద్ద పదేండ్ల పాలనలో తట్టెడు మట్టి తీయలేదు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజె క్టు ఫలితాలను ఇచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాతనే. కృష్ణానదిమీద తలపెట్టిన ప్రాజెక్టులయితే దశాబ్దాలు, పుష్కరాలు గడిచిపోయాయి. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు నాలుగు దశాబ్దాలుగా జనం నోళ్లలోనే ఉండిపోయాయి. 2004లో కాంగ్రెస్ మొదలు పెట్టింది కానీ ఒక్కటి కూడా పూర్తిచేయలేదు. జూరాల ప్రాజెక్టు కాలువలను చూస్త్తే కాంగ్రెస్ నాయకులు లేక ఇప్పుడు బీజేపీలో చేరిన మహబూబ్‌నగర్ నాయకుల బుద్ధి ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. జూరాల నుంచి మూడు కాలువలు తవ్వితే వాటి మొత్తం నీటి తరలింపు సామర్థ్యం 4000 క్యూసెక్కులు కాగా వదిలేది 2400 క్యూసెక్కులే. హంద్రీ-నీవా ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు మళ్లించే నీళ్లు 2400 క్యూసెక్కులు. కాలువల సామర్థ్యం ఎక్కువ ఉంటే వరద రోజుల్లో వేగంగా ఎక్కువ నీటిని తీసుకునే అవకాశం ఉండేది. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును మూడున్నర దశాబ్దాల కిందట రూపొందించారు. ఇప్పటికీ పూర్తికాలేదు. ఎస్‌ఎల్‌బీసీ కాలువ సైజు, పోతిరెడ్డిపాడు కాలువ సైజు పోల్చుకుంటే మన నేత ల వైఫల్యం ఇట్టే కనిపిస్తున్నది. టన్నెలు నీటి తరలింపు సామర్థ్యం 4000 క్యూసెక్కులు. ఆ నీటిని అందుకోవలసిన మాధవరెడ్డి కాలు వ సామర్థ్యం 2000 క్యూసెక్కులు. కాంగ్రెస్, టీడీపీ నాయకులకు నీటి గురించి ఎంత అవగాహన ఉందో ఈ కాలువలు, ప్రాజెక్టుల ను చూస్తే తెలిసిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గతకాలపు అన్యాయాలను సరిదిద్దడానికి, కృష్ణా, గోదావరి నదుల నుంచి గరిష్ఠంగా నీటిని తీసుకోవడానికి అహోరాత్రులు కృషిచేస్తున్నది.


కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేండ్లలో మూడు బరాజులు, ఆరు పంపుహౌజులు, కాలువలు పూర్తిచేసుకొని నీటిని తీసుకునే స్థాయికి వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైంది. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలను పూర్తిచే సి గత రెండున్నరేండ్లుగా నీటిని ఇస్తున్నారంటే అది తెలంగాణ సాధించిన విజయమే. తెలంగాణ వచ్చింది కాబట్టే కృష్ణా నుంచి వరద వచ్చిన మొదటిరోజు నుంచి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల కు పుష్కలంగా నీరు తీసుకునే అకాశం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి నీటిసోయి ఉన్నది. ప్రజల సోయి ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలకు నీటిసోయీ లేదు. ప్రజల సోయీ లేదు. రాజకీయాల సోయి తప్ప మరో ధ్యాస లేదు. ఇరువై నాలుగు గంటల కరెంటు తెలంగాణ సాధించిన మరో గొప్ప విజయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టింది కాంగ్రెస్, టీడీపీలే. ఏనాడూ కరెంటు సక్కగా ఇవ్వలేదు. కరెంటు కోసం ఉద్యమాలు, రాస్తారోకోలు చేయవలసిన దుస్థితి. తెలంగాణ వచ్చిన వెం టనే ఎంత ఖర్చయినా ఫర్వాలేదు రైతులకు కరెంటు కొరత లేకుం డా చేయాలన్న పంతంతో కేసీఆర్ చీకట్లను పారదోలారు. ఇవ్వాళ ఏ రైతునడిగినా తెలంగాణ సాధించిన విజయాలు చెబుతారు. ప్రజ ల మనసుల్లోంచి ఆ విజయానందాన్ని చెరిపేసే కుట్రలో భాగంగా నే విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీలు చీకట్లో బాణాలు విసురుతున్నాయి. ఒక్కటంటే ఒక్క ఆధారం ఇప్పటివరకు బయటపెట్టలేదు. అసత్యాలు, అర్ధ సత్యాలు సమాజంపై కుమ్మరించి తిమ్మిని బమ్మి చేయాలని కాంగ్రెస్, బీజేపీలలోని తెలంగాణ వ్యతిరేకవర్గా లు ప్రయత్నిస్తున్నాయి. ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నవాళ్లు ఏ రోజూ తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడినవాళ్లు కాదు. తెలంగాణ ఉద్యమంతో కలసి వచ్చినవాళ్లు కాదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరిగిందని ఇప్పటికీ వాదించే అమిత్ షా, నరేంద్ర మోదీ, వారి వారసులు తెలంగాణ భక్తులు ఎలా అవుతారు? తెలంగాణ ప్రయోజనాలను వారెలా కాపాడుతారు? నిన్నగాక మొన్న తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని ఇటు హైదరాబాద్‌లో కాకుండా, అటు అమరావతిలో కాకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్యనా యుడు తన నెల్లూరుకు తరలించుకుపోతారు. ఫ్లోరైడు పరిశోధనా కేం ద్రాన్ని చౌటుప్పల్ నుంచి కర్ణాటకకు తరలించుకుపోతారు. తెలంగాణ ఏడు మండలాలను తెలంగాణ అనుమతి లేకుండా పోలవరానికి ఇచ్చేస్తారు. జాతీయ పార్టీలకు ఉన్న జబ్బే ఇది. కేంద్ర నాయకత్వం ఒకటి తలుస్తుంది. ఇక్కడి నాయకులు నోరుమూసుకుని వారిని అనుసరిస్తారు. కాంగ్రెస్ బలహీనపడిపోయింది కాబట్టి, చంద్రబాబు తన ఎజెండాను ఇప్పుడు బీజేపీ ద్వారా అమలుచేయిస్తారు. తెలంగాణకు వ్యతిరేకంగా, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అల్లరి చేయడానికి తన సర్వశక్తులూ ఒడ్డుతారు. రెండు రాష్ర్టాల్లో బీజేపీని కబ్జా చేసే ప్రయత్నం అందులో భాగమే. టీడీపీ కీలకమైన నాయకత్వమంతా బీజేపీలో చేరడం ఆ లక్ష్యసాధనలో భాగమే. బీజేపీ బీజేపీ కాదు, కాంగ్రెస్ కాం గ్రెస్ కాదు. ఈ పార్టీల పట్ల తెలంగాణ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. జెండాల కంటే ఆపార్టీల ఎజెండాలను పసిగట్టడం ముఖ్యం.

853

KATTA SHEKAR REDDY

Published: Sun,September 15, 2019 12:55 AM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ        


Featured Articles