ఎంత పతనం చంద్రబాబూ?


Mon,March 11, 2019 03:44 PM

katta-shekar-reddyకేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషను దాటి ఎప్పుడో ఉగ్రవాద భాషలోకి దిగజారిపోయారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు ఇంతలా మాట్లాడితే ఆయన పెంపుడు ముఠాలు, పైసాకు అభిప్రాయాలను అమ్ముకునే గుంపు లు ఎంతగా తెగబడి మాట్లా డుతాయో అర్థం చేసుకోవ చ్చు. తెలుగుదేశం ఐటీ ముఠాలు, అదీ ఒక సామాజి కవర్గానికి చెందిన ఉన్మాదు లు తెలంగాణపై ఎంత మాట వస్తే అంత మాట ఉపయోగించి ట్వీట్లు చేస్తున్నారు. వారి ట్వీట్లలో రాజకీయాలు లేవు, ఒక చర్చ లేదు, వాదన లేదు. తిట్లు, బూతులు, పర మ నీచాతినీచమైన పద ప్రయోగాలు తప్ప. ఉచ్ఛనీచాలు, ఉచితానుచితాలు ఏవీ వారికి పట్టడంలేదు. ఒక నాగరిక జాతి మాట్లాడే భాష నుంచి వారెప్పుడో అథఃపాతాళానికి పడిపోయారు. ఒకరకంగా తాలిబన్ల కంటే విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులిచ్చి ట్వీట్లు చేయించి, ప్రాంతాన్ని, దేశా న్ని, ఇతర సామాజికవర్గాలను, ఇతర రాజకీయవర్గాలను దారుణంగా అవమానిస్తున్న చంద్రబాబు ట్రోలింగ్ సైన్యం ఏదో ఒకరో జు బోనులో నిలబడాల్సిందే. చంద్రబాబు ఆంధ్ర ఏదో తన ప్రైవే ట్ కంపెనీ అయినట్టు, దేశ రాజ్యాంగం, న్యాయసూత్రాలు, చట్టా లు ఏవీ తనకు వర్తించవన్నట్టు చెలరేగిపోతున్నారు. ఈ ముఠాలు ఇందుకు ఫలితాలను అనుభవించి తీరాలి.

నాలుగేండ్ల కాలాన్ని ఆయన రాజకీయ డ్రామాలకు ఉపయోగించారు. రాజధాని విషయంలో ఆయన వేసినన్ని కుప్పిగంతులు ఎవరూ వేయలేదు. ప్రపంచంలోని అనేక నగరాలతో పోలిక చెప్పి కొత్తకొత్త డిజైన్లు, గ్రాఫిక్స్‌లు చూపుతూ కాలయాపన చేశారు. నాలుగేండ్ల కిందట ఆయన రాజధాని నిర్మాణం మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి ప్రధాన భవనాలన్నీ పూర్తయ్యేవి. రాజకీయంగా కూడా ఆయన అనేకి పిల్లిమొగ్గలు వేశారు. నాలుగేండ్ల కిందట మోదీ మహానుభావుడన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ ఓకే అన్నారు. తీరా ఎన్నికలకు ముందు మోదీ దుర్మార్గుడయ్యారు.


సామాజిక మాధ్యమాలను ఒక మర్యాదకరమైన పరిమితుల్లో ఉపయోగించుకున్నంత కాలం ఫర్వాలేదు. కానీ వందలు వేల మం ది కాసుకు కక్కుర్తిపడి ఆకాశరామన్నల అవతారమెత్తి దాడి చేస్తూ పోతుంటే, ఒక తప్పుడు అభిప్రాయాన్ని అదేపనిగా వ్యాప్తిచేస్తూ పోతుంటే సామాజిక వాతావరణమైనా, రాజకీయ వాతావరణమై నా ఎంతగా కలుషితమవుతుందో చెప్పలేం. అవాంఛిత విద్వేషాల కు, ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఆకాశరామన్నలను అరికట్టకపోతే సామాజిక మాధ్యమాలు మన సమాజం పాలిట భస్మాసుర హస్తం గా మారడం తథ్యం. భావస్వేచ్ఛ, అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవసరమే, కానీ ఏ భావాన్ని ఎవరు వ్యక్తం చేస్తున్నారో, ఆ వ్యక్తి ఎవరో అతని బాధ్యత ఏమిటో, తన అభిప్రాయాలకు తాను ఎంతవరకు బాధ్యత వహిస్తారో మొత్తం సమాజానికి తెలియాలి. తన అభిప్రాయాలపై ఏదైనా వివాదం తలెత్తితే న్యాయపరీక్షకు నిలబడ గలిగి ఉండాలి. అంతే తప్ప సామాజిక మాధ్యమం అన్నది పిచ్చివాడి చేతిలో రాయిగా మారితే, ఈ ఒక్క తరాన్నే కాదు అనేక తరాలను మనం సర్వనాశనం చేసిన వారమవుతాము.

ఎవరు ఏదైనా ఎంతైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు, రాయవచ్చు అన్న స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు, అది బాధ్యతారాహిత్యం, విచ్చలవిడితనం. పత్రికలు, ప్రసా ర సాధనాల మీద, ఒకరికి అనుకూలంగా మరొకరికి ప్రతికూలంగా అభిప్రాయాలను ఉత్పత్తి చేస్తాయన్న (మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్) అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సామాజిక మాధ్యమా లు దానిని పతాకస్థాయికి తీసుకుపోతున్నాయి. ఈ విష సంస్కృతిని నరేంద్ర మోదీ మోతాదుకు మించి పెంచి పోషిస్తే, ఇప్పుడు చంద్రబాబు దానిని అన్ని పరిమితులను బద్దలుకొటి ్టవిచ్చలవిడిగా వాడేస్తున్నారు. దీనిని కట్టడి చేయకపోతే రాజకీయాలు ఆరోగ్యకరమైన చర్చస్థాయిని కోల్పోయి, శత్రు శిబిరాల మధ్య రచ్చగా మారిపోతాయి. భావ వ్యక్తీకరణ కూడా ఒక సత్య పీఠంపైనే జరుగాలి. లేకపోతే విలువలు వలువల్లాగా, బాధ్యతలు బూతుల్లాగా మిగిలిపోతాయి. చంద్రబాబునాయుడు ఇంతగా కలవరపడటానికి కారణం ఆయన ఓటమి ఆయన కళ్ల ముందు కనిపిస్తున్నది. రాజకీయంగా ఆయనతో ఏ ఒక్క పార్టీ కలసిరావడం లేదు. ఒకప్పటి మిత్రపక్షా లు ఇప్పుడు శత్రుపక్షాలయ్యాయి. పవన్‌కల్యాణ్‌ను మంచి చేసుకుందామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వామపక్షాలు ఇప్పు డు తోడున్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆయన నిజానికి రకరకాల సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పెద్దఎత్తున ప్రత్యక్ష ధన పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇంతకాలం ఏమీ చేయకుండా, తీరా ఎన్నికల ముందు ఈ పథకాలను అమలుచేయడం ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నది. నాలుగేండ్ల కాలాన్ని ఆయ న రాజకీయ డ్రామాలకు ఉపయోగించారు. రాజధాని విషయంలో ఆయన వేసినన్ని కుప్పిగంతులు ఎవరూ వేయలేదు. ప్రపంచంలో ని అనేక నగరాలతో పోలిక చెప్పి కొత్తకొత్త డిజైన్లు, గ్రాఫిక్స్‌లు చూపుతూ కాలయాపన చేశారు. నాలుగేండ్ల కిందట ఆయన రాజధాని నిర్మాణం మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి ప్రధాన భవనాలన్నీ పూర్తయ్యేవి. రాజకీయంగా కూడా ఆయన అనేక పిల్లిమొగ్గలు వేశా రు. నాలుగేండ్ల కిందట మోదీ మహానుభావుడన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ ఓకే అన్నారు. తీరా ఎన్నికలకు ముందు మోదీ దుర్మార్గుడయ్యారు. మళ్లీ ప్రత్యేక హోదాయే కావాలన్నారు. నిలకడ లేదు. నిశ్చితాభిప్రాయాలు లేవు. నిజాయితీ లేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ఎప్పటికప్పుడు మాటలు మార్చడమే ఆయన ప్రతిష్ఠను బాగా దెబ్బతీసింది. రాజకీయంగా అత్యంత దివాలాకోరు నాయకుడిగా ఆయన ఎప్పుడో రుజువు చేసుకున్నాడు. వెన్నుపోటును ప్రజాస్వామ్య ఉద్యమంగా మరిపించి, మాయచేసి, ఎన్టీఆర్ మరణానికి కారణమైననాడే చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, ప్రచార ప్రసార సాధనాలు, రాజకీయవర్గాలు నైతికంగా మరణించాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వారు సాగిస్తున్నది బుకాయించి, దబాయించి, మోసగించి సాగించిన రాజకీయమే తప్ప, వాస్తవాలు చెప్పి సాధించిన విజయం ఒక్కటి కూడా లేదు. చంద్రబాబుకు పదాల అర్థం, విలువ కూడా తెలియదు. ఎంత మాటంటే అంతమాట అనేయడం ఆయనకు అలవాటు. ఆంధ్ర సావర్నిటీ కోసం ఎదురొడ్డి పోరాడుతున్నట్టు తాజాగా ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర ప్రత్యేక దేశం కాదు, సావర్నిటీ (సార్వభౌమాధికారం) కోసం పోరాడటానికి. సమాఖ్య రాష్ట్రం. దేశంలో విడదీయలేని భాగం.

ఎంత అథమస్థాయికి దిగజారినా ఫర్వాలేదు, ఏం చేసిన ఫర్వాలేదు, ఏ వ్యవస్థను ఎంత నాశనం చేసినా ఫర్వాలేదు, ఏ మర్యాదలను ఎంతగా పాతిపెట్టినా ఫర్వాలేదు, ఎన్నికల్లో మాత్రం గెలువాలన్నది చంద్రబాబు నినాదంగా కనిపిస్తున్నది. నీతిమాలిన రోత రాజకీయాలు తాత్కాలికంగా ఆవేశకావేశాలు రెచ్చగొట్టడానికి, రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందడానికి ఉపగయోపవడవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఒక దుస్సంప్రదాయాన్ని పాదుకొల్పుతాయి. చంద్రబాబు బరితెగించి మాట్లాడే ధోరణినే ఆయన అనుచరులు కూడా పాటిస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్ర సమాజా న్ని ఒక శాశ్వత మానసిక, సామాజిక సంక్షోభంలోకి నెడుతున్నాడు. ఎన్నికలో ్లగెలుపోటములు ఎలా ఉన్నా రాజకీయాల్లో పది కాలాల పాటు కొనసాగాలనుకునే నాయకులు విచక్షణతో వ్యవహరించాలి.

3753

KATTA SHEKAR REDDY

Published: Sun,November 3, 2019 07:11 AM

మర మనుషులు

మనుషులుగా అంతరించేవారే కాదు, మహోన్నత మానవులుగా వ్యవహరించేవారూ చాలామంది ఉన్నారు. చిరుగుపాతల బట్టలతో ఒక మహారణ్యాన్ని పెంచిన అమ్మల గు

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్        


Featured Articles