పాములూ-నిచ్చెనలూ


Sat,April 27, 2019 10:54 PM

katta-shekar-reddy
అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగంటకు ఫిర్యాదు చేయడానికి బుధవా రం ఇద్దరు పెద్దమనుషులు వచ్చారు. ఒకాయన అమెరికా పౌరుడు. వాషింగ్టన్‌లో ట్రాన్స్‌పోర్టు అథారిటీలో పనిచేసి పదవీ విరమణ చేసి మాధాపూర్‌లో తనకున్న స్థలంలో ఇళ్లు కట్టుకొని స్థిరపడుదామని వచ్చారు. మరో పెద్దాయన కూడా ప్రభుత్వోద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వారిరువురూ ఎప్పుడో ముప్ఫై ఏం డ్ల కిందట జస్టిస్ ఆవుల సాం బశివరావు కుటుంబీకులకు సంబంధించిన భూమిని కొనుగోలు చేసి సియెట్ సొసై టీ ఏర్పాటు చేసుకొని అందు లో పనిచేసే ఉద్యోగులంతా తలా ఒక ప్లాటు తీసుకున్నా రు. అప్పట్లో హుడా అనుమ తి కూడా తీసుకున్నారు. పట్టా భూమి. హుడా అనుమతి ఉంది. అయినా ఇప్పటివరకు ఇండ్లు కట్టుకోలేకపోయారు. మధ్యలో ఎవరి ఉద్యోగాల్లో వారు పడిపోయి ఈ భూమివైపు చూడలేదు. ఈలోగా భూమి చుట్టూ చాలా దందాలు జరిగిపోయాయి. సియెట్ కాలనీలో పార్కులకు వదిలిన భూము లు కబ్జా అయ్యాయి. ఏడెని మిదేండ్ల కిందట సియెట్ సొసైటీ భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందంటూ ఒక కాగితం అంటించారు. విచి త్రమేమంటే ఆ భూముల్లో చెరువు లేదని మండల రెవెన్యూ అధికారి లేఖ కూడా ఇచ్చారు. కానీ ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరు. ఎఫ్‌టీఎల్ ఎత్తివేస్తే తప్ప తాము అనుమతి ఇవ్వలేమని పురపాలక అధికారు లు చెబుతున్నారట. ఇరిగేషన్ అధికారుల వద్దకు వెళ్లారు. ఎవరైతే ఎఫ్‌టీఎల్ గుర్తించి మార్కింగ్ చేశారో ఆయన వద్దకూ వెళ్లారు. ఆయన తనకు రెండు వేల గజాలు ఇస్తే ఎఫ్‌టీఎల్ ఎత్తివేయిస్తా అని ప్రతిపాదన పెట్టాడట. ఎవరి భూమి తీసి ఇవ్వాలి సార్? మాకు సాధ్యం కాదు అని చెప్పాం అని ఆ పెద్దాయన చెప్పారు. అన్ని ఆఫీసుల చుట్టూ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు.

ఈ మొత్తం ఫిర్యాదులు చూస్తే అర్థమైందేమంటే ఎనభై శాతం మానవ తప్పిదాలే. అధికార యంత్రాంగం చేయగలిగి ఉండి, తెలిసి చేయలేకపోయినవే. సకాలంలో పట్టాదారు పుస్తకాలు ఇవ్వకపోవడం, ఇచ్చిన వాటిలో పేర్లో, భూమి విస్తీర్ణమో తప్పుగా ఎంట్రీ చేయడం, ఒకరి భూమి మరొకరి ఖాతాలో నమోదు చేయడం, సర్వే చేయకపోవడం.. ఇటువంటి తప్పులే అధికం. విధాన లోపాలు, సమన్వయ లోపాలు ఉన్న సమస్యలు కొన్నే. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య భూమి లావాదేవీలకు సంబంధించిన సమన్వయం లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ధరణి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల తలెత్తే సమస్యలు తప్ప అత్యధిక శాతం తాసిల్దారు కార్యాలయాల్లో పరిష్కరించదగినవే.ఎవరూ కరుణించలేదు. భారత అమెరికా పౌరుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు విషయమేమంటే ఎఫ్‌టీఎల్ గుర్తించడమన్నది ఇరిగేషన్ అధికారులకు ఒక పెద్ద వరంగా పరిణమించింది. ముంపులో ఉన్న భూములను ఎఫ్‌టీఎల్ నుంచి మినహాయించడం, పక్కన ఉన్న భూములను ఎఫ్‌టీఎల్‌లో చేర్చడం అన్నది హైదరాబాద్ పశ్చిమ మండలంలో యథేచ్ఛగా జరిగింది. చందానగర్ గంగారం చెరువు లో అలాగే జరిగింది. హైవే వెంట ఉన్న భూములను ఎఫ్‌టీఎల్ నుంచి తప్పించి నోరు లేని ఒక బ్రాహ్మణ అధికారికి సంబంధించిన ఆరెకరాల భూమిని ఎఫ్‌టీఎల్‌లో చేర్చారు. హైవేపై పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లు వచ్చాయి. ఆ బ్రాహ్మణుడు తన భూమిలోకి అడుగుపెట్టే పరిస్థితి లేదు. మాదాపూర్, గుట్టల బేగంపేటలో అదే పరిస్థితి. ఇరిగేషన్ అధికారి ఇష్టారాజ్యంగా ఎఫ్‌టీఎల్ మార్కు చేస్తూ పోయాడు. వరద వస్తే పూర్తిగా మునిగిపోయే భూములను ఎఫ్‌టీఎల్ నుంచి మినహాయించి, అంతకంటే ఎత్తున ఉన్న సియెట్ భూములను ఎఫ్‌టీఎల్‌లో పెట్టారు. ఆ చిక్కుముడిని విప్పుకోలేక అక్కడ స్థలాలు కొన్న పౌరులు చావుదలకు వచ్చినా ఇండ్లు కట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటువం టి కేసులెన్నో. ఎంతమంది నమస్తే తెలంగాణకు వస్తున్నారో! అయ్యా.. మీ కేసీఆర్‌కు, మీ పేపర్‌కు చేతులెత్తి దండం పెడుతు న్నా. ఇంట్లాంటి గొప్ప పనిచేసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలే. మొన్నటిదాకా ఆఫీసుల చుట్టూ కాలికి బలపం కట్టుకొని తిరిగాం. ఒక్కరు కూడా దయ చూపలే. ఇప్పుడు గజగజగజ వణుక్కుంటూ పని చేస్తున్నరయ్యా. ఈ మాట చెప్పనీకి ఇంతదూరమొచ్చిన అని వరంగల్ జిల్లా రైతు ఒకాయన చెప్పారు. రోజుకు రెండు మూడు వందల వాట్సాప్ మెసేజీలు వస్తున్నాయి. ముప్ఫై నుంచి నలభై మెయిళ్లు వస్తున్నాయి. రోజుకు ఏడెమినిది మంది నమస్తే తెలంగాణ ఆఫీసుకు వచ్చి తమ సమస్యలు చెప్పి, పత్రాలు ఇచ్చి సాయం చెయ్యాలని కోరుతున్నారు. ఇవి కాకుండా మా జిల్లా కేం ద్ర కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులు అదనం.

ఈ మొత్తం ఫిర్యాదులు చూస్తే అర్థమైందేమంటే ఎనభై శాతం మానవ తప్పిదాలే. అధికార యంత్రాంగం చేయగలిగి ఉండి, తెలి సి చేయలేకపోయినవే. సకాలంలో పట్టాదారు పుస్తకాలు ఇవ్వకపోవడం, ఇచ్చిన వాటిలో పేర్లో, భూమి విస్తీర్ణమో తప్పుగా ఎంట్రీ చేయడం, ఒకరి భూమి మరొకరి ఖాతాలో నమోదు చేయడం, సర్వే చేయకపోవడం.. ఇటువంటి తప్పులే అధికం. విధాన లోపా లు, సమన్వయ లోపాలు ఉన్న సమస్యలు కొన్నే. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య భూమి లావాదేవీలకు సంబంధించిన సమన్వయం లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ధరణి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల తలెత్తే సమస్యలు తప్ప అత్యధిక శాతం తాసిల్దారు కార్యాలయాల్లో పరిష్కరించదగినవే. ఒక సానుకూల మార్పు ఏమంటే రెవెన్యూ సిబ్బంది కూడా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించడం. రెవెన్యూ సంఘాల నాయకుల చొరవతో సమస్యల పరిష్కారానికి పల్లె యాత్రలు ప్రారంభించడం శుభ పరిణామం. ఎవరికైనా కావలసింది సమస్యలు లేకుండా సాగిపోవడమే. సామాన్యులు పట్టాల కోసం, తమ కు హక్కుగా దక్కాల్సిన ప్రయోజనాల కోసం జీవిత కాలం ఆఫీసుల చుట్టూ తిరుగాల్సి రావడం ప్రభుత్వాలకైనా, అధికారులకైనా, సిబ్బందికై నా శాపం. ఒక వృద్ధ జంట లంచాలు ఇవ్వడం కోసం భిక్షాటన చేస్తే అది సమాజానికి ఎంత అవమానకరం? పేదవారి భూములతో చెలగాటమాడటం అంటే వారి జీవితాలతో చెలగాటమాడటమే. చాలామందికి భూమే ప్రాణాధారం,జీవితం. ఇప్పుడు భూముల విలువ కూడా చాలా ఎక్కువ. అటువంటి భూమి విషయంలో ఎం త సవ్యంగా వ్యవహరించాలి! కదలిక అయితే వచ్చింది. అది రెవెన్యూ శాఖకే పరిమితమైంది. ఇంకా చాలా శాఖల్లో ఇది మాకు సంబంధించిన విషయం కాదులే అన్న ధోరణి కనిపిస్తున్నది. పక్క విభాగాల్లో ఇంత జరుగుతున్నా పురపాలక విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది ఎప్పటిలా గే కుక్కతోక వంకర అన్న చందంగా పని చేస్తున్నారు.

ఒక మిత్రుడు ఇంటి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అన్ని పత్రాలు సమర్పించారు. అధికారులు కూడా అందరూ ఆమోదించి సెక్షన్ అధికారి తుది మీట కోసం వెళ్లింది. ఆ అధికారి మీట నొక్కితే అనుమతి పత్రం బయటికి వస్తుంది. వారం రోజులైంది, పది రోజులైంది, మూడు వారాలైంది, అనుమతి పత్రం రాదు. ఉన్నతాధికారులేమో అప్పుడే చేశామంటారు. కిందనేమో అనుమతి పత్రం రాదు. ఇక లాభం లేదని ఒక బ్రోకర్‌ను ఆశ్రయిస్తే, ఆయన చెప్పాడు-మీరెవరూ వెళ్లి కలువలేదట. వెళ్లి ఎంతో కొంత ముట్టజెబితే కానీ అది బయటికి రాదు అని. రెవెన్యూ విభాగంలో ఇంత తుఫాను చెలరేగుతున్నా పురపాలనలో వేళ్లూనుకున్న వటవృక్షం ఇది. ఆ మిత్రుడు వెళ్లి వారికి ఇరువై వేలు సమర్పించుకొని అనుమతి పత్రం తెచ్చా డు. ఇక్కడ వద్దు సార్. సీసీ టీవీలుంటాయి, బయటికి పోదాం. అని బయటి దాకా తీసుకొచ్చి పది వేలు తీసుకొని అనుమతి పత్రం చేతిలో పెట్టాడా క్లర్కు. ఇదొక గొంగడి. అంత తేలికగా దీన్ని శుద్ధి చేయడం సాధ్యం కాదు. ఒక సమగ్రమైన అధ్యయనం చేసి పారదర్శక సాంకేతిక అనుమతి విధానం తీసుకువస్తే తప్ప పట్టణా ల శుద్ధి జరుగదు. ఇతర దేశాల అనుభవాలను, విజయవంతమైన నమూనాలను స్వీకరించి అమలుచేస్తేనే పౌరులకు సులభతరమైన సేవలు అందించడం సాధ్యం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ దిశగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పౌర సేవలు తేలికగా అందుబాటులోకి వచ్చే వ్యవస్థను తీసుకురావాల్సి ఉంది. ఆ దిశగా చట్టాల్లోనూ, పౌరసేవల సాంకేతిక సాధనాల్లోనూ విప్లవం తీసుకురావాలి. లంచాన్ని హక్కుగా భావించే దుర్గతి సమాజానికి మంచిది కాదు. అది ఏయే విభాగాల్లో, ఏయే రంగాల్లో ఉం టే అక్కడంతా ప్రక్షాళన జరుగాల్సిందే.

1935

KATTA SHEKAR REDDY

Published: Sun,September 15, 2019 12:55 AM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ        


Featured Articles