ఓటికుండల చప్పుడు


Sat,August 31, 2019 11:24 PM

katta-shekar-reddy
ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు. బీజేపీ నేత ఒకాయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవినీతిపై తన వద్ద ఆధారాలున్నాయంటాడు. సీబీఐ విచారణ చేయించాలంటాడు. మీడియా వాళ్లు ఆధారాలడిగితే సీబీఐకి ఇస్తానంటాడు. అదే నోటితో సమాచార హక్కు కింద వివరాలు అడిగి తే ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదూ అని ప్రశ్నిస్తాడు. ఈ నాలు గు మాటల్లో ఉన్న వైరుధ్యా న్ని చూడండి. తన వద్ద ఏ ఆధారాలు లేకుండానే గత పదిహేను రోజులుగా చెప్పిం దే చెబుతూ రోజూ మీడియాముందుకువస్తున్నారు. ఇది వాళ్ల పద్ధతి. అబద్ధమైనా గట్టి గా చెప్పాలి. పదేపదే చెప్పా లి. పదిమందితో చెప్పించా లి. ఎప్పుడో ఒకప్పుడు జనం నమ్ముతారు. ప్రాజెక్టులపై, విద్యుత్ కొనుగోలుపై కాం గ్రెస్ నేతలు చేస్తున్నదీ అదే. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండి తెలంగాణను ఎండబెట్టిందీ వీరే. తెలంగా ణ ప్రాజెక్టులను పండబెట్టి ఆంధ్ర ప్రాజెక్టులను ఆగమేఘాల మీద చేసుకుపోతుం టే, హక్కులేని దారిలో వేల టీఎంసీల నీటిని తరలించుకుపోతుంటే హారతులు పట్టిందీ వీరే. మూడు దశాబ్దాల కిందట-అంటే 1985 లో.. ఒకే తీర్మానంతో ప్రాణం పోసుకున్న ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టుల్లో ఎస్‌ఆర్‌బీసీ రెండు దశాబ్దాల కిందట పూర్తయి రాయలసీమకు నీరందిస్తుం టే, ఎస్‌ఎల్‌బీసీ ఇంతవరకు పూర్తికాలేదు. రాష్ర్టాన్ని పాలించిన, కాంగ్రెస్, టీడీపీల నీటి సోయికి నిదర్శనం ఎస్‌ఎల్‌బీసీ. వీరికి ప్రాజెక్టులంటే కమీషన్లు, కాంట్రాక్టులు, ధన యజ్ఞాలు.. ఎన్నేండ్లు పడితే అంత మజా. అప్పుడెప్పుడూ పరిహారాల కోసం, పునరావాసితుల కోసం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసిన చరిత్ర ఇప్పుడు కేసులు వేస్తున్నవారికి లేదు. అప్పుడు వీరంతా ధనయజ్ఞంలో పీకలదాకా మునిగితేలుతూ వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కనుసైగల కింద పనిచేస్తూ వచ్చారు. పోతిరెడ్డిపాడు గొప్ప ప్రాజెక్టు అని పత్రికల్లో వ్యాసాలు రాశారు. నిజమే రాయలసీమకు అది గొప్ప ప్రాజెక్టు.

తుమ్మిడిహట్టి నుంచి అయితే ఈపాటికి తెలంగాణ అంతటా నీరు పారేదని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే విస్మ యం కలుగుతున్నది. తుమ్మిడిహట్టి నుంచి తెలంగాణకు నీరందే పని అయితే 2007 నుంచి 2014 దాకా ఇప్పుడు పాదయాత్రలు, పడవయాత్రలు చేస్తున్న నేతలంతా ఏ గాడిదల పండ్లు తోముకుంటూ ఉన్నారు? ప్రాజెక్టును ఎందుకు ముందుకునడిపించలేదు. తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు. రిజర్వాయర్లు, బరాజుల పని వదిలిపెట్టి కమీషన్లు బాగా వచ్చే కాలువలు, సొరంగాల పనులు ఎందుకు ముందుగా చేపట్టారు? తుమ్మిడిహట్టికి వచ్చిన నీరు కాళేశ్వరానికి రాదా? తుమ్మిడిహట్టి వద్ద లభించే నీటికంటే ఎక్కువ నీరు కాళేశ్వరం వద్ద లభిస్తున్నది.


రాజశేఖర్‌రెడ్డి ఒక్క పోతిరెడ్డిపాడును పెద్దది చేయడమే కాదు, చిన్నవీ పెద్దవీ ఒక ముప్ఫై రిజర్వాయర్లు నిర్మించారు. శ్రీశైలం నీటి తో అనుసంధానం చేశారు. వెలుగోడు నుంచి కండలేరు దాకా, ముచ్చుమర్రి నుంచి పలమనేరు దాకా 150 టీఎంసీలకుపైగా నీటి ని నిలువ చేసుకునే 32 రిజర్వాయర్లను, కాలువల వ్యవస్థను నిర్మించిపోయారు. రాజశేఖర్‌రెడ్డి మొనగాడు. ఎన్ని వేల ఎకరాలు సేకరించి ఉండాలి? ఎన్ని కేసులు వేసి ఉండాలి? ఒక్కరైనా నోరుమెదిపారా? ఆయన చేసిన పని పర్యవసానం ఏమంటే ఈ ఏడాది శ్రీశైలం నుంచి ఇప్పటికి 75కి పైగా టీఎంసీల వరద నీటిని రాయలసీమ తీసుకోగలిగింది. మరో వంద టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. అంటే అక్టోబర్‌లోపు 175 టీఎంసీల నీటిని రాయలసీమ వాడుకోగలుగుతుంది. కాలువలు, రిజర్వాయర్లు, చెరువులు అన్నీ పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు కాబట్టి నీటిని తీసుకోగలుగుతున్నారు. బంగాళాఖాతంలో కలిసే నీటిని కరువుసీమకు తరలించారు రాజశేఖర్‌రెడ్డి. అదే రాజశేఖర్‌రెడ్డి, ఆయన అడుగులకు మడుగులొత్తిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వాటా జలాలను వాడుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులను అంపశయ్యపై పండబెట్టారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదు. ప్రాజెక్టులు పూర్తయితే నీటిహక్కులు వచ్చి ఉండేవి. అప్పు డు పూర్తిచేయలేదు. ఇప్పుడు పూర్తిచేస్తుంటే అడుగడుగునా అడ్డంపడుతున్నారు. ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఫలితా లు తీసుకోవాలని ఆరాటపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నదీ వీరే. ఎక్కడ రిజర్వాయరు వస్తే అక్కడ టెంటు వేస్తారు. ఎక్కడ కాలువ వస్తే అక్కడ కేసు వేస్తారు. పనులపై స్టేలు తెస్తారు. అధికారులకు శిక్షలు తెస్తారు. ఒకసారి పరిహారం తీసుకున్న పునరావాసితుల వద్దకు వెళ్లి మళ్లీమళ్లీ కెలుకుతుంటారు. ఉన్నవీ లేనివీ చెప్పి రెచ్చగొడుతుంటారు. తాను ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసు వేయలేదు, అవినీతికి వ్యతిరేకంగా కేసు వేశానని నాగం జనార్దన్‌రెడ్డి చెబుతుంటే నవ్వొస్తుంది. ఆయన ఎప్పుడెప్పుడు ఎంతనీతిగా నిలబడ్డారో చరిత్ర గుర్తుకువస్తున్నది.


వీటన్నింటినీ బట్టి ఒక విషయం అర్థమవుతున్నది. కేసీఆర్ ఒక పెద్ద గీత. ఈ నాయకులు చాలా చిన్న గీతలు. పెద్ద గీతను చెరుపలేము. చిన్న గీతలను పెద్దగ చేయగల సమర్థతా చైతన్యమూ నాయకత్వ పటిమా లేదు. చేయగలిగిందల్లా పెద్దగీతను చిన్న గీతగా కుదించే ప్రయత్నమే. అందుకే అవినీతి పేరుతో ఒక బట్టకాల్చి మీదవేసే ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకథలు, పిట్టకథలు వండి వార్చుతున్నారు. తెలంగాణను ఆరు దశాబ్దాల పాటు అంధకారం లో ఉంచిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీలు. రైతులు కరెంటు కోసం అలో లక్ష్మణా అని మొత్తుకుంటూ ఉంటే సబ్‌స్టేషన్ల వద్ద అంగలార్చుతుంటే లాఠీచార్జీలు చేయించిన కఠినాత్ములు కాంగ్రెస్ నాయకులు. కరెంటు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించినందుకు నాయకులను జైళ్లలో పెట్టించిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు. కరెంటు కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం, తాగునీరు, సాగునీరు కోసం ప్రజలు రోడ్లెక్కని సందర్భం ఒక్కటి కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో, పంతం తో మన రాష్ట్రం ఈ సమస్యలన్నింటినీ జయించింది. దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న అతికొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. ఉత్తరప్రదేశ్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాలు చాలా ఇప్పటికీ విద్యుత్ కోతల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో నిరాటంకంగా విద్యుత్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్, ఎన్నికలు అయిపోగానే ఫీజులు తీసేసింది. చాలాచోట్ల జనం వీధుల్లోకి రావలసి వచ్చింది. సుదీర్ఘ బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్‌లో కూడా ఇప్పటికీ విద్యుత్ సమస్య ఎదురవుతూనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కష్టమైనా నష్టమైనా వెరవక విద్యు త్ ఇస్తున్నది. ప్రజల మీద ఇసుమంతయినా భారం వేయలేదు. కరెంటు కోసం ఎదురుచూసుడు లేదు. మోటార్లు కాలిపోవడం లేదు. అర్ధరాత్రి అపరాత్రి కరెంటు బావుల వద్దకు పోవుడు లేదు. సబ్‌స్టేషన్ల ముట్టడిలేదు. రాస్తారోకోలు, లాఠీచార్జీలు లేవు. ఈ విజ యం కేవలం ముఖ్యమంత్రి దార్శనిక దృష్టి, జెన్‌కో చైర్మన్ ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డిల కార్యదీక్షల వల్ల సాధ్యమైంది. భారమైనా తెలంగాణ నుంచి చీకట్లను పారదోలిన ఘనత తెలంగాణ నాయకత్వానిది, అధికారులది.

ప్రజలకు కరెంటు సౌఖ్యం అనుభవంలో ఉన్నది. తెలంగాణ సాధించిన విజయం తెలుస్తున్నది. వారి మనసుల్లోంచి ఆ ముద్రను చెరిపేయాలి-అందుకు ఏం చేయాలి? అబద్ధాలు పుట్టించాలి. అబద్ధాలు ప్రచారం చేయాలి. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పాలి. అప్పుడు కానీ తెలంగాణ సాధించుకున్న మంచి పేరు చెరిగిపోదు అని ప్రతిపక్షాల నమ్మకం. కాళేశ్వరంపై చేస్తున్న ప్రచారం కూడా అందులో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మూడు బరాజులు, రిజర్వాయర్లు, పంపుహౌజులు, ఎల్లంపల్లి నుంచి పెద్దఎత్తున నీటిని తరలించే బాహుబలి పంపింగ్ వ్యవస్థలు కేవలం మూడేండ్లలో పూర్తికావడం ఒక చరిత్ర ఒక రికార్డు. తెలంగాణ సమాజానికి ఒక పెద్ద భరోసా. తుమ్మిడిహట్టి నుంచి అయితే ఈపాటికి తెలంగాణ అంతటా నీరు పారేదని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే విస్మ యం కలుగుతున్నది. తుమ్మిడిహట్టి నుంచి తెలంగాణకు నీరందే పని అయితే 2007 నుంచి 2014 దాకా ఇప్పుడు పాదయాత్రలు, పడవయాత్రలు చేస్తున్న నేతలంతా ఏ గాడిదల పండ్లు తోముకుం టూ ఉన్నారు? ప్రాజెక్టును ఎందుకు ముందుకునడిపించలేదు. తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు. రిజర్వాయ ర్లు, బరాజుల పని వదిలిపెట్టి కమీషన్లు బాగా వచ్చే కాలువలు, సొరంగాల పనులు ఎందుకు ముందుగా చేపట్టారు? తుమ్మిడిహట్టికి వచ్చిన నీరు కాళేశ్వరానికి రాదా? తుమ్మిడిహట్టి వద్ద లభించే నీటికంటే ఎక్కువ నీరు కాళేశ్వరం వద్ద లభిస్తున్నది. అక్కడ లేని జలాలు ఇక్కడ అదనంగా ఎలా వస్తాయని ఇటీవల అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు ఒక మిత్రుడు అడిగారు. అదే మాట జీవన్‌రెడ్డి అడుగుతున్నారు. విషాదమేమంటే మనకు నీళ్లెక్కడ నుంచి వస్తున్నాయో, ఎక్కడ లభ్యత ఎక్కువగా ఉన్నదో నాయకులు తెలుసుకోకపోవడం. ఈ ఏడాది మన రాష్ట్రంలో అధికంగా వర్షాలు కురిసింది పాత అదిలాబాద్‌లో, మహారాష్ట్రలోని గడ్చిరోలిలోనే.

పాత ఆదిలాబాద్‌లోని ప్రస్తుత కొమురంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాల నుంచి పెద్దవాగు, నాగుల వాగు, పాలవాగు, వట్టివాగు, ఎర్రవాగు, బతుకమ్మవాగు, తోళ్లవాగు, రాళ్లవాగు, జోడెద్దులవాగు, టేకుమట్ల వాగు, ఈదుల వాగు, కత్తెరశాల వాగు, సుశ్మీర్ వాగు వంటి ఉపనదులు, వాగులు వచ్చి ప్రాణహితలో కలుస్తాయని ఒక్క పాత ఆదిలాబాద్ నుంచే 100 టీఎంసీలకు పైగా నీరు లభిస్తుందని మన నాయకులకు ఎంతమందికి తెలుసు? ఇవిగాక మహారాష్ట్రలోని గడ్చిరోలి కొండల నుంచి దీనా నది, జమేలా వాగు, నందిగాం నాలా, రేపల్‌పల్లి వాగు, ఉమ్మనూరు వాగు, పూసుకుపల్లి వాగు, నెత్తురువాగు, కారస్‌పల్లి వంటి వాగులు తుమ్మిడిహట్టికి దిగువనే ప్రాణహితలో కలుస్తాయి. తుమ్మిడిహట్టి వద్ద లభించే నీటికి ఈ వాగు నుంచి వచ్చేనీరు అదనం. తుమ్మిడిహట్టి నుంచి ఏదో గ్రావిటీద్వారా నీరు వస్తుందని మరో అబద్ధాన్ని కాంగ్రెస్ నాయకులు పదేపదే చెబుతున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మొదటి లిఫ్టు తుమ్మిడిహట్టి ఎల్లంపల్లికి మధ్యనే అనే వాస్తవాన్ని దాచి జనా న్ని మాయ చేయాలని చూస్తున్నారు. అన్నింటికీ కాళేశ్వర జలాలు మానేరు ఉభయ జలాశయాలు దాటి అటు మెదక్‌ను ఇటు కరీంనగర్, వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే. ప్రతిపక్షాలు తమ సభను చూసి మురిసిపోవచ్చు. కానీ కాళేశ్వరం నుంచి మానే రు దాకా ప్రాజెక్టులను సందర్శించి, ఆ నీటిని చూసి మురిసిపోతు న్న జనమే ఎక్కువ.

[email protected]

1547

KATTA SHEKAR REDDY

Published: Sun,September 15, 2019 12:55 AM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ        


Featured Articles