అవినీతిలో దేశముదుర్లు


Mon,March 18, 2019 10:59 AM

katta-shekar-reddy
వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చేసినా, ఏ కారణం చేత చేసినా వివేకా హత్య దుర్మార్గమైనది. డ్రైవర్ ఈ హత్యచేసి ఉంటాడని ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రచారం జరుగుతున్నది. వైఎస్ కుటుంబం గురిం చి తెలిసిన డ్రైవర్ అంత ధైర్యం చేస్తాడా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ డ్రైవరే చేశాడనుకుంటే అతను స్వయంగా చేశాడా లేక వెను క ఎవరైనా ఉండి చేయించా రా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టంకు ముందు జరిగినదంతా మిస్టీరియస్‌గా ఉంది. అంత బలమైన గాయాలు కంటికి కనిపిస్తుం టే గుండెపోటుతో మరణించాడని చెప్పడమేమిటి, సాక్ష్యాలు తుడిపేసే ప్రయ త్నం చేయడమేమిటి, పోలీసులు ఆలస్యంగా రావడం ఏమిటి లాంటి అనేక సందేహాలు, ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్ ఒక్కడే అంతటి దుర్మార్గానికి ఒడిగ ట్టి ఉండడని, ఆయనను కోవర్టుగా ఉపయోగించుకొని ఎవరో ఈ దారుణం చేయిం చి ఉంటారని వైసీపీ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. హత్యా రాజకీయాలు, ముఠా కక్షలు తగ్గిపోయి, రాయలసీమ శాంతిమార్గంలో ముందుకుసాగుతున్నదనుకుంటున్న తరుణంలో మరోసారి ఇటువంటి ఘాతుకం జరుగడం విచారకరం. రాజారెడ్డి హత్యకు గురైన తర్వాత ప్రతీకార హత్యలు వద్దని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన అనుచరవర్గాన్ని వారించారని చెబుతారు. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో హెలికాప్టర్ కూలి హఠాన్మరణం చెందారు. ఇప్పుడు వివేకా మరణం కూడా అటువంటిదే. వివేకా హత్యపై అప్పుడే రాజకీయ దుమారం మొదలైంది.

చంద్రబాబు తెలంగాణ జోలికి ఎంత రాకుండా ఉంటే అంత మంచిది. చంద్రబాబు 1999 నుంచి 2004 వరకు చేసిన అక్రమాలను తవ్వితే ఆయనను ఇప్పడు కూడా బోనులో నిలబెట్టదగినన్ని ఆధారాలు లభిస్తాయి. కేసీఆర్‌ను, తెలంగాణను ఆడిపోసుకున్నంతకాలం చంద్రబాబుకు మిగిలేది దరిద్రమే. అవినీతి గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతుంటే కాస్త జ్ఞానం ఉన్నవారెవరికైనా చిర్రెత్తుకొస్తుంది. చంద్రబాబు స్వయంగా అవినీతిపరుడు. పది హేడు కేసుల్ల్లో కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని విచారణను అడ్డుకొని బతుకుతున్న మేకవన్నె పులి. ఇక ఆయనచుట్టూ ఉన్నవారి గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. ఒక్కొక్కరు ఒక మహా అవినీతి సామ్రాట్టు.


చంద్రబాబునాయుడు ఈ హత్యను అదే కుటుంబానికి అంటగట్టేందుకు కావలసినన్ని లీకు లు, సూత్రాలు చెప్పడం మొదలుపెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి తమ రాజకీయ ప్రత్యర్థులే తమ చిన్నాన్నను బలి తీసుకున్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయం- రాజకీయ యుద్ధం. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవాలకంటే ఆవేశకావేశాలే ఎక్కువగా రాజ్యం చేస్తాయి. అసత్యాలు, అర్ధసత్యాలు బాగా ప్రచారంలోకి వస్తాయి. రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న వివేకానందరెడ్డికి ప్రభుత్వ భద్రత ఎందుకు లేదో తెలియదు. మాజీ ఎమ్మెల్యేలు, చోటా మోటా లీడర్లకే నలుగురైదుగురు సెక్యూరిటీ గార్డులను ఇచ్చే ప్రభుత్వం వివేకాకు ఎందుకు ఇవ్వలేదు? లేక వివేకానే సెక్యూరిటీ వద్దన్నారా? ఈ హత్యను ఎన్నికలకు చుట్టే ప్రయత్నం చేయకుండా, ఒకరిపై ఒకరు బురద చల్లుకునే వక్రమార్గానికి పోకుండా, సావధానంగా దర్యాప్తు జరిపి అసలు విషయా లు బయటికి తీసుకురావలసిన అవసరం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఇక మిగిలింది 25 రోజులే. అధికార తెలుగుదేశం 130కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ కూడా ప్రకటించాల్సి ఉంది. జనసేన నేత పవన్‌కల్యాణ్ కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఎల్లుండి నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. సమయం ఎక్కువగా లేదు. పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ప్రధానంగా ఉండే అవకాశం ఉన్నది. పది నుంచి ఇరువై స్థానాల్లో మాత్రమే పవన్‌కల్యాణ్ గట్టి గా ప్రభావం చూపే అవకాశం ఉందని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది. విచిత్రమేమంటే కేసీఆర్ ఆంధ్ర ఎన్నికల జోలికి వెళ్లకున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కేసీఆర్‌ను జగన్‌ను కలిపి తిట్టి అక్కడేదో బాపుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ లక్ష కోట్లు అవినీతి డబ్బు సంపాదించాడని ఆరోపించిన నోటితోనే, పక్క రాష్ట్రం నుంచి జగన్‌కు ఎన్నికల కోసం వెయ్యికోట్లు వచ్చాయని అంటాడు. లక్ష కోట్లు సంపాదించినవాడికి వెయ్యి కోట్ల అవసరం ఏమిటన్న ప్రశ్నకు బాబువద్ద సమాధానం ఉండదు. నరేంద్ర మోదీ అన్నివిధాలా సాయం చేస్తున్నాడనీ అంటాడు. చంద్రబాబు, ఆయన మనుషు లు, ఆయన మీడియాకు ఏ లాజిక్ అవసరం లేదు. ఏ విషయాన్నయినా అష్టవంకరలు తిప్పి మాట్లాడటంలో, ప్రచారం చేయడంలో వారు సిద్ధహస్తులు. తెలంగాణ వ్యతిరేక భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్నది చంద్రబాబు కుట్ర. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి, రాజకీయ ఫ్రంట్ గట్టి, కోట్లాది రూపాయలు ఇక్కడివాళ్లకు ఇచ్చి, అబద్ధాల సర్వేలు చేయించి, తెలంగాణ ప్రజలపై మానసిక యుద్ధం చేసినప్పుడు కేసీ ఆర్ చంద్రబాబును రాజకీయంగా చితగ్గొట్టిన మాట వాస్తవం. అది చంద్రబాబు స్వయంకృతం. ఆంధ్ర ప్రజలతో కానీ, ఆంధ్ర రాజకీయాలతో కానీ సంబంధం పెట్టుకొని మాట్లాడలేదు. అయినా చం ద్రబాబుది నీచ బుద్ధి. జగన్‌కు, కేసీఆర్‌కు, మోదీకి ఏవేవో సంబంధాలను అంటగట్టడానికి తాడూ బొంగరంలేని కాగితాలు కొన్ని చూపించి నాటకమాడబోయాడు. తెలంగాణలో భూముల అక్రమ కేటాయింపులను సమీక్షించి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్న మొట్టమొదటి నేత కేసీఆరే. పెద్దపెద్ద పారిశ్రామి కవేత్తలతో కూడా ప్రభుత్వం అంతే నిబద్ధతతో వ్యవహరించింది.


చంద్రబాబులాగా కాగితాల మీది కంపెనీలకు, బిల్లీ రావులకు భూములు కేటాయించి, బ్యాక్‌డోర్ నుంచి కోట్లు కొల్లగొట్టిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు తెలంగాణ జోలికి ఎంత రాకుండా ఉంటే అంత మంచిది. చంద్రబాబు 1999 నుంచి 2004 వరకు చేసిన అక్రమాలను తవ్వితే ఆయనను ఇప్పడు కూడా బోనులో నిలబెట్టదగినన్ని ఆధారాలు లభిస్తాయి. కేసీఆర్‌ను, తెలంగాణను ఆడిపోసుకున్నంతకాలం చంద్రబాబుకు మిగిలేది దరిద్రమే. అవినీతి గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతుంటే కాస్త జ్ఞానం ఉన్నవారెవరికైనా చిర్రెత్తుకొస్తుంది. చంద్రబాబు స్వయంగా అవినీతిపరుడు. పది హేడు కేసుల్ల్లో కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని విచారణను అడ్డుకొని బతుకుతున్న మేకవన్నె పులి. ఇక ఆయనచుట్టూ ఉన్నవారి గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. ఒక్కొక్కరు ఒక మహా అవినీతి సామ్రాట్టు. లగడపాటి రాజగోపాల్, సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, నామా నాగేశ్వర్‌రావు, సీఎం రమే శ్... వీరందరిపై ఎటువంటి ఆరోపణలున్నాయో అందరికీ తెలుసు. ఇవ్వాళ తెలుగుదేశం ఎన్నికల నిర్వహణ సారథ్య బృందం అంతా వీరే. బ్యాంకులను ముంచి, ఇన్వెస్టర్లను ముంచి, ప్రజలను ముంచి కోట్లకు పడగలెత్తి ఎక్కడెక్కడో సంపదలు సృష్టించుకొని, ఇక్కడ మాత్రం దివాలా ప్రకటించుకొని దర్జాగా తిరుగడం తెలుగుదేశం నాయకులకే చెల్లింది. దొరుకకుండా కనిపించకుండా అవినీతికి పాల్పడటం ఒక కళ. దొరికినా మేనేజ్ చేసి తెల్లబట్టలు వేసుకొని నీతులు చెబుతూ తిరుగడం మరో కళ. వారెటువంటి వారైనా పత్రికల పతాక శీర్షికలకు, చానెళ్ల ప్రైమ్ టైమ్ కార్యక్రమాలకు ఎక్కించి జాతికి సందేశాలు ఇప్పించడం ఇంకో కళ.

ఇవన్నీ టీడీపీ నాయకులకు, వారి ప్రచార యంత్రాంగానికి అబ్బినంతగా మరెవరికీ అబ్బలేదు. జగన్‌మోహన్‌రెడ్డి వీళ్ల కంటే ఉత్తముడు కాకపోవచ్చు. కానీ అవినీతిలో వీళ్లు దేశముదుర్లు అయితే జగన్ ముదురు. వారికి ఉన్న కళలేవీ ఈయనకు రాలేదు. అందుకే తొందరగా అవినీతి పరుడిగా ముద్ర వేయించుకున్నారు. ఈ ఎన్నికలు ఇద్దరికీ జీవన్మరణ సమస్య. పవన్‌కల్యాణ్ పార్టీ మొదలు పెట్టినప్పుడు సృష్టించిన కలకలం ఇప్పుడు లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీ మొదలు పెట్టినప్పుడు ఆయన తమకు ఉపయోగపడుతారు ఎప్పటికైనా అనుకున్న చంద్రబాబు అనుకూల మీడియా ఆయనకు బాగానే ప్రచారం ఇచ్చింది. ఆయన ఎప్పుడైతే టీడీపీకి ఉపయోగపడరని భావించారో ఆయనను పూర్తిగా విస్మరించడం మొదలుపెట్టారు. పవన్‌కు సొంత మీడియా లేదు. పవన్‌కు రాజకీయ స్పష్టత లేదు. ఆయన ఒక దీర్ఘకాలిక రాజకీయ అవగాహనతో రాజకీయాల్లోకి వచ్చినట్టు కనిపించదు. చంద్రబాబును, జగన్‌ను, మోదీని సరిగా అర్థం చేసుకున్నట్టు అనిపించదు. అందరూ తనను ఉపయోగించుకోవాలనే చూస్తున్నారని ఆయన గమనించినట్టు లేదు. ఎవరికీ ఉపయోగపడకుండా తనదైన ఒక సొంత రాజకీయ పంథాతో ఆయన ముందుకువెళ్లడం లేదు. ఒక్కోసారి ఒక్కోరకంగా ఆయన ఆవేశ కా వేశాలు ప్రదర్శించారు. ఆయన ఆవేశకావేశాల ధోరణిని బట్టి ఆయనను ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఏజెంట్‌గా అవతలివాళ్లు ప్రచారం చేసుకునే వీలుంది. ముఖ్యంగా తెలుగుదేశం ఆయనను డిఫ్యూజ్ చేసే వ్యూహాన్ని బాగా అమలుచేసింది. ఆయనతో చర్చలు జరుగుతున్నాయని, ఆయన ఇన్ని సీట్లు, ఇంత డబ్బు అడుగుతున్నారని ఒక విషపూరిత ప్రచారాన్ని బయటికి వదిలారు. ఇవతల జగన్ శిబిరం రెచ్చిపోయింది.

అందుకు ప్రతీకారంగా పవన్‌కల్యాణ్ మాట్లాడాల్సి వచ్చింది. టీడీపీ అనుకున్నది నెరవేరింది. ఆయన రాజకీయ ప్రసంగాలు ఆయనను నిలకడలేని మనిషిగా, ఎప్పుడేం మాట్లాడో తెలియని నాయకునిగా జనం ముందు నిలబెట్టాయి. మొన్న అసందర్భంగా కేసీఆర్ పేరు తీసుకొని ఆంధ్రులను తిట్టొద్ద ని పిలుపునిచ్చారు. మళ్లీ ఆయనే కేసీఆర్ గొప్పవారని సందేశమిచ్చారు. ఇలా ఎన్నెన్ని వంకరలో. ఎన్నికల పరిశీలకుల అంచనాలు, అధ్యయనాలు, సర్వేలు వాస్తవమైతే పవన్‌కల్యాణ్‌కు చిరంజీవికి వచ్చినన్ని ఓట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. చిరంజీవి నాయకత్వంలోని పీఆర్పీకి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం ఓట్లు వచ్చాయి. గోదావరి జిల్లాల్లో అయితే 27 శాతం దాకా ఓట్లు వచ్చా యి. పవన్‌కల్యాణ్ వెనుక ఇప్పుడు అంత బలం కనిపించడం లేదు. కొంత ఆయన స్వయంకృతాపరాధం. మరికొంత ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేసిన మాయాజాలం.

3394

KATTA SHEKAR REDDY

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం        


Featured Articles